సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్‌కు సంబంధించి నగదు బదిలీ(డీబీటీ)లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి బ్యాంకులు ప్రత్యేకాధికారులను నియమించాయి. వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు తమ బ్యాంకుల ప్రత్యేకాధికారుల వివరాలను స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి అందజేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్ వినియోగదారులు నగదు బదిలీకి సంబంధించి ఏదైనా బ్యాంకులో సమస్య ఏర్పడితే ఆయా బ్యాంకుకు సంబంధించిన ప్రత్యేక అధికారిని నేరుగా గానీ, ఫోన్‌లో గానీ సంప్రదించి వివరాలు అందజేసి పరిష్కరించుకోవచ్చు.
ఈ రెండు జిల్లాల్లోని ఇతర బ్యాంకుల ప్రత్యేక అధికారుల వివరాలను కూడా త్వరలో ప్రకటిస్తామని హైదరాబాద్ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు భరత్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఆధార్‌లో ఉన్న పేరుకు, బ్యాంకు ఖాతాలో ఉన్న పేరు స్పెల్లింగ్‌కు మధ్య ఒక అక్షరం తేడా ఉన్నా సబ్సిడీ జమ కావడం లేదు. కొందరు వినియోగదారులు తెలియక రెండు బ్యాంకు ఖాతాలను ఆధార్‌ను అనుసంధానం చేయడం సమస్యగా మారింది. కొందరి బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ అయినా, సాంకేతిక లోపం వల్ల అది మళ్లీ వెనక్కి వెళ్లిపోతోంది. ఇటువంటి ఏ సమస్య ఉన్నా గ్యాస్ వినియోగదారులు సంబంధిత బ్యాంకు ప్రత్యేకాధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
బ్యాంకు అధికారి పేరు, హోదా మొబైల్ నంబరు
ఆంధ్రాబ్యాంకు పి.వి.రమణ, (ఏజీఎం) 8448104996
కెనరాబ్యాంకు కె.వెంకటేశ్వరరావు (ఏజీఎం) 9441928587
అలహాబాద్ బ్యాంకు విశ్వపతి (సీనియర్ మేనేజరు) 9441421507
బ్యాంక్ ఆఫ్ ఇండియా అపరాజిత దాస్ (మేనేజరు) 7893989850
ఎస్‌బీహెచ్ ఎం.ప్రశాంత్ (మేనేజరు) 9849139991
ఎస్‌బీహెచ్ ఎస్‌పట్నాయక్(చీఫ్ మేనేజరు) 9948820455
ఐసీఐసీఐ బ్యాంకు ఎస్.యూ. మూర్తి(ఏజీఎం) 9989056285
నగదు బదిలీ సమస్యలపై ప్రత్యేకాధికారులు
Published Fri, Sep 13 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement