పోలీసుల రిటైర్మెంట్ విషయంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు దాటిన పోలీసుల నిర్బంధ పదవీ విరమణ కోసం స్క్రీనింగ్‌కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. 50 ఏళ్లు నిండిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించి, తప్పనిసరి పదవీ విరమణ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోలీసుల జాబితాను నవంబర్ 30లోగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
2023, మార్చి 31 నాటికి 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బందికి తప్పనిసరిగా పదవీ విరమణ కోసం స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం తన ఆదేశాలలో పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాత, నిర్ణీత తేదీలోగా నిర్బంధ పదవీ విరమణ చేయాల్సిన పోలీసుల జాబితాను అధికారులు ప్రధాన కార్యాలయానికి పంపించనున్నారు.
తమ సర్వీసులో అవినీతికి పాల్పడినట్లు లేదా చెడు ప్రవర్తన ఉన్నట్లు తేలితే అతనిని రిటైర్ చేయనున్నారు. పోలీసుల స్క్రీనింగ్‌లో వారి వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో యోగి ప్రభుత్వం పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం పోలీసుశాఖలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని అధికారులు, ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో సమర్థవంతులైన వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం యోగి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ కన్నుమూత!
Comments
Please login to add a commentAdd a comment