all india
-
ఆల్ ఇండియా రైఫిల్ షూటింగ్‌కు ‘ఇందూరు’ రేఖారాణి
నిజామాబాద్, నాగారం/సాక్షి: ఆల్ ఇండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీలకు ఇందూరు(నిజామాబాద్)వాసి ఎంపికైంది. నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రేఖారాణి (డబ్ల్యూ పీసీ 325) ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రేఖారాణి రాణించారు. ఈనెల 15 నుంచి తమిళనాడులోని ఒతీవాకం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున రేఖారాణి పాల్గొననున్నారు. 2002 లో ఉద్యోగంలో చేరిన రేఖారాణి.. ఫుట్‌బాల్, మాస్టర్ అథ్లెటిక్స్‌లో సైతం రాణించి పతకాలు సాధించారు. ఆమె ఎంపికపై పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. -
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించింది. ఇటీవల కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆల్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో ఏకంగా మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) బాలీవుడ్ తారలను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు సమంత అద్భుత నటనతో ప్రేక్షకాదరణ పొందింది. ఆర్మాక్స్ సంస్థ స్టార్స్ ఆఫ్ ఇండియా లవ్స్ పేరిట రిలీజ్ చేసిన జాబితాలో జూన్ 2023కు కానూ అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్గా సమంత స్థానం దక్కించుకుంది. కాగా.. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు బాలీవుడ్ వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!) -
జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత
న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు. నల్సా సేవలు అమోఘం విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు. న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి. సులువుగా న్యాయం: మోదీ సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు. ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. -
రూ.8 లక్షల వార్షికాదాయంపై పునఃసమీక్ష
న్యూఢిల్లీ: నీట్–పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్ పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉండాలన్న నిబంధనను పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తేల్చే ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. కోర్టు అనుమతి మేరకు నీట్–పీజీ కౌన్సెలింగ్‌ను నాలుగు వారాలపాటు వాయిదా వేసినట్లు తెలిపారు. కేంద్ర సర్కారు, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) జూలై 29న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్–పీజీ మెడికల్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఎంసీసీ గతంలో తెలిపింది. కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కిందకు వస్తాయి. పీజీ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ‘జాతీయ జీవన వ్యయ సూచిక’ ఆధారంగా ఈ పరిమితి విధించినట్లు స్పష్టం చేసింది. దీనిపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా అమలును వాయిదా వేయడం సాధ్యం కాదని తుషార్ మెహతా అన్నారు. తుషార్ మెహతా వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీకి వాయిదావేసింది. -
తెలుగు సినిమా టార్గెట్ @ ఆల్ ఇండియా
తెలుగు సినిమా టార్గెట్ మారిపోయింది. టార్గెట్ ఆల్ ఇండియా అయిపోయింది. పరభాషలకు హాయ్ చెబుతోంది. అన్ని భాషలకూ సరిపోయే కథలతో సినిమాలు తీస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ‘ఆన్ సెట్’ మీద డజనుకి పైగా ప్యాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్రకటించిన చిత్రాలు అరడజను పైనే ఉన్నాయి. భవిష్యత్తు అంతా ప్యాన్ ఇండియా సినిమాలతో తెలుగు పరిశ్రమ ‘ప్యాన్మయం’ కానుంది. ప్రభాస్ ‘బాహుబలి’కి ప్రేక్షకులు భళా అన్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజైన ‘బాహుబలి’ బాక్సాఫీస్ రికార్డ్స్ కూడా భళా అనిపించాయి. ఆ తర్వాత కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో వందకోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇటు తెలుగు ‘బాహుబలి’ అటు కన్నడ ‘కేజీఎఫ్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంతో దర్శక–నిర్మాతలు, హీరోల టార్గెట్ మారింది. సినిమాల ప్లానింగ్ ప్యాన్ ఇండియా స్థాయిలో జరగడం మొదలైంది. తెలుగులో తొలి ప్యాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అంగీకరించిన ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే. భవిష్యత్‌లో కూడా ప్రభాస్ సినిమా అంటే ఇక అది ప్యాన్ ఇండియన్ మూవీయే అన్నట్లుగా సీన్ మారింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రాధేశ్యామ్’ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక పవన్ కల్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఒకేసారి ప్యాన్ ఇండియన్ మూవీ లైన్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానుంది. విదేశీ భాషల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదల కానుండటం విశేషం. మరో హీరో అల్లు అర్జున్‌కు ఆల్రెడీ మలయాళ పరిశ్రమలో మల్లు అర్జున్ అని పేరు ఉంది. ఇలాంటి క్రేజ్‌నే ఇండియా లెవల్లో సంపాదించుకోవాలని అల్లు అర్జున్ ‘పుష్ప’ అవతారం ఎత్తాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. అంతేకాదు.. ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండో భాగం ఆరంభమైంది. తొలి భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, హీరోగా ఎదిగి ‘అర్జున్‌రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి హిట్స్‌తో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయిపోయారు. యూత్‌లో విజయ్‌కు ఉన్న ఫాలో యింగ్ మరో ప్లస్. ప్యాన్ ఇండియా సినిమాల ఖాతాలో విజయ్ దేరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ కూడా ఉంది. మరో హీరో అడివి శేష్ అయితే క్షణం, గూఢచారి, ఎవరు వంటి మీడియమ్ బడ్జెట్ చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు శేష్ ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కెరీర్లో యాభైకి పైగా సినిమాలు చేసిన హీరోయిన్ సమంత నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం’. దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఓ పెద్ద హీరో, ఓ పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ అంటే ప్యాన్ ఇండియా మూవీ అనే ట్రెండ్ నడుస్తోంది. రానున్న రోజుల్లో బహు భాషా చిత్రాల నిర్మాణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా... మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రకటించిన సినిమా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కనుంది. హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోయేది కూడా ప్యాన్ ఇండియా మూవీయే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కమిట్ అయినవి కూడా ప్యాన్ ఇండియన్ మూవీసే. దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయనున్నారు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు శంకర్‌తో ప్యాన్ ఇండియన్ మూవీ కమిటయ్యారు రామ్‌చరణ్. దర్శకుడు శేఖర్ కమ్ములతో ధనుష్, వంశీ పైడిపల్లితో తమిళ హీరో విజయ్ ప్యాన్ ఇండియన్ అప్పీల్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. రానాతో ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నట్లు నిర్మాతలు ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు గతంలో ప్రకటిం చారు. దర్శకులు ప్రశాంత్ నీల్, వేణు శ్రీరామ్‌లతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమాలు చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని ప్యాన్ ఇండియన్ సినిమాల అనౌన్స్మెంట్స్ వచ్చాయి. కొన్ని రానున్నాయి. -
ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఢమాల్!
ముంబై: ఆల్ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు కోల్పోయాడు. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు తల్లీ తండ్రీలేరు. కష్టపడి చదవి జేఈఈలో మంచి ర్యాంకు సంపాదించాడు. ఐఐటీ బోంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సీటు సైతం సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్‌నెంబర్‌పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్‌ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫరదర్ రౌండ్స్’ అని ఉన్న లింక్‌ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్‌ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. దీంతో ఆయనకు నవంబర్ 10న విడుదలైన అడ్మిటెడ్ స్టూడెంట్స్ లిస్టు చూశాక షాక్ తగిలింది. ఆయన పేరు 93మంది విద్యార్దుల తుది జాబితాలో లేదు. దీంతో ఆయన బాంబే హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్‌ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్‌డ్రా లెటర్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ ఈ నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిషన్లన్నీ జేఒఎస్‌ఎస్‌ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. దీంతో ఈ విషయంపై బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టం పూడ్చేందుకు అదనపు సీటు కేటాయించాలని కోరుతున్నారు. తాను కేవలం సీటు దొరకడం వల్ల ఇకపై అడ్మిషన్ ప్రక్రియ ఉండదన్న అంచనాతో ఫ్రీజ్ లింక్‌ను క్లిక్ చేశానని కోర్టుకు చెప్పారు. అయితే విత్‌డ్రా చేసుకోవడం రెండంచెల్లో జరుగుతుందని, విద్యార్థి ఇష్టపూర్వకంగానే సీటు వదులుకున్నట్లు భావించాలని, ఆ మేరకు సదరు విద్యార్థ్ధికి రూ.2వేలు మినహాయించుకొని సీటు కోసం తీసుకున్న ఫీజు రిఫండ్ చేస్తామని ఐఐటీ పేర్కొంది. సీట్లు వృథా కాకుండా ఈ విధానం తెచ్చినట్లు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
27 నుంచి ఎంబీబీఎస్ ఆలిండియా కౌన్సెలింగ్..
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లను ఆలిం డియా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే ఎయిమ్స్, జిప్మర్ తదితర జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల సీట్లనూ ఈ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 6,410 ఎంబీబీఎస్ సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల నీట్ ఫలి తాలు వెల్లడైన నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. 27 నుంచి వచ్చే నెల 2 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. 5న ఏ కాలేజీలో సీటు వచ్చిందో ప్రకటిస్తారు. అనంతరం విద్యార్థులు అదే నెల 6 నుంచి 12 వరకు వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్ వచ్చే నెల 18 నుంచి 22వ తేదీ మూడు గంటల వరకు జరుగుతుంది. 25న కాలేజీ సీటు కేటా యింపు ఫలితాన్ని ప్రకటిస్తారు. అదే నెల 26 నుంచి డిసెంబర్ 2 నాటికి కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు చేరాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్రాల నుంచి తీసుకున్న 15 శాతం సీట్లలో మిగిలిన వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కు ఇస్తారు. అయితే ఎయిమ్స్, జిప్మర్, కేంద్ర, డీమ్డ్ వర్సిటీ, ఈఎస్ఐసీ వంటి సంస్థల్లో మిగిలిన సీట్లకు మాత్రం మాప్ అప్ రౌండ్లో ఆలిండియా కౌన్సెలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు మాప్‌అప్ రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. సీటు కేటాయించిన కాలేజీని అదే నెల 17న ప్రకటిస్తారు. విద్యార్థులు 18 నుంచి 24 నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అప్పటికీ మిగిలిన సీట్లను అదే నెల 28 నుంచి 31 వరకు భర్తీ చేస్తారు. 29న రాష్ట్రంలో మెడికల్ నోటిఫికేషన్ ఆలిండియా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత ఈ నెల 29న తెలంగాణలో మెడికల్ ప్రవేశాల నోటిఫికేషన్ ప్రారంభం కానుంది. తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత, రాష్ట్రంలో మొదటి విడత కౌన్సెలింగ్ మొదలవుతుంది. అలాగే జాతీయస్థాయి రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక, రాష్ట్రంలో రెండో విడత జరుగుతుంది. జాతీయస్థాయి కౌన్సెలింగ్ తర్వాత వెనక్కు వచ్చే సీట్లతో కలిపి రాష్ట్రంలో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కాళోజీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మాప్‌అప్ రౌండ్ నిర్వహిస్తారు. ఈసారి సర్టిఫికెట్ల ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదని, ఆన్లైన్లోనే వెరిఫికేషన్ ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశాయి. గతేడాది తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు చెల్లుబాటు కావని స్పష్టం చేశాయి. ఈ నెల 29 నాటికి రాష్ట్రానికి నీట్ ర్యాంకుల డేటా వివరాలు వస్తాయని చెబుతున్నారు. అదే రోజు నోటిఫికేషన్ జారీచేస్తారు. ఇదిలావుంటే కరోనా నేపథ్యంలో వైద్య విద్య తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న విషయంలో స్పష్టత లేదని అధికారులు తెలిపారు. వాస్తవంగా జాతీయస్థాయి మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే వచ్చే నెల 15న తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తరగతుల ప్రారంభంపై స్పష్టతలేదని అంటున్నారు. -
మెడిసిన్‌లో మెరిసెన్
వజ్రపుకొత్తూరు: తల్లి కష్టం ఆ యువకుడు వృథాగా పోనియ్య లేదు.. చిన్నప్పుడే తండ్రిని కిడ్నీ వ్యాధి కబలించగా.. ఆటు పోట్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొని ఆ యువకుడు ముందుకు సాగాడు. తల్లి కష్టార్జితంతో పాటు మేనమామ ప్రోత్సాహంతో చదువులో రాణించి వైద్యుడిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేశాడు. సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించి విద్యార్థి లోకానికి స్ఫూర్తిగా నిలిచాడు వజ్రపుకొత్తూరు మండలం పూడిజగన్నాథపురం గ్రామానికి చెందిన దల్లి సురేష్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించిన ఆలిండియా పీజీ మెడిసిన్(నీట్)లో జాతీయ స్థాయిలో 152వ ర్యాంక్ , ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో స్టేట్ 9వ ర్యాంక్ ఆలిండియా ఓబీసీ కేటగిరిలో 23వ ర్యాంక్ సాదించి భళా అనిపించకున్నాడు. చదువులో చిచ్చరపిడుగు.. దల్లి సింహాచలం, దయమంతి కుమారుడైన సురేష్ ఎండీ జనరల్ మెడిసిన్‌లో ర్యాంక్ సాధించేందుకు భావనపాడుకు చెందిన మేన మామ బుడ్డా కనకరాజు కృషి చేశారు.1 నుంచి 7వ తరగతి వరకు పీజేపురం ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు పాఠశాల చదివిన సురేష్ కాకినాడలో ఇంర్మీడియట్ బైపీసీలో 970 మార్కులు సాధించి పూర్తి చేశారు. అనంతరం ఎంసెట్‌లో చక్కటి ర్యాంక్ సాధించి అక్కడే ఎంబీబీఎస్‌ను రంగారాయ మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని పీజీలో ఎండీ జనరల్ మెడిసిన్ ఢిల్లీలోని మౌలానాఅజాద్ మెడికల్ కళాశాలలో పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఘనంగా సన్మానం.. సురేష్‌ను టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ కణితివూరులో ఆదివారం ఘనంగా సన్మానం చేసారు. పేదరికాన్ని జయించి పట్టుదలతో యువ వైద్యుడిగా ఎదగడం విద్యార్థి లోకానికి ఆదర్శమని కొనియాడారు. పీజీని దిగ్విజయంగా పూర్తి చేసి గ్రామీణులకు చక్కటి వైద్య సేవలను అందించాలని కోరారు. కార్యక్రమంలో నందిగాం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొమ్మాళి లక్ష్మీనారాయణ, కణితి గిరి తదితరులు పాల్గొన్నారు. పేదలకు వైద్యసేవలందిస్తా పట్టుదలతో శ్రమిస్తే ఎవరికైనా విజయం సొంతమవుతుంది. మేనమామ ప్రోత్సాహం, తల్లి పడిన కష్టాన్ని దిగమింగుకుని చదవాను. పీజీ పూర్తి చేసి గ్రామీణ ప్రాంత పేదలకు చక్కటి వైద్యసేవలు అందిస్తాను. – దల్లి సురేష్, వైద్య విద్యార్థి, పీజేపురం ఆనందంగా ఉంది.. తండ్రి మరణించినా కష్టపడి పిల్లలను చదివించాను. ఇందులో నా సోదరుడి పాత్ర కీలకం. పేదరికం, కష్టాలను గమనించి చదివిన పెద్ద కుమారుడు వెంకటేష్ ఇడుపులపాయ ట్రిపుల్ ఇటీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ అయ్యారు. చిన్నకుమారుడు సురేష్ వైద్యుడిగా మారడం ఆనందంగా ఉంది.– దల్లి దమయంతి, తల్లి, పీజేపురం -
సంయుక్త విజేతలుగా నేపాల్, బంగ్లాదేశ్
సాక్షి, ఖమ్మం: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఆల్ ఇండియా మహిళా క్రికెట్ టోర్నీ శుక్రవారం ముగిసింది. వర్షం కారణంగా నేపాల్–బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో నిర్వాహకులు సంయుక్త విజేతలుగా ప్రకటించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నేపాల్ జట్టు పరిమిత ఓవర్లలో 105 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. రుబీనాఛత్రి 48 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 రన్స్ చేయగా, శోవాఅలా 21 రన్స్ చేశారు. మిగతా బ్యాట్స్ఉమెన్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఒక్క ఓవర్‌కు 4 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. నేపాల్–బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ దృశ్యం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా రుబీనా (నేపాల్), బౌలర్‌గా ఫరుడ్రూసీ (బంగ్లాదేశ్), బ్యాట్స్ ఉమెన్‌గా ఫాతిమా (బంగ్లాదేశ్)కు ప్రత్యేక బహుమతులు అందజేశారు. సంయుక్త విజేతలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ట్రోపీ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహిళా క్రికెట్‌కు ఆదరణ తీసుకొస్తామని, మహిళా క్రికెటర్ల సంఖ్య కూడా పెరిగిందని, వారికి శిక్షణ ఇచ్చేందుకు సాయం చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా జడ్జి లక్ష్మణ్, టోర్నీ కన్వీనర్ బిచ్చాల శ్రీనివాసరావు మాట్లాడారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, రాజుసింగ్ చంద్రవంశీ, డాక్టర్ రాజీవ్‌కుమార్ శ్రీవాత్సవ్, ఎ.కృష్ణకిశోర్, వినోద్ సింగ్జీ, వైవీ రెడ్డి, కల్యాణస్వామి, సందీప్ ఆర్య, కూరపాటి ప్రదీప్‌కుమార్, ఎండీ మతిన్ తదితరులు పాల్గొన్నారు. -
విజేత రుత్విక శివాని
పుణే: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో క్వాలిఫయర్ రుత్విక 21–10, 21–17తో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక ఈ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయాలబారిన పడ్డ రుత్విక ఇటీవలే కోలుకొని పునరాగమనం చేసింది. మహిళల డబుల్స్‌లో బండి సాహితి (తెలంగాణ)–నీల (తమిళనాడు) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాహితి–నీల జోడీ 12–21, 17–21తో టాప్ సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జంట చేతిలో ఓడిపోయింది. -
సివిల్స్ ప్రథమ ర్యాంకర్ నందినికి సన్మానం
కాశీబుగ్గ : ఆల్ ఇండియా సివిల్స్ ప్రథమ ర్యాంకర్, కేరళకు చెందిన నందినికి పలాసలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలి టీ పరిధిలో పారసాంబ గ్రామానికి యువ ఐఏఎస్‌లు మంగళవారం రాత్రి చేరుకున్నారు. మంగళవారం గ్రామంలో బస చేసిన ఆమెకు స్థానికులు, పట్టణ వాసులు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపి శాలువతో సత్కరించారు. ఇటీవల ఐఏఎస్ అధికారులుగా ఎంపికైన 19మంది ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పశ్చిమబెంగాల్ నుంచి విశాఖ నేవల్ డాక్‌యార్డుకు చేరుకుంటున్న సమయంలో మార్గమధ్యం లో పలాస వచ్చారు. ఐఏఎస్ శిక్షణలో భాగంగా భారత దర్శిని పేరుతో అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ జాతీయ రహదారిపై వెళ్తున్న ఈ బృందాన్ని సివిల్స్ 3వర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ ఆ హ్వానించడంతో ఆయన ఇంటికి చేరుకుని బస చేశారు. ఆరుబయట నేలపై కూర్చుని భోజన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మిగిలిన ఐఏ ఎస్ అధికారులు, టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్థా డబుల్ ధమాకా
ఆలిండియా క్లబ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అంతర్ క్లబ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఎస్‌జీటీఐడీఎం క్లబ్ స్విమ్మర్ ఆస్థా చౌదరీ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అక్వాటిక్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో బాలికల 200 మీ. ఫ్రీస్టయిల్, 100 మీ. బటర్‌ఫ్లయ్ విభాగాల్లో స్వర్ణాలతో మెరిసింది. శుక్రవారం జరిగిన బాలికల 200 మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఆస్థా తొలిస్థానంలో నిలవగా... అంతర కొతారే (గ్లెన్‌మార్క్ అక్వాటిక్ ఫౌండేషన్), మెహ్రూష్ (వీ4 అక్వాటిక్ సెంటర్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. బాలుర 200 మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో డాల్ఫిన్ అక్వాటిక్స్ క్లబ్ స్విమ్మర్లు తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఈ ఈవెంట్లో షోన్ గంగూలీ, తన్మయ్ షిండేలు వరుసగా పసిడి, రజత పతకాలను సొంతం చేసుకోగా... హిరేన్ (ఎంజీఎంసీ) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పతకాలను అందజేశారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు 50మీ. బ్యాక్‌స్ట్రోక్ బాలురు: 1. విదిత్ శంకర్ (డాల్ఫిన్ అక్వాటిక్స్), 2. సంజీవన్ కుమార్ (మార్లిన్ అక్వాటిక్స్), రిషబ్ (గ్లెన్‌మార్క్). బాలికలు: 1. అనన్య (గ్లెన్‌మార్క్), 2. కైరా (గ్లెన్‌మార్క్), 3. రాజోశ్రీ రౌత్ (కాలేజ్ స్క్వేర్ స్విమ్మింగ్ క్లబ్). 100మీ. బటర్‌ఫ్లయ్ బాలురు: 1. బిక్రమ్ (ఎస్‌జీటీఐడీఎం), 2. షోన్ గంగూలీ (డాల్ఫిన్), 3. సమర్థ్ సుబ్రమణ్యం (డాల్ఫిన్). బాలికలు: 1. ఆస్థా, 2. పలక్ (గ్లెన్‌మార్క్), 3. సుకన్య శర్మ (డాల్ఫిన్). బాలుర 4– 50మీ. ఫ్రీస్టయిల్: 1. గ్లెన్‌మార్క్ అక్వాటిక్ ఫౌండేషన్, 2. డాల్ఫిన్ అక్వాటిక్స్, 3. చాంపియన్ ఆక్వాటిక్ క్లబ్. బాలికలు: 1. డాల్ఫిన్ అక్వాటిక్స్, 2. గ్లెన్‌మార్క్, 3. బసవనగూడి అక్వాటిక్ సెంటర్. బాలుర 4–50 బటర్‌ఫ్లయ్: 1. డాల్ఫిన్ అక్వాటిక్స్, 2. స్పోర్టిఫ్ ఎంగేజెస్, 3. జియాన్ స్పోర్ట్స్ బాలికలు: 1. గ్లెన్‌మార్క్, 2. యంగ్ చాలెంజర్స్, 3. డాల్ఫిన్ అక్వాటిక్స్. -
నేటి నుంచి ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలు
– 18 రాష్ట్రాల నుంచి 873 మంది క్రీడాకారులు రాక కర్నూలు (టౌన్): ఆల్ ఇండియా స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడాపోటీలు సోమవారం నుంచి కర్నూలులో ప్రారంభం కానున్నాయి. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల స్టేడియంలో నేటి నుంచి 13 వతేదీ వరకు పోటీలు జరుగుతాయి. మూడు రోజుల పాటు ర్యాంకింగ్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 10 వ తేదీ నుంచి ఇన్నింగ్స్ పోటీలు నిర్వహిస్తారు. అండర్– 13, అండర్– 15 సంవత్సరాల గ్రూపు బాల, బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్‌భట్ తెలిపారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి మొత్తం 873 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు వెల్లడించారు, ఎల్ఈడీ వెలుగుల్లో పోటీలు మొట్టమొదటిసారిగా ఇండోర్‌స్టేడియంలో ఆల్ ఇండియా సబ్ జూనియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఎల్ఈడీ వెలుతురులో నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి ఎ. శ్రీనివాస్ భట్ తెలిపారు. జపాన్ దేశం నుంచి తెప్పించిన యూనిక్స్ ఏఎస్–2 షటిల్ కాక్స్ ఈ పోటీల్లో వాడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 25 లక్షలు Ðð వెచ్చించి ఈటోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
కదం తొక్కిన కార్మికలోకం
-
తండ్రి, తనయుడి ప్రోత్సాహంతోనే..
చెస్ టోర్నీల్లో అడుగుపెట్టా : రాధాకుమారి ఏడోసారి ఎల్ఐసీ ఆల్ ఇండియా చెస్ టోర్నీకి ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : తండ్రి, తనయుడి ప్రోత్సాహంతోనే తాను చెస్ టోర్నీల్లో పాల్గొంటున్నానని ఎల్ఐసీ ఆల్ ఇండియా చెస్ టోర్నీకి ఎంపికైన 45 ఏళ్ల వెంపరాల రాధాకుమారి తెలిపారు. ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయ పరిధిలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బ్రాంచిలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. ‘చిన్నతనం నుంచి నాకు చెస్ అంటే ఎంతో ఇష్టం. దీంతో మా నాన్న వెంపరాల ప్రభాకరావు వద్దే ఆడడం నేర్చుకున్నా. చెస్ క్రీడాకారుడైన నా తనయుడు ఉపాధ్యాయుల సమీర్‌కుమార్ ప్రోత్సాహంతో 2007 నుంచి టోర్నమెంట్లలో పాల్గొంటున్నా. ఎల్ఐసీ టోర్నమెంట్లతో పాటు, 2014లో హైదరాబాద్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో బెస్ట్ ఉమెన్‌గా సెలెక్ట్ అయ్యాను. రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయం తరఫున ఎల్ఐసీ సౌత్ జోన్ చెస్ టోర్నమెంటులో పాల్గొని ద్వితీయస్థానం సాధించా. ఎల్ఐసీ ఆల్ ఇండియా చెస్ టోర్నీకి ఏడోసారి ఎంపికయ్యా. 2015–16 ఆల్ఇండియా చెస్ టోర్నీలో బ్రాంజ్‌మెడల్ సాధించాను. భర్త ఉపాధ్యాయుల సూర్యనారాయణమూర్తి, ఎల్ఐసీ సంస్థ అందిస్తున్న ప్రోత్సాహంతోనే చెస్‌లో రాణిస్తున్నా.’’ -
హైదరాబాద్‌లో SBI ఆలిండియా వాలీబాల్
-
అఖిలభారత వాసవి క్లబ్ మాజీ అధ్యక్షుడు అదృశ్యం
-
క్రీడాపటంలో మెరిసిన విశాఖ
ప్రపంచ క్రీడాపటంలో విశాఖ మరోసారి మెరిసింది. వెస్టిండీస్‌తో భారత్ జట్టు వన్డే క్రికెట్లో తలపడితే, బాక్సింగ్‌లో స్థానిక క్రీడాకారిణులు అంతర్జాతీయ పతకాల్ని సొంతం చేసుకున్నారు. పాఠశాలల క్రీడా సమాఖ్య పోటీలకు జాతీయస్థాయిలో ఆడేందుకు పాఠశాలల విద్యార్థులు అర్హత సాధించారు. విలువిద్యలో గిరిజన క్రీడాకారుడు జాతీయ రికార్డునే సొంతం చేసుకుని విశాఖకే వన్నె తెచ్చాడు. ఏయూ జట్లు సైతం ఆల్ ఇండియా పోటీలకు అర్హత సాధించి విశ్వకళాపరిషత్ ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. గ్రామీణ క్రీడాకారులను ఉద్దేశించి నిర్వహించే పైకా క్రీడల్లో విశాఖ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు చక్కగా రాణించి నేషనల్స్ మీట్ల్లోనూ ఆడేందుకు సమాయత్తమౌతున్నారు. క్రీడాభివృద్ధి సంస్థకు చెందిన ప్రొఫెషనల్ ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అద్భుతంగా రాణించారు. ఆల్ ఇండియాలో ఏ పోటీ అయినా సై... 2013లో ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన మూడు జట్లు ఆల్ ఇండియా అంతర వర్శిటీ పోటీలకు అర్హత సాధించాయి. బ్యాడ్మింటన్‌లో ఆల్ ఇండియా వర్శిటీ పోటీల్లోనూ లీగ్ దశలో సత్తాచాటి నాకవుట్ పోటీల్లో ప్రవేశించింది. పురుషుల విభాగంలో సౌత్‌జోన్ అంతరవర్శిటీ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. టెన్నిస్ పోటీల్లో మరో మారు ఏయూ జట్టు సత్తా నిరూపించుకుంది. దక్షిణ మండల వర్శిటీ పోటీల్లో ఏయూ మెన్ టెన్నిస్ జట్టు నాలుగో స్థానంలో నిలిచి ఆల్ ఇండియా అంతర వర్శిటీ పోటీలకు అర్హత సాధించింది. ఈ పోటీలు త్వరలో కోల్‌కతాలో జరగనున్నాయి. మహిళా క్రికెట్ జట్టు దక్షిణ మండల వర్శిటీ పోటీల్లో సత్తా చాటి విజేతగా నిలిచింది. ఆల్ ఇండియా వర్శిటీ పోటీల్లోనూ ఆడనుంది. మెరిసిన గ్రామీణ క్రీడా మాణిక్యాలు ఈసారి రాష్ట్రంలోనే విశాఖ గ్రామీణ నుంచి అత్యధిక గ్రామీణ చిన్నారులు క్రీడా పాఠశాలలో ఆటలతోపాటు చదువుకునే అవకాశాన్ని పొందారు. హైదరాబాద్ హాకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో వీరంతా ఆటలతో పాటు చదువును అభ్యసించనున్నారు. క్రీడలే ప్రధానంగా సాగే క్రీడాపాఠశాలలో నుంచి మరో ఐదేళ్లలో వీరంతా జాతీయ స్థాయికి చేరుకునే అవకాశాల్ని అందిపుచ్చుకోనున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీరంతా రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు. పైకాలో...హవా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు నిర్వహించే క్రీడల్లోనూ జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. ఖోఖోలో ముగ్గురు జాతీయ మీట్‌కు అర్హత సాధించగా టెన్నిస్‌లో ఇద్దరు, హ్యాండ్‌బాల్‌లో మరో ఇద్దరు ఎంపికయ్యారు. కాగా వీరంతా త్వరలోనే నేషనల్ మీట్లో పాల్గోనుండగా ఇప్పటికే కబడ్డీ పైకా నేషనల్స్‌లో ఇద్దరు కర్నాటకలోని హవేలీలో ఆడి చక్కటి ప్రతిభ కనబరిచారు. పైకా బాక్సింగ్ క్రీడల్లో ఏడుగురు క్రీడాకారులు స్వర్ణాలందుకోవడం విశేషం. పాఠశాలల క్రీడా సమాఖ్యకు ఖ్యాతి ఎస్జీఎఫ్ఐలో ఆడేందుకు పాఠశాలల చిన్నారులు అర్హత సాధించారు. అస్సాంలోని గౌహతిలో జరిగిన ఎస్జీఎఫ్ నేషనల్ బాక్సింగ్ మీట్లో మేఘన రజత పతకాన్ని సాధించగా మనీషా కాంస్యాన్నందుకుని విశాఖ ఖ్యాతిని ఇనుమడించారు. లలెంకవలీ ఏకంగా స్వర్ణాన్నే కై వసం చేసుకుంది. స్టేట్‌మీట్‌లో ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌ను అందుకుంది. సాయ్ ఎస్టీసీ మెరికలు...పంచ్ విసిరితే పతకాలే భారత క్రీడాసంస్థ శిక్షణ కేంద్రంలో నాలుగు శిక్షణ శిబిరాలు ఈ ఏడాది నిర్వహించారు. అందుకు తగినట్టుగానే బాక్సింగ్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పంచ్‌లు విసిరి పతకాల్ని పట్టుకొచ్చారు. బల్గేరియాలో జరిగిన యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ కాంస్యపతకాన్ని సాధించింది. నిఖత్ గోల్డెన్ గ్లోవ్ చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యపతకాన్ని అందుకుంది. సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్‌లో భారతమ్మ, శశికళలు చెరో కాంస్యాన్ని అందుకున్నారు. అజర్బైజాన్లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ శ్యాం క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. విజయ్‌కుమార్ కజికిస్తాన్లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదిలా వుండగా ఎస్టీసీలో శిక్షణ పొందిన వాలీబాల్ ఆటగాడు వెంకటనాని ఆసియన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించాడు. విలుకాని జాతీయ రికార్డు... గిరిజన విలువిద్య క్రీడాకారుడు బైరాగినాయుడు దశాబ్దం క్రితం నమోదైన రికార్డును తిరగ రాశాడు. తొలి రెండేళ్లలో కనీసం పతకం సాధించలేక పోయిన గిరిజన క్రీడాకారుడు ఏకంగా రికార్డునే సొంతం చేసుకోవడంతో క్రీడాలోకం హర్షం ప్రకటించింది. ఇండియన్ రౌండ్లో ఆర్చరీ ఆటగాళ్లు పతకాలు సాధిస్తున్నా రికర్వ్‌లో ఇంకా చక్కటి ప్రోత్సాహం లభించకున్నా బైరాగినాయిడు సత్తా చాటాడు. సీనియర్ నేషనల్స్‌లో ఒలింపిక్ రౌండ్లో టాప్ 20 ర్యాంక్‌కు చేరుకున్నాడు. క్రికెట్‌కు స్వర్ణయుగం అంతర్జాతీయ క్రీడా పటంలో విశాఖ ఖ్యాతికి 2013ది ప్రత్యేకం. ఏకంగా నాలుగు దేశాల జూనియర్స్ టోర్నీకి వేదికగా నిలిచింది. తొలిసారిగా సౌతాఫ్రికా జూనియర్స్ జట్టు విశాఖలో సిరీస్ ఆడింది. ఈసారి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు భారత్ సత్తా చాటింది. మరో మారు క్వాడ్రేంగులర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే టెస్ట్ హోదా సాధించేందుకు అన్ని హంగుల్ని ఈ ఏడాది పూర్తి చేసుకుంది. ఇక్కడ జరిగిన వన్డే సిరీస్‌లో ఐసీసీ ప్రతినిదులు సైతం స్టేడియంలోని వసతుల్ని పరిశీలించారు. ఇక టెస్ట్ క్రికెట్ లాంఛనమే. అయితే ఆహ్వాన జట్టు భారత్‌కు తొలిసారిగా వైఎస్ఆర్ స్టేడియంలో పరాజయం ఎదురైంది. అప్రతిహతంగా సాగే భారత్ విజయ పరంపరకు వెస్టిండీస్ జట్టు గండికొట్టింది. ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ నమోదు చేయాలనుకున్న భారత్‌కు ఆశనిపాతమే అయింది. -
సంతోష్ ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సంతోష్ రావూరి రెండు టైటిల్స్ సాధించాడు. బెంగళూరులో శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో సంతోష్ అండర్-19 బాలుర డబుల్స్ విభాగంలో... అండర్-19 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. బాలుర డబుల్స్ ఫైనల్లో సంతోష్ ఆంధ్రప్రదేశ్‌కే చెందిన తన భాగస్వామి చైతన్య రెడ్డితో కలిసి 21-14, 24-22తో టాప్ సీడ్ శ్యామ్ ప్రసాద్ (కేరళ)-శ్లోక్ రామచంద్రన్ (మహారాష్ట్ర) జంటను బోల్తా కొట్టించాడు. సెమీఫైనల్లో ఈ హైదరాబాద్ జోడి 21-16, 21-16తో రూపిందర్ సింగ్-కవల్దీప్ సింగ్ (చత్తీస్‌గఢ్) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సంతోష్ తన భాగస్వామి పూర్వీషా రామ్ (కర్ణాటక)తో కలిసి 21-16, 22-20తో చిరాగ్ సేన్-కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్) జంటపై విజయం సాధించాడు. అండర్-17 బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ కుర్రాడు రాహుల్ యాదవ్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. సెమీస్‌లో రాహుల్ 14-21, 7-21తో తలార్ లా (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. అండర్-17 బాలికల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు శ్రీ కృష్ణప్రియ, సంతోషి హాసిని క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు.