![Banks continue to battle with slow growth in deposits in June quarter](/styles/webp/s3/article_images/2024/07/6/555.jpg.webp?itok=lhzaZjdU)
న్యూఢిల్లీ: డిపాజిట్ల వృద్ధి స్పీడ్‌ను పెంచడానికి బ్యాంకులు ప్రయతి్నంచినప్పటికీ జూన్ త్రైమాసికంలో నిరాశే మిగిలింది. తక్కువ వ్యయాలకే నిధుల సమీకరణకు దోహదపడే కరెంట్ ఖాతా – సేవింగ్స్ ఖాతా (సీఏఎస్‌ఏ–కాసా) డిపాజిట్‌లను సమీకరించడంలో బ్యాంకింగ్ పనితీరు అంత ప్రోత్సాహకరంగా లేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.
పలు అగ్రశ్రేణి బ్యాంకుల కాసా డిపాజిట్ సమీకరణ వృద్ధి స్పీడ్ 2023–24 మార్చి త్రైమాసికంతో పోలి్చతే తదుపరి 2024–25 జూన్ త్రైమాసికంలో తగ్గింది. కొన్ని బ్యాంకుల విషయంలో డిపాజిట్ల తీరు అక్కడక్కడే ఉండగా, మరికొన్నింటి విషయంలో క్షీణత సైతం నమోదయ్యింది. తొలి సమాచారం ప్రకారం 13 బ్యాంకుల మొత్తం డిపాజిట్లు మార్చి త్రైమాసికంలో పోలి్చతే జూన్ త్రైమాసికంలో 1.15 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసికంలో డిపాజిట్ల తీరు క్లుప్తంగా...
Comments
Please login to add a commentAdd a comment