nageswar rao
-
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రావు విశ్లేషణ ...
-
ఆ దృశ్యం నన్ను కదిలించింది: సోనూసూద్
మన చుట్టూ సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. కొన్నిటిని చూస్తూ వెళ్లిపోతాం, కొన్నింటి దగ్గర ఆగి ఓ క్షణం జాలిపడ్డ తర్వాత అక్కడి నుంచి కదులుతాం. కానీ సినీ విలన్, రియల్ హీరో సోనూ సూద్ అలా చేయలేదు. తనకు కనిపించే కష్టాన్ని చూసి కదిలిపోయారు. జాలిపడితే ఫలితం రాదని ఆయనకు బాగా తెలుసు. అందుకే కష్టమైనా నష్టమైనా వారికి సాయం చేయాలని తలిచారు. ఆ సంకల్పమే అతడిని ముందుకు నడిపించింది. తన ఆస్తిని తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ అండగా నిలబడుతున్నారు. ఈ లాక్డౌన్లోని ఎన్నో కథలను ఆయన పుస్తక రూపంలో తీసుకొచ్చారు. "ఐయామ్ నో మెస్సయ్య"(నేను రక్షకుడిని కాదు) పేరుతో ఇటీవలే ఇది మార్కెట్లోకి వచ్చింది. అందులో సోనూ చిత్తూరువాసి నాగేశ్వర్ రావు గురించి ప్రస్తావించిన రియల్ స్టోరీ ఇది.. రైతును ఆదుకున్న ట్రాక్టర్.. రైతు పేరు: నాగేశ్వర్ రావు, అతడి కుటుంబం ప్రాంతం: చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ సమస్య: పేదరికంతో కూతుళ్లతో పొలం దున్నించడం పరిష్కారం: రైతుకు ట్రాక్టర్, అతడి కూతుళ్లకు విద్యను అందించడం సమయంతో సంబంధం లేకుండా పొలాల్లో పని చేసేవారికి ఇది అంకితం. ఇది నా సొంతంగా చెప్తున్న లైను కాదు. ఓసారి ఎక్కడో చదివాను, ఇక్కడ సరిగ్గా సరిపోతుంది అనిపించింది. క్రిష్ణమూర్తి అనే వ్యక్తి చిత్తూరులోని మదనపల్లికి చెందిన టమాట రైతు పడుతున్న కష్టాలను వీడియో తీసి జూలై 25న షేర్ చేశాడు. అందులో ఆ రైతు కాడెడ్లకు బదులుగా కన్న కూతుళ్లతో పొలం దున్నించాడు. అది చూసి నా మనసు చలించిపోయింది. చదువుకోవాల్సిన పిల్లలు పొలం దున్నడం ఏంటని బాధపడ్డాను. ఆ దృశ్యం నా మెదడులో బలంగా నాటుకుపోయింది. కేవలం బాధపడితే ప్రయోజనం ఉండదు. అందుకే వాళ్లకు ఆపన్నహస్తం అందించాలనుకున్నా. ఆంధ్రాలో ఉన్న నా స్నేహితులను అడిగి రైతు వివరాలు అడిగితే అతడిది చిత్తూరులోని మదనపల్లివాసి అని తెలిసింది. ఆ రాష్ట్రంలో ఎన్నోసార్లు షూటింగ్‌కు వెళ్లాను కానీ చిత్తూరుకు వెళ్లలేదు. అప్పుడే అనుకున్నా, ఒక్కసారైనా అక్కడికి వెళ్లి తీరాలని! (చదవండి: నా బంగారు తల్లి.. డాషింగ్ బావ: వరుణ్ తేజ్) అది శనివారం రాత్రి 9.30 గంటలు. నా ఫ్రెండ్స్ రైతు ఫోన్ నంబర్ ఇవ్వడంతో అతడికి కాల్ చేసి మాట్లాడాను. తనకో టీ స్టాల్ ఉండేదని, కానీ కరోనా వల్ల అది మూతపడటంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటించాల్సి వస్తుందని నాగేశ్వర్ చెప్పాడు. అప్పుడే అతడికి మాటిచ్చాను. అమ్మాయిల భుజాల మీద కాడిని తీసేయండి, మీకు నేను ఎద్దులను కొనిస్తాను అని చెప్పాను. అతడు దానికి చాలా సంతోషించాడు. తిరుపతిలో ఎద్దులు ఉన్నాయని, వాటిని తీసుకుంటానని సంబరపడ్డాడు. అంతలోనే నా బుర్రలో ఓ లైటు వెలిగింది. ట్రాక్టర్ కొనిస్తే సరిపోతుంది కదా అనిపించింది. అదే మాట అతడితో చెప్పాను. కానీ దీనికి ప్రతిఫలంగా తన కూతుళ్లను చదివించాలని మాట తీసుకున్నాను. మాటిచ్చానన్న మాటేగానీ అది ఆచరణలో పెట్టగలనా అని నాలో సంఘర్షణ మొదలైంది. లాక్డౌన్లో అతడికి ట్రాక్టర్ పంపించగలనా? అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను. తర్వాతి రోజు ఉదయం చత్తీస్‌ఘడ్‌లో ఉన్న నా స్నేహితుడు కరన్ గిల్హోత్రా సాయంతో ఇండియాలో టాప్ ట్రాక్టర్ కంపెనీలలో ఒకటైన సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీకి సంబంధించిన ఏజెంట్‌తో మాట్లాడాను. అతడు ఆ రోజు సెలవులో ఉన్నప్పటికీ మా కోరిక బలమైనది గ్రహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకల్లా ట్రాక్టర్‌ను రైతు కళ్ల ముందుంచాడు. (చదవండి: మా ఆత్మకథ చెబుతాం) ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన రైతు రైతు నాగేశ్వరరావు అనేక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అతనికి అందిన సహాయం వివరాలు... 1. గత ఏడాది రైతు భరోసా కింద రూ.13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం 2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరు, జనవరిలో బదిలీ 3. నాగేశ్వర్రావు చిన్న కుమార్తెకు ‘జగనన్న అమ్మ ఒడి’ కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం 4. పెద్ద కూతురుకు ‘జగనన్న తోడు’ కింద లబ్ధికోసం దరఖాస్తు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది. 5. నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోంది. 6. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెలా రూ.2250 అందుకుంటున్నారు. 7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్రావు కుటుంబం పొందింది. ఉచిత రేషన్ కూడా తీసుకుంది. 8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలను నాగేశ్వర్రావు తీసుకున్నారు. -
వీవీ వినాయక్‌ను కలిసిన మార్గాని
పశ్చిమగోదావరి, చాగల్లు: చాగల్లులో ప్రముఖ సీనీ దర్శకుడు వీవీ వినాయక్‌ను వైఎస్సార్ సీపీ నాయకులు బీసీ సంఘం రాష్ట్ర జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్టినేటర్ మార్గాని భరత్‌రామ్‌కు మద్దతు ఇవ్వాలని వినాయక్‌ను కోరారు. అనంతరం నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ రాజమండ్రి సీటును బీసీలకు కేటాయించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు 13 జిల్లాలో బీసీలకు చట్ట సభల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ నిర్ణయానికి వైఎస్సార్ సీపీ సానుకూలంగా ఉందని జగన్ ఇప్పటికే తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మూలనివాసి రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని చంటిబాబు, బీసీ సంఘం చాగల్లు మండల అధ్యక్షుడు బొర్రా కృష్ణారావు, వీవీ వినాయక్ సోదరుడు గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు,అయినం నాగరాజు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు ప్రస్తుతానికి రాజకీయ రంగంలోకి ప్రవేశించే అలోచన లేదని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామం చాగల్లు వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తనకు ఆన్లైన్లో ఫేస్బుక్, ట్విట్టర్, హిస్ట్రోగామ్ వంటి వాటిల్లో అకౌంట్లు లేవని, వాటిల్లో వచ్చిన వార్తలకు తనకు సంబంధం లేదన్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతికి చాగల్లు వచ్చి తన కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి గడపటం సంతోషాన్ని ఇస్తుందన్నారు. త్వరలో సి.కళ్యాణ్ నిర్మాతగా హీరో బాలకృష్ణతో చిత్రం తీసేందుకు కథ అన్వేషణలో ఉన్నట్టు తెలిపారు. -
కూపీ లాగితే ‘సీబీఐ’ డొంక కదులుతోంది!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) నేడు ఇంతగా భ్రష్టుపట్టి పోవడానికి కారకులు ఎవరు? అందుకు బాధ్యులు ఎవరు? సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై అవినీతి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలయితే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై కూడా ఎందుకు చర్యలు తీసుకుంది? ఇద్దరిని బలవంతపు సెలవు మీద ఎందుకు పంపించింది? అసలు గుజరాత్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ అస్థానా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన నియామకాన్ని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎందుకు సవాల్ చేశారు? ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అభిమాన పాత్రుడు ఎలా అయ్యారు? మోదీకి అస్థానాను పరిచయం చేసిందెవరు? అస్థానా ఇంతవరకు డీల్ చేసిన కేసులేమిటీ? 2016లో వడోదరలో విలాసవంతమైన తన కూతురు పెళ్లి వేడకులకు డబ్బులు ఖర్చు పెట్టిందెవరు? చివరకు తానే ఓ కేసులో పీకల దాకా ఎలా కూరుకుపోయారు? ఆ కేసేమిటీ? సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శ నాయకుడని చెప్పుకునే రాకేశ్ అస్థానా తనకు తాను ‘ఉక్కు మనిషి’ని అని చెప్పుకుంటారు. ఆయన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాశ్ చంద్రబోస్, వివేకానందుడినితో పోలుస్తూ 2018, ఏప్రిల్ నెలలో ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అస్థానానే తనకు తాను అలా ప్రమోట్ చేసుకున్నారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. హవాలా కేసులో ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొన్న ‘డైరీ ఆఫ్ 2011’ కేసులో ఆస్థానా నిందితుడు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయం ఉన్న ‘అగస్ట వెస్ట్‌ల్యాండ్’ రక్షణ కుంభకోణం, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై, భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా, రాజస్థాన్ అంబులెన్స్ కుంభకోణం లాంటి కేసులను విచారించడం ద్వారా అస్థానా పేరు బాగా వెలుగులోకి వచ్చింది. అంతకంటే 2002లో ‘గోద్రా రైలు దుర్ఘటన’ కేసును దర్యాప్తు జరిపిన సిట్‌కు నాయకత్వం వహించిందీ అశోక్ అస్థానానే. 2002, ఫిబ్రవరి 27వ తేదీన కర సేవకుల బోగీలు తగులబడి 58 మంది మరణించిన విషయం తెల్సిందే. 2002, మార్చి నెలలో దాఖలైన మొదటి చార్జిషీటులో రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందని పేర్కొన్నారు. ఈ బోగీలను ముస్లింలు తగులబెట్టారన్న వార్తల కారణంగానే గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగడం, రెండువేల మందికి పైగా మరణించడం తెల్సిందే. అప్పటి మోదీ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వం 2002, మే నెలలో రాకేశ్ అస్థానా నాయకత్వాన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జూలై 9వ తేదీ నాటికల్లా కేసు దృక్కోణమే మారిపోయింది. రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, స్థానిక ముస్లిం వ్యాపారి ఒకరు కుట్రపన్ని రైలు బోగీలను తగులబెట్టారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు 2002, సెప్టెంబర్ నెలలో ఛార్జిషీటు దాఖలయింది. 2003, ఫివ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్ యాక్ట్’ కింద నిందితులపై అభియోగాలు మోపారు. కేంద్రంలోని యూపీఏ హయాంలో 2005లో ‘పోటా’ రివ్యూ కమిటీ పోటా ఆరోపణలను కొట్టివేసింది. గోద్రా కేసు విచారణ మాత్రం వివిధ కోర్టుల్లో అనేక ఏళ్లపాటు కొనసాగింది. 2011లో ట్రయల్ కోర్టు 11 మంది నిందితులకు మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2017లో గుజరాత్ హైకోర్టు మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చింది. అహ్మదాబాద్ పేలుళ్ల కేసును కూడా 2008లో సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు బృందానికి కూడా అస్థానానే ఇంచార్జీగా వ్యవహరించారు. నగరంలో నాడు సంభవించిన 22 పేలుళ్లలో 56 మంది అమాయకులు మరణించారు. నరేంద్ర మోదీ ‘సెక్యూరిటీ’ అనే నినాదంపైనే వరుసగా రెండో సారి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ కేసు దర్యాప్తులో మరో పోలీసు అధికారి అభయ్ చుడాసమా కూడా ముక్యపాత్ర వహించారు. అప్పుడు అస్థానా బరోడా పోలీసు కమిషనర్‌గా పనిచేస్తుండగా, అభయ్ డిప్యూటీ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2005లో జరిగిన షొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో అభయ్ చుడాసమ ప్రధాన నిందితుల్లో ఒకరు. ‘ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)’ విద్యార్థులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అస్థానా బృందం చివరకు తేల్చింది. అద్వానీతో పరిచయం లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని పశుదాణా కేసులో విచారించి ఆయనపై చార్జిషీటు దాఖలవడానికి బాధ్యుడయ్యాడని ప్రశంసలు అందుకున్న అస్థానా 2000 సంవత్సరంలో ఎల్కే అద్వానీకి పరిచయం అయ్యారు. అద్వానీ గుజరాత్‌కు వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెళ్లిన అస్థానా, తనకుతాను పరిచయం చేసుకొని తాను సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిమానినని, ఆ తర్వాత తమనూ అభిమానిస్తానని చెప్పారట. 2002లో అద్వానీ స్వయంగా తన వెంట తీసుకెళ్లి అస్థానాను మోదీకి పరిచయం చేశారట. ఢిల్లీకి పిలుపు.. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలానికే ఢిల్లీకి బదిలీ చేస్తూ అస్థానాకు ఉత్తర్వులు అందాయి. 2017లో ఆయన్ని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్టెర్లింగ్ బయోటెక్’ హవాలో కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్థానాను సీబీఐ అధికారిగా ఎలా నియమిస్తారంటూ ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. దాన్ని తొలుత సుప్రీం కోర్టు కొట్టి వేయగా, మళ్లీ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. 3.83 కోట్ల ముడుపులు స్టెర్లింగ్ బయోటెక్ కంపునీ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో రాకేశ్ అస్థానాకు 3.83 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు నమోదై ఉంది. ఈ డైరీ ఆధారంగానే ఆ కంపెనీపై సీబీఐ 2017లోనే చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అందులో అస్థానా పేరును పేర్కొనలేదు. 2016లో వడోదరలో వైభవంగా జరిగిన కూతురు పెళ్లికి పెళ్లి వేదిక నుంచి భోజనాల వరకు ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ వర్గాలే స్పాన్సర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గత జూలై నెలలో అలోక్ వర్మ విధి నిర్వహణలో భాగంగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయనకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా అస్థానా సీబీఐలో కొత్త నియామకాలు జరిపారు. వర్మ వచ్చాక ఈ విషయమై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈడీ దాడులతో స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ డైరెక్టర్లు చేతన్, నితిన్ సండేసర ఆస్తులపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ నెలలో దాడులు చేయడంతో మరోసారి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ హవాల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అస్థానా తనను వేధిస్తున్నారని, ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తే కేసు లేకుండా చూస్తానని చెబుతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన సతీష్ సనా అనే వ్యాపారి సీబీఐకే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న సీబీఐ డైరెక్టర్ వర్మ అక్టోబర్ 15వ తేదీన అస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మ రాజకీయ పక్షపాతి అని, అవినీతికి పాల్పడుతున్నారంటూ అస్థానా కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాశారు. ఇద్దరిపై ఆరోపణలు వచ్చినందునే.. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానాపై అవినీతి ఆరోపణలు వస్తే ఆయనపై చర్య తీసుకోవాలిగానీ, డైరెక్టర్ అలోక్ వర్మపై ఎందుకు చర్య తీసుకున్నారని విలేకరులు ప్రశ్నించగా, ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చినందున ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు సీబీఐ డైరెక్టర్‌పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఆయన నీతివంతుడు, నిజాయితీపరుడంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణియం ప్రశంసించడం ఇక్కడ గమనార్హం. ఓ నిందుతుడు చేసిన కౌంటర్ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నారంటే అరుణ్ జైట్లీకి వివేకమెంతుందో ఆయనకే తెలియాలి. -
చిరంజీవి.. కుమార్
హైదరాబాద్, మూసాపేట: తాను చనిపోతూ ఓ యువకుడు అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగు నింపాడు. మూసాపేట ఆంజనేయనగర్ కాలనీకి చెందిన కూచుంపూడి నాగేశ్వరరావు, తులసి దంపతుల కుమారుడు బాల ప్రసన్న కుమార్(21) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం దూలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. అతడి గుండె, లివర్, కిడ్నీ, లంగ్స్‌తో మరికొందరికి జీవితాన్నివ్వవచ్చని బాధితుడి తల్లిదండ్రులకు సూచిండడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో జీవన్మృతుడి అవయవాలను శస్త్ర చికిత్స ద్వారా తీసి అత్యవసరంగా చెన్నైకి తరలించారు. తన కుమారుడు లేడన్న బాధ ఉన్నప్పటికీ అతడి అవయవాలు అమర్చిన ఇంకొందరిలో చిరంజీవిగా ఉంటాడని తల్లిదండ్రులు తెలిపారు. -
ధూపం వేస్తేనే తల్లి గుట్ట దిగేది..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పడిగాపూర్‌కు చెందిన దొబె నాగేశ్వర్రావు.. సమ్మక్క తల్లి ధూపం వడ్డెగా వ్యవహరిస్తారు. వయస్సు పైబడడంతో తండ్రి దొబె పగడయ్య నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2015 మినీ జాతర నుంచి ధూపం వడ్డెగా నాగేశ్వర్రావు కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఆయన తల్లి సేవలో తరిస్తున్నారు. తల్లికి ధూపం వేసే పెద్ద బాధ్యతను ఆయన యుక్తవయస్సులోనే భుజాన వేసుకున్నారు. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర సందర్భంగా చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దె వద్దకు తీసుకొస్తారు. నాగేశ్వర్రావు ధూపం వేస్తేనే సమ్మక్క తల్లి చిలుకలగుట్ట దిగుతుంది. డోలు దరువు తల్లులకు ఇష్టం జాతరలో డోలు వాయిద్య కళాకారులకు ప్రత్యేక కథ ఉంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువస్తారు. డోలు వాయిద్య కళాకారుల దరువుతోనే తల్లులు కదిలొస్తారు. డోలు దరువు అంటే తల్లులకు మహా ఇష్టం. దరువు కొట్టనిది తల్లులు ఆవహించిన ప్రధాన పూజారుల అడుగు ముందుకు కదలదు. దేవతలను గద్దెలపై తీసుకురావడానికి రెండు గంటల సమయం పడుతుంది. అప్పటి వరకు డోలులు వాయిస్తూనే ఉండాలి. చిలుకలగుట్ట దద్దరిలేలా కళాకారులు తన ఒంట్లో ఉన్న శక్తిని ఉపయోగించి డోలును వాయించాలి. తల్లులను గద్దెలపై తీసుకువచ్చే క్రమంలో సమయం తెలియదని, తమకు ఏమాత్రం అలసట అనిపించదని, ఇదంతా తల్లుల మహిమేనని డోలు వాయిద్య కళాకారులు చెబుతున్నారు. అదేవిధంగా జాతరకు రెండు నెలలపాటు వచ్చిపోయే వందల మంది ప్రముఖులు, అధికారులకు డోలు వాయిద్య కళాకారులు స్వాగతం పలుకుతుంటారు. కానీ, వీరికి దేవాదాయశాఖ అధికారులు ఇచ్చే వేతనం అంతంత మాత్రమే. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డోలు వాయిద్య కళాకారులు కోరుతున్నారు. సమ్మక్కను తీసుకొస్తా జాతరకు పది రోజుల ముందే చిలుకలగుట్ట వనంలో లభించే ఔషధ మూలికలతో గుగ్గిలం తయారు చేస్తాం. ఆ గుగ్గిలంతోనే ధూపం వేస్తా. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను గద్దెకు రప్పిస్తా. తండ్రి నుంచి ధూపం వడ్డె బాధ్యతలను స్వీకరించి సమ్మక్క తల్లికి సేవ చేయడం నేను మహా అదృష్టంగా భావిస్తున్నా. –నాగేశ్వర్రావు, సమ్మక్క ధూపం వడ్డె -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చోడవరం: విశాఖపట్టణం జిల్లా చోడవరం మండలం నర్సీపేటలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కందెపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (27) మరో వ్యక్తితో కలిసి బుధవారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో బైక్‌పై వెళ్తుండగా నర్సీపేటలోని భీమిలి రోడ్డులో ఎదురుగా మరో బైక్ వచ్చి ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న నాగేశ్వరరావు కిందపడిపోగా అప్పుడే వచ్చిన బస్సు అతని తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. -
కాకినాడలో పరువు హత్య
-
కూతురితో సహజీవనం చేస్తున్నాడని..
కాకినాడ : కూతురుతో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై...ఆమె తండ్రి దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వివరాలు కాకినాడకు చెందిన పెండ్యాల రవిశంకర్(38) విద్యుత్ నగర్లో భార్య దేవితో కలసి ఉంటున్నాడు. ఇతడు వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా పిఠాపురానికి చెందిన దుర్గా భవానీ అనే మరో మహిళతో పదేళ్లగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఈరోజు ఉదయం దుర్గా భవానీ తండ్రి నాగేశ్వరరావు పిఠాపురం నుంచి కూతురు ఇంటికి వచ్చాడు. అప్పుడే దుర్గ ఇంటికి వచ్చిన రవిశంకర్‌పై నాగేశ్వరరావు కత్తితో దాడి చేసి హతమర్చాడు. అడ్డు వచ్చిన కుమార్తెపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. నాగేశ్వరరావు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బిగుస్తున్న ఉచ్చు..
* ముంబై జైల్లో ఉన్న ఎన్సీఎస్ ఎం.డిని తీసుకురావడానికి ప్రత్యేక బృందం * అక్టోబర్ 13న భూముల వేలం * బినామీ రుణాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు బొబ్బిలి : చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిం చకపోవడంతో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడిన ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం యాజామన్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిల్లులు చెల్లించకపోవడంతో రైతు లు కొద్ది రోజుల కిందట ఆందోళనలు చేసిన నేపథ్యం లో కర్మాగారం ఎం.డి నాగేశ్వరరావుతో పాటు డెరైక్టర్లు శ్రీనివాస్, మురళిపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6న డెరైక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏడో తేదీన అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు విశాఖలోని కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. వీరిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. డెరైక్టర్లు పోలీసులకు చిక్కడంతో తాజాగా బినామీ రుణాలపై బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు ఫిర్యాదులు చేయడానికి ముందు కు వస్తున్నారు. ఇప్పటికే పార్వతీపురం పోలీస్ స్టేషన్ లో ఒక రైతు తమ పేరుమీద బినామీ రుణాలు తీసుకు ని మోసం చేశారంటూ ఎన్సీఎస్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయగా, తాజాగా సీతానగరం మండలం బూర్జకు చెందిన ఎర్ర చిన్నంనాయుడు, పణుకుపేటకు చెందిన బంకురు తవిటినాయుడు, పూడి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న డెరైక్టర్లు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. బిల్లుల చెల్లింపులు, బినామీ రుణాలపై నమోదైన కేసుల నేపథ్యంలో దర్యాప్తు కోసం డెరైక్టర్లను తమకు అప్పగించాలని పోలీసులు చేసుకున్న వినతిని కోర్టు పరిశీలిస్తోంది. కాగా ఈ కేసుతో సంబంధముండి ఇప్పటికే ముంబైలో అరెస్టు అయి ఆర్ధర్ సబ్ జైల్లో ఉన్న ఎం.డి నాగేశ్వరరావును తీసుకురావడానికి పోలీసుల ప్రత్యేక బృందం ముంబై పయనమైంది. బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు ఒక వైపు యాజమాన్యంను అరెస్టు చేసినా రైతుల ఆందోళనలు చల్లారకపోవడంతో ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీస్ అధికారులు రైతులకు పేమెంట్లు చెల్లించడానికి చర్యలు తీసుకున్నారు. రైతులకు సుమారు 24 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, మొదటి విడతగా ఆరు కోట్ల రూపాయలను అధికారులు చెల్లిస్తున్నారు. పది వేల రూపాయల లోపున్న 15 వందల మంది రైతులకు ముందుగా బిల్లులు చెల్లిస్తున్నారు. మిగతా వారికి కూడా బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13న భూముల వేలం ఫ్యాక్టరీకి సంబంధించి రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న భూములను వచ్చే నెల 13న వేలం వేయనున్నారు. సీతానగరం మండల పరిధిలో ఉండే సుమారు 36 ఎకరాల భూమిని వేలం వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఈ నెల 8న ప్రకటన కూడా జారీ చేశారు. పార్వతీపురంలోని ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వేలం వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
లక్ష 72 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి
కొండపి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇప్పటి వరకు లక్ష 72 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించినట్లు జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ ధనుంజయుడు తెలిపారు. అక్షర విజయం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొండపి వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక హౌసింగ్ డీఈ కార్యాలయంలో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. 2006లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 లక్షల 36 వేల ఇళ్లు మంజూరు చేయగా... లక్షా 72 వేల మంది ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించుకున్నారన్నారు. 30 వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా ఐదో స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలో కారంచేడు, చినగంజాం, చీమకుర్తి, మద్దిపాడు, జే పంగులూరు, కొండపి మండలాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఉండగా..దోర్నాల, త్రిపురాంతకం, అర్ధవీడు, మర్రిపూడి మండలాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయని చెప్పారు. ఎక్కువ మంది ఎస్సీలు ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 150 కేజీల ఇనుము సైతం అందించే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారులు 11 డిజిట్‌తో కూడిన ఆన్లైన్ అకౌంట్లనే ప్రారంభించుకోవాలన్నారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు సిమెంటు డబ్బులు దశలవారీగా వెంటనే చెల్లిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 50 శాతం పురోగతి సాధించలేని హౌసింగ్ అధికారులకు కలెక్టర్ మెమోలు ఇచ్చినట్లు చెప్పారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 41 వేల మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టాలు తీసుకుని గ్రౌండ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో అటవీ సిబ్బంది..
చర్ల, న్యూస్‌లైన్: జిల్లాలో అటవీ, పోలీస్‌శాఖల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 22వ తేదీన అనుమతులు లేకుండా ఉంజుపల్లి అటవీప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టారని ఉన్నతాధికారుల సూచన మేరకు అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పోలీస్‌శాఖ వారిని అడ్డుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు తమదైన శైలిలో అటవీశాఖ అధికారి, సిబ్బం దిపై విరుచుకుపడ్డారు. అటవీశాఖ సిబ్బంది సైతం పోలీసులకు ఎదురు తిరిగారు. మీడి యా వారు ఇదంతా చిత్రీకరిస్తుండడంతో అ టవీశాఖ సిబ్బంది వెనక్కు తగ్గడంతో పోలీ సులు తమ పని కానిచ్చారు. అప్పటి నుంచి ఇరు శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో సోమవారం విధి నిర్వహణలో భాగంగా ఉంజుపల్లి అటవీ ప్రాంతానికి వెళ్తున్న చర్ల రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు బుచ్చయ్య, నాగేశ్వరరావు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ విజయరావులను సీఐ నరేందర్, ఎస్సై - 1 సంతోష్‌లు సిబ్బందిలో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ విష యం తెలిసి మీడియా వారు అక్కడికి వెళ్లేలోగానే వారిని హడావిడిగా పోలీస్‌స్టేషన్‌కు తీ సుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇ చ్చారు. అటవీప్రాంతంలో వీరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, అందుకే అదుపులోకి తీసుకున్నామని ఒకసారి, ఉంజుపల్లి మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరి వాహనాలు ఆపి తనిఖీ చేయగా డ్రైవింగ్ లెసైన్స్‌లు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని మరోసారి బదులిచ్చారు. వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఎవరినీ ఇలా స్టేషన్‌కు తరలించి నిర్బంధించిన దాఖలాలు లేవని, కొత్తగా ఇలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సీఐ నరేందర్,ఎస్సై - 1 సంతోష్‌లను వివరణ కోరగా తాము ఎవరి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, కేవలం వాహన తనిఖీల్లో భాగంగానే సరైన పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. గతంలో ఇటువంటి కేసులు నమోదైన దాఖలాలు ఎన్నడూ లేవని ప్రశ్నించగా ఇక నుంచి ఇలాగే కొనసాగిస్తామని బదులిచ్చారు. -
రెండో రోజూ ఆందోళన
షాబాద్, న్యూస్‌లైన్: రెండో రోజూ మండల పరిధిలోని సర్దార్‌నగర్‌లో ఉన్న పేపర్ మిల్లు ఎదుట గ్రామస్తులు బైఠాయించారు. కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీని బంద్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ కాలుష్యం విషయమై చర్చించేందుకు ఆదివారం గ్రామ సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులతో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లారు. సర్పంచ్‌తో పాటు గ్రామస్తులను కంపెనీ సిబ్బంది నెట్టివేయడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. సోమవారం కూడా సర్పంచ్‌తో పాటు స్థానికులు కంపెనీ ఎదుట బైఠాయించారు. కంపెనీ మేనేజర్ నాగేశ్వర్రావు గ్రామ సర్పంచ్ నర్సింలుతో పాటు స్థానికులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తమ సెక్యురిటీకి సర్పంచ్ అని తెలియక తెలియక పొరపాటు జరిగిందని చెప్పారు. కంపెనీ నుంచి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పేపర్‌మిల్లు ఎదుట గ్రామస్తుల ఆందోళన
షాబాద్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామ సర్పంచ్ నర్సింలుపై స్థానికంగా ఉన్న ఓ పేపర్‌మిల్లు యాజమాన్యం దాడి చేసిందని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు ఆదివారం ధర్నా చేశారు. సర్పంచ్ నర్సింలు, గ్రామస్తులు చెప్పిన కథనం ప్రకారం.. సర్దార్నగర్కి సమీపంలో ఉన్న పేపర్ మిల్లు నుంచి దుమ్ము, దూళి అధికంగా వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మిల్లు యజమానితో మాట్లాడేందుకు సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అయితే మిల్లు మేనేజర్ నాగేశ్వర్రావు తన సెక్యూరిటీ గార్డ్స్‌తో సర్పంచ్‌ను బయటకు గెంటివేయించారు. ‘నీవు సర్పంచ్ అయితే మాకేంది..? మా మిల్లు వద్దకు ఎందుకు వచ్చావంటూ’ దుర్భాషలాడటంతో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. మిల్లు నుంచి వచ్చే దుమ్ముతో తాగునీరు కలుషితమవుతోందని, తాము రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లును మూసివేయించాలని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మిల్లు మూసివేతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. గ్రామస్తులంతా కలిసి కంపెనీ గేటుకు తాళం వేయడంతో మిల్లులో పనులు నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు అక్కడినుంచి వెనుదిరిగారు. -
వచ్చే నెల 1 నుంచి నగదు బదిలీ
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : వచ్చే నెల( ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నాగేశ్వర్రావు వెల్లడించారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని ఇండేన్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆధార్ కార్డులు అందజేసిన ప్రతి ఒక్క వినియోగదారుడికి వెంటనే అనుసంధానం చేయాలని ఆదేశించారు. వినియోగదారులను చైతన్యం చేయడానికి ఏజెన్సీల వారు కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 46 శాతం మంది గ్యాస్ వినియోగదారులు అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. కాగా మిర్యాలగూడలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో 43,255 మంది గ్యాస్ వినియోగదారులుంటే ఇప్పటి వరకు 19,237 మంది మాత్రమే ఏజెన్సీ లో, 14,327 మంది బ్యాంకులో అనుసంధానం చేసుకున్నారని చెప్పారు. అదే విధంగా హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో 34,832 మందికి గాను 11,337 మంది గ్యాస్ ఏజెన్సీలో, 5526 మంది బ్యాంకులో అనుసంధానం చేసుకున్నారన్నారు. ఫిబ్రవరి 1 నుంచి నగదు బదిలీ పథకం జిల్లాలో అమలు కానున్నందున గ్యాస్ వినియోగదారులంతా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని కోరారు. అదే విధంగా దీపం గ్యాస్ కనెక్షన్‌కు స్టౌ లేకుండా 1060 మాత్రమే చెల్లించాలని కోరారు. కొత్త గ్యాస్ కనెక్షన్‌కు గాను స్టౌ లేకుండా 2,585, అదనపు సిలిండర్‌కు 1995 మాత్రమే చెల్లించాలని వివరించారు. కొత్త కనెక్షన్లకు ఎక్కు వ డబ్బులు తీసుకుంటే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏజీపీవో చంద్రశేఖర్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ ఆర్ఐ వాజిద్ ఉన్నారు. -
ఏజెన్సీలో లక్ష మంది పేదలకు ఉచిత నేత్ర వైద్యం
ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు అరకులోయ,న్యూస్‌లైన్: ఏజెన్సీ ప్రాంతంలో లక్ష మంది పేదలకు ఉచితంగా కంటి వైద్యం అందించేందుకు నిర్ణయించినట్టు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ చైర్మన్ జి.నాగేశ్వరరావు తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అరకులోయలో ఏర్పాటు చేసిన 100వ దృష్టి కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. వైద్యపరీక్షల అనంతరం విశాఖలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తే నూతన భవనం నిర్మిస్తామన్నారు. 500మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని చెప్పార -
ఇక డీడీలకు చెల్లు..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతినెలా రేషన్ డీలర్లకు డీడీలు తీయడానికి *400నుంచి *500 వరకు ఖర్చవుతోంది. దీంతో రేషన్‌డీలర్లపై అదనపు భారం పడుతోంది. దీనిని పౌరసరఫరాల శాఖే భరించాలని కొంతకాలంగా డీలర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ *5కే రేషన్ డీలర్లకు ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ కార్డు నంబర్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లో డ బ్బులు జమచేస్తే ఇవి సివిల్ సప్లయి ఖాతాలోకి వెళ్తాయి. దీన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే నల్లగొండ మండలంలో అమలు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. వచ్చేనెల నుంచి ఈ పద్ధతిని అమలు పరచడానికి కార్డుల్ని ఐసీఐసీఐ బ్యాంకువారు తయారు చేశారు. తగ్గనున్న శ్రమ.... ప్రీపెయిడ్ విధానం ద్వారా డీలర్లుకు శ్రమతోపాటు సమయం కూడా మిగులుతుంది. డీడీకి అయ్యే సర్వీస్ చార్జ్ కూడా ఆదా కానుంది. ప్రతినెలా వేల రూపాయల డీడీ తీయడానికి బ్యాంకుల్లో బారులుదీరుతున్నారు. డబ్బులు పౌర సరఫరాల శాఖ ఖాతాల్లో జమచేసినా మళ్లీ డీడీకోసం బ్యాంకుల్లో నిరీక్షించాల్సి వచ్చేది. ఇకపై ఇటువంటి శ్రమ ఉండదు. అంతేగాక డీడీకి అవసరమైన సర్వీసు చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. తద్వారా డీలర్లపై ఆర్థికభారం తగ్గినట్లే. ప్రీపెయిడ్ విధానం నల్లగొండ మండలంలో విజయవంతమైతే మొదటగా జిల్లావ్యాప్తంగా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ పద్ధతి అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కలెక్టరేట్లో నల్లగొండ మండలంలోని 70 మంది రేషన్ డీలర్లకు ప్రీపెయిడ్ విధానంపై డీఎస్ఓ నాగేశ్వరరావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించి ప్రీపెయిడ్ కార్డులు అందజేశారు. -
ఎన్నున్నా... నేనున్నా
అప్పటికి - అమెరికా వెళ్లడం ఒక్కటే నాగేశ్వరరావు లక్ష్యం. అప్పటికి అంటే... చదువు పూర్తయ్యేనాటికి. చదువు పూర్తయింది. లక్ష్యం చేరువయింది. సడెన్‌గా యు-టర్న్ తీసుకున్నారు నాగేశ్వరరావు! నో అమెరికా అనుకున్నారు. అమెరికా వెళితే తనొక్కడే హ్యాపీగా ఉంటాడు. వెళ్లకపోతే? తనలాంటి వికలాంగులెందర్నో హ్యాపీగా ఉంచగలడు! వైకల్యం జీవన్మరణం అని ఆయనకు తెలుసు. అసౌకర్యాలుంటాయి, అవమానాలుంటాయి. అన్యాయాలంటాయి, అక్రమాలు ఉంటాయి. ‘ఎన్నున్నా... మీకు నేనున్నా’ అని నిలబడ్డారాయన. పట్టు సడలని ఆయన పోరాటమే... ఈవారం... ప్రజాంశం. అంతవరకు తోటిపిల్లలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు నాలుగేళ్ల నాగేశ్వరరావు. ఉన్నట్టుండి ప్రమాదవశాత్తూ చెయ్యి విరిగింది ఆ చిన్నారికి. నిరుపేద కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరావుకి అకస్మాత్తుగా వచ్చిపడ్డ అంగవైకల్యం అతడిలో క్రమేణా పట్టుదలను పెంచింది. చెయ్యిలేనివాడికి చదువెందుకంటూ ఎద్దేవా చేశారు చాలామంది. ఉన్నత చదువులతోనే వారందరికీ సమాధానం చెప్పాలనుకున్నాడు. చదువుకుంటూనే ‘వికలాంగుల విద్యార్థి సంఘం’ స్థాపించిన నాగేశ్వరరావు ఆ తర్వాత వికలాంగులకు కావలసిన సౌకర్యాల కోసం వికలాంగుల హక్కుల సంఘాన్ని స్థాపించి, పోరాటం ప్రారంభించారు.ఈ పోరాట యోధుని అనుభవాలు ఆయన మాటల్లోనే... ‘‘మాది నెల్లూరుజిల్లా చౌటపల్లి. నాన్న నిరుపేద రైతు. బిడ్డల్ని చదివించడం తప్ప ఆయనకు మరో ధ్యేయం లేదు. నాకు పదేళ్ల వయసున్నప్పుడు, తెలిసిన వాళ్ల ద్వారా నన్ను మలక్‌పేట వికలాంగుల హాస్టల్లో చేర్పించారు. అక్కడే డిగ్రీ పూర్తిచేశాను. ఒక స్నేహితుడు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హాండీకాప్డ్’లో బి.ఈడీచేస్తే ఉద్యోగాలొస్తాయని చెప్పడంతో వెంటనే అందులో చేరి బి.ఈడీ పూర్తిచేశాను. అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది కానీ వెళ్లదలచుకోలేదు. నాలా ఏ వికలాంగుడూ ఇన్ని కష్టాలు పడకుండా ఉండటం కోసం ఏమైనా చేయాలనుకున్నాను. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘వికలాంగుల హక్కులసంఘం’. పింఛన్ నుండి ‘పిలుపు’ వరకూ... ఏ మనిషికైనా డబ్బు ప్రధానం కాబట్టి, ముందు పెన్షన్ కోసం పోరాటం ప్రారంభించాను. అప్పటివరకూ వికలాంగులకు రు.200 మాత్రమే పెన్షన్ వచ్చేది. దాన్ని రు.500కు పెంచాలని చేసిన డిమాండ్ ఫలించింది. ‘మా సంక్షేమం గురించి అడిగేవారు లేకపోవడంతో మా కనీస హక్కులేంటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో ‘పిలుపు’ పేరుతో ఓ మాసపత్రిక పెట్టాను. అందులో ప్రభుత్వ పథకాలు, హక్కులు, చట్టాలు... వంటి వివరాలన్నీ ఉంటాయి. ఏయే విద్యార్హతలకు ఏయే ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలియజేస్తూ ఆయా ఉద్యోగాల వివరాలు, దరఖాస్తులు అందుబాటులో ఉంచాను. అవే కాకుండా వికలాంగుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, రాష్ర్టంలోని వికలాంగుల విజయగాథల ను కూడా అందులో ప్రచురిస్తున్నాం. వాటి ఆధారంగా దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. సంఘం సాధించిన విజయాలు... వికలాంగులమంటూ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నవారు చాలామంది ఉంటారు. వారి బండారం బయటపెట్టాను. నాలుగేళ్లక్రితం వచ్చిన ఓ సినిమాలో డైలాగ్‌లు వికలాంగుల మనోభావాల్ని గాయపరిచేలా ఉండడంతో వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి ఆ సినిమాలో మాటలు తొలగించాలని కోరాను. నిర్మాత పెద్దగా స్పందించకపోవడంతో సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగాం. వెంటనే ఆ డైలాగ్స్‌ని కట్ చేశారు. అంతేకాదు... ‘ఇకపై మరే సినిమాలో కూడా వికలాంగుల మనోభావాల్ని ఇబ్బందిపెట్టే మాటలు, సన్నివేశాలు ఉండనివ్వం’ అంటూ సెన్సార్ బోర్డు వారు మాట ఇవ్వడం మేం సాధించిన మరో విజయం. ఆటలు, అవార్డులు... మా సంఘపోరాటాన్ని ధర్నాలు, ఉద్యమాలకే పరిమితం చేయకుండా వికలాంగుల్లో చైతన్యం తీసుకురావడానికి... క్రికెట్ టోర్నమెంట్‌ని నిర్వహించి, రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి 23 టీమ్‌లను ఏర్పాటుచేశాం. ఏటా వికలాంగుల దినోత్సవం నాడు ప్రత్యేక వేడుకల్ని జరుపుతున్నాం. మహిళా దినోత్సవంనాడు... వ్యాపారం, విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించిన వికలాంగ మహిళలకు సన్మానాలు చేస్తున్నాం.సకలాంగులకు కూడా సాధ్యం కాని ఎన్నో విజయాలను సాధించిన నాగేశ్వరరావు అభినందనీయులు. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి