cook gas
-
ఖాతాలు లేని బ్యాంకుల్లోకి నగదు బదిల
కావలి/ కోవూరు, న్యూస్‌లైన్ : వంట గ్యాస్ నగదు బదిలీ పథకం వినియోగదారులను అయోమయంలో పడేస్తోంది. తమకు ఖాతాలు లేని బ్యాంకుల్లో నగదు చేరుతున్న సమాచారం వస్తుండటంతో దీంతో విని యోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 4.19 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 2.2 లక్షల కనెక్షన్లకు ఆధార్ కార్డులను ఏజెన్సీలకు అప్పగించారు. ఆధార్ ఇచ్చిన వారందరూ బ్యాంక్ అకౌంటుతో సంబంధం లేకుండా రూ.1,073 గ్యాస్ సిలిండర్ కోసం చెల్లించాల్సి ఉంది. చెల్లించిన తర్వాత వెంటనే బ్యాంక్ అకౌంటు లేని వారికి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పడినట్లు జిల్లాలో ఎక్కువగా సెల్‌ఫోన్ మెసేజ్‌లు వినియోగదారులకు వస్తున్నాయి. స్థానిక ఐసీఐసీఐ బ్యాంక్‌కు వెళ్లి తమ సబ్సిడీ ఇక్కడకు బదిలీ కావడంతో సిబ్బందిని అడుగుతున్నారు. ఖాతా లేకుండా బ్యాంక్‌లోకి ఎలా వస్తుందని సిబ్బంది వారిని ఎదురు ప్రశ్నించి తిరిగి పంపుతున్నారు. పట్టణంలో నాలుగు ఏజెన్సీలు, 45,367 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 20 వేల కనెక్షన్లకు ఆధార్ కార్డులను తీసుకున్నారు. 20 శాతానికి పైగా వినియోగదారులకు అకౌంట్ లేని బ్యాంకుల్లో నగదు బదిలీ అయినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ అధికారుల దగ్గర సరైన సమాధానం లేదు. ఒక వైపు అన్నిస్థాయిల్లో కోర్టులు ఆధార్ అనుసంధానంపై అసహనం వ్యక్తం చేస్తున్నా పాలకులు మాత్రం బేఖాతర్ చేస్తున్నారు. పాలకుల ఆదేశాల మేరకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. బదిలీ బేజార్ నిన్న మొన్నటి వరకు గ్యాస్ కొనుగోలుకు రూ.418 సరిపోయేది. ప్రస్తుతం గ్యాస్ కొనాలంటే రూ.1018 తప్పనిసరి. దీంతో సామాన్యులు బేజారెత్తుతున్నారు. ఇదిలా ఉండగా సబ్సిడీ సొమ్ము తమ అకౌంట్లో కాకుండా వేరే అకౌంట్లో పడుతుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల కోవూరులోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు బుచ్చిరెడ్డిపాళెంలో ఖాతా ఉన్న లబ్ధిదారుడు వచ్చాడు. నగదు బదిలీ కింద సబ్సిడీ జమ కావడంపై తెలుసుకునేందుకు వచ్చాడు. సబ్సిడీ సొమ్ము అతని ఖాతాలో జమ కాలేదు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అతను ప్రశ్నించాడు. ఖాతాదారుడి నంబర్ ఆధారంగా పరిశీలించగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో సబ్సిడీ సొమ్ము జమ అయినట్టు తేలింది. ఏమి చేయాలో దిక్కుతోచక అతను వెనుదిరిగాడు. ఆందోళన అవసరం లేదు నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకంలో సబ్సిడీ మొత్తం వినియోగదారుల అకౌంట్లో కాకుండా ప్రైవేట్ బ్యాంక్‌లో జమ అవుతున్నట్టు సమాచారం అందింది. వినియోగదారులు ఆందోళన చెందవద్దు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు సూచనల మేరకు తక్షణం సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు తమ బ్యాంక్ ఖాతా నంబరు సమర్పిస్తే గ్యాస్ సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాలో జమ అవుతుంది. -
ఎల్పీజీ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి కాదు: మొయిలీ
పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ న్యూఢిల్లీ: వంటగ్యాస్(ఎల్పీజీ)పై సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తేల్చిచెప్పేంత వరకు కార్డు తప్పనిసరి కాదని బుధవారమిక్కడ మీడియాతో అన్నారు. ‘ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే. సుప్రీంకోర్టు ఏదో ఒకటి స్పష్టంగా తేల్చేవరకు దీన్ని తప్పనిసరి చేయం’ అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడం తెలిసిందే. -
నగదు బదిలీ సమస్యలపై ప్రత్యేకాధికారులు
సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్‌కు సంబంధించి నగదు బదిలీ(డీబీటీ)లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి బ్యాంకులు ప్రత్యేకాధికారులను నియమించాయి. వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు తమ బ్యాంకుల ప్రత్యేకాధికారుల వివరాలను స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ)కి అందజేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్ వినియోగదారులు నగదు బదిలీకి సంబంధించి ఏదైనా బ్యాంకులో సమస్య ఏర్పడితే ఆయా బ్యాంకుకు సంబంధించిన ప్రత్యేక అధికారిని నేరుగా గానీ, ఫోన్లో గానీ సంప్రదించి వివరాలు అందజేసి పరిష్కరించుకోవచ్చు. ఈ రెండు జిల్లాల్లోని ఇతర బ్యాంకుల ప్రత్యేక అధికారుల వివరాలను కూడా త్వరలో ప్రకటిస్తామని హైదరాబాద్ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు భరత్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఆధార్‌లో ఉన్న పేరుకు, బ్యాంకు ఖాతాలో ఉన్న పేరు స్పెల్లింగ్‌కు మధ్య ఒక అక్షరం తేడా ఉన్నా సబ్సిడీ జమ కావడం లేదు. కొందరు వినియోగదారులు తెలియక రెండు బ్యాంకు ఖాతాలను ఆధార్‌ను అనుసంధానం చేయడం సమస్యగా మారింది. కొందరి బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ అయినా, సాంకేతిక లోపం వల్ల అది మళ్లీ వెనక్కి వెళ్లిపోతోంది. ఇటువంటి ఏ సమస్య ఉన్నా గ్యాస్ వినియోగదారులు సంబంధిత బ్యాంకు ప్రత్యేకాధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. బ్యాంకు అధికారి పేరు, హోదా మొబైల్ నంబరు ఆంధ్రాబ్యాంకు పి.వి.రమణ, (ఏజీఎం) 8448104996 కెనరాబ్యాంకు కె.వెంకటేశ్వరరావు (ఏజీఎం) 9441928587 అలహాబాద్ బ్యాంకు విశ్వపతి (సీనియర్ మేనేజరు) 9441421507 బ్యాంక్ ఆఫ్ ఇండియా అపరాజిత దాస్ (మేనేజరు) 7893989850 ఎస్బీహెచ్ ఎం.ప్రశాంత్ (మేనేజరు) 9849139991 ఎస్బీహెచ్ ఎస్పట్నాయక్(చీఫ్ మేనేజరు) 9948820455 ఐసీఐసీఐ బ్యాంకు ఎస్.యూ. మూర్తి(ఏజీఎం) 9989056285 -
జనవరి 1 కల్లా అన్ని జిల్లాల్లో గ్యాస్‌కు నగదు బదిలీ
వచ్చే నెల నుంచి మరో 8 జిల్లాల్లో పథకం సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌కు నగదు బదిలీని జనవరి 1కల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెండు దశల్లో 12 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉండగా, వచ్చే నెల 1 నుంచి మరో 8 జిల్లాల్లో (కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, వరంగల్, మెదక్, నల్లగొండ, విశాఖపట్టణం) జిల్లాల్లో అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి మహబూబ్‌నగర్, విజయనగరం జిల్లాల్లో అమలుచేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో అమల్లోకి తేనున్నారు. నగదు బదిలీ ప్రారంభించిన నాటి నుంచి మూడు నెలల్లోగా వినియోగదారులు బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. అప్పటివరకు అనుసంధానం చేయకపోయినా సబ్సిడీని ఇస్తారు. మూడు నెలలు తరువాత కూడా ఆధార్‌ను బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేయని వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వరు. మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆధార్‌ను బ్యాంకు లింకేజి చేసుకుంటే అప్పటి నుంచి వంట గ్యాస్ సబ్సిడీని అందజేస్తారు.