మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా అటవీశాఖలో ఆదివారం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల ఏర్పాటుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 215 ఉండగా 7,741 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరుకానున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష రాసే అభ్యర్థులు ఇంటర్‌నెట్ ద్వారా హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. నిర్ధేశిత సమయం క్క నిమిషం దాటినా పరీక్ష రాయడానికి అనుమతించరు.
మంచిర్యాల రీజియన్‌లో పరీక్షా కేంద్రాలు
మంచిర్యాలలో 5, మందమర్రిలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంవీఎన్ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల వివేక వర్ధిని
కళాశాల, కాలేజ్ రోడ్‌లోని చాణక్య డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండలంలోని ముల్కల్లలో ఐజా ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మందమర్రిలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, సింగరేణి మహిళా పీజీ అండ్ డిగ్రీ కళాశాల కూడా పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ రీజియన్‌లో 4 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.
ఆదిలాబాద్ రీజియన్‌లో 6 కేంద్రాలు
ఆదిలాబాద్ రీజియన్‌లో 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల(మావల), ఏఎన్‌ఆర్ టెక్నాలజీ కళాశాల(మావల), లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ శాంతినగర్(ఆదిలాబాద్), విద్యార్థి డిగ్రీ కళాశాల(ఆదిలాబాద్), గౌతమి డిగ్రీ కళాశాల(ఆదిలాబాద్)లలో కేంద్రాలు నెలకొల్పారు. ఈ రీజియన్‌లో 3,741 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రెండు ఏరియాలకు రీజియన్ ఇన్‌చార్జీలను నియమించారు. మంచిర్యాల కు ఐజా కళాశాలకు చెందిన తిరుపతిరెడ్డి, ఆదిలాబాద్‌కు నాగేందర్‌రావులను ప్రభుత్వం నియమించింది.
ఉద్యోగమస్తు!
Published Sun, May 11 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement