నేటి నుంచి ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలు
నేటి నుంచి ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలు
Published Sun, Nov 6 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
– 18 రాష్ట్రాల నుంచి 873 మంది క్రీడాకారులు రాక
కర్నూలు (టౌన్): ఆల్ ఇండియా స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడాపోటీలు సోమవారం నుంచి కర్నూలులో ప్రారంభం కానున్నాయి. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల స్టేడియంలో నేటి నుంచి 13 వతేదీ వరకు పోటీలు జరుగుతాయి. మూడు రోజుల పాటు ర్యాంకింగ్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 10 వ తేదీ నుంచి ఇన్నింగ్స్ పోటీలు నిర్వహిస్తారు. అండర్– 13, అండర్– 15 సంవత్సరాల గ్రూపు బాల, బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్‌భట్ తెలిపారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి మొత్తం 873 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు వెల్లడించారు,
ఎల్‌ఈడీ వెలుగుల్లో పోటీలు
మొట్టమొదటిసారిగా ఇండోర్‌స్టేడియంలో ఆల్ ఇండియా సబ్ జూనియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఎల్‌ఈడీ వెలుతురులో నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి ఎ. శ్రీనివాస్ భట్ తెలిపారు. జపాన్ దేశం నుంచి తెప్పించిన యూనిక్స్ ఏఎస్–2 షటిల్ కాక్స్ ఈ పోటీల్లో వాడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 25 లక్షలు Ðð వెచ్చించి ఈటోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement