చర్ల, న్యూస్‌లైన్: జిల్లాలో అటవీ, పోలీస్‌శాఖల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 22వ తేదీన అనుమతులు లేకుండా ఉంజుపల్లి అటవీప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టారని ఉన్నతాధికారుల సూచన మేరకు అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పోలీస్‌శాఖ వారిని అడ్డుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు తమదైన శైలిలో అటవీశాఖ అధికారి, సిబ్బం దిపై విరుచుకుపడ్డారు. అటవీశాఖ సిబ్బంది సైతం పోలీసులకు ఎదురు తిరిగారు.
మీడి యా వారు ఇదంతా చిత్రీకరిస్తుండడంతో అ టవీశాఖ సిబ్బంది వెనక్కు తగ్గడంతో పోలీ సులు తమ పని కానిచ్చారు. అప్పటి నుంచి ఇరు శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో సోమవారం విధి నిర్వహణలో భాగంగా ఉంజుపల్లి అటవీ ప్రాంతానికి వెళ్తున్న చర్ల రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు బుచ్చయ్య, నాగేశ్వరరావు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ విజయరావులను సీఐ నరేందర్, ఎస్సై - 1 సంతోష్‌లు సిబ్బందిలో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ విష యం తెలిసి మీడియా వారు అక్కడికి వెళ్లేలోగానే వారిని హడావిడిగా పోలీస్‌స్టేషన్‌కు తీ సుకువచ్చారు.
ఈ విషయంపై పోలీసులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇ చ్చారు. అటవీప్రాంతంలో వీరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, అందుకే అదుపులోకి తీసుకున్నామని ఒకసారి, ఉంజుపల్లి మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరి వాహనాలు ఆపి తనిఖీ చేయగా డ్రైవింగ్ లెసైన్స్‌లు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని మరోసారి బదులిచ్చారు. వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఎవరినీ ఇలా స్టేషన్‌కు తరలించి నిర్బంధించిన దాఖలాలు లేవని, కొత్తగా ఇలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సీఐ నరేందర్,ఎస్సై - 1 సంతోష్‌లను వివరణ కోరగా తాము ఎవరి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, కేవలం వాహన తనిఖీల్లో భాగంగానే సరైన పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. గతంలో ఇటువంటి కేసులు నమోదైన దాఖలాలు ఎన్నడూ లేవని ప్రశ్నించగా ఇక నుంచి ఇలాగే కొనసాగిస్తామని బదులిచ్చారు.
పోలీసుల అదుపులో అటవీ సిబ్బంది..
Published Tue, Mar 4 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement
Advertisement