ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా
ఖాకీ డ్రెస్‌లోనే మోసాలు నకిలీ అధికారి అరెస్ట్
బంజారాహిల్స్: పోలీసు ఆఫీసర్‌నని..ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌నని..తనకు డిపార్ట్‌మెంట్‌లో చాలా పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి రూ లక్షలు వసూలు చేయడమే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ డ్రెస్‌లో ఏకంగా సైఫాబాద్‌లోని అరణ్యభవన్ (ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్)లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్న నకిలీ అధికారిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్‌కు చెందిన కొనకంచి కిరణ్‌కుమార్ ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. శ్రీనగర్‌కాలనీలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసే మహిళను పరిచయం చేసుకుని తాను పోలీసు ఇన్‌స్పెక్టర్‌నని, డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన బాధితురాలు తన తమ్ముడు గణేష్ కు ఉద్యోగం ఇప్పించాలని అతడికి రూ.11.50 లక్షలు ఇచి్చంది. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు.
కాగా అతను అంతకముందే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారి అవతారమెత్తిన కిరణ్ గత గురువారం సైఫాబాద్‌లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన అతను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో సీఐగా పని చేస్తున్నానని చెప్పుకుంటూ హల్‌చల్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డులు అతడిని నిలదీయగా గుట్టురట్టయ్యింది. డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏకంగా అరణ్యభవన్‌లోనే తిష్టవేసిన అతను బాధితులను అక్కడికే రమ్మని చెప్పినట్లు తేలింది.
అధికారుల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం సైఫాబాద్ పోలీసులు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు పోలీసు, ఫారెస్ట్ శాఖ పేర్లు చెప్పుకుంటూ ఖాకీ డ్రెస్‌లో తిరుగుతూ ఆయా శాకల్లో ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైఫాబాద్, చర్లపల్లి, ఖమ్మం పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ అతడిపై ఎనిమిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇంత జరుగుతున్నా అలా జైలుకు వెళ్లడం..ఇలా బెయిల్‌పై రావడం..తిరిగి ఖాకీ డ్రెస్ చేసుకుని అవే డిపార్ట్‌మెంట్ల పేర్లు చెప్పి అమాయకులను మోసం చేయడం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment