సాక్షి, గద్వాల: ధర్మవరం మండల పరిధిలోని గురుకుల పాఠశాలలో శుక్రవారం సాయంత్రం ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. దీంతో పిల్లలను ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న విద్యార్థులను డిశ్చార్జి చేయగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
శుక్రవారం సాయంత్రం భోజనంలో పిల్లలకు రైస్, ఎగ్, చారు, కాలీఫ్లవర్ కర్రీ వడ్డించారు. అది తిన్న విద్యార్థుల్లో 86 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే 108 ఆంబులెన్స్‌లో వాళ్లను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కోలుకున్న విద్యార్థులను తిరిగి గురుకులానికి తరలించామని.. మరికొందరు ఇంకా చికిత్స పొందుతున్నారని జోగులాంబ గద్వాల్ జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఫుడ్‌పాయిజన్ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.


