రేపే కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) రాతపరీక్ష
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ (కమ్యూని కేషన్) పోస్టుల కోసం నిర్వహించనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మధ్యా హ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్య ర్థులు ఒంటిగంట కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అను మతించేది లేదని పోలీస్ నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్ గురువారం ఓ ప్రకట నలో తెలిపారు.
అభ్యర్థులు తమవెంట బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ను తెచ్చుకోవాలని, పరీక్ష కేంద్రంలోని అనుమతించిన వెంటనే బయోమెట్రిక్ హాజరు తీసుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థులు పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్‌సలలో ఏదైనా ఒకటి తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరిక రాలు, సెల్‌ఫోన్లు, చేతిగడి యారం తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమ తించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అభ్యర్థు లకు హాల్ టికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు.