12 మందిని సస్పెండ్ చేసిన అదనపు డీజీ
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగంలో అంతర్గత పదోన్నతుల కోసం జరిగిన రాత పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన 12 మందిపై అదనపు డీజీ తేజ్‌దీప్‌కౌర్ మీనన్ సస్పెన్షన్ వేటువేశారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఎస్పీఎఫ్‌లో కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్, హెడ్ నుంచి ఏఎస్‌ఐ, ఏఎస్‌ఐ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు అర్హులైన అభ్యర్థులకు ఇటీవల అమీన్‌పూర్ అకాడమీలో 45 రోజుల శిక్షణ అనంతరం రాత పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు అభ్యర్థులు తమకు బదులుగా తమ సీనియర్‌లతో పరీక్షలు రాయించారు. ఆ పరీక్షల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన ఉన్నతాధికారి కూడా వారికి పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం ఎస్పీఎఫ్ అదనపు డీజీ తేజ్‌దీప్ కౌర్ దృష్టికి రావడంతో తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు.
ఎస్పీఎఫ్ పదోన్నతి పరీక్షల్లో అక్రమాలు
Published Sat, Nov 16 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement