సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో ప్రవేశాల (అడ్మిషన్ల) కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షలు నిర్వహించారు. ఐదో తరగతిలో 14,940 సీట్లు ఉండగా ఆన్‌లైన్ ద్వారా 61,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 49,890 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. వారికి 188 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
ఇంటర్మీడియట్, ఐఐటీ, మెడికల్ అకాడమీలలో ప్రవేశానికి 13,560 సీట్లు ఉండగా ఆన్‌లైన్ ద్వారా 42,831 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 37,492 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 185 కేంద్రాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4 గంటల వరకు వీరికి రాత పరీక్ష నిర్వహించారు. కాగా, పామర్రు పరీక్షా కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తోపాటు అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి ఉన్నారు.
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
Published Mon, Apr 25 2022 4:22 AM | Last Updated on Mon, Apr 25 2022 7:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment