ఎల్పీజీ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి కాదు: మొయిలీ
పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ
న్యూఢిల్లీ: వంటగ్యాస్(ఎల్పీజీ)పై సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తేల్చిచెప్పేంత వరకు కార్డు తప్పనిసరి కాదని బుధవారమిక్కడ మీడియాతో అన్నారు. ‘ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే. సుప్రీంకోర్టు ఏదో ఒకటి స్పష్టంగా తేల్చేవరకు దీన్ని తప్పనిసరి చేయం’ అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడం తెలిసిందే.