Beat Officer
-
అలా జైలుకు..ఇలా బెయిల్‌పై
బంజారాహిల్స్: పోలీసు ఆఫీసర్నని..ఫారెస్ట్ బీట్ ఆఫీసర్నని..తనకు డిపార్ట్మెంట్లో చాలా పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి రూ లక్షలు వసూలు చేయడమే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రెస్‌లో ఏకంగా సైఫాబాద్‌లోని అరణ్యభవన్ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్)లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్న నకిలీ అధికారిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్‌కు చెందిన కొనకంచి కిరణ్‌కుమార్ ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. శ్రీనగర్‌కాలనీలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసే మహిళను పరిచయం చేసుకుని తాను పోలీసు ఇన్స్పెక్టర్నని, డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన బాధితురాలు తన తమ్ముడు గణేష్ కు ఉద్యోగం ఇప్పించాలని అతడికి రూ.11.50 లక్షలు ఇచి్చంది. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా అతను అంతకముందే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి అవతారమెత్తిన కిరణ్ గత గురువారం సైఫాబాద్‌లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీఐగా పని చేస్తున్నానని చెప్పుకుంటూ హల్చల్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డులు అతడిని నిలదీయగా గుట్టురట్టయ్యింది. డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏకంగా అరణ్యభవన్లోనే తిష్టవేసిన అతను బాధితులను అక్కడికే రమ్మని చెప్పినట్లు తేలింది.అధికారుల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం సైఫాబాద్ పోలీసులు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు పోలీసు, ఫారెస్ట్ శాఖ పేర్లు చెప్పుకుంటూ ఖాకీ డ్రెస్‌లో తిరుగుతూ ఆయా శాకల్లో ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైఫాబాద్, చర్లపల్లి, ఖమ్మం పోలీస్స్టేషన్ల పరిధిలోనూ అతడిపై ఎనిమిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇంత జరుగుతున్నా అలా జైలుకు వెళ్లడం..ఇలా బెయిల్‌పై రావడం..తిరిగి ఖాకీ డ్రెస్ చేసుకుని అవే డిపార్ట్మెంట్ల పేర్లు చెప్పి అమాయకులను మోసం చేయడం జరుగుతుంది. -
ఆత్మహత్యాయత్నానికి యత్నించిన నిర్మల్ జిల్లా బుట్టాపూర్ బీట్ అధికారి
-
బీట్ అధికారి వచ్చీరాని డ్రైవింగ్.. ఒకరు మృతి, మరొకరికి..
సాక్షి, మాచారెడ్డి (నిజామాబాద్): డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో అటవీశాఖ బీట్ అధికారి నవీన్ కార్యాలయ జీపు నడుపుతూ ఒకేరోజు రెండు బైక్‌లను ఢీ కొట్టడంతో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మాచారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీట్ అధికారి నవీన్ తోపాటు మరికొందరు అటవీ అధికారులు విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఎల్లంపేటకు వెళ్లి మాచారెడ్డికి వస్తున్నారు. అక్కాపూర్ సమీపంలో ఎల్లంపేట గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు మాచారెడ్డి నుంచి ఎల్లంపేటవెళ్తుండగా ఎదురుగా వస్తున్న అటవీశాఖ వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో బాధపడుతున్న సంతోష్‌ను అదే వాహనంలోఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అయితే గజ్యానాయక్ తండా గ్రామపంచాయితీపరిధిలోని గొట్టం చెరువు తండాకు చెందిన అజ్మీరా రాములు (30) అక్కాపూర్రోడ్డులో ఉన్న రెండెకరాల భూమిని కౌలుకు చేస్తున్నాడు. ఆయన తన బైక్పైపొలం దగ్గరకువెళ్తుండగా అతివేగంగావస్తున్న ఈ అటవీశాఖ వాహనం ఢీ కొట్టడంతో కింద పడిపోయిన రాములు కాళ్లుచేతులు విరిగాయి. గాయాలతో బాధపడుతున్న రాములను కూడా అదే వాహనంలో చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడచికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వివరించారు.అతి వేగం, అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన అధికారినికఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గజ్యానాయక్ తండా చౌరస్తాలోని రేంజ్ కార్యాలయం ఎదుట కామారెడ్డి–సిరిసిల్లా రహదారిపై 3 గంటల పాటు ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్మర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపోయాయి. కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అంజినాయక్, అటవీశాఖ అధికారులు ఆందోళనాకారులను సముదాయించారు. మృతుడు రాములుకు భార్యవనిత, రెండేళ్ల కుమారుడు, తొమ్మిదినెలల కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లాఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డితెలిపారు. -
బీట్.. బహు బాగు
సాక్షి, భూపాలపల్లి: హలో.. హలో బీట్ ఆఫీసరేనా ఇక్కడ దుప్పిని చంపారు సార్. మీరు తొందరగా వచ్చి వేటగాళ్లను పట్టుకోండి అని ఓ బీట్ పరిధిలోని గూడెం నుంచి బీట్ ఆఫీసర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ ఆగమేగాలతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొంత దూరం వెళ్లాకా.. మరో ఫోన్ కాల్ వచ్చింది.. సార్ ఇక్కడ పెద్ద ఎత్తున టేకు చెట్లను నరికి దుంగలను తరలించడానికి దుండగులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే రండి.. లేకుంటే వారు వెళ్లిపోతారని ఈ కాల్ సారాంశం. దీంతో ఆ బీట్ ఆఫీసర్ ఎటు వెళ్లాలో తేల్చుకోలేని çపరిస్థితి. దుప్పి మాంసాన్ని కాపాడలేదు.. కలప స్మగ్లింగ్ ఆగలేదు. ఒక ఆఫీసర్ రెండు నుంచి ఐదు బీట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు అటవీ శాఖలో ఉంది. ప్రస్తుతం బీట్ ఆఫీసర్ల నియామకంతో కొంతలో కొంతైనా వారిపై భారం తగ్గనుంది. అడవి సంరక్షణలో బీట్ ఆఫీసర్లే కీలకం. క్షేత్రస్థాయిలో వన్య ప్రాణులు, కలప, అటవీ ఉత్పత్తుల కంటికి రెప్పలా కాపాడడంలో వీరిది అందవేసిన చేయి. అయితే కొంతకాలంగా వీరి కొతర అటవీశాఖను తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేక తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు కొత్తగా బీట్ ఆఫీసర్ల నియామకంతో కాస్త భారం దిగనుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గత కొన్నేళ్లుగా తగినంత మంది బీట్ ఆఫీసర్లు లేక ఉన్నవారిపైనే అదనపు భారం పడేది. దీంతో ఒక్కో బీట్ అధికారి ఒకటి కంటే ఎక్కువ అటవీ బీట్ల విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొత్త బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో అటవీ పరిరక్షణ మరింతగా పెరుగనుంది. పెరిగిన ఆఫీసర్లు.. కొత్తగా బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో జిల్లాలో అటవీ శాఖపై పనిభారం తగ్గనుంది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కరీంనగర్ తూర్పు డివిజన్‌తో పాటు వరంగల్ నార్త్ డివిజన్ పరిధిలో ఉంది. భూపాలపల్లి జిల్లాకు కరీంనగర్ తూర్పు డివిజన్ నుంచి 80 మంది, వరంగల్ నార్త్ డివిజన్ నుంచి 24 మందిని కేటాయించారు. మొత్తంగా జిల్లాకు 104 మంది కొత్త బీట్ అధికారులు రానున్నారు. అదే విధంగా ములుగు జిల్లా పూర్తిగా వరంగల్ నార్త్ డివిజన్ పరిధిలో ఉంది. ములుగులోని ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, ములుగు సబ్డివిజన్లకు 35 మంది చొప్పున 105 మంది బీట్ ఆఫీసర్లను కేటాయించారు. త్వరలో వీరు నియామకం కానున్నారు. అలాగే 80 పోస్టులు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. వీటికి ఎస్టీ ట్రైబ్స్ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 13 మండలాలకు కేటాయించనున్నారు. స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట దట్టమైన అడవులు, పర్యాటక కేంద్రాలు ఉన్న ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బీట్ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఇన్నాళ్లు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వన్య ప్రాణుల వేట, కలప అక్రమ రవాణా, అడవిలో లభించి విలువైన వన మూలికలు, ఇతర సరుకులు అక్రమాలకు కాసులకు కురిపించేవి. స్మగ్లర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో ఇకపై అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే కొత్తగా పోడును నిలువరించడంతో పాటు హరితహారంలో మొక్కులు పెంచి అటవీని పచ్చగా మార్చుకోవచ్చు. ఖాళీగా కొన్ని బీట్లు తాజాగా జరిగిన నియామకాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో బీట్ ఆఫీసర్లు ఖాళీల నియామకాలు జరిగాయి. ఇన్ని నియామకాలు జరిగినా రెండు జిల్లాల్లోని కొన్ని బీట్లు ఖాళీగానే ఉన్నాయి. మొన్నటి వరకు రెండు జిల్లాలో 532 బీట్లు ఉంటే కేవలం 110 మంది బీట్ ఆఫీసర్లు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో మొన్నటి వరకు 190 బీట్లకు గానూ 32 మంది, ములుగులో 342 బీట్లకు గానూ 78 మంది మాత్రమే బీట్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించారు. సగటున ఒక బీటు చూసే అధికారి ఐదారు బీట్లు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొత్తగా నియమించే సిబ్బందితో ఈ సమస్యలను అధిగమించవచ్చని అటవీశాఖ భావిస్తోంది. ప్రస్తుతం భూపాలపలి జిల్లాకు కొత్తగా 104 మంది, ములుగు జిల్లాకు 105 మంది రానుండటంతో ఖాళీల సంఖ్య తగ్గింది. కొత్తగా వచ్చిన బీట్ ఆఫీసర్ల నియామకం జరిగిన తర్వాత భూపాలపల్లిలో 54 ఖాళీలు ఉంటాయి. ఆదే విధంగా ములుగులో 159 ఖాళీలు ఉంటాయి. అయితే మరో 80 ఏజెన్సీ పోస్టుల నియామకం ఉండటంతో ములుగు జిల్లా కూడా ఖాళీల సంఖ్య 80కి తగ్గే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి
కాగజ్‌నగర్(ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డీఎఫ్ఓ కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరశురాం(40) మృతిచెందారు. ఆయన డీఎఫ్ఓ కార్యాలయానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పరశురాంను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. -
అటవీశాఖలో ఇంటి దొంగలు..?
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం అటవీ రేంజ్ పరి ధి పర్ణశాల సెక్షనలోని ఒక బీట్ అధికారి ఇంట్లో అక్రమంగా 40టేకు దిమ్మలు ఉన్నట్లు సమాచా రం అందుకున్న అటవీ శాఖ ప్రత్యే సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు.ఆపై ఇంటి దొంగలను కాపాడేందుకు పైఅధికారుల ఒత్తిడి మేరకు యూడీఆర్ కేసును మాత్రమే నమోదు చేసి సిబ్బందిని కాపాడారు . వివరాలు ...చినబండిరేవులో బీట్ అధికారి ఇంటి వెనుక 40టేకు దిమ్మలు అక్రమంగా ని ల్వ ఉంచారని భద్రాచలం నార్త్ ఇన్చార్జ్ డీఎఫ్ఓ రాథోడ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన ఆప్రాంతానికి ప్రత్యేక సిబ్బందిని పంపి తనిఖీలు చేయించగా టేకు దిమ్మలతో పాటు ఇంట్లోనే ఫర్నీచర్ చేయించడం వారి కంట పడింది. ఈ కలపను మూడు నెలల క్రితం గ్రామాలలో దాడులు చేసి పట్టుకొచ్చి నిల్వ ఉంచారు. నిల్వచేసిన వారిలో ముగ్గురు సిబ్బంది హస్తం ఉన్నట్లు సమాచారం. కలపను పట్టుకున్న వెంటనే యూడీఆర్ కేసు నమోదు చేసి దానిపై నంబర్లు నమోదు చేయాలి. కానీ మూడు నెలలు దాటినా కేసు నమోదు చేయకపోగా నంబర్లు సైతం వేయలేదు. దీనికి తోడు ఆ కలపను స్మగ్లర్లకు విక్రయించడానికి మరో సిబ్బంది సుమారు 45 వేలు వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కలప నిల్వపై ప్రత్యేక సిబ్బంది దాడిచేసి పట్టుకోవడంతో అధికారులు కూడా తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కేసును తారుమారు చేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ వ్యవహారం గోప్యంగా ఉంచిన అటవీ సిబ్బంది, అదేరోజు దాడి చేసి దిమ్మలను పట్టుకున్నట్లు, యూడీఆర్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముగ్గురు సిబ్బందితో యూడిఆర్ కేసు నమోదు చేయించిన అధికారులు, కలపను రాత్రికి రాత్రే భద్రాచలం డిపోకు తరలించారు.ఈ విషయంపై భద్రాచలం నార్త్ ఇన్చార్జ్ డీఎఫ్ఓ రాథోడ్‌ను వివరణ కోరగా.. కలప కోసం ప్రత్యేక సిబ్బందిని పంపినమాట వాస్తవమేనన్నారు. కలప ఉన్నమా ట వాస్తవమేనని, కేసు ఎప్పుడు నమోదు చేశారు అనే విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. -
అటవీశాఖలో పోస్టుల భర్తీకి...
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు ఆదివారం నుంచి జరగనున్నాయి. జిల్లా అటవీశాఖలో రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న మొత్తం 254 పోస్టుల (బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్) భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖమ్మం కేంద్రంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. 141 అసిస్టెంట్ బీటాఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం ఖమ్మంలోని 17 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 13,261 మంది అభ్యర్దులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జన రల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమెటిక్స్ పేపర్; మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 గంటల వరకు జనరల్ ఎస్సే పరీక్ష ఉంటాయి. ఈ నెల 18న 17 సెంటర్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(మొత్తం ఖాళీలు 92) పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 9,146 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్, 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్ పేపర్; మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుంది. ఈ నెల 25న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (మొత్తం ఖాళీలు 16) పరీక్ష నాలుగు కేంద్రాలలో జరుగుతుంది. మొత్తం 1733 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్; మధ్యాహ్నం ఒంటి గంటనుంచి 2:00 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పేపర్ పరీక్ష ఉంటుంది. తానేధార్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-3) పోస్టులకు వరంగల్‌లో పరీక్ష ఉంటుంది. -
అటవీ ఉద్యోగాల జాతర
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఉద్యోగాల జాతరకు తెర లేచింది. ఏప్రిల్‌లో జరగవలసిన రాత పరీక్షలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఘట్టం పరిసమాప్తం కావడంతో ఇక అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు వివిధ పోస్టులకు దశల వారీగా రాత పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాస్తవంగా ఏప్రిల్ 6న ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించడానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇదే సమయంలో వెలువడింది. దాంతో ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి వచ్చింది. రాత పరీక్షలు వాయిదా పడక తప్పలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ ్లలో 3,820, రెండేళ్లలో 2,547 పోస్టులు భర్తీ చేయాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాల భర్తీకి అన్ని ఆ టంకాలు తొలగిపోవడంతో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో ఆనందం రేకెత్తిస్తోంది. ఈ నెల 11న పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉద్యోగాల కోసం ఎంతో కా లంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు అటవీ శాఖలో పోస్టుల భర్తీ నిజంగా ఆనందభరితులను చేస్తోంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో పోస్టుల వివరాలు జిల్లాలోని ఆరు డివిజన్లు ఉండగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 30, బీట్ ఆఫీసర్లు 113, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 215 పోస్టులు మొత్తం 358 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులకు ప్రభుత్వం విద్యార్హతలను కూడా ప్రకటించింది. అటవీ సెక్షన్ అధికారి పోస్టుకు ఇంజినీరింగ్‌లో సైన్స్ ఆధారంగా పట్టభద్రులై ఉండాలి. అలాగే బీట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు పదో తరగతి విద్యార్హతగా నిర్దేశించింది. వారం ముందే హాల్‌టికెట్లు పరీక్ష తేదీకి వారం రోజుల ముందే అభ్యర్ధులకు హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్హత గల అభ్యర్థులు నిర్దేశిత వెబ్సైట్www.apfdt.orgనుంచి అటవీ శాఖల పోస్టుల పరీక్షల హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కొలువు అటవీ శాఖ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన ఉత్తీర్ణులైన ఉద్యోగులకు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనే కొలువు దీరనున్నారు. పరీక్షలు రాసిన అనంతరం ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించనుంది. దాంతో అటవీ శాఖలో కొత్తగా వందల మంది ఉద్యోగులు కొలువు దీరనున్నారు. -
పోలీసుల అదుపులో అటవీ సిబ్బంది..
చర్ల, న్యూస్‌లైన్: జిల్లాలో అటవీ, పోలీస్‌శాఖల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 22వ తేదీన అనుమతులు లేకుండా ఉంజుపల్లి అటవీప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టారని ఉన్నతాధికారుల సూచన మేరకు అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పోలీస్‌శాఖ వారిని అడ్డుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు తమదైన శైలిలో అటవీశాఖ అధికారి, సిబ్బం దిపై విరుచుకుపడ్డారు. అటవీశాఖ సిబ్బంది సైతం పోలీసులకు ఎదురు తిరిగారు. మీడి యా వారు ఇదంతా చిత్రీకరిస్తుండడంతో అ టవీశాఖ సిబ్బంది వెనక్కు తగ్గడంతో పోలీ సులు తమ పని కానిచ్చారు. అప్పటి నుంచి ఇరు శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో సోమవారం విధి నిర్వహణలో భాగంగా ఉంజుపల్లి అటవీ ప్రాంతానికి వెళ్తున్న చర్ల రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు బుచ్చయ్య, నాగేశ్వరరావు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ విజయరావులను సీఐ నరేందర్, ఎస్సై - 1 సంతోష్‌లు సిబ్బందిలో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ విష యం తెలిసి మీడియా వారు అక్కడికి వెళ్లేలోగానే వారిని హడావిడిగా పోలీస్‌స్టేషన్‌కు తీ సుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇ చ్చారు. అటవీప్రాంతంలో వీరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, అందుకే అదుపులోకి తీసుకున్నామని ఒకసారి, ఉంజుపల్లి మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరి వాహనాలు ఆపి తనిఖీ చేయగా డ్రైవింగ్ లెసైన్స్‌లు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని మరోసారి బదులిచ్చారు. వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఎవరినీ ఇలా స్టేషన్‌కు తరలించి నిర్బంధించిన దాఖలాలు లేవని, కొత్తగా ఇలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సీఐ నరేందర్,ఎస్సై - 1 సంతోష్‌లను వివరణ కోరగా తాము ఎవరి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, కేవలం వాహన తనిఖీల్లో భాగంగానే సరైన పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. గతంలో ఇటువంటి కేసులు నమోదైన దాఖలాలు ఎన్నడూ లేవని ప్రశ్నించగా ఇక నుంచి ఇలాగే కొనసాగిస్తామని బదులిచ్చారు.