
PC: X
న్యూఢిల్లీ: క్రీడా పోటీల్లో తరచూ వివాదాస్పదమవుతున్న తప్పుడు వయో ధ్రువీకరణ అంశంపై నిర్దిష్టమైన పాలసీని రూపొందిస్తున్న కేంద్ర క్రీడా శాఖ ఇందులో సాధారణ ప్రజల్ని భాగం చేయాలని నిర్ణయించింది.
క్రీడల్లో నకిలీ వయో ధ్రువీకరణ నిరోధక జాతీయ పాలసీ (ఎన్‌సీఏఏఎఫ్‌ఎస్) ముసాయిదా బిల్లును రూపొందించిన క్రీడా శాఖ తుది సవరణలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెలాఖరు (31) వరకు సాధారణ ప్రజానీకం అభిప్రాయాలు, ఫిర్యాదులను సేకరించనుంది.
‘నూతన క్రీడల్లో వయో ధ్రువీకరణ పాలసీపై క్రీడలు–యువజన సర్వీసుల శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సలహాలు సంప్రదింపులు జరుపుతుంది. ప్రజలు కూడా భాగం కావొచ్చు. ఆయా వయో విభాగాల క్రీడల్లో నిజమైన వయస్సు కలిగిన క్రీడాకారులకు నష్టం కలుగకుండా చూడటమే ఈ బిల్లు లక్ష్యం’ అని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చట్టాలకు లోబడి శిక్షలు
భారత క్రీడల్లో మరింత జవాబుదారీతనం పెంచడం కోసం నిర్దిష్టమైన సవరణలతో 15 ఏళ్ల తర్వాత ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు క్రీడాశాఖాధికారులు తెలిపారు. తప్పుడు, నకిలీ ధ్రువీకరణతో పోటీల్లో పాల్గొంటే తొలిసారి రెండేళ్ల నిషేధం విధిస్తారు.
పతకాల్ని వెనక్కి తీసుకుంటారు. రెండోసారి పునరావృతం జీవితకాల నిషేధం విధించడంతో పాటు, చట్టాలకు లోబడి శిక్షలు తప్పవు. అయితే సస్పెన్షన్‌కు గురైన అథ్లెట్లు తమ తప్పుని అంగీకరించి, నిజమైన వయస్సును వెల్లడిస్తే క్షమాభిక్షకు అవకాశమిచ్చారు.
ఇదీ చదవండి
చండీగఢ్‌లో గురువారం జరిగిన పంజాబ్ యూనివర్సిటీ (పీయూ) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. మేటి షూటర్ మనూ భాకర్ ‘పీయూ ఖేల్‌రత్న’ పురస్కారం అందుకుంంది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్ ఈ ఏడాది చండీగఢ్‌లోని డీఏవీ కాలేజీ నుంచి మాస్టర్స్ డిగ్రీ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment