district forest department
-
ఆదిలాబాద్: ఉట్నూరులోని ఆదివాసీల జీవనం దయనీయం
-
నిజాయితీ అధికారికి బదిలీ బహుమానమా?
సాక్షి, వికారాబాద్: అధికారులు అవకాశవాదులుగా మారి.. ప్రజాప్రతినిధులు, బడా వ్యక్తుల అడుగులకు మడుగులొత్తుతున్న సమయంలో నిజాయితీగా ఉండటం సవాలే.. నిజాయితీగా వ్యవహరిస్తే అవార్డులు, రివార్డులు ఏమో గానీ బదిలీ.. లేక సస్పెన్షన్ వేటో తప్పదన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం డీఎఫ్ఓ విషయంలో కూడా ఇదే రుజువయ్యింది. అయిన వచ్చీ రాగానే అక్రమార్కులకు సింహస్వప్నమయ్యారు. వారి గుండెల్లే రైళ్లు పరిగెత్తేలా చేశారు. కానీ వచ్చిన అనతికాలంలోనే అనేక మార్పులకు నాంది పలికిన ఆయన అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా మారారు. ఎవరు చెప్పినా... హెచ్చరించిన లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అలాంటి జిల్లా ఫారెస్టు అధికారి జిల్లా డీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్‌రెడ్డి ఐదు నెలల్లోనే బదిలీ కాకా తప్పలేదు. సంస్కరణలకు శ్రీకారం డీఎఫ్ఓ వెంకటేశ్వర్‌రెడ్డి అనేక మార్పులకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏళ్లుగా ఆక్రమణలకు నోచుకున్న వాటిని బయటకు తీసి రుజువులతో సహా కోర్టు ముందుంచారు. వికారాబాద్, తాండూరు సమీపంలో కాంట్రాక్టర్లు ఫారెస్టు భూముల్లో తవ్వకాలు జరిపి రూ. వందల కోట్ల విలువగల ఖనిజ సంపద తరలిస్తున్నారని గుర్తించి అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఫారెస్టు భూములు కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయించారు. వారు కోర్టులకు వెళ్తే కౌంటర్ ఫైల్ వేశారు. అనుమితి లేని సా మిల్లులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కలప రవాణాను అడ్డుకోవటం, అక్రమ కలప కొనుగోలు దారులకు రూ.లక్షల్లో ఫైన్లు వేయటం, అనుమతిలేకుండా ఫారెస్టు భూముల్లోంచి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ఫైన్లు వేయటం లాంటి అనేక విషయాల్లో ఆయన ఉక్కుపాదం మోపారు. ఇక వారి ఆటలు సాగవని భావించి కొందరు ప్రజా ప్రతినిధులపై వత్తిడి తెస్తూ వచ్చారు. ఎట్టకేలకు నిజాయితీగా వ్యవహరించిన అధికారిని సాగనంపారు. -
ఉద్యోగమస్తు!
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా అటవీశాఖలో ఆదివారం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల ఏర్పాటుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 215 ఉండగా 7,741 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరుకానున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష రాసే అభ్యర్థులు ఇంటర్నెట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. నిర్ధేశిత సమయం క్క నిమిషం దాటినా పరీక్ష రాయడానికి అనుమతించరు. మంచిర్యాల రీజియన్‌లో పరీక్షా కేంద్రాలు మంచిర్యాలలో 5, మందమర్రిలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంవీఎన్ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల వివేక వర్ధిని కళాశాల, కాలేజ్ రోడ్‌లోని చాణక్య డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండలంలోని ముల్కల్లలో ఐజా ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మందమర్రిలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, సింగరేణి మహిళా పీజీ అండ్ డిగ్రీ కళాశాల కూడా పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ రీజియన్‌లో 4 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఆదిలాబాద్ రీజియన్‌లో 6 కేంద్రాలు ఆదిలాబాద్ రీజియన్‌లో 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల(మావల), ఏఎన్ఆర్ టెక్నాలజీ కళాశాల(మావల), లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ శాంతినగర్(ఆదిలాబాద్), విద్యార్థి డిగ్రీ కళాశాల(ఆదిలాబాద్), గౌతమి డిగ్రీ కళాశాల(ఆదిలాబాద్)లలో కేంద్రాలు నెలకొల్పారు. ఈ రీజియన్‌లో 3,741 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రెండు ఏరియాలకు రీజియన్ ఇన్చార్జీలను నియమించారు. మంచిర్యాల కు ఐజా కళాశాలకు చెందిన తిరుపతిరెడ్డి, ఆదిలాబాద్‌కు నాగేందర్రావులను ప్రభుత్వం నియమించింది. -
‘ఫారెస్టు’లో చీకటి దందా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి డివిజన్లున్నాయి. వీటి పరిధిలో నిజామాబా ద్, కమ్మర్పల్లి, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఇందల్వాయి రెంజ్లున్నాయి. జిల్లావ్యాప్తంగా 140 సా మిల్లులు పనిచేస్తుండగా.. ఇందులో టేకు కలపకు సంబంధించిన సామిల్లులు 60 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా 40కిపైగా టేకు కలప సా మిల్లులున్నట్లు తెలుస్తోంది. ఏటా డిసెంబర్లో సామిల్లులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తవాటికీ ఇదే సమయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి పనికో రేటు కొత్తగా సామిల్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారికి అటవీ శాఖలోని పలువురు ఉద్యోగులు చుక్క లు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సామిల్లు అనుమతి కోసం రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే సవాలక్ష కొర్రీలతో అడ్డుకుంటున్నట్లు సమాచారం. రెన్యువల్ కోసం ఒక్కొక్కరి వద్దనుంచి రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ‘బీట్’లోనూ.. బీట్ అధికారులు కూడా తక్కువ తినడం లేదన్న ఆరోపణలున్నాయి. కలపతో అక్రమ వ్యాపారం చేస్తున్న సామిల్లు యాజమానుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సామిల్లు యాజమాని వద్ద నుంచి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు నొక్కేస్తున్నట్లు సమాచారం. కలప స్మగ్లర్లతో సంబంధాలు కలప అక్రమ రవాణా చేసే స్మగ్లర్లతోనూ పలువురు సిబ్బంది సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఐదారు గ్రూపులుగా ఏర్పడిన దళారులు కలప అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, చెన్నూరు, ఇచ్చోడ ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్, ఇతరత్రా ప్రదేశాల నుంచి టేకు కలపను అక్రమంగా నిజామాబాద్ తరలిస్తున్నారు. నిజామాబాద్‌లో తమకు సంబంధమున్న సామిల్లుకు గుట్టు చప్పుడు కాకుండా కలపను పంపి, ఫర్నీచర్ తయారు చేయించి, కొనుగోలుదారులకు, దుకాణాలకు పంపిస్తున్నారు. ఈ అక్రమ దందాకు అటవీ శాఖలోని పలువురు ఉద్యోగులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సహాయానికి కృతజ్ఞతగా స్మగ్లర్లు భారీగానే డబ్బులు అందిస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు పర్సంటేజీలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పది రోజుల వ్యవధిలో.. జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే భారీగా కలప పట్టుబడింది. జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్ ప్రాంతంలో ఒక పాత ఇంటిపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులు 22 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం ఎల్లంపేట శివారు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న టేకు దుంగలను పట్టుకున్నారు. మల్కాపూర్ శివారు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న టేకుదుంగలను, భీమ్‌గల్‌లోని ఓ సామిల్లులో అక్రమ కలపతో తయారు చేసిన సోఫాసెట్లు, విలువైన ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న చీకటి దందా విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది. అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కలప అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని, ఇంటిదొంగల పని పట్టాలని ప్రజలు కోరుతున్నారు.