- పండగల్లో యథేచ్ఛగా కోడిపందేలు, గుండాటలు
- అధికార పార్టీ హవాతో అటువైపు కన్నెత్తి కూడా చూడని పోలీసులు
- పండగ ముగిశాక.. తామున్నామంటూ నిరూపించుకునే యత్నం
అంతా ముగిశాక.. హడావుడి
Published Mon, Jan 16 2017 11:15 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
సంక్రాంతి పండగ మూడు రోజులపాటు.. కోర్టు తీర్పులు.. 144 సెక్ష¯ŒS విధించామంటూ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు.. కోడిపందేలను అడ్డుకుంటామంటూ స్వయంగా ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన నిమ్మకాయల చినరాజప్ప చెప్పిన మాటలు.. గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోని పోలీసులు.. అంతా ముగిసిన తరువాత హడావుడి చేయడం విమర్శలకు తావిచ్చింది. సంప్రదాయం ముసుగులో అధికార పార్టీ నేతల సమక్షంలో.. వారి అండతో.. కత్తులు కట్టి మరీ పబ్లిక్‌గా కోట్లలో కోడిపందేలు ఆడినా పోలీసులు ఈ మూడు రోజులూ కిమ్మనలేదు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ, సోమవారం మురమళ్లలో నిర్వహించిన పొట్టేళ్ల పందేలను మాత్రం అడ్డుకోవడం విచిత్రంగా కనిపించింది. కోడిపందేల మాదిరిగానే పొట్టేళ్ల పందేలను కూడా ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబే ప్రారంభించారు. వీటికోసం కూడా షామియానాలతో భారీ బరులు, మినీ స్టేడియంను తలపించేలా, ఒకేసారి మూడు వేలమంది కూర్చుని వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేశారు. ఈ పందేలను తిలకించేందుకు టీడీపీకే చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఇతర రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఒక్కో పందెం రూ.2 లక్షల వంతున సాగితే, పైపందేలు కూడా లక్షల్లోనే జరిగాయి. పండగ మూడు రోజులూ విచ్చలవిడిగా సాగిన కోడిపందేలవైపు కన్నెత్తి కూడా చూడని పోలీసులు ఎందుకో కానీ పొట్టేళ్ల పందేలను మాత్రం అడ్డుకున్నారు. అమలాపురం డీఎస్సీ ఎల్.అంకయ్య, ముమ్మిడివరం సీఐ కేటీవీవీ రమణారావుల ఆధ్వర్యంలో వచ్చిన పోలీసులు ఈ పందేలను నిలిపివేశారు. ఇలా అడ్డుకోవడం తప్పని కాదు కానీ, ఇదే తీరులో కోడిపందేలను కూడా అడ్డుకుని ఉంటే పోలీసు యూనిఫాం గౌరవం మరింత పెరిగేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ వివక్ష ఏమిటో?
∙సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పలు ప్రాంతాల్లో చెలరేగుతున్న ఉద్యమాలపై ఏమాత్రం కనికరం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
∙దివీస్ పరిశ్రమతో తమ జీవనం ప్రశ్నార్థకమవుతున్న వేళ తిరుగుబాటు చేస్తున్న తొండంగి మండల ప్రజలను పోలీసులు నిరంకుశంగా అణచివేస్తున్నారు. వారికి మద్దతు ఇచ్చేందుకు వచ్చినవారిని ముందస్తు అరెస్టులు కూడా చేశారు.
∙మరోపక్క సీఎం చంద్రబాబు ఎన్నికల్లో బీసీ రిజర్వేష న్లు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ అమలు కోసం శాం తియుతంగా పాదయాత్ర చేస్తామన్న కాపు నేతలను, కాపులను అరాచక శక్తులుగా పరిగణించి కట్టడి చేశారు.
∙పోలవరం నిర్వాసితుల కోసం ఉద్యమిస్తున్న వామపక్ష నేతలను కట్టడి చేస్తూనే ఉన్నారు.
∙ఇలా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నవారిని సెక్ష¯ŒS–30 పేరుతో అణచివేస్తున్న పోలీసులు.. చట్టాన్ని ఉల్లంఘించి, పబ్లిక్‌గా కోట్లాది రూపాయల మేర కోడిపందేలు, గుండాటలు ఆడుతున్న పెద్దలను, వారికి దన్నుగా నిలిచిన అధికార పార్టీ నేతలను చూసీచూడనట్టు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement