![Constable Rekharani sellected for Rifle Shooting Competitions](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/11/GUN.jpg.webp?itok=ojvOvhWG)
నిజామాబాద్, నాగారం/సాక్షి: ఆల్ ఇండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీలకు ఇందూరు(నిజామాబాద్)వాసి ఎంపికైంది. నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రేఖారాణి (డబ్ల్యూ పీసీ 325) ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రేఖారాణి రాణించారు.
ఈనెల 15 నుంచి తమిళనాడులోని ఒతీవాకం ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున రేఖారాణి పాల్గొననున్నారు. 2002 లో ఉద్యోగంలో చేరిన రేఖారాణి.. ఫుట్‌బాల్, మాస్టర్ అథ్లెటిక్స్‌లో సైతం రాణించి పతకాలు సాధించారు. ఆమె ఎంపికపై పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment