మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : వచ్చే నెల( ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నాగేశ్వర్‌రావు వెల్లడించారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని ఇండేన్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆధార్ కార్డులు అందజేసిన ప్రతి ఒక్క వినియోగదారుడికి వెంటనే అనుసంధానం చేయాలని ఆదేశించారు.
వినియోగదారులను చైతన్యం చేయడానికి ఏజెన్సీల వారు కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 46 శాతం మంది గ్యాస్ వినియోగదారులు అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. కాగా మిర్యాలగూడలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో 43,255 మంది గ్యాస్ వినియోగదారులుంటే ఇప్పటి వరకు 19,237 మంది మాత్రమే ఏజెన్సీ లో, 14,327 మంది బ్యాంకులో అనుసంధానం చేసుకున్నారని చెప్పారు.
అదే విధంగా హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో 34,832 మందికి గాను 11,337 మంది గ్యాస్ ఏజెన్సీలో, 5526 మంది బ్యాంకులో అనుసంధానం చేసుకున్నారన్నారు. ఫిబ్రవరి 1 నుంచి నగదు బదిలీ పథకం జిల్లాలో అమలు కానున్నందున గ్యాస్ వినియోగదారులంతా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని కోరారు. అదే విధంగా దీపం గ్యాస్ కనెక్షన్‌కు స్టౌ లేకుండా 1060 మాత్రమే చెల్లించాలని కోరారు.
కొత్త గ్యాస్ కనెక్షన్‌కు గాను స్టౌ లేకుండా 2,585, అదనపు సిలిండర్‌కు 1995 మాత్రమే చెల్లించాలని వివరించారు. కొత్త కనెక్షన్లకు ఎక్కు వ డబ్బులు తీసుకుంటే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏజీపీవో చంద్రశేఖర్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ ఆర్‌ఐ వాజిద్ ఉన్నారు.
వచ్చే నెల 1 నుంచి నగదు బదిలీ
Published Wed, Jan 22 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement