Assistant Beat Officer
-
అటవీశాఖలో పోస్టుల భర్తీకి...
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు ఆదివారం నుంచి జరగనున్నాయి. జిల్లా అటవీశాఖలో రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న మొత్తం 254 పోస్టుల (బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్) భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖమ్మం కేంద్రంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. 141 అసిస్టెంట్ బీటాఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం ఖమ్మంలోని 17 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 13,261 మంది అభ్యర్దులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జన రల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమెటిక్స్ పేపర్; మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 గంటల వరకు జనరల్ ఎస్సే పరీక్ష ఉంటాయి. ఈ నెల 18న 17 సెంటర్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(మొత్తం ఖాళీలు 92) పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 9,146 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్, 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్ పేపర్; మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుంది. ఈ నెల 25న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (మొత్తం ఖాళీలు 16) పరీక్ష నాలుగు కేంద్రాలలో జరుగుతుంది. మొత్తం 1733 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్; మధ్యాహ్నం ఒంటి గంటనుంచి 2:00 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పేపర్ పరీక్ష ఉంటుంది. తానేధార్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-3) పోస్టులకు వరంగల్‌లో పరీక్ష ఉంటుంది. -
ఉద్యోగమస్తు!
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా అటవీశాఖలో ఆదివారం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల ఏర్పాటుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 215 ఉండగా 7,741 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరుకానున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష రాసే అభ్యర్థులు ఇంటర్నెట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. నిర్ధేశిత సమయం క్క నిమిషం దాటినా పరీక్ష రాయడానికి అనుమతించరు. మంచిర్యాల రీజియన్‌లో పరీక్షా కేంద్రాలు మంచిర్యాలలో 5, మందమర్రిలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంవీఎన్ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల వివేక వర్ధిని కళాశాల, కాలేజ్ రోడ్‌లోని చాణక్య డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండలంలోని ముల్కల్లలో ఐజా ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మందమర్రిలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, సింగరేణి మహిళా పీజీ అండ్ డిగ్రీ కళాశాల కూడా పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ రీజియన్‌లో 4 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఆదిలాబాద్ రీజియన్‌లో 6 కేంద్రాలు ఆదిలాబాద్ రీజియన్‌లో 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల(మావల), ఏఎన్ఆర్ టెక్నాలజీ కళాశాల(మావల), లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ శాంతినగర్(ఆదిలాబాద్), విద్యార్థి డిగ్రీ కళాశాల(ఆదిలాబాద్), గౌతమి డిగ్రీ కళాశాల(ఆదిలాబాద్)లలో కేంద్రాలు నెలకొల్పారు. ఈ రీజియన్‌లో 3,741 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రెండు ఏరియాలకు రీజియన్ ఇన్చార్జీలను నియమించారు. మంచిర్యాల కు ఐజా కళాశాలకు చెందిన తిరుపతిరెడ్డి, ఆదిలాబాద్‌కు నాగేందర్రావులను ప్రభుత్వం నియమించింది. -
‘అటవీ’ ఉద్యోగాల భర్తీకి... 11 నుంచి రాత పరీక్షలు
పోస్టుల వివరాలు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్-141 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్-92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్-16 బంగ్లా వాచర్-2 టెక్నికల్ అసిస్టెంట్-3 ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీ శాఖలోని ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11వ తేదీ నుంచి రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా అటవీ శాఖ కన్జర్వేటర్ ఆనంద్ మోహన్ తెలిపారు. ఆయన గురువారం ఖమ్మంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోస్టులు... దరఖాస్తుదారుల సంఖ్య, పరీక్షల తేదీలు.. సమయం తదితర వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో ఖమ్మం కేంద్రంగా జేఎన్టీయూ ఆధ్వర్యంలో రీజనల్ కో-ఆర్డినేటర్ ద్వారా ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు-141, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు-92, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు-16, బంగ్లా వాచర్ పోస్టులు-2, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-2) పోస్టులు-3 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: ఈ నెల 11న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో 24 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 13,261మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: ఈ నెల 18న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో 17 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 9,146మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: ఈ నెల 25న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 1,733మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 గంటల నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది. బంగ్లా వాచర్స్, తానేధార్స్, టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షలు వరంగల్‌లో జరుగుతాయి. హాల్ టికెట్‌ను అటవీ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో ఉన్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు పర్యవేక్షకులుగా డివిజనల్ ఫారెస్ట్ అధికారులు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు నియమితులయ్యారు. -
‘ఫారెస్ట్’ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఫారెస్టు డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకోసం ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్న పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ బి. శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓలు టి. చక్రపాణి, ఎ. చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై గురువారం కళాశాలలో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. పరీక్షలను మొదటిసారిగా జేఎన్టీయూ(హైదరాబాద్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పరీక్షలు(టెక్నికల్ అసిస్టెంట్ మినహా) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. టెక్నికల్ అసిస్టెంట్ పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్ష పార్ట్- 1, 2, 3 భాగాలుగా ఉంటుందన్నారు. పార్ట్ వన్ ఎస్ఏ టైప్, పార్ట్ -2, 3 ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుందన్నారు. పరీక్షలో వచ్చిన మార్కులు, వాకింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. అభ్యర్థులు ్చఞజఛీట్ట.ౌటజ వెబ్సైట్ ద్వారా పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి ఒకరోజు ముందు వరకు మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినవారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి భవిష్యత్‌లో ఏ ఉద్యోగానికి ద రఖాస్తు చేసుకోకుండా అనర్హులను చేస్తామని ెహ చ్చరించారు. పరీక్ష వివరాలు తేది పోస్ట్ అభ్యర్థుల సంఖ్య కేంద్రాలు 11 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 6,775 12 12 బంగ్లా వాచర్ 278 01 13 తానేదార్ 350 01 14 టెక్నికల్ అసిస్టెంట్ 243 01 18 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 8,766 16 25 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 1,697 03 -
పోలీసుల అదుపులో అటవీ సిబ్బంది..
చర్ల, న్యూస్‌లైన్: జిల్లాలో అటవీ, పోలీస్‌శాఖల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 22వ తేదీన అనుమతులు లేకుండా ఉంజుపల్లి అటవీప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టారని ఉన్నతాధికారుల సూచన మేరకు అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పోలీస్‌శాఖ వారిని అడ్డుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు తమదైన శైలిలో అటవీశాఖ అధికారి, సిబ్బం దిపై విరుచుకుపడ్డారు. అటవీశాఖ సిబ్బంది సైతం పోలీసులకు ఎదురు తిరిగారు. మీడి యా వారు ఇదంతా చిత్రీకరిస్తుండడంతో అ టవీశాఖ సిబ్బంది వెనక్కు తగ్గడంతో పోలీ సులు తమ పని కానిచ్చారు. అప్పటి నుంచి ఇరు శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో సోమవారం విధి నిర్వహణలో భాగంగా ఉంజుపల్లి అటవీ ప్రాంతానికి వెళ్తున్న చర్ల రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు బుచ్చయ్య, నాగేశ్వరరావు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ విజయరావులను సీఐ నరేందర్, ఎస్సై - 1 సంతోష్‌లు సిబ్బందిలో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ విష యం తెలిసి మీడియా వారు అక్కడికి వెళ్లేలోగానే వారిని హడావిడిగా పోలీస్‌స్టేషన్‌కు తీ సుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇ చ్చారు. అటవీప్రాంతంలో వీరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, అందుకే అదుపులోకి తీసుకున్నామని ఒకసారి, ఉంజుపల్లి మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరి వాహనాలు ఆపి తనిఖీ చేయగా డ్రైవింగ్ లెసైన్స్‌లు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని మరోసారి బదులిచ్చారు. వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఎవరినీ ఇలా స్టేషన్‌కు తరలించి నిర్బంధించిన దాఖలాలు లేవని, కొత్తగా ఇలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సీఐ నరేందర్,ఎస్సై - 1 సంతోష్‌లను వివరణ కోరగా తాము ఎవరి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, కేవలం వాహన తనిఖీల్లో భాగంగానే సరైన పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. గతంలో ఇటువంటి కేసులు నమోదైన దాఖలాలు ఎన్నడూ లేవని ప్రశ్నించగా ఇక నుంచి ఇలాగే కొనసాగిస్తామని బదులిచ్చారు.