వారణాసి: వారణాసిలో కాశీ విశ్వనాథ్ ప్రధానాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో లభించిన శివలింగాకృతి శిల వయసు నిర్ధారణకు వారణాసి జిల్లా కోర్టు అనుమతిని ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రధాన కట్టడం వెనకవైపు గోడకు ఉన్న దేవతా విగ్రహాల నిత్య ఆరాధనకు అనుమతించాలంటూ మహిళా భక్తులు వేసిన పిటిషన్‌ను గురువారం వారణాసి జిల్లా కోర్టు విచారించింది.
శిల కార్భన్–డేటింగ్ ప్రక్రియకు అనుమతించాలని భక్తుల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు .. జడ్జి విశేష్‌ను కోరారు. అందుకు అంగీకరిస్తూ జడ్జి ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణ తేదీ 29కల్లా అభ్యంతరాలు ఉంటే తెలపాలని మసీదు మేనేజ్‌మెంట్‌కు సూచించారు. కేసులో భాగస్వామ్య పక్షాలుగా చేరుతామంటూ 15 మంది కోర్టు ముందుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment