మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఉద్యోగాల జాతరకు తెర లేచింది. ఏప్రిల్‌లో జరగవలసిన రాత పరీక్షలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఘట్టం పరిసమాప్తం కావడంతో ఇక అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు వివిధ పోస్టులకు దశల వారీగా రాత పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాస్తవంగా ఏప్రిల్ 6న ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించడానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు.
అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇదే సమయంలో వెలువడింది. దాంతో ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి వచ్చింది. రాత పరీక్షలు వాయిదా పడక తప్పలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ ్లలో 3,820, రెండేళ్లలో 2,547 పోస్టులు భర్తీ చేయాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాల భర్తీకి అన్ని ఆ టంకాలు తొలగిపోవడంతో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో ఆనందం రేకెత్తిస్తోంది. ఈ నెల 11న పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉద్యోగాల కోసం ఎంతో కా లంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు అటవీ శాఖలో పోస్టుల భర్తీ నిజంగా ఆనందభరితులను చేస్తోంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో పోస్టుల వివరాలు
జిల్లాలోని ఆరు డివిజన్లు ఉండగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 30, బీట్ ఆఫీసర్లు 113, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 215 పోస్టులు మొత్తం 358 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులకు ప్రభుత్వం విద్యార్హతలను కూడా ప్రకటించింది. అటవీ సెక్షన్ అధికారి పోస్టుకు ఇంజినీరింగ్‌లో సైన్స్ ఆధారంగా పట్టభద్రులై ఉండాలి. అలాగే బీట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు పదో తరగతి విద్యార్హతగా నిర్దేశించింది.
వారం ముందే హాల్‌టికెట్లు
పరీక్ష తేదీకి వారం రోజుల ముందే అభ్యర్ధులకు హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్హత గల అభ్యర్థులు నిర్దేశిత వెబ్‌సైట్www.apfdt.orgనుంచి అటవీ శాఖల పోస్టుల పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో కొలువు
అటవీ శాఖ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన ఉత్తీర్ణులైన ఉద్యోగులకు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనే కొలువు దీరనున్నారు. పరీక్షలు రాసిన అనంతరం ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించనుంది. దాంతో అటవీ శాఖలో కొత్తగా వందల మంది ఉద్యోగులు కొలువు దీరనున్నారు.
అటవీ ఉద్యోగాల జాతర
Published Mon, May 5 2014 1:50 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement