
కాశీబుగ్గ : ఆల్ ఇండియా సివిల్స్ ప్రథమ ర్యాంకర్, కేరళకు చెందిన నందినికి పలాసలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలి టీ పరిధిలో పారసాంబ గ్రామానికి యువ ఐఏఎస్‌లు మంగళవారం రాత్రి చేరుకున్నారు. మంగళవారం గ్రామంలో బస చేసిన ఆమెకు స్థానికులు, పట్టణ వాసులు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపి శాలువతో సత్కరించారు. ఇటీవల ఐఏఎస్ అధికారులుగా ఎంపికైన 19మంది ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పశ్చిమబెంగాల్ నుంచి విశాఖ నేవల్ డాక్‌యార్డుకు చేరుకుంటున్న సమయంలో మార్గమధ్యం లో పలాస వచ్చారు.
ఐఏఎస్ శిక్షణలో భాగంగా భారత దర్శిని పేరుతో అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ జాతీయ రహదారిపై వెళ్తున్న ఈ బృందాన్ని సివిల్స్ 3వర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ ఆ హ్వానించడంతో ఆయన ఇంటికి చేరుకుని బస చేశారు. ఆరుబయట నేలపై కూర్చుని భోజన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మిగిలిన ఐఏ ఎస్ అధికారులు, టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.