- వణుకుతున్న ‘తూర్పు’
- పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- పరచుకుంటున్న మంచుతెరలు
- మన్యంలో మరింత గజగజ
చలి.. పంజా..
Published Sun, Nov 27 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
అమలాపురం :
వెలుగుల రేడు.. సూరీడు.. పడమటి వీధికి మళ్లుతున్న వేళకే చలిగాలులు మొదలైపోతున్నాయి. చూస్తూం డగానే అతిశీతలంగా మారిపోతున్న వాతావరణంలో.. ఆకాశం నీడన ఉన్న వస్తువులు, చెట్టు, చేమ.. హిమపాతం లో తడిసి ముద్దవుతున్నాయి. ‘తూర్పు’ తెలతెలవారుతున్న వేళ.. పరచుకుం టున్న మంచుపరదాలు ప్రకృతికి కొత్త అందాలను అద్దుతున్నాయి. చలి పంజా విసురుతున్న వేళ.. స్వెట్లర్లు, రగ్గులే జనానికి నులివెచ్చని నేస్తాలవుతున్నా యి. కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. గత కొద్ది సంవత్సరాలతో పోలిస్తే.. ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉందని పలువు రు అంటున్నారు. మైదానంతో పోల్చుకుంటే దట్టమైన అడవులు పరచుకున్న మన్యసీమలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చీకట్లు కమ్ముకుంటున్నాయంటే చాలు.. గిరిపుత్రులు చలితో గజగజలాడుతున్నారు. జిల్లా అంతటా ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మారేడుమిల్లిలో 15, రంపచోడవరంలో 17 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం, అమలాపురాల్లో 19, కాకినాడలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజ¯ŒSలో ఇవే అతి తక్కువ ఉష్ణోగ్రతలు. చలికి తోడు దట్టమైన మంచు కమ్ముకుంటోంది. ఉదయం ఎనిమిది గంటలకు సైతం మంచు వీడడం లేదు. మన్యసీమ, కోనసీమలైతే దాదాపు ఉదయం పది గంటల వరకూ మంచు తెరల్లోనే ఉంటున్నాయి.
Advertisement