సాక్షి, మాచారెడ్డి (నిజామాబాద్): డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో అటవీశాఖ బీట్ అధికారి నవీన్ కార్యాలయ జీపు నడుపుతూ ఒకేరోజు రెండు బైక్‌లను ఢీ కొట్టడంతో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మాచారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీట్ అధికారి నవీన్ తోపాటు మరికొందరు అటవీ అధికారులు విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఎల్లంపేటకు వెళ్లి మాచారెడ్డికి వస్తున్నారు.
అక్కాపూర్ సమీపంలో ఎల్లంపేట గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు మాచారెడ్డి నుంచి ఎల్లంపేటవెళ్తుండగా ఎదురుగా వస్తున్న అటవీశాఖ వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో బాధపడుతున్న సంతోష్‌ను అదే వాహనంలోఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అయితే గజ్యానాయక్ తండా గ్రామపంచాయితీపరిధిలోని గొట్టం చెరువు తండాకు చెందిన అజ్మీరా రాములు (30) అక్కాపూర్‌రోడ్డులో ఉన్న రెండెకరాల భూమిని కౌలుకు చేస్తున్నాడు. ఆయన తన బైక్‌పైపొలం దగ్గరకువెళ్తుండగా అతివేగంగావస్తున్న ఈ అటవీశాఖ వాహనం ఢీ కొట్టడంతో కింద పడిపోయిన రాములు కాళ్లుచేతులు విరిగాయి. గాయాలతో బాధపడుతున్న రాములను కూడా అదే వాహనంలో చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడచికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వివరించారు.అతి వేగం, అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన అధికారినికఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గజ్యానాయక్ తండా చౌరస్తాలోని రేంజ్ కార్యాలయం ఎదుట కామారెడ్డి–సిరిసిల్లా రహదారిపై 3 గంటల పాటు ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్‌మర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపోయాయి.
కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అంజినాయక్, అటవీశాఖ అధికారులు ఆందోళనాకారులను సముదాయించారు. మృతుడు రాములుకు భార్యవనిత, రెండేళ్ల కుమారుడు, తొమ్మిదినెలల కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లాఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డితెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment