Age Verification
-
ఇన్‌స్టాలో ఇక వయసు దాచలేరు
టీనేజీ యూజర్లు అసభ్య, అనవసర కంటెంట్ బారిన పడకుండా, వాటిని చూడకుండా కట్టడిచేసేందుకు, వారి మానసిక ఆరోగ్యం బాగుకోసం సామాజికమాధ్యమం ఇన్‌స్టా గ్రామ్ నడుం బిగించింది. ఇందుకోసం ఆయా టీనేజర్ల వయసును కనిపెట్టే పనిలో పడింది. తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారంతో లాగిన్ అయినాసరే ఇన్‌స్టా గ్రామ్ యాప్‌ను వాడుతున్నాసరే దానిని కనిపెట్టి అడ్డుకునేందుకు కృత్రిమ మేథ సాయం తీసుకుంటామని దాని మాతృసంస్థ ‘మెటా’వెల్లడించింది.ఎలా కనిపెడతారు? అడల్ట్ క్లాసిఫయర్ పేరిట కొత్త ఏఐ టూల్‌ను మెటా వినియోగించనుంది. దీంతో యూజర్ల వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించుకోవచ్చు. ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్‌ను యూజర్ వీక్షిస్తున్నాడు?, ఆ యూజర్ ప్రొఫైల్‌లో పొందుపరిచిన వివరాలతో వయసుపై తొలుత ప్రాథమిక అంచనాకొస్తారు. తర్వాత ఈ యూజర్‌ను ఏఏ వయసు వాళ్లు ఫాలో అవుతున్నారు?, ఈ యూజర్‌తో ఎలాంటి కంటెంట్‌ను పంచుకుంటున్నారు?, ఎలాంటి అంశాలపై ఛాటింగ్ చేస్తున్నారు? ఏం ఛాటింగ్ చేస్తున్నారు? వంటి విషయాలను వడబోయనున్నారు. ఫ్రెండ్స్ నుంచి ఈ యూజర్లకు ఎలాంటి బర్త్‌డే పోస్ట్‌లు వస్తున్నాయి వంటివి జల్లెడపట్టి యూజర్ వయసును నిర్ధారిస్తారు. ఆ యూజర్ 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్‌గా తేలితే ఆ అకౌంట్‌ను వెంటనే టీన్ అకౌంట్‌గా మారుస్తారు. ఈ అకౌంట్ల వ్యక్తిగత గోప్యత సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఈ యూజర్లకు ఏ వయసు వారు మెసేజ్ పంపొచ్చు? అనేది ఏఐ టూల్ నిర్ణయిస్తుంది. ఈ టీనేజర్లు ఎలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు అనే దానిపై కృత్రిమ మేథ టూల్దే తుది నిర్ణయం. ప్రస్తుతం చాలా మంది టీనేజర్లు లైంగికసంబంధ కంటెంట్‌ను వీక్షించేందుకు, తల్లిదండ్రులకు తెలీకుండా చూసేందుకు తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారం ఇచ్చి లాగిన్ అవుతున్నారు. వీటికి త్వరలో అడ్డుకట్ట పడనుంది.వచ్చే ఏడాది షురూ అడల్ట్ క్లాసిఫయర్ను వచ్చే ఏడాది నుంచి అమలుచేసే వీలుంది. 18 ఏళ్లలోపు టీనేజర్ల ఖాతాలను టీన్ అకౌంట్లుగా మారుస్తాయి. అయితే త్వరలో 18 ఏళ్లు నిండబోయే 17, 16 ఏళ్ల వయసు వారికి కొంత వెసులుబాటు కల్పించే వీలుంది. అంటే నియంత్రణ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇది కూడా కాస్తంత కష్టంగా మార్చొచ్చు. సామాజికమాధ్యమ వేదికపై హానికర అంశాలను పిల్లలు చూసి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మెటా ఈ దిశగా యాప్‌లో మార్పులు చేస్తోంది. టీనేజీ అమ్మాయిలపై ఇన్‌స్టా గ్రామ్ పెను దుష్ప్రభావాలు చూపుతోందని ప్రజావేగు ఫ్రాన్సెస్ హాగెన్ సంబంధిత అంతర్గత పత్రాలను బహిర్గతం చేయడంతో ఇన్‌స్టా గ్రామ్ నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు అధికమయ్యాయి. కొత్త టూల్ కారణంగా టీనేజీ యూజర్ల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చేమోగానీ సమస్యకు పూర్తి పరిష్కారం లభించకపోవచ్చని స్వయంగా మెటానే భావిస్తోంది. ఎవరైనా యూజర్ తాను టీనేజర్‌ను కాదు అని చెప్పి టీన్అకౌంట్ను మార్చాలనుకుంటే ఆ మేరకు లైవ్‌లో నిరూపించుకునేలా కొత్త నిబంధన తేవాలని చూస్తున్నారు. బయటి సంస్థకు ఈ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. సంబంధిత యూజర్ వీడియో సెల్ఫీ లైవ్‌లో తీసి పంపితే ఈ బయటి సంస్థ వీడియోను సరిచూసి అకౌంట్ స్టేటస్‌పై తుది నిర్ణయం తీసుకుంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
70 ఏళ్ల వయసులో మెడికల్ గ్రాడ్యుయేట్‌గా
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. అనుకున్న లక్ష్యం సాధించేందుకు వయసు ఏమాత్రం అడ్డురాదని మలేసియాకు చెందిన 70 ఏళ్ల తోహ్ హాంగ్‌కెంగ్ నిరూపించారు. ఇప్పటికే రిటైర్డ్ అయిన తోహ్ ఇటీవల మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఔరా అనిపించారు. 70 ఏళ్ల వయసులో మెడిసిన్ చేసి ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసులో మెడిసిన్ చేసిన వారిలో ఒకరిగా తోహ్ రికార్డ్ సృష్టించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తుందా..! చిరంజీవి స్టైల్‌గా క్లాస్‌లోకి వస్తుంటే అందరూ ఆయనను ప్రొఫెసర్ అని పొరబడతారు. ఫిలిప్పీన్స్‌లోని సెబులో ఉన్న సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ పీహెచ్ ఎంఏ విద్యార్థులు సైతం తోహ్ మొదటిసారి క్లాసులో అడుగుపెట్టినప్పుడు అలాగే అనుకున్నారు. కానీ తోటి విద్యార్థి అని తర్వాత తెల్సుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆయనను ‘సర్ తోహ్’అంటూ గౌరవంగా పిలుచుకుంటున్నారు. అయితే ఆయన చిన్నతనం నుంచే డాక్టర్ కావాలనేమీ కలలు కనలేదు. అప్పటికే ఆర్థికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఎల్రక్టానిక్ ఇంజనీరింగ్ చదివేశారు. తర్వాత ఆయన మనసు మెడిసిన్ వైపు మళ్లింది. 2018లో కిర్గిజిస్తాన్ విహారయాత్రలో ఉండగా ఇద్దరు యువ భారతీయ వైద్య విద్యార్థులను కలిశారు. ఆ పరిచయం ఆయనను వైద్య విద్య పట్ల అమితాసక్తిని పెంచిందని తోహ్ చెప్పారు. 2019లో కార్పొరేట్ ప్రపంచం నుంచి పదవీ విరమణ పొందాక మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ అన్నిచోట్లా వైద్యవిద్య చదవడానికి వయోపరిమితి అడ్డుగా ఉందని తర్వాత అర్థమైంది. ఈ వయసులోనూ తనను మెడిసిన్ చదివేందుకు అనుమతించే కాలేజీ కోసం తెగ తిరిగారు. అయితే తమ పని మనిషి కూతురు చదివిన ఫిలిప్పీన్స్‌లోని వైద్య పాఠశాలలో వయోపరిమితి లేదని తెలుసుకుని ఎగిరి గంతేశారు. వెంటనే దరఖాస్తు చేసుకోవడం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, తర్వాత సెలక్షన చకచకా జరిగిపోయాయి. పెట్టే బేడా సర్దుకుని అక్కడికి వెళ్లిపోయి స్కూల్లో చేరారు. 2020లో కరోనా విజృంభించడంతో హాంకాంగ్‌కు మకాం మార్చేసి తన క్లాసులన్నీ ఆన్లైన్లో విన్నారు. కుటుంబం, సహాధ్యాయిల సహకారంతో గత జూలైలో మెడిసిన్ పట్టా అందుకున్నారు. రెసిడెన్సీ అనుభవంతో పూర్తిస్థాయి లైసెన్స్డ్ డాక్టర్‌గా మారడానికి ఆయనకు మరో పదేళ్లు పట్టొచ్చు. విదేశీ విద్యార్థుల ట్యూషన్ ఫీజుల కోసం.. మెడికల్ బోర్డు పరీక్ష కోసం ఏడాది పాటు ఇంటర్న్íÙప్, మరింత అధ్యయనం అవసరం. దానికి బదులుగా అతను హాంకాంగ్‌లో స్నేహితుడి సంస్థ అలెర్జీ అండ్ ఇమ్యునాలజీ డయాగ్నస్టిక్స్‌లో కన్సల్టెంట్‌గా పని చేయాలని యోచిస్తున్నారు. త నలాగా మెడిసిన్ చేస్తున్న పేద పిల్లలకు సాయం చేద్దామని భావించారు. ట్యూషన్ ఫీ చెల్లించడానికి కష్టపడే విదేశీ వైద్య విద్యార్థుల కోసం స్కాలర్íÙప్ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ ప్రకారం అమెరికాలో ప్రభుత్వ వైద్య పాఠశాలలలో స్థానిక విద్యార్థులకు సంవత్సరానికి సగటు ట్యూషన్ ఫీజు సుమారు 60,000 డాలర్లు. విదేశీ విద్యార్థు లకు 95,000 డాలర్లు ఖర్చు అవుతుంది. ప్రైవేటు వైద్య పాఠశాలల్లో విదేశీయులకు ట్యూషన్, ఫీజులు 70 వేల డాలర్ల వరకు ఖర్చవుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల విషయానికొస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. ఫిలిప్పీన్స్‌లో ట్యూషన్ ఫీజులు అంత ఎక్కువగా లేవు. తోహ్ సౌత్ వెస్ట్రన్ వర్సిటీ ఏడాదికి దాదాపు 5,000 డాలర్లు ఖర్చు చేశారు. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు ఇది పెద్దమొత్తమే. ఇలాంటివారికి ఆ నిధిని ఖర్చు చేయనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనిషి ఎంతకాలం జీవించవచ్చు? పరిశోధనల్లో ఏం తేలింది?
దీర్ఘాయుష్షు... ఇది ప్రతీమానవునికీ ఉండే కోరిక. అందుకే శాస్త్రవేత్తలు నిరంతరం మనిషి ఆయుష్షు పెంపుదలకు సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల డచ్ పరిశోధకులు మానవుడు ఎంత సుదీర్ఘకాలం పాటు జీవించవచ్చనే విషయాన్ని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. డచ్ పరిశోధకులు మనిషి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను కూడా వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన స్థితిగతులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని డచ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు తమ పరిశోధనల కోసం ముందుగా వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరుల డేటాను సేకరించారు. దీని ని సమూలంగా విశ్లేషించారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక రూపొందించారు. రోటర్‌డామ్‌లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లని తమ పరిశోధనల ద్వారా కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త ఎక్కువేనని వారు చెబుతున్నారు. పరిశోధకులు మూడు దశాబ్దాల డేటా ఆధారంగా మానవుని గరిష్ట ఆయుష్షును అంచనావేయగలిగారు. ఈ పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మనిషి ఆయుష్షు పెరుగుతూ వస్తోందని, వృద్ధాప్యం కూడా దూరమవుతున్నదన్నారు. ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అని డచ్ పరిశోధకులు పేర్కొన్నారు. కాగా ఈ డచ్ శాస్త్రవేత్తల పరిశోధనలు అంతకుముందునాటి అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనల నివేదికలను పోలివుండటం వివేషం. అమెరికా శాస్త్రవేత్తలు కూడా డచ్ పరిశోధకులు వెల్లడించిన గరిష్ట వయో పరిమితినే గుర్తించారు. అయితే తమ దేశంలో ప్రస్తుతం ఉన్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు వివరించారు. డచ్ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ఈ పరిశోధనల కోసం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తొలగించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే 122 సంవత్సరాల164 రోజులు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ తన ఆయుష్షుకు అడ్డుపడే అన్ని పరిధులను అధిగమించారని ఐన్‌మహ్ల్ పేర్కొన్నారు. ఈయన మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ పరిశోధనల వివరాలు త్వరలోనే ప్రచురితమై అందుబాటులోకి రానున్నాయి. -
దీర్ఘాయుష్షు అంటే ఎంత?
మనిషి ఆయుష్షుకు సంబంధించిన పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డచ్ పరిశోధకులు మానవుని గరిష్ట వయస్సు ఎంతనే విషయంతో పాటు ఇలాంటి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన పరిస్థితులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని తమ పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరులు డేటా ఆధారంగా నిపుణులు ఈ విశ్లేషణ చేశారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. రోటర్‌డామ్‌లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లు అని కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని తెలియజెప్పారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త గట్టిదేనని చెప్పవచ్చు. మూడు దశాబ్దాల డేటా ఆధారంగా పరిశోధకులు మానవుని గరిష్ట ఆయుర్దాయాన్ని అంచనావేయగలిగారు. ఈ అధ్యయనాన్ని చేపట్టిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ ‘సాధారణంగా ప్రజలు దీర్ఘకాలమే జీవిస్తారు. గత 30 ఏళ్లలో మనిషి ఆయుష్షు పెరుగుతోంది. వృద్ధాప్యం దూరమయ్యింది. నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది’ అని అన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అంటారు. ఈ డచ్ పరిశోధనలు.. గత ఏడాది అమెరికా పరిశోధకుల పరిశోధనల నివేదికలను పోలివున్నాయి. అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఇదే గరిష్ట వయో పరిమితిని గుర్తించారు. అయితే తమ దేశంలో ఇప్పుడున్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు పేర్కొన్నారు. డచ్ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తీర్చేందుకు ఉపకరిస్తుంది. కాగా 122 సంవత్సరాల164 రోజులపాటు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ ఆయుష్షుకు అడ్డుపడే అన్ని అడ్డంకులను దాటారని ఐన్‌మహ్ల్ ఉదహరించారు. ఇప్పటివరకూ జీన్ కాల్మెంట్ అత్యధిక కాలం జీవించిన మహిళగా చరిత్రలో నిలిచారు. ఐన్‌మహ్ల్ మార్గదర్శకత్వలో జరుగుతున్న ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలు త్వరలోనే సమగ్రంగా ప్రచురితం కానున్నాయి. ఇది కూడా చదవండి: ‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు -
50 దాటిన పోలీసులకు రిటైర్మెంట్.. యూపీ ప్రభుత్వ నిర్ణయం
పోలీసుల రిటైర్మెంట్ విషయంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు దాటిన పోలీసుల నిర్బంధ పదవీ విరమణ కోసం స్క్రీనింగ్‌కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. 50 ఏళ్లు నిండిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించి, తప్పనిసరి పదవీ విరమణ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోలీసుల జాబితాను నవంబర్ 30లోగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2023, మార్చి 31 నాటికి 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బందికి తప్పనిసరిగా పదవీ విరమణ కోసం స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం తన ఆదేశాలలో పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాత, నిర్ణీత తేదీలోగా నిర్బంధ పదవీ విరమణ చేయాల్సిన పోలీసుల జాబితాను అధికారులు ప్రధాన కార్యాలయానికి పంపించనున్నారు. తమ సర్వీసులో అవినీతికి పాల్పడినట్లు లేదా చెడు ప్రవర్తన ఉన్నట్లు తేలితే అతనిని రిటైర్ చేయనున్నారు. పోలీసుల స్క్రీనింగ్‌లో వారి వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో యోగి ప్రభుత్వం పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం పోలీసుశాఖలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని అధికారులు, ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో సమర్థవంతులైన వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం యోగి ఆదేశించారు. ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత! -
తగ్గుతున్న జనాభా.. చైనా కీలక నిర్ణయం..
చైనాలో జననాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతూ యుక్తవయస్సు వారు తగ్గిపోతున్నారు. యుక్త వయస్కులు పెళ్లికి దూరంగా ఉండటమే దీనికి కారణం అని గుర్తించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికూతురు వయస్సు 25 ఏళ్లు, అంతకంటే తక్కువగా ఉంటే రూ.11,340 నగదును కానుకగా ఇవ్వనుంది. ఈ మేరకు హాంకాంగ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రోత్సాహంతోనైనా యువత త్వరగా పెళ్లి చేసుకుని జననాల సంఖ్యను పెంచుతారని ప్రభుత్వం భావిస్తోంది. సరైన వయస్సులో చేసుకునే మొదటి పెళ్లికి మాత్రమే ఈ కానుక వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనాలో గత ఆరు దశాబ్దాలుగా జనాభా రేటు ఘణనీయంగా తగ్గిపోతోంది. వృద్దుల సంఖ్య పెరుగుదలతో ఆందోళన చెందుతున్న అధికారులు.. జననాల సంఖ్యను పెంచడానికి అనేక చర్యలను తీసుకుంటున్నారు. చైనాలో సాధారణంగా పెళ్లికి కనీస వయ్సస్సు అబ్బాయికి 22, అమ్మాయికి 20గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఆర్థికపరమైన చిక్కులతో పాటు ఒంటరి మహిళలు పిల్లలను కనే చట్టాలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది. 2022లో వివాహాల సంఖ్య 68 లక్షలు కాగా.. 1986 తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. 2021 కంటే 2022లో 8 లక్షల వివాహాలు తక్కువగా అయ్యాయి. జననాల రేటులో ప్రపంచంలోనే అతి తక్కువ స్థానానికి చైనా చేరుకుంది. 2022లో రికార్డ్ స్థాయిలో 1.09గా నమోదు కావడం గమనార్హం. పిల్లల సంరక్షణకు అధిక ఖర్చు కావడం వల్ల చాలా మంది తల్లులు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు. అదీగాక మహిళల పట్ల వివక్ష కూడా ఇందుకు శాపంగా మారింది. ఇదీ చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి -
అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది?
భారతదేశం రూపొందించిన చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత జనానికి అంతరిక్షానికి సంబంధించిన విషయాలపై మరింత ఆసక్తి పెరిగింది. పలు విషయాలు తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అంతరిక్షానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. గూగుల్ బాబాను అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదిలా ఉంటే అంతరిక్షానికి సంబంధించిన అనేక అపోహలు జనంలో ఉన్నాయి. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటిలో ఒక సందేహం జనంలో ప్రబలంగా ఉంది. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి వృద్ధాప్యానికి చేరుకోడు. యవ్వనునిగానే ఉండిపోతాడని అంటారు. దీనిలో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యోమగాముల శరీరంలో మార్పులు గడచిన కొన్ని దశాబ్దాలుగా పలుదేశాలు తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాయి. వారు అంతరిక్షంలో కొన్ని రోజులు గడిపి, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కాగా అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములలో పలు మార్పులు కనిపించాయి. వారికి సంబంధించిన అధ్యయనాన్ని నాసా చేపట్టింది. అంతరిక్షం నుంచి వచ్చిన వారిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో గమనించింది. అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములలో రక్తహీనత సర్వసాధారణం. దీనిని స్పేస్ అనీమియా అని కూడా అంటారు. అంతరిక్షంలో వయసు పెరగడం లేదా? అంతరిక్షంలోకి వెళ్లాక వారి వృద్ధాప్యం నిజంగానే నెమ్మదిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఇందుకోసం నాసా ఒక పరీక్ష చేసింది. పరిశోధకులు ఇద్దరు కవల సోదరులను ఎంపికచేశారు. ఈ సోదరులిద్దరూ వ్యోమగాములు. వారిలో ఒకరిని అంతరిక్షంలోకి పంపారు. మరొకరిని భూమిపై ఉంచారు. స్కాట్ కెల్లీ 340 రోజులు అంతరిక్షంలో గడిపాడు. అతని కవల సోదరుడు మార్క్ భూమిపైనే ఉన్నాడు. వయస్సుపై కొంతవరకు ప్రభావం స్కాట్ కెల్లీ అంతరిక్షం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతని జన్యువులలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. భూమిపై జరగని కొన్ని మార్పులు అతని డీఎన్ఏలో కనిపించాయి. స్కాట్ తన సోదరుడు మార్క్ కంటే చిన్నవాడిగా కనిపించడానికి ఇదే కారణంగా నిలిచింది. అయితే తరువాతి 6 నెలల్లో స్కాట్ కెల్లీ జీన్స్‌లో మార్పు సాధారణ స్థితికి చేరుకుంది. దీని ప్రకారం చూస్తే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్నవారి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా వారు యవ్వనులుగా కనిపించేందుకు అవకాశాలున్నాయి. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! -
11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్ ఏమి చెబుతోందంటే..
ఏ యువకునికైనా తండ్రిగా మారడమనేది కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ అనుభూతి అతని జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే మగపిల్లవాడు ఏ వయసులో తండ్రి అవుతాడు? ఈ ప్రశ్న విజ్ఞానశాస్త్రానికే సవాల్‌గా నిలిచింది. అయితే ఇటీవల బ్రిటన్‌కు చెందిన షాన్ స్టీవర్ట్ కేవలం 11 ఏళ్ల వయసులోనే తండ్రి అయ్యాడు. ఈ ఉదంతం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మగపిల్లవాడు ఏ వయసులో తండ్రి అవుతాడనే దానిపై పలు వాదోపవాదనలు జరుగుతున్న నేపధ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతున్నదంటే.. సైన్స్ చెబుతున్న వివరాల ప్రకారం 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు కలిగిన మగ పిల్లవాడు తండ్రి అయ్యేందుకు అర్హుడవుతాడు. 11 ఏళ్లు వచ్చేసరికి మగపిల్లలలో స్మెర్మ్ ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ మగపిల్లవాడు ఏ మహిళను అయినా గర్భవతిని చేయగలుగుతాడు. అయితే ఇది ప్రతిసారీ సాధ్యంకాదు. ఇది ఆ మహిళ బయోలాజికల్ క్లాక్‌పై ఆధారపడివుంటుంది. చాలా సందర్భాలలో 14 ఏళ్ల తరువాతనే మగపిల్లవాడు తండ్రి అయ్యే సామర్థ్యాన్ని సంతరించుకుంటాడు. అమ్మాయిలు ఏ వయసులో తల్లి అవుతారంటే.. విజ్ఞానశాస్త్రపరంగా చూస్తే అమ్మాయిలు 13 ఏళ్ల వయసులో తల్లి అయ్యే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. కొన్ని సందర్భాల్లో 10 నుంచి 12 ఏళ్ల వయసులోనే తల్లిగా మారేందుకు అవకాశం ఉంటుంది. మెడిసిన్ నెట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ మెలిసా మాట్లాడుతూ చాలా సందర్భాలలో తల్లితండ్రులయ్యే సామర్థ్యం మగపిల్లవారికన్నా ముందుగా ఆడపిల్లలకు వస్తుంది. మగపిల్లలు 11 నుంచి 14 ఏళ్ల వయసు మధ్యలో తండ్రి అయ్యేందుకు అవకాశం ఉండగా, అమ్మాయిలు 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో తల్లి అయ్యే సామర్థ్యాన్ని పొందుతారు. అయితే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలంటే ఆడపిల్లలకు కనీసం 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి. చట్ట ప్రకారం కూడా 18 ఏళ్లు దాటడమే తల్లి అయ్యేందుకు తగిన వయసుగా గుర్తించారు. అయితే వివిధ దేశాల్లో ఈ విషయంలో పలు రకాల చట్టాలు అమలులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: ‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. -
9 ఏళ్ల అనాథ అనుకుంటే.. 22 ఏళ్ల యువతి.. సినిమా ట్విస్టులు!
2009లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఆర్ఫన్’ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఒక జంట.. తమ మూడవ సంతానం మృతి చెందిన నేపధ్యంలో రష్యాకు చెందిన ఒక చిన్నారిని దత్తత తీసుకుంటారు. ఈ సినిమాలోని కథనం ప్రకారం ఆ చిన్నారి 9 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టగానే క్రూరంగా ప్రవర్తిస్తూ తన అన్నదమ్ములను, తల్లిదండ్రులను హత్య చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇది ఒక కథ. అయితే అమెరికాకు చెందిన ఒక జంటకు ఇటువంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆమె చిన్నపిల్ల కాదు.. క్రిస్టీన్ బార్నెట్(45) ఆమె మాజీ భర్త మైఖేల్ బార్నెట్(43)లు తాము దత్తత తీసుకున్న 9 ఏళ్ల నటాలియా గ్రేస్‌ను అమెరికాలోని ఇండియానాలో వదిలివేసి, వారు కెనడా పారిపోయారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ దంపతులకు తాము దత్తత తీసుకున్న నటాలియా చిన్నపిల్ల కాదని యువతి అని, చిన్నపిల్లలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నదని బయటపడింది. మరగుజ్జు లోపంతో.. ఉక్రెయిన్‌లో జన్మించిన నటాలియా గ్రేస్‌ను 2010లో వీరు దత్తత తీసుకున్నారు. అప్పుడు నటాలియాకు 6 ఏళ్ల అని అనాథాశ్రమం నిర్వాహకులు తెలిపారు. ఆమె బర్త్ సర్టిఫికెట్ మీద కూడా అదేవిధంగా ఉంది. మరుగుజ్జు లోపంతో బాధపడుతున్న నటాలియా మూడు అడుగుల ఎత్తు మాత్రమే వుంది. ఆమెను కొంతకాలం సంరక్షించిన మైఖేల్, క్రిస్టీన్ దంపతులు తరువాత ఆమెను వదిలిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల రిపోర్టులో నటాలియా నడవలేని స్థితిలో ఉన్నదని దానిలో పేర్కొన్నారు. ‘9 ఏళ్లు కాదు.. 22 ఏళ్లు’ డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్రిస్టీనా మాట్లాడుతూ తాము ఒక మోసగాడు చేసిన వంచనకు బలయ్యామని పేర్కొంది. దత్తత తీసుకున్న చిన్నారిని తాము విడిచిపెట్టే సమయానికి ఆమెకు 9 ఏళ్లు కాదని, 22 ఏళ్ల యువతి అని తెలిసిందన్నారు. తాము ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో నటాలియా కత్తి తీసుకుని వచ్చి తమను బెదిరించేదని, కాఫీలో బ్లీచ్ కలిపేదని తెలిపారు. ఇంటిలోని విలువైన వస్తువులను పగులగొట్టేదని ఆరోపించారు. నటాలియా రాత్రి వేళ్లల్లో ఇలా ప్రవర్తిస్తుండటంతో తాము నిద్ర పోలేకపోయేవారమని క్రిస్టీనా తెలిపింది. తాము తాగే కాఫీలో నటాలియా బ్లీచ్, విండెక్స్ మొదలైనవాటిని కలపడాన్ని చూశామని పేర్కొంది. ఆ సమయంలో తాను ఇలా ఎందుకు చేస్తున్నవని నటాలియాను అడిగితే ‘మిమ్మల్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నానని’ చెప్పిందన్నారు. మీడియా ఆరోపణలపై దంపతుల కలత నటాలియా విషయంలో తాము దుర్మార్గంగా ప్రవరిస్తున్నామని మీడియా ఆరోపిస్తున్నదని, దానిలో నిజం లేదని క్రిస్టీనా తెలిపింది. నటాలియా చిన్న పిల్ల కాదు.. యవతి అని, ఆమెకు పీరియడ్స్ కూడా వస్తుంటాయని, అయితే శారీరకంగా ఎదుగుదల లేకుండా చిన్నపిల్ల మాదిరిగానే కనిపిస్తున్నదని, ఆమె మరుగుజ్జు మనిషి అని క్రిస్టీనా పేర్కొంది. వైద్యులకు నటాలియాను చూపించగా, ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతున్నదని, ఆమెను చిన్న పిల్లగా భావించకూడదని స్పషం చేశారని తెలిపింది. నటాలియాకు అద్దె ఇంటిలో సౌకర్యాలు.. ఈ నేపధ్యంలో తాము నటాలియా విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నామని, తాము కెనడా వెళ్లిపోయే ముందు ఆమె ఉండేందుకు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడాది రెంట్ కూడా ముందే చెల్లించామని తెలిపారు. ఆహారం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆమె ఎదిగిన వయసు కలిగినదనే భావనతో ఆక్కడే ఉంచామన్నారు. అయితే 2013లో నటాలియా ఉన్నట్టుండి మాయమయ్యింది. ఫోను కూడా చేయడం మానివేసిందని క్రిస్టీనా తెలిపారు. తాజాగా నటాలియా తన కొత్త తండ్రితో ఇండియాలోని వాల్‌మార్ట్ పార్కింగ్ లాట్ బయట ఫైర్వర్క్స్ టెంట్లో పని చేస్తూ కనిపించింది. నటాలియా మీడియాకు కనిపించడంతో ఆమె ఉదంతం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఇది కూడా చదవండి: అది అత్యంత పొడవైన రైలు.. ఎన్ని వందల బోగీలు ఉంటాయంటే.. -
రాత్రికి రాత్రే వయసు తగ్గిపోయింది!
రాత్రికి రాత్రే వయసు ఏకంగా ఒకటి నుంచి రెండేళ్లు తగ్గిపోయింది. అదీ ఒకరిద్దరికీ కాదు. ఏకంగా 5 కోట్ల మందికి!. ఇదేం జంబలకిడి పంబ మాయ కాదు. కొత్తగా తీసుకొచ్చిన చట్టం మూలంగా అక్కడి ప్రజల వయసు అలా ఆటోమేటిక్‌గా తగ్గిపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏమా చట్టం? ఎవరా ప్రజలు?.. ఎందుకు మార్చాల్సి వచ్చింది తెలియాలంటే.. దక్షిణ కొరియా.. జనాభా దాదాపు ఐదున్నర కోట్ల దాకా ఉంటుంది. కానీ, వాళ్లను వయసెంత అని అడిగితే మాత్రం మూడు రకాల సమాధానాలు ఇస్తుంటారు. దాని వల్ల ఆ దేశంలో అన్నింటా గందరగోళమే!. అందుకు కారణం.. మూడు విధాలుగా వాళ్ల వయసును లెక్కించడం. ► సౌత్ కొరియాలో ఇప్పటివరకూ.. సంప్రదాయ పద్దతిలో వయసు లెక్కింపు విధానంతో పాటు కేలండర్ ఏజ్, ఇంటర్నేషనల్ ఏజ్ అనే మూడు రకాల పద్ధతులను వాడుతూ వచ్చారు. కొరియన్ సంప్రదాయం ప్రకారం.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే వయసు లెక్కింపు మొదలవుతుంది. అలాగే.. జనవరి 1వ తేదీ నుంచి(కేలండర్ ఏజ్) ప్రకారం ఒక వయసు(అంటే ఒకవేళ బిడ్డ డిసెంబర్ 31వ తేదీన పుట్టినా కూడా.. ఆ మరుసటి రోజు నుంచి ఆ బిడ్డ వయసును రెండేళ్లుగా గుర్తిస్తారు) ఒక వయసు, ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కు తగ్గట్లుగా అంటే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి వయసు లెక్కింపు(డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా).. ఇలా మూడు రకాలుగా ఉంటూ వచ్చింది. ► ఉదాహరణకు ఒక వ్యక్తి 2003 జూన్ 30వ తేదీన పుట్టాడనుకోండి.. ఆ వ్యక్తికి 29 జూన్ 2023 నాటికి ఇంటర్నేషనల్ ఏజ్ బర్త్ ప్రకారం 19 ఏళ్లు, అదే కౌంటింగ్ ఏజ్ విధానంలో 20, కొరియన్ ఏజ్ విధానంలో 21 ఏళ్లు ఉండేది. దీనివల్ల చదువు మొదలు ఉద్యోగాల దాకా అన్నింటా చాలా ఏళ్లుగా గందరగోళం ఏర్పడుతూ వస్తోంది. పైగా ఈ తరహా విధానాల వల్ల ప్రభుత్వాలపై ఆర్థికంగా పెను భారం పడుతూ వచ్చింది ఇంతకాలం. ► దీనికి తెర దించేందుకు.. ఇక నుంచి అంతర్జాతీయ విధానాన్ని.. అంటే అన్ని దేశాల్లో ఎలా అనుసరిస్తారో అలా పుట్టిన తేదీ నుంచి(డేట్ ఆఫ్ బర్త్) విధానాన్ని అనుసరిస్తారు. ఇందుకోసం చేసిన చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. సో.. ఇప్పటి నుంచి పుట్టిన తేదీ ప్రకారమే అక్కడి ప్రజలు జీవనం కొనసాగించనున్నారు. ► దక్షిణ కొరియాకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూన్ సుక్ యోల్ సంస్కరణల వైపుగా అడుగులేయడం మొదలుపెట్టారు. సాంప్రదాయ వయస్సు-గణన పద్ధతులు వల్ల అనవసరమైన సామాజిక, ఆర్థిక వ్యయాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఇక నుంచి కొత్త చట్టం అమలు మూలంగా అన్ని జ్యుడీషియల్, అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో అంతర్జాతీయ వయసు లెక్కింపు విధానాన్నే అను సరిస్తారని, దీనివల్ల సామాజిక గందరగోళాలు, వివాదాలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ► ఈ చట్టాన్ని పోయిన ఏడాది డిసెంబర్ లోనే పార్లమెంట్ ఆమోదించింది. అలాగే పబ్లిక్ ఒపీనియన్లో భాగంగా సర్కారు నిర్ణయానికి ఏకంగా 86.2% దేశ ప్రజలు మద్దతు ప్రకటించారు. మిగతా సర్వేల్లోనూ.. ప్రతీ నలుగురిలో ముగ్గురు డేట్ ఆఫ్ బర్త్ వయసు గణన వైపే మొగ్గు చూపించారు. గతంలో చాలా దేశాలు సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలను పాటించేవి. అందులో తూర్పు ఏషియా దేశాలు ప్రముఖంగా ఉండేవి. అయితే వీటిలో చాలావరకు వాటిని వదిలేసి.. గ్లోబల్ స్టాండర్డ్‌ను పాటిస్తూ వస్తున్నాయి. జపాన్ 1950లో, ఉత్తర కొరియా 1980 దాకా సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలనే పాటిస్తూ ఉండేవి. ఇదీ చదవండి: డైనోసార్లు మనకు కాస్త దగ్గరే! -
Guinness World Records: ఆ పిల్లి వయసు 26
లండన్: ఆ పిల్లి వయసు 26. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న పిల్లి ఇది. ఇప్పడు గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. ఫ్లాజీ అని పిలుచుకునే ఆ ఆడ పిల్లి లండన్‌లో ఉంది. దీని వయసు 26 సంవత్సరాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు నిర్ధారించి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈ పిల్లి వయసు మనుషులు 120 ఏళ్లతో సమానమని గిన్నిస్ అధికారులు చెప్పారు. సాధారణంగా పిల్లులు 12 నుంచి 18 ఏళ్లు మాత్రమే జీవించగలవు. కానీ ఫ్లాజీ 26 ఏళ్లు వచ్చినా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో పిల్లుల్ని సంరక్షించే కేంద్రంలో ఉంచారు. విశేషం ఏమిటంటే ఈ 26 ఏళ్లలో ఫ్లాజీ యజమానులు ముగ్గురు మారారు. 1995 సంవత్సరంలో ఫ్లాజీ పుట్టింది. అప్పుడు ఒక మహిళ ఆమెని పెంచుకుంది. ఫ్లాజీకి పదేళ్లు వచ్చేటప్పటికీ ఆ మహిళ మరణించడంతో ఆమె చెల్లి ఈ పిల్లిని చూసుకుంది. 14 ఏళ్లు ఆమె ఇంట్లో ఉంది. ఆ తర్వాత ఆమె కూడా మరణించింది. ఆమె కుమారుడు మరో రెండేళ్లు చూసుకున్నాడు. ఆ తర్వాత పిల్లుల సంరక్షణ కేంద్రానికి అప్పగించాడు. ప్రస్తుతం అత్యధిక వయసున్న పిల్లుల్ని చూసుకునే విక్కీ గ్రీన్ అనే సంరక్షకుడు ఫ్లాజీ బాగోగులు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆ పిల్లికి చెవులు వినిపించడం లేదట. చూపు మందగించింది. అయినప్పటికీ మనుషుల్ని చూస్తే అభిమానంతో మీదకి వస్తుందని విక్కీ చెప్పుకొచ్చాడు. -
‘మేం ఇంకా బతికే ఉన్నాం.. ఇది చాలదా మేం పండుగ చేసుకోవడానికి?’
అమెరికాలో జాన్సన్ సిస్టర్స్‌గా పేరుగాంచిన ఓ నలుగురు అక్కచెల్లెళ్లు తీవ్ర వృద్ధాప్యంలోనూ ఇటీవల సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు! వారు నెలకొల్పిన రికార్డు కూడా ఆషామాషీదేం కాదు.. ఇప్పట్లో ఎవరూ దాన్ని బద్దలుకొట్టే అవకాశం కూడా లేదు! ఇంతకీ ఆ రికార్డు ఏమిటో తెలుసా? వారు నేటికీ జీవించి ఉండటమే!! అంటే ప్రపంచంలోనే అత్యధిక వయసున్న నలుగురు అక్కచెల్లెళ్లుగా వారు గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించారన్నమాట. ఆ సోదరీమణుల మొత్తం వయసు ఎంతో తెలుసా. ఏకంగా 389 సంవత్సరాలు! అందరిలో పెద్దామె అర్లోయెన్స్ జాన్సన్ ఓవర్స్కీ వయసు 101 ఏళ్లు కాగా, రెండో సోదరి మార్సిన్ జాన్సన్ స్కల్లీకి 99 ఏళ్లు, మూడో సోదరి డోరిస్ జాన్సన్ గాడినీర్కు 96 ఏళ్లు, చివరి సోదరి జెవెల్ జాన్సన్ బెక్కు 93 ఏళ్లు. 2022 ఆగస్టు 1 నాటికి వారంతా 389 ఏళ్ల 197 రోజులు జీవించి ఎక్కువకాలం జీవించిన అక్కచెల్లెళ్లుగా ఘనత సాధించారు. తద్వారా 383 ఏళ్లతో నలుగురు తోబుట్టువుల పేరిట ఈ ఏడాది తొలినాళ్లలో నమోదైన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టారు. రూత్ల్యాండ్లో జన్మించిన ఈ జాన్సన్ సిస్టర్స్... తరువాత యూఎస్‌లోని వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. ఎప్పుడు ఎక్కడ ఉన్నా... ప్రతి వేసవిలో మాత్రం తప్పక కలుసుకుంటారు. అయితే వయసు పైబడటంతో ఈమధ్య ఫోన్లోనే టచ్‌లో ఉంటున్నట్టు తెలిపారు. గిన్నిస్ రికార్డు కోసం ఎందుకు దరఖాస్తు చేయాలనిపించింది? అని అడిగితే... ‘మేం నలుగురం ఇంకా బతికే ఉన్నాం. ఇది చాలదా మేం పండుగ చేసుకోవడానికి?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా! చదవండి: (Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు) -
జ్ఞానవాపి ‘శివలింగం’ వయసు నిర్ధారణకు ఓకే
వారణాసి: వారణాసిలో కాశీ విశ్వనాథ్ ప్రధానాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో లభించిన శివలింగాకృతి శిల వయసు నిర్ధారణకు వారణాసి జిల్లా కోర్టు అనుమతిని ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రధాన కట్టడం వెనకవైపు గోడకు ఉన్న దేవతా విగ్రహాల నిత్య ఆరాధనకు అనుమతించాలంటూ మహిళా భక్తులు వేసిన పిటిషన్‌ను గురువారం వారణాసి జిల్లా కోర్టు విచారించింది. శిల కార్భన్–డేటింగ్ ప్రక్రియకు అనుమతించాలని భక్తుల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు .. జడ్జి విశేష్ను కోరారు. అందుకు అంగీకరిస్తూ జడ్జి ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణ తేదీ 29కల్లా అభ్యంతరాలు ఉంటే తెలపాలని మసీదు మేనేజ్మెంట్కు సూచించారు. కేసులో భాగస్వామ్య పక్షాలుగా చేరుతామంటూ 15 మంది కోర్టు ముందుకొచ్చారు. -
వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా!
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తండ్రి 1981లో పుడితే అతని కుమారుడు 1988లో పుట్టాడు. వినడానికి వింతగా ఉంది కదూ! కారుణ్య నియామకాల్లో ఓ తపాలా అధికారి చూపిన వింత లీల ఇది. ఈ లీల కర్నూలు జిల్లాలో జరిగింది. ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలోని దైవందిన్నె గ్రామ వాసి శంకరన్న నకిలీ స్కూల్ సర్టిఫికెట్తో 2005లో కారుణ్య నియామకం ద్వారా తపాలా శాఖలో గ్రామ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగం పొందాడు. ఆ సమయంలో ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఐపీవో)గా పనిచేసిన కె.హరికృష్ణ ప్రసాద్ ఆ నియామకం చేశారు. అయితే 2019లో శంకరన్న కన్నుమూశాడు. ఇదే సమయంలో హరికృష్ణ ప్రసాద్ డివిజన్ హెడ్ (పోస్టల్ సూపరింటెండెంట్) హోదాలో ఉన్నారు. ఈ సమయంలో శంకరన్న కుమారుడు వీరేంద్రకు కూడా కారుణ్య నియామకం ద్వారా తండ్రి ఉద్యోగాన్ని హరికృష్ణ ప్రసాద్ కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించగా.. శంకరన్న ఇచ్చిన స్కూల్ సర్టిఫికెట్లో 1981లో పుట్టినట్లుగా ఉంది. కానీ అతని ఆధార్ కార్డులో 1958లో పుట్టినట్లుగా ఉంది. ఇక వీరేంద్ర 1988లో పుట్టినట్లుగా అతని స్కూల్ సర్టిఫికెట్లు స్పష్టం చేస్తున్నాయి. సర్టిఫికెట్లలో తండ్రీ కొడుకులకు మధ్య ఏడేళ్లు మాత్రమే తేడా ఉండటంతో ఆశ్చర్యపోవడం ఉన్నతాధికారుల వంతైంది. శంకరన్నకు సర్వీసులో ప్రయోజనం చేకూర్చడం కోసం హరికృష్ణ ప్రసాద్ తప్పు చేసినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనకు అత్యున్నత నేర అభియోగం (రూల్–14) అయిన చార్జిషీట్‌ను జారీ చేశారు. దీనిపై హరికృష్ణ ప్రసాద్‌ను వివరణ కోరగా.. తప్పులు జరుగుతాయని, దీనిని ప్రచారం చేయవద్దని అన్నారు. చదవండి: చెత్త సేకరణపై నిఘా.. సిటిజన్ యాప్‌ను రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ -
Vedant Deoakte: అమెరికాలో రూ.33 లక్షల ఉద్యోగం కోల్పోయిన బాలుడు
ముంబై: కోడింగ్ కాంపిటీషన్లో 1,000 మందితో పోటీపడి నెగ్గిన విజేతకు అమెరికా కంపెనీ మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఏడాదికి రూ.33 లక్షల వేతనం ఇస్తామని తెలిపింది. అతడి వయసు గురించి తెలిశాక ఉద్యోగం ఇవ్వలేమని సమాచారం పంపింది. విజేత వయసు కేవలం 15 ఏళ్లు కావడమే ఇందుకు కారణం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన వేదాంత్ దేవ్కాటే వయసు 15 సంవత్సరాలు. పదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్‌టాప్ సాయంతో స్వయంగా కోడింగ్ నేర్చుకున్నాడు. అందులో మంచి పట్టు సంపాదించాడు. అమెరికాలోని న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ నిర్వహించిన కోడింగ్ పోటీలో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో 2,066 లైన్ల కోడ్ రాశాడు. సునాయాసంగ విజయం సాధించాడు. వేదాంత్ ప్రతిభను గుర్తించిన న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ తమ మానవ వనరుల విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రూ.33 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తామని తెలిపింది. వ్యక్తిగత వివరాలు పంపాలని కోరింది. వేదాంత్ ఆ వివరాలు పంపించాడు. అతడి వయసు 15 ఏళ్లేనని తెలుసుకున్న న్యూజెర్సీ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేమని పేర్కొంది. తమ కంపెనీ నిబంధనల ప్రకారం చిన్న వయసు వారిని చేర్చుకోవడం సాధ్యపడదని నిస్సహాయత వ్యక్తం చేసింది. నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తమను సంప్రదించాలని వేదాంత్‌కు సూచించింది. -
వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!
రామాయణ కాలం నుంచీ వధూవరులు సమానమైన వయస్సు, నడవడి, శీలము, ఉత్తమ గుణాలు కలిగిన వారై ఉండాలని సీతారాముల అన్యోన్యార్హతను వివరిస్తూ వాల్మీకి రచించిన ‘తుల్యశీల వయో వృత్తాం...’ అనే శ్లోకం వల్ల తెలుస్తోంది. ఆ మాటకొస్తే సీత... రాముడి కంటే పెద్దదని జనశ్రుతి. కానీ ధర్మశాస్త్రాలలో వరుడు వధువు కంటే పెద్దవాడయి వుండాలనీ, వరహీనమైతే పురుషుడికి ఆయుఃక్షీణమనీ చెప్పారు. ఈ నియమం మన వివాహ వ్యవస్థలో అన్ని కులాలలోనూ పాటింపబడుతోంది. పెళ్లికూతురు కంటే పెళ్లికొడుకు కనీసం అయిదేళ్లయినా పెద్దగా ఉండాలనే ఆచారాన్ని నిన్నటి పురుషా ధిక్య సమాజం స్వార్థంతో దుర్వినియోగం చేసింది. ‘అష్ట వర్షాత్ భవేత్ కన్యా’ అని కన్యా లక్షణానికి హద్దుల్ని నిర్ణయించి ఆడపిల్లలకు ఎనిమిదేళ్ల లోపే పెళ్లి చేస్తే పుణ్యం వస్తుందని భావించారు. అలాంటి మూఢ విశ్వాసంతో శారదా చట్టం (1929లో బాలికల వివాహ వయస్సు 14 సంవత్సరాలు) అమలులో ఉన్న కాలంలో కూడా ఆ చట్టం వర్తించని ప్రదేశాలకు తీసుకెళ్లి బాలికలకు వివాహాలు చేశారు. ఇదే అదనుగా ముసలివాళ్లు కూడా కన్యాశుల్కాన్ని చెల్లించి ముక్కు పచ్చలారని పసిపిల్లలకు మూడుముళ్లు వేసి వాళ్ల భవిష్యత్తులను అంధకారమయం చేశారు. అలాంటి అభాగినులకు బాసటగా గురజాడ, కందుకూరి మొదలైన కవులూ, సంస్కర్తలూ నిలిచి బాల్య వివాహాలను రూపుమాపడానికీ, వితంతు వివాహాలను ప్రోత్సహించడానికీ కృషి చేశారు. బాల్య వివాహాల దురాచార దశ దాటిన తర్వాత కూడా ఆడపిల్లల అగచాట్లు అంతం కాలేదు. 1978లో ప్రభుత్వం అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయస్సులుగా నిర్ణయించినా అమ్మాయిలు మైనర్లుగా ఉండగానే వాళ్ల ఇష్టా నిష్టాలతో సంబంధం లేకుండానే చాలామంది తల్లి దండ్రులు వాళ్లకు మూడుముళ్లు వేయించి బాధ్యత తీరిపోయిందనుకునేవారు. వయోభేదం కంటే జాత కాలకు ప్రాధాన్యాన్నిచ్చి పెళ్లికూతురు కంటే రెట్టింపు వయసున్న పెళ్లికొడుకులకు కూడా కట్టబెట్టేవాళ్లు. ‘కన్యాశుల్కం’ నాటకంలో అగ్నిహోత్రా వధాన్లు చెప్పినట్టు పెళ్లి కోసం యిచ్చే ఆ జాతకాల్లో కూడా నిజాలు ఉండేవి కావు. ఆస్తులు బయటకు పోకుండా ఉండాలని బలవంతంగా కట్టబెట్టిన మేనరికాలు... అక్క చనిపోతే వయసుతో తేడాను లెక్క చేయకుండా పిల్లల తండ్రి అయిన బావకు ముడిపెట్టిన రెండో పెళ్లిళ్లు... రెండో పెళ్లి వాడయినా మూడో పెళ్లి వాడయినా సంపన్నుడయిన అల్లుడు ముందుకొస్తున్నాడని అతని కూతురు వయసు కూడా లేని పడుచు పిల్లను కన్యాదానం చేసే పేద తల్లిదండ్రుల దీనావస్థకు చెందిన పెళ్లిళ్లు– ఇలా అనేక సందర్భాలలో గత్యం తరం లేక కన్నె పిల్లలు బలి పశువులయ్యేవారు! పైన పేర్కొన్న అన్ని రకాల పెళ్లిళ్లలోనూ వయస్సులో పెద్దవాళ్లయిన ‘మొగుళ్ల’ను కట్టుకుని ముద్దు ముచ్చట లేకుండా ‘అరిటాకు – ముల్లు’ సామెతగా జీవితంలో వసంతం లాంటి యవ్వనానికి దూరమైంది ఆడ పిల్లలే! కాలం మారింది. కన్యాశుల్కమే కాదు, వరకట్నం కూడా తగ్గుముఖం పట్టింది. ఆడపిల్లలు చదువుకొని మగవాళ్లతో సమంగా ఉద్యోగాలు చేస్తున్న వర్తమాన సమాజంలో సంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు కూడా గణనీయంగానే జరుగుతున్నాయి. ‘జగత్తులో నేడు సగం దగాపడుట మానుకొంది’ అని దాశరథి గారన్నట్టు జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్ల అభిప్రాయం తెలుసుకోవలసిన అవసరమేమిటి అనే రోజులు పోయాయి. వివాహానంతరం కూడా భర్తతో సరిపడకపోతే నవ వధువు రాజీ ధోరణి విడిచి, విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తోంది. ఈలోగా అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి కూడా వెనకాడటం లేదు. డేటింగులూ, సహజీవనాలూ కూడా మన వివాహ వ్యవస్థలో చొరబడిన ఈ కాలంలో ప్రేమ వివాహాలకు సంబంధించినంతవరకూ అమ్మాయి అబ్బాయి పుట్టిన తేదీ తెలుసుకుని ప్రేమించడం లేదు. పెద్దలు ఏర్పాటు చేస్తున్న పెళ్లిళ్లలో కూడా పెళ్లి కూతురు తన కంటే ఒకటి రెండేళ్లు మాత్రమే పెద్ద వాడయిన వరుణ్ణి కోరుకుంటోంది. పెద్దలు అంగీకరిస్తే అన్ని విధాలా అనుకూలమైన సంబంధమైతే పెళ్లికొడుకు ఒకటి రెండేళ్లు చిన్నయినా చేసుకోవడానికి సిద్ధమంటోంది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే కొన్ని సందర్భాలలో జంట మధ్య స్వల్పమైన వయోభేదం వల్ల వచ్చే నష్టమేమీ లేదనిపిస్తోంది. ఆడపిల్ల అబ్బాయి కంటే శారీరకంగానూ, మానసికంగానూ త్వరగా ఎదుగుతుంది. ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు, పరిణతి ఆడపిల్లకు తక్కువ వయస్సులోనే అలవడ తాయి గనుక పెళ్లికొడుకు కంటే పెళ్లికూతురు చిన్నదిగా ఉండాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచి ఉండొచ్చు. వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనే ఆలోచనలకు కాలం చెల్లి, దాంపత్య జీవితంలో అపస్వరాలు వినిపించకుండా వివాహానికి ముందే అన్ని నిజాలూ చెప్పడం మంచిదనే అభిప్రాయాలు నేడు ఇరుపక్షాల్లోనూ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయసును మగవారితో సమంగా 21 ఏళ్లకు పెంచుతూ సవరణ బిల్లును తీసుకురావడం హర్షదాయకం. ప్రభుత్వం ఆదేశంతో పెద్దలు కూడా మారి వైవాహిక జీవితానికి ఈడూ జోడూ ముఖ్యమనే ఆడపిల్లల అభిప్రాయంతో ఏకీభవించి, వారిని ఆశీర్వ దిస్తారని ఆశిద్దాం. – పి. మానసారెడ్డి సామాజిక విశ్లేషకులు, దుబాయ్ (కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచేలా బిల్లు తెచ్చిన సందర్భంగా) -
ఆమె ఒక్కరే!
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చారిత్రక బిల్లును లోతుగా పరిశీలించే స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం)లో ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉన్నారనే విషయం తాజాగా వెలుగులో వచ్చింది. విప్లవాత్మకమైన, మహిళల జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకాంశంపై చర్చ జరిగే సమయంలో అతివలకు ఇంత తక్కువ భాగస్వామ్య ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై... ఉన్న శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (రాజ్యసభ) సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ. బీజేపీ సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు (వైఎస్సార్సీసీ) ఒక్కరికే దీంట్లో ప్రాతినిధ్యం ఉంది. అమ్మాయిల కనీసం వివాహ వయసు పెంపుపై సమతా పార్టీ మాజీ ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం–2006కు మార్పులు తలపెట్టింది. యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్ల పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ (సవరణ) చట్టం–2021 బిల్లును కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబరు 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. హడావుడిగా బిల్లు తెచ్చారని, లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో ప్రభుత్వం దీనిని స్టాండింగ్ కమిటీకి పంపింది. కమిటీలోని 31 సభ్యుల్లో మీరొక్కరే మహిళ అనే విషయాన్ని సుస్మితా దేవ్ దృష్టికి తీసుకెళ్లగా ‘ఈ బిల్లును పరిశీలించేటపుడు మరింత మంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేది. అయితే ఇదివరకే చెప్పినట్లు భాగస్వామ్యపక్షాల అందరి వాదనలూ వింటాం’ అని ఆమె ఆదివారం స్పందించారు. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే... అమ్మాయి కనీస వివాహ వయసు విషయంలో ఏ మతానికి చెందిన ‘పర్సనల్ లా’ కూడా వర్తించదు. కనీస వివాహ వయసు 21 ఏళ్లు అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తుంది. ఏకరూపత వస్తుంది. మతపరమైన ‘పర్సనల్ లా’ల్లో ఏం నిర్దేశించినా అది ఇక చెల్లుబాటు కాదు. ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ద ఫారిన్ మ్యారేజ్ యాక్ట్‌లకు... బాల్య వివాహ నిషేధ (సవరణ)–2021 సవరణలు చేస్తుంది. ఏకరూపత ఉండేలా కనీస వివాహ వయసును 21 ఏళ్లుగా నిర్దేశిస్తుంది. స్టాండింగ్ కమిటీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగా నియమించలేదు నిజానికి ఈ స్టాండింగ్ కమిటీ బిల్లును పరిశీలించేందుకు ప్రత్యేకంగా నియమించిన కమిటీ కాదు. పార్లమెంటులో మొత్తం 24 శాఖాపరమైన కమిటీలు ఉన్నాయి. ఇవి శాశ్వత కమిటీలు. వీటిల్లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలిద్దరూ సభ్యులుగా ఉంటారు. ఆయా పార్టీలు తమకు పార్లమెంటులో ఉన్న బలానికి అనుగుణంగా స్టాండింగ్ కమిటీలకు సభ్యుల పేర్లను సిఫారసు చేస్తాయి. కొన్నింటిని లోక్‌సభ, మరికొన్నింటిని రాజ్యసభ పర్యవేక్షిస్తుంది. సెలక్ట్ కమిటీ, జాయింట్ (సంయుక్త) కమిటీలను ఏదైనా అంశంపై చర్చించాల్సిన వచ్చినపుడు ప్రత్యేకంగా దాని కోసమే ఏర్పాటు చేస్తారు. మహిళల వివాహ వయసును పెంచే బిల్లును పరిశీలించనున్న కమిటీలో 2021 సెప్టెంబరులో రెండు విడతలుగా సభ్యులను నియమించారు. 10 లోక్‌సభ ఎంపీలు, 21 మంది రాజ్యసభ ఎంపీలు దీనిలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో నియామకాలు జరిగిన తర్వాత మహిళలకు సంబంధించిన ఈ కీలక బిల్లును డిసెంబరు 21 లోక్‌సభ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయడం గమనార్హం. సమంజసం కాదు ప్రతిపాదిత బిల్లును పరిశీలించే స్టాండింగ్ కమిటీలో 50 శాతం మంది మహిళలు లేకపోతే అది సమంజసం అనిపించుకోదు. నిబంధనలు అనుమతిస్తే.. ఈ ప్యానెల్‌లోని తమ పురుష ఎంపీలను మార్చి వారి స్థానంలో మహిళా ఎంపీలను నామినేట్ చేయాలని నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలా కుదరని పక్షంలో ఈ కీలకమైన బిల్లుపై చర్చించేటపుడు తమ పార్టీలోని మహిళా ఎంపీలను సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా. – జయా జైట్లీ మరింత మంది ఉండాలి నారీమణులకు సంబంధించిన అంశాలపై చర్చించే ఈ స్టాండింగ్ కమిటీలో మరింత మంది మహిళా ఎంపీలకు ప్రాతినిధ్యం ఉండాలి. సభ్యులు కాని వారినీ చర్చకు పిలిచే అధికారం కమిటీ ఛైర్మన్‌కు ఉంటుంది. భాగస్వామ్యపక్షాలందరినీ కలుపుకొని పోతూ, విస్తృత చర్చ జరగాలంటే ఛైర్మన్ మహిళా ఎంపీలను ఆహ్వానించవచ్చు. ఈ కీలక చర్చలో మహిళా ఎంపీల భాగస్వామ్యం మరింత ఉండాలని కోరుకుంటున్నాను. – సుప్రియా సూలే, లోక్‌సభ ఎంపీ -
వివాహ కనీస వయసు.. పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కూడా!
అమ్మాయిల కనీస పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచాలనే నిర్ణయాన్ని భాగస్వామ్యులైన నేటి యువతరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. అయితే దేశంలోని పేదరికం, విద్య, వైద్య సదుపాయాలు... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మనస్తత్వం, వైవాహిక వ్యవస్థపై బలంగా నాటుకుపోయిన భావాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలనేది నిపుణుల భావన. పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలనేది వారి సూచన. ఈ నేపథ్యంలో అనుకూల, ప్రతికూల వాదనలేమిటనేది ప్రస్తావనార్హం. అనుకూల వాదన ► అమ్మాయిలకు చదువులు కొనసాగించే వీలు కలుగుతుంది. నైపుణ్యాభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. దాంతో సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వారో హోదాను పొందుతారు. మహిళా సాధికారికతకు దోహదపడుతుంది. ► ప్రపంచం, చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన విస్తృతం అవుతుంది. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. స్థిరమైన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోగలుగుతారు. తమ గొంతుకను బలంగా వినిపించగలరు. ► లేబర్ ఫోర్స్‌లో (ఉద్యోగాల్లో) మహిళల సంఖ్య పెరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ 2019 అంచనాల ప్రకారం భారత లేబర్ ఫోర్స్‌లో మహిళలు 20.3 శాతం మాత్రమే. పొరుగునున్న బంగ్లాదేశ్‌లో ఇది 30.5 శాతం. శ్రీలంకలో 33.7 %. 2020లో ప్రపంచ సగటు 46.9 % ► పోషకాహార స్థాయి పెరుగుతుంది. ► గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యల కారణంగా (గర్భస్రావం, ప్రసవ సమయంలో) సంభవించే మరణాలు తగ్గుతాయి. 21 ఏళ్లు దాటితే శారీరక ఎదుగుదల బాగుంటుంది కాబట్టి అమ్మాయిలు బిడ్డను కనేందుకు అనువైన వయసు అవుతుంది. ప్రతి లక్ష మందితో గర్భధారణ, ప్రసవ సమయంలో ఎంత మంది మరణిస్తున్నారనే దాన్ని ‘మాటర్నల్ మొర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్)గా పిలుస్తారు. 2014–16 మధ్య ఎంఎంఆర్ భారత్‌లో 130 ఉండగా, 2016–18 మధ్య ఇది 113 చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంఎంఆర్‌ను 70గా నిర్దేశించారు. ప్రతికూల వాదన ► అమ్మాయి పెళ్లి ఎప్పుడనేది భారత సమాజంలో తల్లిదండ్రులకు నిత్యం ఎదురయ్యే ప్రశ్న. వారిపై బయటికి కనిపించని సామాజిక ఒత్తిడి. కనీస వయసును 21 ఏళ్లకు పెంచినా గ్రామీణ భారతంలో ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ► కనీస వయసు 21 ఏళ్లకు పెంచకముందే... భారత్‌లో 2019 నాటికే అమ్మాయిల సగటు పెళ్లి వయసు 22.1 ఏళ్లుగా ఉందని భారత గణాంక, పథకాల అమలు శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో, పేదల్లో బాల్యవివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ► ప్రస్తుతం పీసీఎంఏ– 2006లో బాల్యవివాహం చేసిన వారికి, సహకరించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఫిర్యాదు వస్తేనే కేసులు నమోదవుతున్నాయి. సామాజికంగా ఆమోదయోగ్యం కాబట్టి ఎవరికీ అభ్యంతరం లేకపోతే చెల్లుబాటు అవుతున్నాయి. తేబోయే చట్ట సవరణలో 21 ఏళ్ల కింది వయసులో పెళ్లిళ్లను నిషేధిస్తేనే ఫలితం ఉంటుంది. ► అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. పరువు, కులం పేరిట తల్లిదండ్రులు యువజంటలకు వ్యతిరేకంగా దీన్నో ఆయుధంగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో... అధికభాగం 18 ఏళ్లు నిండకుండానే నచ్చిన వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయిల తల్లిదండ్రులు పెడుతున్నవే ఉన్నాయి. ప్రపంచంలోని భిన్న ఖండాల్లోని వివిధ దేశాల్లో అమ్మాయిలు, అబ్బాయిల కనీస వివాహ వయసు ఇలా ఉంది. అమెరికాలో మూడు నాలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నా మెజారిటీ రాష్ట్రాల్లో 18 ఏళ్లుగానే ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
బ్యాంక్ చీఫ్‌ల పదవీ కాలం 15 ఏళ్లు
ముంబై: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్ టైం డైరెక్టర్ల (డబ్ల్యూ్టటీడీ) పదవీకాలాన్ని 15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలను జారీ చేసింది. బోర్డ్ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి. బ్యాంక్‌లలో కార్పొరేట్ గవర్నెన్స్‌పై మాస్టర్ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్యూటీడీలను పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డ్ ఆమోదిస్తే గనక.. కనీసం మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత.. కొన్ని షరతులకు లోబడి నియమించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బ్యాంక్‌తో లేదా అనుబంధ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. అదేవిధంగా సీఈఓ, ఎండీ, డబ్ల్యూటీడీలు 70 ఏళ్ల వయస్సుకు మించి ఆయా పదవుల్లో కొనసాగలేరని.. అంతకంటే తక్కువ వయసు లోపే పదవీ విరమణను బోర్డ్‌లు సూచించవచ్చని పేర్కొంది. చైర్మెన్, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఎన్ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. ఎన్‌ఈడీల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంక్ బోర్డ్‌లో ఎనిమిది సంవత్సరాలకు మించి ఉండకూడదు. వీరి పునర్నియామకానికి కూడా మూడేళ్ల వ్యత్యాసం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్‌ఈడీల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదని ఆదేశించింది. -
సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే!
సాక్షి, హైదరాబాద్: 90వ దశాబ్ధం వరకు సొంతిల్లు కొనాలంటే పొదుపు చేసిన సొమ్ముతోనే లేక పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. 45–55 ఏళ్ల వయసు గల వాళ్లే గృహ కొనుగోలుదారులుగా ఉండేవాళ్లు. బ్యాంక్ రుణాలపై అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. 20వ దశాబ్ధం నుంచి గృహ కొనుగోలుదారుల వయసు 35–45 ఏళ్లకు తగ్గిపోయింది. గృహ రుణాలు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. యువ ఉద్యోగులు కూడా దాచుకున్న డబ్బుతో కాకుండా రుణంతో కొనాలని భావిస్తున్నారు. బ్యాంక్‌లు కూడా తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్నాయి. చదవండి: బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ కొత్త ఎడిషన్ కార్లు : వారికి మాత్రమే బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్ -
స్వచ్ఛందంగా వెల్లడిస్తే సరి...
ముంబై: తప్పుడు వయస్సు ధ్రువీకరణ చూపించి అదనపు ప్రయోజనం పొందేందుకు వర్ధమాన క్రికెటర్లు ప్రయత్నించటం చాలా కాలంగా కొనసాగుతున్నదే. క్రికెట్లో కూడా వేర్వేరు వయో విభాగాల్లోని టోర్నీల్లో ఇది ఎన్నో సార్లు బయటపడినా స్వల్ప హెచ్చరికలతో చాలా మంది బయటపడిపోయేవారు. అయితే ఇప్పుడు దీనికి చెక్ పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. వీరి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందుకే ముందస్తు హెచ్చరిక జారీ చేస్తూనే అవసరమైతే నిషేధం విధించేందుకు ఉపక్రమిస్తోంది, బోర్డు వద్ద రిజిస్టర్ అయిన క్రికెటర్లలో ఎవరైనా తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఉంటే వారంతా స్వచ్ఛందంగా వెల్లడించాలని ఆదేశించింది. ఆ తర్వాత తమ విచారణలో గనక తప్పుడు పని చేసినట్లు తేలితే రెండేళ్ల నిషేధం విధిస్తామని ప్రకటించింది. 2021–22 సీజన్లో వివిధ వయో విభాగాల టోర్నీల్లో పాల్గొనబోతున్న ఆటగాళ్లకు ఇది వర్తిస్తుందని బీసీసీఐ పేర్కొంది. స్వచ్ఛందంగా బయటపడినవారిపై ఎలాంటి చర్య ఉండదని, అసలు పుట్టిన తేదీ ప్రకారం వారు ఏ విభాగానికి అర్హులవుతారో అందులో ఆడేందుకు అవకాశం కూడా ఇస్తామని బోర్డు స్పష్టం చేసింది. సెప్టెంబరు 15లోగా క్రికెటర్లు పూర్తి వివరాలతో తమ లేఖలు పంపాలని బోర్డు చెప్పింది. ఒక వయో విభాగంలో సమాన వయస్కులు ఉంటేనే సరైన పోటీ ఉంటుందని, అటువంటి వాతావరణం కల్పించేందుకు ఈ చర్యకు సిద్ధమయ్యామని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పగా... క్రీడా స్ఫూర్తిని దెబ్బ తీస్తున్న ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటున్న బోర్డుకు వర్ధమాన ఆటగాళ్లు సహకరించాలని మాజీ కెప్టెన్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కోరారు. మరోవైపు రంజీల్లో సొంత రాష్ట్రంనుంచి కాకుండా ఇతర రాష్ట్రం (మెరుగైన జట్టు) తరఫున ఆడే అవకాశం కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు. వారు తప్పు చేసినట్లు రుజువైతే కనీసం రెండేళ్ల నిషేధం వెంటనే అమలవుతుంది. -
సీఈవోకు 70 ఏళ్లు..!
ముంబై: బ్యాంకింగ్ రంగంలో గవర్నెన్స్‌ను మెరుగుపర్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం బ్యాంకుల సీఈవోలు, హోల్‌టైమ్ డైరెక్టర్లకు గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లుగా ఉండనుంది. అలాగే ప్రమోటర్ కుటుంబానికి చెందిన వారికి గరిష్టంగా 10 ఏళ్ల పదవీకాలం ఉంటుంది. ఆ తర్వాత నిర్వహణ సారథ్య బాధ్యతలను ప్రొఫెషనల్స్‌కు ప్రమోటర్ గ్రూప్ అప్పగించాలి. ‘బ్యాంకుల సీఈవో/హోల్‌టైమ్ డైరెక్టర్ల గరిష్ట వయో పరిమితి 70 ఏళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత ఆ పోస్టులో కొనసాగడానికి వీల్లేదు. అంతర్గత విధానం కింద కావాలంటే అంతకన్నా తక్కువ వయోపరిమితి కూడా నిర్దేశించుకోవచ్చు. ఇక సీఈవో లేదా హోల్‌టైమ్ డైరెక్టరుగా ఉన్న ప్రమోటరు లేదా ప్రధాన షేర్‌హోల్డరుకు కార్యకలాపాలను చక్కబెట్టేందుకు, నిర్వహణ బాధ్యతలను ప్రొఫెషనల్స్‌కు అప్పగించేందుకు 10 ఏళ్ల కాలం సరిపోతుంది. దీనివల్ల యాజమాన్యం, నిర్వహణ ను విడదీయడం, ప్రొఫెషనల్ నిర్వహణ సంస్కృతిని పెంపొందించడం సాధ్యపడుతుంది’ అని ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు చర్చాపత్రాన్ని విడుద ల చేసింది. దీనిపై జూలై 15లోగా సంబంధిత వర్గా లు ఆర్బీఐకి అభిప్రాయాలు తెలియజేయాలి. మూడేళ్ల విరామం తర్వాత మరో దఫా.. ఇక ప్రమోటరు లేదా ప్రధాన షేర్‌హోల్డరు కాకుండా మేనేజ్మెంట్లో భాగమైనవారు సీఈవో లేదా హోల్‌టైమ్ డైరెక్టరుగా (డబ్ల్యూటీడీ) వరుసగా 15 ఏళ్ల పాటు కొనసాగవచ్చని వివరించింది. అటుపైన మూడేళ్లు గడిచిన తర్వాత మాత్రమే మళ్లీ సీఈవో, డబ్ల్యూటీడీ హోదాల్లో పునర్నియామకానికి వారికి అర్హత లభిస్తుందని తెలిపింది. అయితే ఈ వ్యవధిలో వారు ఏ హోదాలోను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, సలహాదారు గా గానీ సదరు బ్యాంకుకు సేవలు అందించకూడ దు. తాజా ప్రతిపాదనలు నోటిఫై చేసేటప్పటికే ప దవీకాలం ముగిసిపోయి ఉంటే వారికి అదనంగా మరో రెండేళ్ల వ్యవధినివ్వాలని లేదా ప్రస్తుత పదవీకాలం తీరిపోయే దాకా (ఏది తర్వాతైతే అది) కొనసాగించవచ్చని తదుపరి ఆర్బీఐ తెలిపింది. బ్యాంకుల్లో ప్రమాణాలను మెరుగుపర్చాల్సిందే... దేశీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం, సంక్లిష్టత పెరిగిపోతుండటమనేది బ్యాంకుల్లో గవర్నెన్స్ ప్రమాణాలను పటిష్టపర్చుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని ఆర్బీఐ చర్చాపత్రంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అమల్లోకి తేవాలనే ఉద్దేశంతో ఈ చర్యలు ప్రతిపాదించింది. -
సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్‌గా చేపట్టే వ్యక్తే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్ పర్సన్‌గానూ కొనసాగుతారు. -
ఆఫ్రిది... నిజం చెప్పేశాడు!
న్యూఢిల్లీ: అనుమానాలున్నా.... ఇన్నాళ్లూ ఎవరికీ అంతు చిక్కనిదిగా మిగిలిన పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అసలు వయసు ఎంతో ఇప్పుడు బయటపడింది. అది కూడా స్వయంగా అతడి రాతల్లోనే తేలిపోయింది. ఆఫ్రిది ఆత్మకథ ‘గేమ్ చేంజర్’ ఇటీవల భారత్, పాకిస్తాన్లలో విడుదలైంది. అందులో 1996లో శ్రీలంకపై 37 బంతుల్లోనే చేసిన సెంచరీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, తాను 1975లో పుట్టినట్లు పేర్కొన్నాడు. ఇందులో తేదీని మాత్రం ప్రస్తావించలేదు. వాస్తవానికి క్రికెట్లో కొనసాగినన్నాళ్లు ఆఫ్రిది పుట్టింది 1980 మార్చి 1న అని రికార్డుల్లో ఉండేది. కానీ, అతడి ఆకారం చూసి వయసు ఇంకా ఎక్కువే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. తాజాగా ఆత్మకథ ప్రకారం ఆఫ్రిది ఐదేళ్ల వయసు దాచినట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్ తరఫున అతడు 2015లో చివరి వన్డే, 2018లో చివరి టి20 ఆడాడు. ఆత్మకథ లెక్కల ప్రకారం... ప్రస్తుతం 45వ పడిలో ఉన్న ఆఫ్రిది... 40 ఏళ్ల వయసు దాటాక కూడా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగినట్లు స్పష్టమవుతోంది. -
‘ఒంటరి మహిళల భృతి’పై కొలిక్కిరాని కసరత్తు
వయోపరిమితి నిర్ధారణపై సర్కారు తర్జన భర్జన సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకం మార్గదర్శకాలపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక భృతిని అందిస్తామని సర్కారు గత శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలులోకి రావాల్సి ఉన్నందున లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గత పక్షం రోజులుగా కసరత్తు చేస్తోంది. వివాహం చేసుకోని మహిళలు, వివాహమైనప్పటికీ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నవారు, విడాకు లు తీసుకున్న మహిళలు, జోగినులను ఒంటరి మహిళలుగా పరిగణించాలని అధికా రులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయా కేటగిరీల మహిళలకు కనీస వయసును 35గా నిర్ణయిస్తే మేలని ప్రభుత్వానికి సూచించారు. అయితే.. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో మరో రెండు కేటగిరీల మహిళలను ఒంటరి మహిళలుగా పరిగణించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. అత్యాచారం, యాసిడ్‌దాడులకు గురైన మహిళలను కూడా దీనికింద పరిగణించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. తదుపరి సమావేశంలో తుది నిర్ణయం సెర్ప్ ప్రతిపాదించిన విధంగా కనీస వయ సు 35గా నిర్ణయిస్తే, అంతకన్నా తక్కువ వయసున్న మహిళల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కనీస వయో పరిమితిని 21, 30, 35 ఏళ్లుగా నిర్ణయిస్తే, ఎంతమందికి లబ్ధి చేకూర్చవచ్చనే విషయమై అంచనాలు సిద్ధం చేయాలని సెర్ప్ అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. ప్రతిపాదనలలో మార్పులు చేసి, తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని సెర్ప్ అధికా రులు భావిస్తున్నారు.