పోస్టుల వివరాలు
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్-141
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్-92
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్-16
బంగ్లా వాచర్-2
టెక్నికల్ అసిస్టెంట్-3
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీ శాఖలోని ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11వ తేదీ నుంచి రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా అటవీ శాఖ కన్జర్వేటర్ ఆనంద్ మోహన్ తెలిపారు. ఆయన గురువారం ఖమ్మంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోస్టులు... దరఖాస్తుదారుల సంఖ్య, పరీక్షల తేదీలు.. సమయం తదితర వివరాలను ఆయన వెల్లడించారు.
జిల్లాలో ఖమ్మం కేంద్రంగా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో రీజనల్ కో-ఆర్డినేటర్ ద్వారా ఈ పరీక్షలు జరుగుతాయి.
జిల్లాలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు-141, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు-92, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు-16, బంగ్లా వాచర్ పోస్టులు-2, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-2) పోస్టులు-3 ఖాళీగా ఉన్నాయి.
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: ఈ నెల 11న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో 24 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 13,261మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: ఈ నెల 18న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో 17 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 9,146మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: ఈ నెల 25న జరిగే ఈ పరీక్షకు ఖమ్మంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 1,733మంది దరఖాస్తు చేశారు. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-2) పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జనరల్ మేథమేటిక్స్ (పార్ట్-3) పరీక్ష 11 గంటల నుంచి 12.30 గంటల వరకు, జనరల్ ఎస్సే (పార్ట్-1) పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.30 గంటల వరకు ఉంటుంది.
బంగ్లా వాచర్స్, తానేధార్స్, టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షలు వరంగల్‌లో జరుగుతాయి.
హాల్ టికెట్‌ను అటవీ శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
ఈ పరీక్షల నిర్వహణకు పర్యవేక్షకులుగా డివిజనల్ ఫారెస్ట్ అధికారులు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు నియమితులయ్యారు.
‘అటవీ’ ఉద్యోగాల భర్తీకి... 11 నుంచి రాత పరీక్షలు
Published Fri, May 9 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement