సంతోష్ ‘డబుల్’ | santosh double | Sakshi
Sakshi News home page

సంతోష్ ‘డబుల్’

Published Mon, Aug 12 2013 12:55 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

santosh double

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సంతోష్ రావూరి రెండు టైటిల్స్ సాధించాడు. బెంగళూరులో శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో సంతోష్ అండర్-19 బాలుర డబుల్స్ విభాగంలో... అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు.
 
  బాలుర డబుల్స్ ఫైనల్లో సంతోష్ ఆంధ్రప్రదేశ్‌కే చెందిన తన భాగస్వామి చైతన్య రెడ్డితో కలిసి 21-14, 24-22తో టాప్ సీడ్ శ్యామ్ ప్రసాద్ (కేరళ)-శ్లోక్ రామచంద్రన్ (మహారాష్ట్ర) జంటను బోల్తా కొట్టించాడు. సెమీఫైనల్లో ఈ హైదరాబాద్ జోడి 21-16, 21-16తో రూపిందర్ సింగ్-కవల్‌దీప్ సింగ్ (చత్తీస్‌గఢ్) జంటపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సంతోష్ తన భాగస్వామి పూర్వీషా రామ్ (కర్ణాటక)తో కలిసి 21-16, 22-20తో చిరాగ్ సేన్-కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్) జంటపై విజయం సాధించాడు.
 
 అండర్-17 బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ కుర్రాడు రాహుల్ యాదవ్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. సెమీస్‌లో రాహుల్ 14-21, 7-21తో తలార్ లా (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. అండర్-17 బాలికల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు శ్రీ కృష్ణప్రియ, సంతోషి హాసిని క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement