చికిత్స పొందుతున్న రాజశేఖర్
నిర్మల్: తాము చేయని తప్పుకు సస్పెండ్ చేశారంటూ అటవీశాఖ అధికారులు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలోనే డిప్యూటీ రేంజ్ అధికారి రాజశేఖర్, బీట్ అధికారి వెన్నెల గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. మామడ మండలం ఆరేపల్లి రేంజ్‌లో అటవీశాఖ భూములను ఆక్రమించడం, పోడుభూముల్లో బోర్లు వేసు కోవడం వంటి చట్టవిరుద్ధ పనులు చేపడుతున్నా.. డబ్బు లు తీసుకుని అడ్డుకోకుండా ఉన్నారంటూ డిప్యూటీ రేంజ్ అధికారి రాజశేఖర్, బీట్ అధికారి వెన్నెలను అటవీశాఖ ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు.
దీంతో ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు గురు వారం అటవీ శాఖ కార్యాలయానికి వచ్చారు. అన్యా యంగా తమను సస్పెండ్ చేశారంటూ ఆఫీస్ ప్రాం గణం లోనే వారు పురుగులమందు తాగారు. అక్కడ ఉన్నవారు అడ్డుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వెన్నెలకు పెద్దగా ప్రమాదం లేదని, రాజశేఖర్‌కు చికిత్స అందించామని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. ఆత్మ హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment