written tests
-
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్లలో ప్రవేశాల (అడ్మిషన్ల) కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షలు నిర్వహించారు. ఐదో తరగతిలో 14,940 సీట్లు ఉండగా ఆన్లైన్ ద్వారా 61,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 49,890 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. వారికి 188 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్, ఐఐటీ, మెడికల్ అకాడమీలలో ప్రవేశానికి 13,560 సీట్లు ఉండగా ఆన్లైన్ ద్వారా 42,831 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 37,492 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 185 కేంద్రాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4 గంటల వరకు వీరికి రాత పరీక్ష నిర్వహించారు. కాగా, పామర్రు పరీక్షా కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తోపాటు అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి ఉన్నారు. -
ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదు: సజ్జల
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కోసం పరీక్ష చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని.. అందరు ఉద్యోగులకు ఇలాంటి రూల్ ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాలు ఎక్కడికీ పోవని.. పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారని ఆయన వివరణ ఇచ్చారు. డిపార్ట్మెంట్ టెస్టులు ఏటా ఏపీపీఎస్సీ రెండుసార్లు నిర్వహిస్తుందని.. ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. జాబ్ క్యాలెండర్‌పై టీడీపీ వాళ్లకి మాట్లాడే అర్హత లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. -
ఎస్సై పోస్టులకు 18 నుంచి రాతపరీక్షలు
సాక్షి, అమరావతి: ఎస్సై పోస్టులకు ఈ నెల 18, 19 తేదీల్లో తుది రాతపరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రోజుకు రెండు పరీక్షలు చొప్పున రెండు రోజుల్లో నాలుగు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 355 సివిల్ ఎస్సై, 113 ఏఆర్ ఎస్సై, 9 రిజర్వ్ ఎస్సై, 209 ఏపీఎస్పీ ఎస్సై. 16 డిప్యూటీ జైలర్, 5 అసిస్టెంట్ మేట్రిన్ పోస్టులకు ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో ఎంపికైన 35,428 మందికి తుది రాతపరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. వీరికి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలుల్లో రెండు రోజులపాటు తుది రాత పరీక్షలు నిర్వహిస్తామని అతుల్‌సింగ్ వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 8న సాయంత్రం 5 గంటలలోపు recruitment. appolice. gov. in, www. appolice. gov. in వెబ్సైట్ల నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏదైనా సందేహం, సమస్య ఉంటే 0884–2340535, 2356255 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని, లేదా apslrpb. pc@ gmail. comMyకు మెయిల్ చేయవచ్చని సూచించారు. -
రేపే కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) రాతపరీక్ష
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ (కమ్యూని కేషన్) పోస్టుల కోసం నిర్వహించనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మధ్యా హ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్య ర్థులు ఒంటిగంట కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అను మతించేది లేదని పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ గురువారం ఓ ప్రకట నలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ను తెచ్చుకోవాలని, పరీక్ష కేంద్రంలోని అనుమతించిన వెంటనే బయోమెట్రిక్ హాజరు తీసుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థులు పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్సలలో ఏదైనా ఒకటి తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరిక రాలు, సెల్ఫోన్లు, చేతిగడి యారం తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమ తించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అభ్యర్థు లకు హాల్ టికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. -
3 నుంచి ఎంసెట్-3 హాల్‌టికెట్లు
11వ తేదీన రాతపరీక్ష.. పక్కాగా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు సర్కారు పక్కాగా చర్యలు చేపడుతోంది. సెప్టెంబర్ 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్ష హాల్‌టికెట్లను ఈ నెల 3 నుంచే డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,153 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఇక ఈ రాత పరీక్షను పూర్తిగా నిఘా నీడలో చేపట్టనుంది. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఇప్పటికే పలుమార్లు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించింది. మళ్లీ మళ్లీ మెడికల్ ఎంసెట్‌కు హాజరవుతున్న వారు, చాలా ఏళ్ల కింద ఇంటర్ ఉత్తీర్ణులైన వారు, ఇప్పటికే ఎంబీబీఎస్ చేస్తున్నవారు తిరిగి ఎందుకు ఎంసెట్ రాస్తున్నారన్న అంశంపై లోతైన విచారణ జరపాలని పోలీసు శాఖను కోరింది. ఇక విద్యార్థులు ఎంసెట్-3 హాల్‌టికెట్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు tseamcet.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఎంసెట్-2 పరీక్ష సమయంలో పలు కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తి అభ్యర్థుల నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్ డాటా) తీసుకోలేకపోయారు. దీంతో ఈసారి ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంసెట్-3 పరీక్ష సమయానికి గంట ముందు నుంచే విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకోనున్నారు. 2011 నుంచి జరిగిన అన్ని ఎంసెట్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఎంసెట్ కమిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
జర్నలిజంలో పీజీ డిప్లొమా
అర్హతలు: తెలుగు మీద పట్టు ఆంగ్లంపై అవగాహన డిగ్రీ ఉత్తీర్ణత (గతేడాదికి డిగ్రీ పూర్తిచేసి, సర్టిఫికెట్లు ఉన్నవారే అర్హులు) 01-08-2015 నాటికి 30 ఏళ్లకు మించని వయసు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. నియమావళి: అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు శిక్షణ కాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి. శిక్షణ భృతి: జర్నలిజం స్కూలులో చేరిన విద్యార్థులకు మొదటి ఆరు నెలలు రూ.8,000, తరవాతి ఆరునెలలు రూ.10,000 నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం సంస్థలో ఏడాదిపాటు ట్రెయినీగా పనిచేయాలి. అప్పుడు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. దరఖాస్తు విధానం: www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com వెబ్సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదివి, దరఖాస్తును ఆన్‌ైలైన్‌లోనే పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునిక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబరు సాయంతో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తు చేయడానికి గడువు:10-04-2015 రాతపరీక్ష: 19-04-2015 ఇంటర్వ్యూలు: 18-05-2015 నుంచి చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సితారా గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నంబర్- 12, బంజారాహిల్స్, హైదరాబాద్- 500034 ఫోన్: 040 23386945 సమయం: ఉ.10 గం.నుంచి సా. 5 గం. వరకు (సెలవులు, ఆదివారాలు మినహా) -
సంపాదనకు ఇదో సోర్స్
స్వయంగా రాతపరీక్షలు నిర్వహించి మరీ బేరమాడుతున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అటెండర్ పోస్టు కావాలా..రూ.50వేలు ఇవ్వాల్సిందే... ఇంకొంచెం పెద్దదయితే..జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తారా... అయితే రూ.లక్షయినా ఇవ్వండి.. డబ్బులిస్తేనే ఉద్యోగం...ఔట్సోర్సింగ్ ద్వారా, ఏడాది ఉద్యోగమే అయినా సరే... కాసులు మాత్రం ముట్టజెప్పాల్సిందే... పైసలివ్వలేదంటే మీకు ఆ ఉద్యోగం చేసేందుకు అర్హత లేనట్టే... ఇదీ జిల్లాలో కొన్ని ప్రైవేటు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల తీరు. ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు ఈ ఏజెన్సీలు పండగ చేసుకుంటున్నాయి. నిరుద్యోగ యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని గ్యారంటీ లేని ఉద్యోగాలే అయినా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు తీసేసుకుని ఇచ్చేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల దందా నడుస్తోంది. ఈ కళాశాలల్లో బోధనేతర పోస్టులను భర్తీ చేసేందుకుగాను ఏకంగా రాతపరీక్షలే నిర్వహించిన ఏజెన్సీలు ఆ తర్వాత బేరసారాలు నడిపిస్తుండడం గమనార్హం. పోస్టుకో రేటు ఇటీవల జిల్లాలోని పలు డిగ్రీ కళాశాలల్లో అటెండర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, ఇతర టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. నకిరేకల్, ఆలేరు, చండూరులోని కళాశాలల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో 14 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే, జిల్లాలోని మూడు ఏజెన్సీలు ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులను పంపుతామని కాంట్రాక్టు పొందాయి. నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. వారికి హాల్‌టికెట్లు పంపి ఏకంగా రాతపరీక్ష కూడా నిర్వహించాయి. నల్లగొండలో జరిగిన ఈ రాతపరీక్షలకు 52మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ రాత పరీక్షల తర్వాత అసలు కథ ప్రారంభమైంది. ఫలితాలను వెల్లడించి మెరిట్లిస్టులు పెట్టకుండానే ఆ ఏజెన్సీలు కాసుల దందాకు దిగుతున్నట్టు తెలుస్తోంది. పోస్టుకో రేటును ఫిక్స్ చేసి డబ్బులిస్తేనే ఎంపిక చేస్తామని, లేదంటే ఏదో సాకు చెప్పి మెరిట్‌లిస్టులో పేరు తీసేస్తామని బేరమాడుతున్నట్టు సమాచారం. ఈ కోవలో ఓ ఏజెన్సీ బేరసారాలాడిన నిరుద్యోగి ఒకరు ఁసాక్షి*తో మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నారు. నాకు అన్ని అర్హతలున్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం పెట్టిన రాతపరీక్షలో నాకు మంచి మార్కులు వస్తాయి. అయినా రూ.లక్ష ఇస్తేనే ఉద్యోగం వస్తుందంటున్నారు. లేదంటే నా పేరు మెరిట్‌లిస్టులో పెట్టరంట. ఇదేం పద్ధతి.* అని వాపోవడం గమనార్హం. అదేవిధంగా అటెండర్, ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు రూ.50వేల వరకు బేరాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఉద్యోగాల వేతనాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రెగ్యులర్ పోస్టులో పనిచేసే ఉద్యోగికి ఉండే మూలవేతనం (బేసిక్)ను వారి నెల వేతనంగా నిర్ణయించడంతో రూ.6,700 నుంచి రూ.8500 వరకు మాత్రమే వారికి నెలసరి వేతనాలు వస్తున్నాయి. అయితే, ఈ ఉద్యోగాలను కొనసాగించే అవకాశం ఏజెన్సీలకు ఉండడంతో నిరుద్యోగులు పెద్దమొత్తంలో ఏజెన్సీ నిర్వాహకులకు డబ్బులు ముట్టజెపుతున్నారు. కళ్లకు కడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల దందా వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చే దగ్గరి నుంచి నియామకాలు పొందిన వారి నెల జీతం ఇచ్చేంతవరకు ప్రభుత్వం అన్ని బాధ్యతలను ఔట్సోర్సింగ్ ఏజెన్సీలమీదే పెడుతుండడంతో ఆ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరికీ కనిపించని రీతిలో నోటిఫికేషన్లు ఇస్తుండడంతో ఏజెన్సీలే ఫలానా పోస్టులున్నాయని, దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో పాటు ఉద్యోగాల్లో నియామకాలు పూర్తయిన తర్వాత వారి వేతనాలను కూడా ఏజెన్సీలకే చెక్కుల రూపంలో ఇస్తుండడంతో ఏజెన్సీల నిర్వాహకులు అప్పుడు కూడా కోత పెట్టి వేతనాలు ఇస్తున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. మరోవైపు ఉద్యోగుల పీఎఫ్ జమ చేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కేవలం ప్రభుత్వం, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల మధ్యే ఒప్పందం కుదరడం, ఆ తర్వాత కనీసం పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లోనూ సంప్రదించే అవకాశం లేకపోవడంతో ఉద్యోగాలు చేయాలన్నా ఏజెన్సీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోందని నిరుద్యోగులంటున్నారు. ఉద్యోగాల కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండడం, ఆ తర్వాత కొనసాగించాలన్నా ఏజెన్సీల అనుమతి కావాల్సి ఉండడంతో ఉద్యోగులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెన్సీల నిర్వాహకులను కూడా పల్లెత్తు మాట కూడా అనలేకపోతున్నారు. ఈ పద్ధతిలో ప్రభుత్వం తమకేం బాధ్యత లేదనే రీతిలో వ్యవహరిస్తుండడమే ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యానికి కారణమవుతోందనే భావన నిరుద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
కొలువుల సీజన్..
ముందు చదువు పూర్తి చేయడం.. ఆనక పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయడం, రాయడం, ఫలితాల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడటం.. ఇదంతా గతం.. మారుతున్న కాలంతోపాటు నియామకాల ప్రక్రియ కొత్త పుంతలు తొక్కింది. విద్యాభ్యాస సమయంలోనే కొలువు సంపాదించే అద్భుత అవకాశాన్ని.. అదీ తరగతి గది వద్దే కల్పిస్తోంది. ఈ ప్రక్రియనే క్యాంపస్ డ్రైవ్ అంటున్నారు. ఇందులోనూ ఇటీవలి కాలం వరకు సాఫ్ట్వేర్, ఇతర వృత్తివిద్యా కోర్సులు చేసిన వారికే క్యాంపస్ ఎంపికలు పరిమతమయ్యాయి. ఇప్పుడా పరిమితులు తొలగిపోయాయి. ప్రొఫెషనల్ కోర్సులతో పాటు సంప్రదాయ డిగ్రీ, పీజీలు చేసిన వారికి బహుళజాతి, దేశీయ కార్పొరేట్ సంస్థలు క్యాంపస్ నియామకాల్లో మంచి అవకాశాలనే కల్పిస్తున్నాయి. వార్షిక పరీక్షలకు ముందు నవంబర్ నుంచి మార్చి నెలలను క్యాంపస్ డ్రైవ్‌ల నెలలుగా అభివర్ణించవచ్చు. ఇంతటి అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం.. భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవడం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మళ్లీ కొలువుల సీజన్ వచ్చిన నేపథ్యంలో గత విజేతలు, నిపుణుల సలహాలు.. ఎచ్చెర్ల: ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ రంగం పుంజుకుంటోంది. పలు కంపెనీలు ఉద్యోగాల నియూమకాలకు తలుపులు తెరుస్తున్నారుు. మరికొన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల నిర్వహణలో బిజీ ఆయ్యూరుు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు ఉద్యోగాల భర్తీ కాలం. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అరుుతే, కష్టపడి చదివిన వారికే కొలువులు దక్కుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. అందుకు తగ్గ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఇలా... జిల్లాలో సీఏస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ బ్రాంచిలు ఉన్నాయి. సీఏస్ఈ విద్యార్థులకు సాప్టువేర్ రంగంలో, ఈసీఈ విద్యార్థులకు నెట్వర్క్, కమ్యూనికేషన్ రంగంలో, త్రిపుల్ఈకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, విద్యుత్ రంగంలో, మెకానికల్ విద్యార్థులకు రవాణా, మోటార్ ఫీల్డులోను, సివిల్ బ్రాంచ్ విద్యార్థులకు కనస్ట్రక్షన్ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఎంసీఏ విద్యార్థులు సాఫ్ట్వేర్ కంపెనీలకు, ఎంబీఏ విద్యార్థులకు వ్యాపార రంగంలోను, బి-ఫార్మసీ విద్యార్థులకు హాస్పటాలిటీ, మందుల కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తారుు. రాతపరీక్ష, బృందచర్చల్లో ప్రతిభ చూపిన వారికే... జిల్లాలో ఏటా టీసీఏస్, విప్రో, ఇన్ఫోసిస్, ఐబీఏం, ఐహేచ్సీ, మహేంద్రా సత్యం, హనీవెల్, కేబ్జిమిని తదితర కంపెనీలు ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారుు. తమకు కావాల్సిన సిబ్బందిని నియమిస్తున్నారుు. కంపెనీ ప్రతినిధులే నేరుగా కళాశాలకు వచ్చి రాత పరీక్ష, బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఉద్యోగ హామీపత్రాలను అందజేస్తున్నారు. అరుుతే, ఈ కంపెనీలు విద్యార్థిని అన్ని కోణాల్లోనూ పరీక్షించి తమ అవసరాలకు ఉపయోగపడేవారినే ఎంపిక చేసుకుంటారుు. విద్యార్థులు ముందుగానే కంపెనీల అవసరాలు గుర్తించి సిద్ధంకావాలి. ఇప్పటికే ఆయూ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సీనియర్ విద్యార్థుల సూచనలు, సలహాలు స్వీకరించాలి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇవి తప్పనిసరి... క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజేతగా నిలవాలంటే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం, నైపుణ్యం, గణితంపై పట్టు, అనుకూల దృక్పథం ఉండాలి. అలాగే, ఆంగ్లభాషా పరిజ్ఞానం, సమస్యపై స్పందించే గుణం, తక్షణ పరిష్కారం చూపే నైపుణ్యం పెంపొందించుకోవాలి. తడబాటు ఇక్కడే... జిల్లా విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కేవలం 30 శాతం మందే అర్హత సాధిస్తున్నారు. అదీ నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల లోపు జీతం ఇచ్చే ఉద్యోగాలకే అర్హత సాధిస్తున్నారు. దీనికి ఆంగ్లభాషపై పట్టులేకపోవం, అనుకూల దృక్పథం లేకపోవడం, సబ్జెక్టుపై పరిజ్ఞానం ఉన్నా భావాన్ని వ్యక్తికరించలేకపోవడం, సాంకేతిక మార్పులు గమనించలేకపోవడమే ప్రధాన లోపాలుగా మారారుు. వీటిపై సాధన చేస్తే జిల్లా విద్యార్థులు సైతం నెలకు రూ.80వేల నుంచి రూ.లక్షా 50వేల జీతాలు ఇచ్చే కంపెనీలు, ఉద్యోగాలకు ఎంపికవుతారని విద్యానిపుణులు చెబుతున్నారు. ఇంటర్వ్యూల కాలంలో లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అనుకూల దృక్పథంతో సాగాలి విద్యార్థిలో ముందుగా అనుకూల దృక్పథం ఉండాలి. ఇదే విజయంవైపు పయనించేలా చేస్తుంది. ఏ అంశం నేర్చుకోవాలన్నా ముందు విద్యార్థి తనలోని భయం విడనాడాలి. పట్టుదలే లక్ష్యసాధనన్న విషయం గుర్తించాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించాలి. అవసరమైతే మహనీయుల ఆత్మ కథలు చదవాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ముందు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవడం అలవర్చుకోవాలి. -ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నైపుణ్యాలు కీలకం విద్యార్థి ఇంజినీరింగ్‌లో చేరిన వెంటనే రిలీవ్లోపు ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం నిర్దేశించుకోవాలి. లోపాలు గుర్తించి అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. విద్యాబోధన ఆంగ్లంలో సాగుతుంది. అందుకే తరగతి గదిలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. దీనివల్ల కమ్యునికేషన్ స్కిల్స్ వృద్ధి చెందుతారుు. తరగతులకు రోజూ హాజరైతే విషయ పరిజ్ఞానానికి డోకా ఉండదు. -డాక్టర్ బుడుమూరు శ్రీరాంమూర్తి, డెరైక్టర్, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల -
ప్రశాంతంగా పోస్టుమెన్ రాత పరీక్షలు
కర్నూలులో 75, నంద్యాలలో 65 శాతం అభ్యర్థులు హాజరు కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాయలసీమ రీజియన్ పరిధిలోని అభ్యర్థులకు నిర్వహించిన పోస్టుమెన్/ మెయిల్‌గార్డు అభ్యర్థుల రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. కర్నూలు, నంద్యాలలో మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్ల చొప్పున 1,336 మంది నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద డివిజన్ స్థాయి పోస్టల్ అధికారులు సూపర్వైజర్లుగా వ్యవహరించారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను సైతం 10.15 గంటల వరకు అనుమతించారు. 19,278 మందికి హాల్‌టికెట్లు జారీ చేయగా, 13,943 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారని కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు చెప్పారు. కర్నూలులో 12,540 మందికి 9,520 మంది(75శాతం), నంద్యాలలో 6,733 మందికి 4423 మంది(65శాతం) పరీక్షలు రాశారన్నారు. మొత్తం మీద రీజియన్ పరిధిలో 72 శాతం హాజరు నమోదైనట్లు వివరించారు. హాల్‌టికెట్ నంబర్ల నమోదులో ఇక్కట్లు పరీక్ష నిర్వాహకులు అందించిన ఆన్సర్‌షీట్‌లో అంతా ఓఎంఆర్ విధానమే పాటించడంతో అభ్యర్థులు ఇక్కట్లకు గురయ్యారు. హాల్‌టికెట్ నంబరును అంకెల్లో రాయడమే కాకుండా వాటి ఎదురుగా ఉండే ఓఎంఆర్ గళ్లను కూడా పెన్నుతో దిద్ది పూరించాల్సి ఉండటంతో కొందరు అభ్యర్థులు తికమకపడ్డారు. అంకెల్లో సరిగ్గానే రాసినా ఓఎంఆర్ గళ్లు పూరించడంలో పొరపాట్లు చేశారు. ఈ విషయంలో పరీక్ష కేంద్రాల సూపర్వైజర్లు నిస్సహాయత వ్యక్తం చేయడంతో పరీక్ష పేపర్‌ను పరిగణనలోకి తీసుకుంటారో లేదోనని కొందరు ఆందోళనకు గురవుతున్నారు. -
అటవీశాఖలో పోస్టుల భర్తీకి...
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు ఆదివారం నుంచి జరగనున్నాయి. జిల్లా అటవీశాఖలో రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న మొత్తం 254 పోస్టుల (బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్) భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖమ్మం కేంద్రంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. 141 అసిస్టెంట్ బీటాఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం ఖమ్మంలోని 17 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 13,261 మంది అభ్యర్దులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జన రల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమెటిక్స్ పేపర్; మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 గంటల వరకు జనరల్ ఎస్సే పరీక్ష ఉంటాయి. ఈ నెల 18న 17 సెంటర్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(మొత్తం ఖాళీలు 92) పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 9,146 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్, 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్ పేపర్; మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుంది. ఈ నెల 25న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (మొత్తం ఖాళీలు 16) పరీక్ష నాలుగు కేంద్రాలలో జరుగుతుంది. మొత్తం 1733 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్; మధ్యాహ్నం ఒంటి గంటనుంచి 2:00 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పేపర్ పరీక్ష ఉంటుంది. తానేధార్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-3) పోస్టులకు వరంగల్‌లో పరీక్ష ఉంటుంది. -
ఉద్యోగమస్తు!
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా అటవీశాఖలో ఆదివారం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల ఏర్పాటుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 215 ఉండగా 7,741 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరుకానున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష రాసే అభ్యర్థులు ఇంటర్నెట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. నిర్ధేశిత సమయం క్క నిమిషం దాటినా పరీక్ష రాయడానికి అనుమతించరు. మంచిర్యాల రీజియన్‌లో పరీక్షా కేంద్రాలు మంచిర్యాలలో 5, మందమర్రిలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంవీఎన్ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల వివేక వర్ధిని కళాశాల, కాలేజ్ రోడ్‌లోని చాణక్య డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండలంలోని ముల్కల్లలో ఐజా ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మందమర్రిలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, సింగరేణి మహిళా పీజీ అండ్ డిగ్రీ కళాశాల కూడా పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ రీజియన్‌లో 4 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఆదిలాబాద్ రీజియన్‌లో 6 కేంద్రాలు ఆదిలాబాద్ రీజియన్‌లో 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల(మావల), ఏఎన్ఆర్ టెక్నాలజీ కళాశాల(మావల), లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ శాంతినగర్(ఆదిలాబాద్), విద్యార్థి డిగ్రీ కళాశాల(ఆదిలాబాద్), గౌతమి డిగ్రీ కళాశాల(ఆదిలాబాద్)లలో కేంద్రాలు నెలకొల్పారు. ఈ రీజియన్‌లో 3,741 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రెండు ఏరియాలకు రీజియన్ ఇన్చార్జీలను నియమించారు. మంచిర్యాల కు ఐజా కళాశాలకు చెందిన తిరుపతిరెడ్డి, ఆదిలాబాద్‌కు నాగేందర్రావులను ప్రభుత్వం నియమించింది. -
ఎస్పీఎఫ్ పదోన్నతి పరీక్షల్లో అక్రమాలు
12 మందిని సస్పెండ్ చేసిన అదనపు డీజీ సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగంలో అంతర్గత పదోన్నతుల కోసం జరిగిన రాత పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన 12 మందిపై అదనపు డీజీ తేజ్‌దీప్‌కౌర్ మీనన్ సస్పెన్షన్ వేటువేశారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్, హెడ్ నుంచి ఏఎస్ఐ, ఏఎస్ఐ నుంచి సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు అర్హులైన అభ్యర్థులకు ఇటీవల అమీన్పూర్ అకాడమీలో 45 రోజుల శిక్షణ అనంతరం రాత పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు అభ్యర్థులు తమకు బదులుగా తమ సీనియర్లతో పరీక్షలు రాయించారు. ఆ పరీక్షల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన ఉన్నతాధికారి కూడా వారికి పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం ఎస్పీఎఫ్ అదనపు డీజీ తేజ్‌దీప్ కౌర్ దృష్టికి రావడంతో తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు.