slow
-
బ్యాంక్ డిపాజిట్లు డీలా..
న్యూఢిల్లీ: డిపాజిట్ల వృద్ధి స్పీడ్‌ను పెంచడానికి బ్యాంకులు ప్రయతి్నంచినప్పటికీ జూన్ త్రైమాసికంలో నిరాశే మిగిలింది. తక్కువ వ్యయాలకే నిధుల సమీకరణకు దోహదపడే కరెంట్ ఖాతా – సేవింగ్స్ ఖాతా (సీఏఎస్ఏ–కాసా) డిపాజిట్లను సమీకరించడంలో బ్యాంకింగ్ పనితీరు అంత ప్రోత్సాహకరంగా లేదని గణాంకాలు పేర్కొంటున్నాయి. పలు అగ్రశ్రేణి బ్యాంకుల కాసా డిపాజిట్ సమీకరణ వృద్ధి స్పీడ్ 2023–24 మార్చి త్రైమాసికంతో పోలి్చతే తదుపరి 2024–25 జూన్ త్రైమాసికంలో తగ్గింది. కొన్ని బ్యాంకుల విషయంలో డిపాజిట్ల తీరు అక్కడక్కడే ఉండగా, మరికొన్నింటి విషయంలో క్షీణత సైతం నమోదయ్యింది. తొలి సమాచారం ప్రకారం 13 బ్యాంకుల మొత్తం డిపాజిట్లు మార్చి త్రైమాసికంలో పోలి్చతే జూన్ త్రైమాసికంలో 1.15 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసికంలో డిపాజిట్ల తీరు క్లుప్తంగా... -
అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది?
భారతదేశం రూపొందించిన చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత జనానికి అంతరిక్షానికి సంబంధించిన విషయాలపై మరింత ఆసక్తి పెరిగింది. పలు విషయాలు తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అంతరిక్షానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. గూగుల్ బాబాను అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదిలా ఉంటే అంతరిక్షానికి సంబంధించిన అనేక అపోహలు జనంలో ఉన్నాయి. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటిలో ఒక సందేహం జనంలో ప్రబలంగా ఉంది. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి వృద్ధాప్యానికి చేరుకోడు. యవ్వనునిగానే ఉండిపోతాడని అంటారు. దీనిలో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యోమగాముల శరీరంలో మార్పులు గడచిన కొన్ని దశాబ్దాలుగా పలుదేశాలు తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాయి. వారు అంతరిక్షంలో కొన్ని రోజులు గడిపి, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కాగా అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములలో పలు మార్పులు కనిపించాయి. వారికి సంబంధించిన అధ్యయనాన్ని నాసా చేపట్టింది. అంతరిక్షం నుంచి వచ్చిన వారిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో గమనించింది. అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములలో రక్తహీనత సర్వసాధారణం. దీనిని స్పేస్ అనీమియా అని కూడా అంటారు. అంతరిక్షంలో వయసు పెరగడం లేదా? అంతరిక్షంలోకి వెళ్లాక వారి వృద్ధాప్యం నిజంగానే నెమ్మదిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఇందుకోసం నాసా ఒక పరీక్ష చేసింది. పరిశోధకులు ఇద్దరు కవల సోదరులను ఎంపికచేశారు. ఈ సోదరులిద్దరూ వ్యోమగాములు. వారిలో ఒకరిని అంతరిక్షంలోకి పంపారు. మరొకరిని భూమిపై ఉంచారు. స్కాట్ కెల్లీ 340 రోజులు అంతరిక్షంలో గడిపాడు. అతని కవల సోదరుడు మార్క్ భూమిపైనే ఉన్నాడు. వయస్సుపై కొంతవరకు ప్రభావం స్కాట్ కెల్లీ అంతరిక్షం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతని జన్యువులలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. భూమిపై జరగని కొన్ని మార్పులు అతని డీఎన్ఏలో కనిపించాయి. స్కాట్ తన సోదరుడు మార్క్ కంటే చిన్నవాడిగా కనిపించడానికి ఇదే కారణంగా నిలిచింది. అయితే తరువాతి 6 నెలల్లో స్కాట్ కెల్లీ జీన్స్‌లో మార్పు సాధారణ స్థితికి చేరుకుంది. దీని ప్రకారం చూస్తే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్నవారి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా వారు యవ్వనులుగా కనిపించేందుకు అవకాశాలున్నాయి. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! -
2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా
ముంబై: భారత్‌లో రుణ వృద్ధి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితం కావచ్చని జపాన్ బ్రోకరేజ్ సంస్థ-నోమురా అంచనా వేసింది. 2022-23లో సాధించిన 15 శాతంతో పోల్చిచూస్తే రుణ స్పీడ్ దాదాపు 5 శాతం పడిపోతు దన్నది నోమురా అంచనాలు కావడం గమనార్హం. ఆహారేతర రుణాలకు సంబంధించి వృద్ధి మందగించే అవకాశం ఉందని ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో సంస్థ అభిప్రాయపడింది. (ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) రుణ వృద్ధి స్పీడ్ తగ్గడంసహా, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, తక్కువ మూలధన అవసరాలు వంటి కారణాలు 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రేటును 5.3 శాతానికి పరిమితం చేస్తాయని కూడా నోమురా అంచనా వేయడం గమనార్హం. గత ఏడాది మే నుంచి 2.5 శాతం మేర పెరిగిన ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం) రుణ వృద్ధికి విఘాతం కలిగించే వీలుందని, వ్యవస్థలో ప్రత్యేకించి గృహ రుణాలపై ఇప్పటికే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించింది. (డిజిటల్ బాటలో ఎయిర్ ఇండియా - భారీ పెట్టుబడి) జనవరిలో 16.7 శాతం రుణ వృద్ధి నమోదయితే.. ఇది తగ్గుతూ వస్తున్న ధోరణి స్పష్టమవుతోందని పేర్కొంది. ఫిబ్రవరిలో 16 శాతం, మార్చిలో 15.4 శాతంగా రుణ వృద్ధి జరిగిందని పేర్కొంది. రానున్న మాసాల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రుణ వృద్ధి పెంచుకోవవడం-సాధ్యమైనంత మొండిబకాయిలు (ఎన్పీఏ) తగ్గించుకోవడంపై భారత్ బ్యాంకింగ్ ప్రస్తుతం దృష్టి సారించినట్లు పరిస్థితి కనబడుతోందని పేర్కొంది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ) -
మందగమనంలో ఆర్థిక వ్యవస్థ
దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పలు సందర్భాలలో సంక్షోభాల వలయంలో చిక్కుకొన్నప్పటికీ, ఇప్పటి పరిస్థితి అన్నింటికంటే దయనీయంగా ఉంది. సంక్షోభం ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా సర్వవ్యాపితంగా కనిపిస్తోంది. సెంచరీ దాటిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదవుతున్నా కిందకి దిగడం లేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,100 దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ 8 ఏళ్లలో దాదాపు 42 శాతం మేర పతనం అయింది. వాస్తవం ఈ విధంగా ఉంటే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణించలేదు... డాలర్ బలపడిందంటూ చేసిన ప్రకటన క్రూర పరిహాసమే! దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పి చాలాకాలమే అయింది. నూనెలు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాల ధరలు పైపైకి పోతున్నాయి. నిరుద్యోగం తీవ్రంగా ఉంది. ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనా వల్ల మందగించిన పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు కొంత మెరుగయినప్పటికీ ఆశించిన స్థాయిలో లేదు. దేశంలో దిగుమతులు పెరిగాయి. ఎగు మతులలో క్షీణత నమోదవుతోంది. ఫలితంగా కరెంట్ ఎకౌంట్ బ్యాలెన్స్‌లో లోటు పెరిగిపోతోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇక, రూపాయి శీఘ్రంగా పతనం అవుతూ సెంచరీ కొట్టే దిశగా సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధిస్తున్న పన్నులు, సెస్సులు అంతకంతకూ పెరిగిపోతున్నా, ఇబ్బడి ముబ్బడిగా విదేశీ రుణాలు తీసుకొంటున్నా, బడ్జెట్ అవసరాలను తీర్చలేక కేంద్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ఆర్థికరంగం ముఖచిత్రం ఇంత ఘోరంగా తయారవుతుంటే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించకుండా, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అమెరికా డాలర్ బలపడటం వంటి బయటి అంశాలే కారణమని ఎటువంటి వెరపు లేకుండా సమర్థించు కోవడం అందర్నీ నిశ్చేష్టుల్ని చేస్తోంది. ఎవరు అధికారంలో ఉన్నా... సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. కానీ, వాటిని ఎదుర్కొని ప్రతికూల పరిణామాల ప్రభావం ప్రజలపై దీర్ఘకాలం పాటు పడకుండా చూడడమే ప్రభుత్వ బాధ్యత. కేంద్రంలోని ఎన్డీయే తీరు ఎంత బాధ్యతారహితంగా ఉన్నదంటే.. తమ తప్పుల్ని గత పాలకుల పాపాలుగా చూపి చేతులు దులుపుకొనే ప్రయత్నమే చేస్తోంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు సగటున 90 డాలర్లు మాత్రమే ఉన్నప్పటికీ. దేశీయ మార్కెట్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 కిందికి దిగడం లేదు. 2013లో బ్యారెల్ ధర 140 డాలర్లు పలికినపుడు కూడా లీటర్ పెట్రోల్ రూ. 70 కే లభించిం దికదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఆయిల్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని చెల్లించడానికి ధర పెంచాం అనే సమాధానం ఇస్తున్నారు. కశ్మీర్లో శాంతిభద్రతలు అదుపు తప్పితే.. అందుకు దేశ తొలి ప్రధాని నెహ్రూని నిందిస్తారు. ఆకలి సూచీలో భారత్ ర్యాంకు దిగజారిందంటే, అవన్నీ తప్పుడు లెక్కలని దబాయి స్తున్నారు. రూపాయి పతనానికి వింత భాష్యం చెప్పారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ 8 ఏళ్లలో దాదాపు 42 శాతం మేర పతనం అయింది. ఇటీవలికాలంలో విదేశీ మారకద్రవ్య నిల్వల నుండి దాదాపు ఒక బిలియన్ డాలర్లు వెచ్చించి పటిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేసినా రూపాయి బలపడలేకపోయింది. 642 బిలియన్ డాలర్ల మేర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ మారకం నిల్వలు కేవలం 9 నెలల దిగుమతులకే సరిపోతాయి. కనీసం రెండేళ్ల దిగుమ తులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యం ఉంటే... అది ఆరోగ్యకరమైన స్థాయిగా పరిగణిస్తారు. వాస్తవం ఈ విధంగా ఉంటే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణించలేదు... డాలర్ బలపడిం దంటూ చేసిన ప్రకటన క్రూర పరిహాసమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు నిజంగానే ఇతర కరెన్సీల కంటే రూపాయి మెరుగ్గానే ఉందా? అని ప్రశ్నించు కొంటే సమాధానం దొరకదు. ఉదాహరణకు విదేశాలలో విద్యనభ్య సిస్తున్న భారతీయ విద్యార్థులు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి మొదలైన వాటికయ్యే ఖర్చును డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్రిటన్‌లోనే పౌండ్లలో చెల్లిస్తారు. అంటే, ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగ్గా ఉందని చెçప్పుకొన్నప్పటికీ... చెల్లింపులన్నీ డాలర్లలో చేసేటప్పుడు అదనపు భారాన్ని ఎవరు మోస్తున్నట్లు? తమ కరెన్సీ విలువ ఎంతో నిర్ధారించుకోవడానికి అన్ని దేశాలు ఫ్లోటింగ్ మారక రేటునే పాటించాలి. కనుక రూపాయి పటిష్టంగా ఉంటే డాలర్‌కు 82 నుంచి 84 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నట్లు? రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ఉపసంహరించు కుంటున్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, రుణ భారాన్ని తగ్గించుకొంటూ ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేసినప్పుడే పరిస్థితులు మెరుగ వుతాయి. విదేశీ వాణిజ్య లోటును తగ్గించుకోవాలంటే దిగుమతుల్ని తగ్గించాలి. ప్రస్తుతం వాణిజ్య లోటు రూ. 2,600 కోట్ల డాలర్ల మేర ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ముడి చమురు, ఎరువుల దిగుమతులకు అధిక శాతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్న నేపథ్యంలో పర్యాటకం, పారిశ్రామిక రంగాలను ప్రోత్స హించి విదేశీ కరెన్సీ రాబడి పెరిగేలా చూడాలి. అది జరగాలంటే... దేశంలో శాంతిభద్రతలు మెరుగవ్వాలి. మౌలిక సదుపాయాలు విస్తరించాలి. దిగుమతులలో అత్యధికంగా ఉన్న నూనెగింజలు, పప్పు ధాన్యాలను దేశీయంగానే సాగు చేస్తామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ ఆచరణలోకి రాలేదు. ఈ అంశంలో నీతి ఆయోగ్ వెలువరించిన విధాన పత్రం ఏమయిందో తెలియదు. కాగా, ఇటీవల బియ్యం ఎగుమతులపై భారీ సుంకం విధించడంతో వాటి ఎగుమతులు మందగించి విదేశీ మారకద్రవ్యం ఆర్జించే అవకాశాలు తగ్గాయి. రష్యాతో చమురు దిగుమతుల ఒప్పందం కుదుర్చుకొన్నాక ఆ చెల్లింపులను డాలర్లలో కాక రూపాయిల్లోనే జరపడం కొంత ఊరట నిచ్చే అంశం. మేకిన్ ఇండియా ద్వారా అనేక ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసు కొంటాం అని కేంద్రం నమ్మకంగా చెప్పిన విషయం ఆచరణలో తేలిపోయింది. చైనా ఆర్థికరంగంతో పదేపదే పోల్చుకొంటున్నప్పుడు, చైనా మాదిరిగా అన్ని రంగాలకు అవసరమైన యంత్రాలు, ఇతర సాధన సంపత్తిని ఎందుకు సమకూర్చుకోలేక పోతున్నామో సమీక్షిం చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపడంతో వేలాదిమంది రుణ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకొని ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ రంగ బ్యాంకుల బ్రాంచీల సంఖ్యను కుదించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో రైతాంగానికి పరపతి సౌకర్యం మునుపటిలా సజావుగా అందడం లేదన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీన్నిబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం సంపన్న వర్గాల సేవలకే పరిమితం అవుతున్నట్లు భావించాల్సి వస్తోంది. నిజానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతుంది. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. సెస్సుల ద్వారా రాష్ట్రాలకు వాటా ఇవ్వని ఆదాయం కేంద్రానికి సమకూరు తోంది. ఇదికాక, ఎల్ఐసీ వంటి పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా లభిస్తున్న నిధులు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ‘పీఎం కేర్స్’కు అందుతున్న విరాళాలు... ఇవి చాలవన్నట్లు విదేశీ అప్పులు! ఈ విధంగా పెద్దఎత్తున కేంద్రానికి నిధులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో సరైన విధానం లేకపోవ డంతోపాటు, రాజకీయ వ్యూహాలపై అధిక సమయం వెచ్చిస్తూ దేశాభి వృద్ధిని నిర్లక్ష్యం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కల్లోలం తర్వాత పరిస్థితులు క్రమంగా కుదుటపడినప్పటికీ అన్ని రకాల సేవలు, వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో తమ ఆదాయాల్లో ఏమాత్రం పెరుగుదల లేని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లకు తక్షణం కేంద్ర ప్రభుత్వం ముగింపు పలకాలి. సి.రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
11 ఏళ్ల కనిష్టానికి జీడీపీ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికమందగమనంపై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధిని ప్రభుత్వం అంచనా వేయడం గమనార్హం. కేంద్ర గణాంక కార్యాలయం మంగళవారం విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని నమోదు చేయనుంది. గత ఏడాది వృద్ధి రేటు 6.8 శాతంతో పోలిస్తే 5 శాతం వృద్ధికి పరిమితం కానుందని ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. ఇది 11 ఏళ్ల కనిష్టం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షిక ఆర్థిక వృద్ధి 4.5 శాతానికి తగ్గింది. దీంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెలలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో అదనపు ఆర్థిక ఉద్దీపనలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే వ్యక్తిగత పన్నుల్లో రాయితీలను, గత ఏడాది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన తరువాత మౌలిక సదుపాయాల కోసం ఖర్చులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు, ఆర్థికవేత్తలు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి క్రమంగా పెరుగుతుందని ప్రైవేట్ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. తాజా వృద్ధి సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను , ప్రభుత్వ వ్యయాన్ని ప్రభావితం చేస్తుందని ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో ఆర్థికవేత్త ఎన్.ఆర్. భానుమూర్తి వ్యాఖ్యానించారు.అయితే 2020/21 లో వృద్ధి 6 నుంచి 6.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. 2018-19 లో 6.9 శాతం వృద్ధితో పోలిస్తే 2019-20 లో తయారీ 2.0 శాతం పెరుగుతుందని అంచనా వేసినట్లు గణాంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సంవత్సరం 8.7 శాతంతో పోలిస్తే 2019/20 లో నిర్మాణం 3.2 శాతం పెరిగే అవకాశం ఉండగా, వ్యవసాయ రంగం 2.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అంతకుముందు ఏడాది ఇది 2.9 శాతంగా ఉంది. సవరించిన పూర్తి సంవత్సర వృద్ధి అంచనాలతో పాటు, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి డేటాను గణాంక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28 న విడుదల చేయనుంది. కాగా 2025 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కోసం 102 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నత్తే నయం
- ముందుకు సాగని హంద్రీ-నీవా వెడల్పు పనులు - ఫలితమివ్వని 90 రోజుల కార్యచరణ - ఆందోళనలో రైతన్నలు – ఆయకట్టుకు నీరివ్వాలని వేడుకోలు అనంత రైతులకు హంద్రీ-నీవా జలాలు అందనంటున్నాయి. కార్యాచరణ ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితం కాగా...రైతుల ఆశలన్నీ నీరుగారుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించిన 90 రోజుల ప్రణాళిక కూడా ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరాల తరబడి సాగుతున్న పనులతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉరవకొండ : ‘‘అనంత రైతాంగానికి హంద్రీ-నీవా జలాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం..90 రోజుల్లో డిస్ర్టిబ్యూటరీలను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తాం..పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం’’ మార్చి మొదటి వారంలో అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి. దీంతో అనంత రైతులంతా ఈ ఖరీఫ్‌కు హంద్రీ-నీవా జలాలు అందుతాయని ఆశగా ఎదురుచూశారు. కానీ పనులు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా 90 రోజుల ప్రణాళిక ప్రకటించారు. అనంత రైతాంగానికి హంద్రీ-నీవా నీళ్లిచ్చి తీరుతామని గొప్పలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా పనులు సా....గుతున్నాయి. జూన్ 10న ప్రారంభం హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులు జూన్ 10న యుద్ధప్రతిపాదికన ప్రారంభయ్యాయి. వారం రోజుల పాటు ఐదు చోట్ల భారీ యంత్రాలతో చురుగ్గా సాగినా.... ఆ తర్వాత ముందుకు సాగడం లేదు. 216 కిలోమీటర్లు కాలువ వెడల్పు పనులు మూడు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టుర్లకు అప్పగించినా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. 90 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా? హంద్రీనీవా కాలువ తవ్వడానికి ఏడేళ్లు పట్టింది. అంతేస్థాయిలో ఉన్న కాలువ వెడల్పు పనులు మూడంటే మూడు నెలల్లో పూర్తి చేయడం సాధ్యమైయ్యే పనేనా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో కాలువను 10 మీటర్లు మేర(బెడ్ లెవెల్) తవ్వడానికే ఏడేళ్లు పట్టింది. ప్రస్తుతం కాలువ బెడ్‌ను 19.5 మీటర్లకు పెంచాల్సి ఉంది. అంటే గతంలో జరిగినంత మేర మళ్లీ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏడేళ్లు సాగిన పనులను 90 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పైగా నిధుల సమస్య, భూసేకరణ లాంటివి కుడా కాలువ వెడల్పు పనులకు ఆటంకం కల్పించనున్నాయి. పనుల కేటాయింపు ఇలా... 216 కి.మీ. నిడివి కలిగిన హంద్రీనీవా కాలువను వెడల్పు పనులు చేయడానికి మూడు ప్యాకేజీలుగా విభజించారు. కర్నూలు జిల్లా మాల్యాల నుంచి 64వ ప్యాకేజీని రిత్విక్ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్ సంస్థకు, 64వ కి.మీ. నుంచి 134 కి.మీ. వరకూ రెండవ ప్యాకేజీని హిందూస్థాన్ ఇంజనీర్స్ సిండికేట్ సంస్థకు. 134 కి.మీ. నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరుకు మూడవ ప్యాకేజీ పనులను ఎంఈఐఎల్ సంస్థకు అప్పగించారు. మన జిల్లా పరిధిలో 82 కి.మీ. కాలువ పనులను ఎంఈఐఎల్ సంస్థ చేపట్టింది. మట్టి తొలగించి కాలువ వెడల్పు చేసే పనులను ఆ సంస్థ ఐదు కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కాలువలో ఉన్న సిమెంట్ నిర్మాణాల వద్ద లైనింగ్, బెడ్డింగ్ పనులు మాత్ర సదరు సంస్థ స్వయంగా చేపట్టింది. ఇందులో భాగంగా కాలువలో 134, 176, 179, 180, 182 కి.మీ. వద్ద మట్టి తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. కానీ రాగులపాడు పంప్‌హౌస్ వద్ద హంద్రీ-నీవా కాలువ వెడల్పు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పాటు 34 ప్యాకేజీలో కాలువను ఎంత మేర వెడల్పు చేయాలో కనీసం మార్కింగ్ కూడా వేయలేదు. దీన్ని బట్టి చూస్తే హంద్రీ-నీవా జలాలు అనంత రైతులకు అందాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పనులు వేగవంతానికి చర్యలు 90 రోజుల్లో హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. పనులపై ఏరోజుకారోజు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నాము. భారీ యంత్రాలతో పనులు ప్రారంభించాము. పనులు మందకొడిగా జరుగుతున్నాయనుకున్న చోట నిరంతర పర్యవేక్షణతో పనులు వేగవంతమయ్యేలా చూస్తాం. -రాజశేఖర్‌బాబు, కార్యనిర్వాహక ఇంజనీరు, హంద్రీనీవా -
సమయం లేదు మిత్రమా !
పంట కాలువలకు నీటి సరఫరాను ఆపేసి సుమారు నెలరోజులు కావస్తోంది. జూన్ 1న మళ్లీ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వహణ పనులూ ముందుకు సాగడం లేదు. ఫలితంగా రానున్న రోజుల్లోనూ అన్నదాతలకు, ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. కాళ్ల: కాళ్ల మండలంలోని అన్నయ్యకోడు కాలువలో సుమారు 280 మీటర్ల మేర రూ.75 లక్షలతో రెండు చోట్ల రిటెయినింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. సమయం ముంచుకొస్తున్నా.. ఈ పనులు కొలిక్కి రాలేదు. నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను నాణ్యత లేకుండా నీటిలోనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలువలకు నీరు వదిలితే ఈ పనులు సగంలో నిలిచిపోయే దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పలు కాలువల్లో మట్టి మేట వేసింది. జువ్వలపాలెం నుంచి శివారు కలవపూడి వరకూ అన్నయ్యకోడులో కర్రనాచు మేట వేసి ఉంది. కర్రనాచువల్ల ప్రతి ఏటా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. గురువారమే ఈ పనులు చేపట్టారు. ఇవి కూడా గడువులోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే కాళ్ల కె.లంక చానల్ శివారు నుంచి ఎర్త్‌వర్క్ పనులు ఇటీవలే చేశారు. నిబంధనల మేరకు ఈ పనులు జరగ లేదని, నీళ్లల్లోనే తవ్వకం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్నయ్యకోడు అభివృద్ధి పనులు మొదలెట్టాం అన్నయ్యకోడు పంటకాలువ అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించాం. కాలువలో పేరుకుపోయిన కర్రనాచు, మట్టి దిబ్బలను తొలగిస్తాం. దీని వల్ల శివారు గ్రామాలకు నీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – నంబూరి త్రినాథమూరి్తరాజు, కలవపూడి నీటి సంఘం అధ్యక్షుడు కంటి‘తూడు’పు చర్యలే నిడదవోలు : జిల్లాలో కాలువలు కట్టిన తరువాత యుద్ధ ప్రాదిపదికన చేపట్టాలి్సన ఓ అండ్ ఎం (ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ )తూడు పనులకు ఆలస్యంగా ఆమోదం లభించింది. జిల్లాలో 2017–18 సంవత్సరానికి పశ్చిమ డెల్టాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో 202 పనులకు రూ.5.06 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరు రోజుల వ్యవధిలో కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పనులు చేపడతారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది. కాలువలకు నీరు విడుదల చేయక ముందే వాటిల్లో పేరుకుపోయిన కర్రనాచు, గుర్రపుడెక్క తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేయాలి. అయితే ఆలస్యంగా నిధులు మంజూరు కావడంతో పనులను తూతూ మంత్రంగా చేపడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం కంటితుడుపు చర్యలేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్ధలకు చేరుకున్న స్లూయిస్ల మరమ్మతులSనైనా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా ఇదే తంతు ఏటా తూడు పనుల మంజూరులో ఆలస్యం జరుగుతూనే ఉంది. కాలువలు మూసివేసిన తరువాత ఏటా పశ్చిమడెల్టా ప్రధాన కాలువతోపాటు తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలోని ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పేరుకుపోయిన తూడు, డెక్క తొలగింపు, స్లూయిస్ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్, స్లూయిస్ల అడుగు భాగంలో పేరుకుపోయిన నాచు తొలగింపు పనుల చేపట్టా ల్సి ఉంది. ఏటా వీటి కి నిధుల మంజూరులో ఆలస్యం జరగడంతో పనులు పూర్తికావడం లేదు. తూడు పనులు.. నీటి సంఘాలకే... ఈ పనులన్నింటినీ కొన్నేళ్లుగా నామినేషన్ పద్ధతిపై నీటి సంఘాలకే కట్టబెడుతున్నారు. అంతక్రితం అన్ని పనులనూ టెండర్లు వేసి చేపట్టేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టెండర్ల ప్రక్రియకు స్వస్తి పలికారు. పనులను టీడీపీ వర్గీయులైన నీటి సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తున్నారు. ఫలితంగా ఇవి నాణ్యంగా ఉంటాయో లేదోనన్న అనుమానం నెలకొంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి భీమవరం టౌన్ : డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక ఏఎస్సార్ సాంస్కృతిక కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలకృష్ణంరాజు మాట్లాడారు. నీటిని విడుదల చేసేలోపే పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కోరారు. నందమూరు అక్విడెక్టు పాతనిర్మాణాన్ని తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త అక్విడెక్టు నిర్మాణం వల్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దాని పరీవాహక ప్రాంతంలో గట్లు మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గట్లు పటిష్టం చేసిన తరువాతే పాత అక్విడెక్టు నిర్మాణాన్ని తొలగించాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు మేళం దుర్గా ప్రసాద్, పాతపాటి మురళీరామరాజు, మెంటే సోమేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, సీతారామరాజు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు. -
పురోగతి లేని లేపాక్షి అభివృద్ధి
లేపాక్షి వేదికగా గత ఏడాది జరిగిన నంది ఉత్సవాల్లో ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సుమారు 15 నెలలు గడుస్తున్నా వారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. ఫలితంగా లేపాక్షిలో అభివృద్ధి పడకేసింది. - లేపాక్షి (హిందూపురం) లేపాక్షి వేదికగా గత ఏడాది నంది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. స్వయంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలో దిగి ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అందులో భాగంగానే రూ.1.50 కోట్లతో లేపాక్షి నుంచి బింగిపల్లి, జఠాయు మోక్ష ఘాట్ వరకూ బీటీ రోడ్డు వేశారు. అయితే ఈ రహదారిలో ఉన్న కల్వర్టు పనులు నేటికీ పూర్తి చేయలేకపోయారు. రూ. 20 లక్షలతో నంది విగ్రహం నుంచి జఠాయు కొండ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేశారు. హామీలు ఇలా.. నెరవేరిందెలా! నంది ఉత్సవాల సాక్షిగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. రూ. 30 లక్షలతో కోనేరు అభివృద్ధి చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఇప్పటి వరకూ దాని అతీగతీ లేకుండా పోయింది. పాత మరుగుదొడ్ల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు రూ. 21 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పి, వెనువెంటనే పాత మరుగుదొడ్లను కూల్చివేయించారు. కొత్తవి నేటికీ పూర్తి చేయలేకపోయారు. జఠాయు ఘాట్ పునరుద్ధరణకు రూ. 8.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హామీనిచ్చారు. ముళ్లపొదలు మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారు. పెద్దగుండ్ల మీద రూ. 10 లక్షలతో జఠాయు పక్షి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దాని ఊసెత్తడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ ప్రహరీ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. అయితే రూ. 50 వేలుతో పాత ప్రహరీకే మరమ్మతులు చేశారు. ఇలాగైతే లేపాక్షి అభివృద్ధి ఎన్నడు జరుగుతుందోనన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
వెలగని దీపం!
► నియోజకవర్గానికి 5వేల చొప్పున ► గ్యాస్ కనెక్షన్ల కేటాయింపు ► రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ ► ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుచేయని వైనం ► లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ► ఇవ్వడంలో తీవ్రజాప్యం ► ఇదే అదునుగా సీఎస్ఆర్ కనెక్షన్లు ► ఇస్తున్న గ్యాస్ కంపెనీలు మహబూబ్‌నగర్ న్యూటౌన్ కట్టెలపొయ్యితో పొగచూరిన మహిళలకు విముక్తి కల్పించి వారి ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం గ్యాస్ కనెక్షన్ల పథకం జిల్లాలో అర్హుల దరి చేరడం లేదు. ఈ పథకం గ్రౌండింగ్ విషయంలో సమావేశాలు నిర్వహించి పురోగతిని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కిందిస్థాయి అధికారులకు పట్టడం లేదు. సరైన సిబ్బంది లేరనే సాకు వారికి తోడైంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. దీపం పథకం కింద నియోజకవర్గానికి 5 వేల చొప్పున పేదలకు గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసి రెండేళ్లు గడుస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం పట్ల ఉన్నతాధికారులు సైతం పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమలులో ఎలాంటి లోపాలున్నాయో ఇప్పటివరకు స్పష్టత రాని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారుకు ఇష్టం లేకపోతే రాతపూర్వకంగా రాయించుకొని రద్దు చేసి ఆ స్థానంలో వేరొకరికి అవకాశవిువ్వాలని దీపం పథకం గ్రౌండింగ్‌పై గత నెల క్రితం నిర్వహిం చిన సమావేశంలో పౌరసరఫరా ల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు నెల రోజులు గడిచినా పురోగతిలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. పర్యవేక్షణా లోపం కారణంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఈ పథకం అమలుపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. అడ్డంకిగా మారిన సీఎస్ఆర్ దీపం పథకం అమలుకు సీఎస్ఆర్ (కంపెనీ సోషల్ రెస్సా¯Œ్సబుల్) విధా నం అడ్డంకిగా మారింది. దీపం పథకంలో లబ్ధిదారుల ఎంపిక రాజకీయ నాయకులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ప్రమేయంతో జరుగుతోంది. దీంతో కనెక్షన్లు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇప్పటివరకు మంజూరు ప్రొసీడింగులు అందలేదు. లబ్ధిదారుల అవసరాలను ఆసరాగా చేసుకున్న గ్యాస్ ఏజెన్సీలు.. కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ కనెక్ష¯ŒSలపై దృష్టి సారించాయి. దీపం లబ్ధిదారులకు సీఎస్ఆర్ కనెక్ష¯ŒSలు ఇస్తున్నాయి. అప్పటికే కనెక్ష¯ŒS తీసుకోవడంతో దీపం పథకం కింద మంజూరైన కనెక్షన్ల గ్రౌండింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్యాస్ కంపెనీల లాభాల్లోనుంచి 2 శాతం ఖర్చు చేయాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం... సీఎస్ఆర్ కనెక్షన్లను పేద లబ్ధిదారులకు డిపాజిట్ లేకుండా గ్యాస్ కంపెనీలు అందజేయడం గమనార్హం. లక్ష్యం 27,262 దీపం కనెక్షన్లు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 5 వేల చొప్పున దీపం కనెక్షన్లు మం జూరు చేసింది ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన తర్వాత తాజా మహబూబ్‌నగర్ జిల్లాకు 27,262 దీపం కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశిం చారు. అందులో 20,846 మంది లబ్ధిదారులను గుర్తించగా 20,406 మందికి అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 18,077 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగులను జారీ చేశారు. ఇప్పటివరకు అందులో 9,624 మందికి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనుమతులు జారీ చేసిన వాటిలో ఇంకా 8,453 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మంజూరు చేసిన దీపం పథకం కనెక్షన్లకు డిపాజిట్ రూపేణ రూ.1600 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు చెల్లించింది. దీపం పథకం లబ్ధిదారుల పేరిట డిపాజిట్ రూపేణ గ్యాస్ కంపెనీలకు దాదాపు రూ.4.36 కోట్లు వెచ్చించింది. రాజకీయ పట్టువిడుపులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ పథకం పురోగతి సాధించకపోవడానికి క్షేత్రస్థాయిలో రాజకీయాల పట్టువిడుపులు ఒక కారణమైతే, కంపెనీలు ఇస్తున్న సీఎస్ఆర్ కనెక్షన్లు మరో కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎస్ఆర్ కనెక్షన్లు నిలిపివేయాలని అధికారుల సిఫారసు మేరకు ప్రజాప్రతినిధులు సంబంధిత గ్యాస్ కంపె నీలపై ఒత్తిడి తెచ్చారు. పథకం పురోగతిలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో రెండుమూడు సార్లు స మీక్షలు నిర్వహించి చర్చించారు. సీ ఎస్ఆర్ కనెక్షన్లకు అనుమతులు ఎందుకిస్తున్నారని, గతంలో ఇచ్చి న వాటికి కచ్చితంగా అనుమతి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు.. అధికారులకు హుకూం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన సీఎస్ఆర్ కనెక్షన్లకు అనుమతుల కోసం గ్యాస్‌డీలర్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటికే దీపం పథకం లబ్ధిదారులు సీఎస్ఆర్ కనెక్షన్లు పొం దడం, గ్యాస్ ఏజెన్సీలను టార్గెట్ చేసి ప్రజాప్రతినిధులు టెక్నికల్‌గా ఇబ్బందులు పెట్టడం, అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధచూపకపోవడం కారణాలు దీపం పథకం అమలుకు అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. -
అంతులేని జాప్యం
- నత్తనడకన హెచ్చెల్సీ ఆధునికీకరణ - అర్ధంతరంగా ఆగిన బ్రిడ్జిల నిర్మాణం - నేటికీ ప్రారంభం కాని యూటీ పనులు జిల్లాకు వరదాయని అయిన తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునికీకరణపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. తాగు, సాగు నీరందించే ఈ కాలువ గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల గడువు పొడిగించుకుంటూనే వెళ్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు పొడిగించినా పురోగతి మాత్రం కన్పించడం లేదు. కణేకల్లు (రాయదుర్గం) : హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు అలసత్వం చూపుతుండటంతో అనుకున్న పురోగతి కన్పించడం లేదు. కాలువ శిథిలావస్థకు చేరుకుని సాగునీటి సరఫరాకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతుండటంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్చెల్సీ ఆధునికీకరణకు రూ.475 కోట్లు మంజూరు చేశారు. 2,400 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యమున్న కాలువను 4,200 క్యూసెక్కులకు పెంచుతూ కాలువను వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఆధునికీకరణ పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. 2008లో పనులు ప్రారంభమయ్యాయి. 2012లోనే పూర్తి కావాల్సి ఉండేది. ఆది నుంచి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. హెచ్చెల్సీకి నీరు బంద్ అయిన వెంటనే పనులు ప్రారంభించకపోవడమే ఇందుకు కారణం. నీరు బంద్ అయిన రెండు, మూడు నెలలకు పనులు ప్రారంభించి.. జూలై రెండో వారం వరకు అడపాదడపా చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. వీటి గురించి జిల్లా మంత్రులు, చీఫ్ విప్, ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాంట్రాక్టర్ల కోరిక మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు సార్లు గడువు ఇచ్చింది. ఆగస్టు 2018లోగా పనులు పూర్తి చేయాలని తుది గడువు విధించింది. ఈ తొమ్మిదేళ్లలో ఒక్కో ప్యాకేజీలో 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తుది గడువులోపు కూడా పూర్తి కావడం అనుమానంగానే కన్పిస్తోంది. అసంపూర్తిగా బ్రిడ్జిలు హెచ్చెల్సీ వ్యవస్థలో కీలకమైన అండర్ టన్నెళ్లు (యూటీ), బ్రిడ్జిలు, అక్విడెక్ట్ పనుల్లో ఏమాత్రమూ పురోగతి లేదు. కొందరు కాంట్రాక్టర్లు బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఇవి కూడా పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఏ బ్రిడ్జి కూడా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఇక యూటీ పనులు ఏ ఒక్కటీ ప్రారంభించలేదు. పాత యూటీలను తొలగిస్తే కొత్త వాటిని ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాలువకు నీరొచ్చే సమయానికే పూర్తి కావాలి. దీంతో కాలువకు నీరు బంద్ అయిన వెంటనే పనులు చేపట్టాలని హెచ్చెల్సీ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది కూడా యూటీ పనులు జరగవనే తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటరీలదీ అదే పరిస్థితి 2, 3 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులపై ప్రధాన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయడంతో వాటిని హెచ్చెల్సీ అధికారులు ఎస్ఆర్ కంపెనీకి అప్పగించారు. రెండో ప్యాకేజీలో 2ఏ, 3వ డిస్ట్రిబ్యూటరీ పనులు, మూడో ప్యాకేజీలో 4, 5, 6బీ, 6బీ1ఆర్ డిస్ట్రిబ్యూటరీ పనులను ఎస్ఆర్ కంపెనీతో చేయిస్తున్నారు. నాల్గో ప్యాకేజీలో ప్రధాన కాంట్రాక్టర్ 7, 8వ డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేశారు. మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు 96 శాతం వరకు జరిగాయి. ఒకటో ప్యాకేజీలో కురువళ్లి, 2వ డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభం కాగా.. ఒకటో డిస్ట్రిబ్యూటరీ పనులు నేటికీ మొదలు కాలేదు. ప్యాకేజీ సంఖ్య నిధుల కేటాయింపు కేటాయించిన కి.మీలు పనిశాతం 1 రూ.65.55 కోట్లు 10 54 2 రూ.77.96 కోట్లు 15 52 3 రూ.69.92 కోట్లు 14 46 4 రూ.108 కోట్లు 18 58 5 రూ.66.655 కోట్లు 10 27 6 రూ.87.55 కోట్లు 17.50 52 గడువులోగా పూర్తి చేస్తాం కొన్ని ప్యాకేజీలకు జూన్, మరికొన్ని ప్యాకేజీలకు ఆగస్టు 2018 వరకు గడువు ఇచ్చాం. పనులను పర్యవేక్షిస్తున్న డీఈఈలతో 15రోజులకోసారి ప్రొగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. పనులు వేగవంతమయ్యేలా చూస్తున్నాం. కాంట్రాక్టర్లకు మరోసారి గడువు ఇచ్చేది ఉండదు. యూటీ పనులు చేయాలనుకుంటే ఆలస్యం లేకుండా ప్రారంభించాలని సూచించాం. - కె.వెంకటరమణారెడ్డి, హెచ్చెల్సీ ఈఈ -
అంతా ముగిశాక.. హడావుడి
పండగల్లో యథేచ్ఛగా కోడిపందేలు, గుండాటలు అధికార పార్టీ హవాతో అటువైపు కన్నెత్తి కూడా చూడని పోలీసులు పండగ ముగిశాక.. తామున్నామంటూ నిరూపించుకునే యత్నం సాక్షి ప్రతినిధి, కాకినాడ : సంక్రాంతి పండగ మూడు రోజులపాటు.. కోర్టు తీర్పులు.. 144 సెక్ష¯ŒS విధించామంటూ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు.. కోడిపందేలను అడ్డుకుంటామంటూ స్వయంగా ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన నిమ్మకాయల చినరాజప్ప చెప్పిన మాటలు.. గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోని పోలీసులు.. అంతా ముగిసిన తరువాత హడావుడి చేయడం విమర్శలకు తావిచ్చింది. సంప్రదాయం ముసుగులో అధికార పార్టీ నేతల సమక్షంలో.. వారి అండతో.. కత్తులు కట్టి మరీ పబ్లిక్‌గా కోట్లలో కోడిపందేలు ఆడినా పోలీసులు ఈ మూడు రోజులూ కిమ్మనలేదు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ, సోమవారం మురమళ్లలో నిర్వహించిన పొట్టేళ్ల పందేలను మాత్రం అడ్డుకోవడం విచిత్రంగా కనిపించింది. కోడిపందేల మాదిరిగానే పొట్టేళ్ల పందేలను కూడా ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబే ప్రారంభించారు. వీటికోసం కూడా షామియానాలతో భారీ బరులు, మినీ స్టేడియంను తలపించేలా, ఒకేసారి మూడు వేలమంది కూర్చుని వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేశారు. ఈ పందేలను తిలకించేందుకు టీడీపీకే చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఇతర రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఒక్కో పందెం రూ.2 లక్షల వంతున సాగితే, పైపందేలు కూడా లక్షల్లోనే జరిగాయి. పండగ మూడు రోజులూ విచ్చలవిడిగా సాగిన కోడిపందేలవైపు కన్నెత్తి కూడా చూడని పోలీసులు ఎందుకో కానీ పొట్టేళ్ల పందేలను మాత్రం అడ్డుకున్నారు. అమలాపురం డీఎస్సీ ఎల్.అంకయ్య, ముమ్మిడివరం సీఐ కేటీవీవీ రమణారావుల ఆధ్వర్యంలో వచ్చిన పోలీసులు ఈ పందేలను నిలిపివేశారు. ఇలా అడ్డుకోవడం తప్పని కాదు కానీ, ఇదే తీరులో కోడిపందేలను కూడా అడ్డుకుని ఉంటే పోలీసు యూనిఫాం గౌరవం మరింత పెరిగేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వివక్ష ఏమిటో? ∙సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పలు ప్రాంతాల్లో చెలరేగుతున్న ఉద్యమాలపై ఏమాత్రం కనికరం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ∙దివీస్ పరిశ్రమతో తమ జీవనం ప్రశ్నార్థకమవుతున్న వేళ తిరుగుబాటు చేస్తున్న తొండంగి మండల ప్రజలను పోలీసులు నిరంకుశంగా అణచివేస్తున్నారు. వారికి మద్దతు ఇచ్చేందుకు వచ్చినవారిని ముందస్తు అరెస్టులు కూడా చేశారు. ∙మరోపక్క సీఎం చంద్రబాబు ఎన్నికల్లో బీసీ రిజర్వేష న్లు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ అమలు కోసం శాం తియుతంగా పాదయాత్ర చేస్తామన్న కాపు నేతలను, కాపులను అరాచక శక్తులుగా పరిగణించి కట్టడి చేశారు. ∙పోలవరం నిర్వాసితుల కోసం ఉద్యమిస్తున్న వామపక్ష నేతలను కట్టడి చేస్తూనే ఉన్నారు. ∙ఇలా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నవారిని సెక్ష¯ŒS–30 పేరుతో అణచివేస్తున్న పోలీసులు.. చట్టాన్ని ఉల్లంఘించి, పబ్లిక్‌గా కోట్లాది రూపాయల మేర కోడిపందేలు, గుండాటలు ఆడుతున్న పెద్దలను, వారికి దన్నుగా నిలిచిన అధికార పార్టీ నేతలను చూసీచూడనట్టు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చలి.. పంజా..
వణుకుతున్న ‘తూర్పు’ పడిపోతున్న ఉష్ణోగ్రతలు పరచుకుంటున్న మంచుతెరలు మన్యంలో మరింత గజగజ అమలాపురం : వెలుగుల రేడు.. సూరీడు.. పడమటి వీధికి మళ్లుతున్న వేళకే చలిగాలులు మొదలైపోతున్నాయి. చూస్తూం డగానే అతిశీతలంగా మారిపోతున్న వాతావరణంలో.. ఆకాశం నీడన ఉన్న వస్తువులు, చెట్టు, చేమ.. హిమపాతం లో తడిసి ముద్దవుతున్నాయి. ‘తూర్పు’ తెలతెలవారుతున్న వేళ.. పరచుకుం టున్న మంచుపరదాలు ప్రకృతికి కొత్త అందాలను అద్దుతున్నాయి. చలి పంజా విసురుతున్న వేళ.. స్వెట్లర్లు, రగ్గులే జనానికి నులివెచ్చని నేస్తాలవుతున్నా యి. కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. గత కొద్ది సంవత్సరాలతో పోలిస్తే.. ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉందని పలువు రు అంటున్నారు. మైదానంతో పోల్చుకుంటే దట్టమైన అడవులు పరచుకున్న మన్యసీమలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చీకట్లు కమ్ముకుంటున్నాయంటే చాలు.. గిరిపుత్రులు చలితో గజగజలాడుతున్నారు. జిల్లా అంతటా ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మారేడుమిల్లిలో 15, రంపచోడవరంలో 17 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం, అమలాపురాల్లో 19, కాకినాడలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజ¯ŒSలో ఇవే అతి తక్కువ ఉష్ణోగ్రతలు. చలికి తోడు దట్టమైన మంచు కమ్ముకుంటోంది. ఉదయం ఎనిమిది గంటలకు సైతం మంచు వీడడం లేదు. మన్యసీమ, కోనసీమలైతే దాదాపు ఉదయం పది గంటల వరకూ మంచు తెరల్లోనే ఉంటున్నాయి. -
పంపు ‘సెట్’ అయ్యేదెప్పుడు..?
నత్తనడకన ఏజీడీఎస్ఎం పైలెట్ ప్రాజెక్టు ఏడాదిన్నరలో 15 శాతం మాత్రమే అమలు ఆసక్తి చూపని రైతులు వ్యవసాయంలో విద్యుత్ ఆదాకు పాతమోటార్ల స్థానంలో అధునాతన పంపు సెట్లు ఏర్పాట్లు చేసే డిమాండ్ ఆధారిత వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏజీడీఎస్ఎం) నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును రాజానగరం మండలంలో చేపట్టారు. మండలంలోని 29 గ్రామాల్లో గల 2,496 పంపుసెట్లను ఈ పథకంలో మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇంతవరకూ కేవలం 456 మోటార్లనే మార్చగలిగారు. అంటే 15 శాతం లక్ష్యాన్ని మాత్రమే ఏడాదిన్నరకు సాధించగలిగారు. సాక్షి, రాజమహేంద్రవరం : పథకాలు ఘనం.. ఆచరణ అల్పం అనడానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది డిమాండ్ ఆధారిత వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏజీడీఎస్ఎం). మెట్ట ప్రాంతంలో బోరు ఆధారిత వ్యవసాయంలో పాతమోటార్ల స్థానంలో అధునాతన పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రాజానగరం మండలంలో ఈ పథకాన్ని 2015 ఏప్రిల్ 5 నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకంలో రైతుల వద్ద ఉన్న పాత మోటార్ల స్థానంలో 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ కలిగిన అధునాతన వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేస్తారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్), ఈఈఎస్ఎల్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. రూ. 18.95 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐదేళ్లలో రూ. 40.45 కోట్ల విలువైన 21.317 మిలియన్ల విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాజానగరంలో మండలంలోని 29 గ్రామాల్లో 29 ఫీడర్ల పరిధిలోని 2,496 పంపుసెట్ల స్థానంలో స్టార్ రేటింగ్ మోటార్లు మార్చాల్సి ఉంది. దీనికి ఏడాది కాలపరిమితిగా నిర్దేశించారు. రైతుల్లో అనాసక్తి రైతులు తమ అవసరాలకు అనుగుణంగా 5, 10, 15, 20 హార్స్పవర్ (హెచ్‌పీ) మోటార్లు వినియోగిస్తున్నారు. ఉచితంగా ఇస్తున్నప్పటికీ పాత పంపుసెట్టు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. స్టార్ రేటింగ్ పంపు సెట్టు అమర్చే ఈఈఎస్ఎల్ పాత మోటారును తీసుకుంటుంది. ఐదేళ్లపాటు ఉచితంగా సర్వీసు అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే సర్వీస్ చేసే సిబ్బంది సకాలంలో రాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే రైతులు దీనిపై ఆసక్తి చూపడం లేదు. ప్రాజెక్టు పురోగతి నామమాత్రం ఈ ఏడాది అక్టోబర్ నాటికి 100 శాతం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఈ నెల 3వ తేదీ నాటికి మొత్తం 765 మోటార్లను మాత్రమే మార్చగలిగారు. ఈ నెలాఖరు నాటికి మిగిలిన 1,731 మోటార్లను మార్చాల్సి ఉంది. ఈ పథకంపై పలుమార్లు రైతులకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ ప్రాజెక్టు పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. -
జంబ్లింగ్‌కు తాత్కాలికంగా వెనకడుగు
తొలిసారిగా ఉమ్మడి పరీక్షా విధానం పాఠశాల స్థాయిలోనే మూల్యాంకనం రాయవరం : పాఠశాల స్థాయిలో తొలిసారిగా ఉమ్మడి పరీక్షా విధానానికి విద్యాశాఖ తెరతీసింది. సమగ్ర నిరంతర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి పరీక్షా విధానంలో జంబ్లింగ్ తరహాలో మూల్యాంకనం చేయాలని కూడా తలపోసింది. అయితే టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు జంబ్లింగ్ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా సమ్మేటివ్–1 పరీక్షలు విద్యాశాఖ తొలుతగా ప్రాథమిక, ఉన్నత స్థాయి పరీక్షల్లో ఉమ్మడి పరీక్షా విధానం అమలు చేయాలని భావించింది. ప్రైవేటు పాఠశాలలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆరో తరగతి నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు. పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావించారు. ఈ విధానం అమలులో చోటు చేసుకునే ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో పరీక్షలకు రెండు రోజుల ముందు జంబ్లింగ్ విధానంలో పరీక్షా పేపర్ల మూల్యాంకనంపై సవరణ చేశారు. ఆరు, ఏడు తరగతులకు సమ్మేటివ్–1, 2, 3 పేపర్ల మూల్యాంకనాన్ని మండల స్థాయిలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 8, 9 తరగతులకు సమ్మేటివ్–1, 2 పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని, సమ్మేటివ్–3 పరీక్షలను మాత్రమే జంబ్లింగ్ తరహాలో మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. ఆరు నుంచి టెన్త్ వరకు సమ్మేటివ్–1, 2, 3 పేపర్లను అన్ని సబ్జెక్టుల్లోనూ ఐదు శాతం జవాబు పత్రాలను ప్రత్యేక బృందం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. ప్రస్తుత సమ్మేటివ్ పరీక్షల్లో టెన్త్ పరీక్షల్లో మాదిరిగా అన్ని పాఠశాలలకూ పర్యవేక్షకులను నియమించారు. బృందాల నియామకం .. జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిధిలోని 4.03,860 మంది విద్యార్థులు సమ్మేటివ్–1 పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు జరుగుతున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2,098 మంది పరిశీలకులను నియమించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండగా, పరీక్షలను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో మోడరేటివ్ బృందాలను నియమించారు. ఎంఈవో చైర్మన్‌గా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఒక సీనియర్ హెచ్ఎం, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఈ కమిటీలో ఉంటారు. వేర్వేరు సబ్జెక్టులు బోధించే వారిని టీమ్‌లో నియమించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా ఈ బృందాలు సమ్మేటివ్–1 పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను సందర్శించాయి. అలాగే డివిజన్ స్థాయిలో ప్రతి డివిజన్‌కు ఒక కమిటీని నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు టీమ్‌లు(స్కా్వడ్స్) సమ్మేటివ్–1 పరీక్షలను తనిఖీలు నిర్వహించారు. -
ఆర్వోబీ.. నత్తనడక
* రూ.50 లక్షలతో ఆర్వోబీ సుందరీకరణ * నెమ్మదిగా సాగుతున్న పనులు పట్టణంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్భాటంగా పనులు ప్రారంభిస్తున్న పాలకులు, అధికారులు వాటి పురోగతి గురించి పట్టించుకోకపోవడంతో మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. సమయం గడచినా పనులు పూర్తికావట్లేదు. ఇందుకు తెనాలి పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిదర్శనం. తెనాలి రూరల్ : తెనాలి నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో పట్టణ నడిబొడ్డులో ఉన్న ఈ వంతెన నిత్యం రద్దీగానే ఉంటుంది. 1960 దశకాల్లో ఈ వంతెనను నిర్మించారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రైలు పట్టాల పైన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కింది భాగం పెచ్చులూడి పడుతోంది. పట్టణంలో అతి పెద్దదయిన ఈ వంతెనకు పైపై మెరుగులు దిద్ది సుందరీకరించాలని పాలకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆర్అండ్బీ అధికారులు సుమారు రూ.50 లక్షల అంచనాలు సిద్ధం చేశారు. గోప్యంగానే అయిన వారికి కాంట్రాక్టు ఇప్పించేశారు. ఇంకేముంది పుష్కరాల సందర్భంగా పట్టణాన్ని సుందరీకరిస్తున్నారంటూ ప్రచారమూ సాగింది. ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. పనులను ఆర్భాటంగా ప్రారంభించి, ప్రచారం చేయించుకున్న వారు అవి కొనసాగుతున్న తీరును పర్యవేక్షించడం మరచారు. పనులు ప్రారంభించి రెండు నెలలు దాటినా, ఇప్పటికీ సగం పనులు జరగలేదంటే అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేసిన పనులూ అంత నాణ్యంగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంతెనకు ఇరువైపుల ఉన్న గోడలను పగులగొట్టి, వాటి స్థానే ఇనుప గొట్టాలు ఏర్పాటు చేసి, పసుపు, కాషాయ రంగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు కొంత మేర వేసిన రంగులు నాలుగు రోజులకే లేచి పోతున్నాయి. ఇక ఫుట్‌పాత్‌పై టైల్స్ కూడా లేచి పోతున్నాయి. అధికారులు పనులను పర్యవేక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
నత్తనడక..
* గుంటూరు– తెనాలి రైల్వేట్రాకు డబ్లింగ్ పనులు ఆలస్యం * భూసేకరణలో తీవ్ర జాప్యం గుంటూరు (నగరంపాలెం): గుంటూరు రైల్వే డివిజనులో గుంటూరు–తెనాలి డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2014 అక్టోబరు నెలలో డబ్లింగ్ విద్యుద్దీకరణ పనులను రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది. ప్రాథమికంగా రూ.144 కోట్లతో ప్రారంభించిన పనులకు భూసేకరణ తీవ్ర అడ్డంకిగా మారింది. తెనాలి నుంచి గుంటూరు రైల్వేస్టేçÙన్ వరకు 25 కి.మీ. పొడవున్న ట్రాక్‌కు తెనాలి, గుంటూరు రెవెన్యూ డివిజనులో, నగరపాలక సంస్థ పరిధి మొత్తంలో సుమారు 20 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. రైల్వేట్రాకు ఏర్పాటుకు సంగం జాగర్లమూడి వద్ద బకింగ్‌హామ్ కెనాల్ వద్ద, బుడంపాడు వద్ద గుంటూరు చానల్‌పై రెండు పెద్ద వంతెనలు, గుంటూరు డొంకరోడ్డులో మూడు వంతెనల వద్ద ఆర్యూబీ, 40 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఇప్పటికి తెనాలి రైల్వేస్టేçÙన్ నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఎర్త్ వర్కు, 30 వరకు చిన్న వంతెనల నిర్మాణం పూర్తి కావచ్చాయి. భూసేకరణ సమస్య కారణంగా అక్కడక్కడ కొద్దిగా ఎర్త్ పనులు చేశారు. కేంద్ర జల రవాణా సూచనల మేరకు డీపీఆర్‌లో ఉన్నదానికంటే బకింగ్హోమ్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసే వంతెన 2.5 అడుగుల ఎత్తుపెంచాల్సి రావడంతో ట్రాక్ ఎలైన్మెంట్ మారి మరో నాలుగు కిలోమీటర్ల పొడవునా అదనంగా భూసేకరణ చెయ్యాల్సి వచ్చింది. బుడంపాడు, బకింగ్ హామ్ కెనాల్ వద్ద పెద్దవంతెనలు పిల్లర్ల దశకు చేరుకున్నాయి. ఆర్యూబీ పనులు ప్రారంభం.. నగరంలో మూడు వంతెనల వద్ద ఆర్యూబీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న నగరపాలకసంస్థ కాల్వను పక్కకు మార్చే పనులు రెండురోజుల క్రితం ప్రారంభమయ్యాయి. సర్వేయర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు ఇప్పటివరకు రాజధాని పనులు, కృష్ణా పుష్కరాల పనులలో మునిగిపోవడంతో భూసేకరణ పనులు సక్రమంగా కొనసాగలేదు. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం స్థలాల గుర్తింపు, మార్కింగ్, స్థల యజమానులకు ప్రకటన ఇవ్వడానికే రెండు సంవత్సరాల కాలం పట్టింది. మొదటి దశలో తెనాలి రెవెన్యూ డివిజను పరిధిలోని సుమారు ఆరు ఎకరాలకు మాత్రమే పరిహారం చెక్కులు సిద్ధం చేసినా పంపిణీ జరగలేదు. ఇక అదనంగా నాలుగు కిలోమీటర్లు భూసేకరణ చేయాల్సిన ప్రాంతంలో మార్కింగ్ మాత్రమే జరిగింది. పూర్తిస్థాయిలో భూమి అప్పగిస్తేనే పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉందని పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. -
నత్తనడకన సాగుతున్న పుష్కరపనులు