అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? | Astronauts Age Slower than People Lived on Earth | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది?

Published Sun, Aug 27 2023 7:08 AM | Last Updated on Sun, Aug 27 2023 11:00 AM

Astronauts Age Slower than People Lived on Earth - Sakshi

భారతదేశం రూపొందించిన చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత జనానికి అంతరిక్షానికి సంబంధించిన విషయాలపై మరింత ఆసక్తి పెరిగింది. పలు విషయాలు తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. అంతరిక్షానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. గూగుల్‌ బాబాను అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదిలా ఉంటే అంతరిక్షానికి సంబంధించిన అనేక అపోహలు జనంలో ఉన్నాయి. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటిలో ఒక సందేహం జనంలో ప్రబలంగా ఉంది. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి వృద్ధాప్యానికి చేరుకోడు. యవ్వనునిగానే ఉండిపోతాడని అంటారు. దీనిలో నిజం  ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

వ్యోమగాముల శరీరంలో మార్పులు
గడచిన కొన్ని దశాబ్దాలుగా పలుదేశాలు తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాయి. వారు అంతరిక్షంలో కొన్ని రోజులు గడిపి, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కాగా అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములలో పలు మార్పులు కనిపించాయి. వారికి సంబంధించిన అధ్యయనాన్ని నాసా చేపట్టింది. అంతరిక్షం నుంచి వచ్చిన వారిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో గమనించింది. అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములలో రక్తహీనత సర్వసాధారణం. దీనిని స్పేస్ అనీమియా అని కూడా అంటారు.

అంతరిక్షంలో వయసు పెరగడం లేదా?
అంతరిక్షంలోకి వెళ్లాక వారి వృద్ధాప్యం నిజంగానే నెమ్మదిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఇందుకోసం నాసా ఒక పరీక్ష చేసింది. పరిశోధకులు ఇద్దరు కవల సోదరులను ఎంపికచేశారు. ఈ సోదరులిద్దరూ వ్యోమగాములు. వారిలో ఒకరిని అంతరిక్షంలోకి పంపారు. మరొకరిని భూమిపై ఉంచారు. స్కాట్ కెల్లీ 340 రోజులు అంతరిక్షంలో గడిపాడు. అతని కవల సోదరుడు మార్క్ భూమిపైనే ఉన్నాడు.

వయస్సుపై కొంతవరకు ప్రభావం
స్కాట్ కెల్లీ అంతరిక్షం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతని జన్యువులలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. భూమిపై జరగని కొన్ని మార్పులు అతని డీఎన్‌ఏలో కనిపించాయి. స్కాట్ తన సోదరుడు మార్క్ కంటే చిన్నవాడిగా కనిపించడానికి ఇదే కారణంగా నిలిచింది. అయితే తరువాతి 6 నెలల్లో స్కాట్ కెల్లీ జీన్స్‌లో మార్పు సాధారణ స్థితికి చేరుకుంది. దీని ప్రకారం చూస్తే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్నవారి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా వారు యవ్వనులుగా కనిపించేందుకు అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: పిజ్జా యాప్‌ సాయంతో ప్రియుడి అరెస్ట్‌.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement