Bank Deposits
-
డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలు
డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినూత్న ప్రొడక్టులను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. రికరింగ్ డిపాజిట్– క్రమానుగత పెట్టుబడి విధానం (ఎస్ఐపీ) కాంబో ప్రొడక్ట్సహా వినూత్నమైన ఉత్పత్తులను తీసుకురావాలని యోచిస్తున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నందున కస్టమర్లు ఆర్థికంగా మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలో డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వారు వినూత్న పెట్టుబడి సాధనాల కోసం వెతకడం ప్రారంభించారని కూడా తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడటంతో కస్టమర్లు తమ పెట్టుబడులపై అధిక రాబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ మేరకు పోర్ట్‌ఫోలియో రూపకల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.సహజంగానే ఎవరూ ప్రతి రూపాయినీ ప్రమాదకర లేదా ఊహాజనిత ఇన్వెస్ట్మెంట్లో ఉంచాలని కోరుకోరు. బ్యాంకింగ్ ప్రొడక్టులు ఎల్లప్పుడూ పోర్ట్‌ఫోలియోలో భాగమే. కాబట్టి మేము వారికి నచ్చే ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.రికరింగ్ డిపాజిట్ వంటి కొన్ని సంప్రదాయ ప్రొడక్టుల్లో కొత్త విధానాలు తీసుకురావాలని యోచిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్/ రికరింగ్ డిపాజిట్–ఎస్ఐపీను డిజిటల్‌గా యాక్సెస్ చేయగల కాంబో ప్రోడక్ట్‌గా రూపొందించాలనే ప్రతిపాదనలున్నాయి.తాజా ప్రొడక్టులు జన్ జెడ్‌లో (12 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు) ప్రాచుర్యం పొందడానికి అనుగుణమైన ఆవిష్కరణలపై బ్యాంక్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.అంతేకాకుండా, డిపాజిట్ సమీకరణ కోసం బ్యాంక్ భారీ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.ఇదీ చదవండి: బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!కొత్త ఖాతాలను తెరవడంపై బ్యాంక్ దృష్టి సారిస్తోంది. రోజుకు దాదాపు 50,000 నుంచి 60,000 సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నాం.ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లలో దాదాపు 50 శాతం డిజిటల్ ఛానెల్‌ల ద్వారానే తెరుస్తున్నాం.వచ్చే 3–5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటాలని దేశీయంగా బలమైన ఆర్థిక సంస్థగా అవతరించాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని బ్యాంక్ నమోదుచేసింది. -
ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్
డిపాజిట్‌దార్లు ఆన్లైన్లో తమ క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకునేలా డీఐసీజీసీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఆన్లైన్ టూల్ ‘దావా సూచక్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారులు తమ డిపాజిట్ల క్లెయిమ్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకే ఈ ‘దావా సూచక్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీఐసీజీసీ తెలిపింది.బ్యాంక్‌లో నమోదైన మొబైల్ నంబరు ద్వారా ఖాతాదారులు దావా సూచక్లోని సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అయితే 2024 ఏప్రిల్ 1 తర్వాత చేసిన క్లెయిమ్‌ల వివరాలు మాత్రమే ఈ టూల్ ద్వారా తెలుసుకునేందుకు వీలుందని డీఐసీజీసీ పేర్కొంది. సంస్థలు(ఇన్స్టిట్యూషన్స్) చేసే డిపాజిట్లు మినహా ఇతర అన్నిరకాల క్లెయిమ్‌లను ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంది. అంటే ఉదాహరణకు ఏదైనా బ్యాంకులోగానీ, ఎన్బీఎఫ్సీలోగానీ రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుకు బీమా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల బ్యాంక్ డీఫాల్ట్ అయితే రూ.5 లక్షలకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా రూ.5 లక్షలు మాత్రం కచ్చితంగా చెల్లిస్తారు.ఇదీ చదవండి: పెరిగిన ట్రక్ అద్దెలుదేశంలోని మొత్తం డిపాజిట్లలో 97.8 శాతం ఖాతాలు పూర్తిగా బీమా పరిధిలో ఉన్నాయని డీఐసీజీసీ తెలిపింది. అంటే ఈ మొత్తాలు రూ.5 లక్షల వరకే ఉన్నవి. మరో 2.2 శాతం రూ.5 లక్షలకు మించిన డిపాజిట్లు. వీటిల్లో ఎంత మొత్తం ఉన్నా రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. 1962లో ఈ బీమా రూ.1,500గా ఉండేది. దాన్ని ఫిబ్రవరి 04, 2020 వరకు ఆరుసార్లు సవరించి రూ.5 లక్షలకు పెంచారు. 2023లో డీఐసీజీసీ రూ.1,432 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది. -
ఈక్విటీ కరెక్షన్తో తిరిగి బ్యాంకుల్లోకి డిపాజిట్లు
ముంబై: ఈక్విటీ మార్కెట్లో దిద్దుబాటుతో బ్యాంక్‌లు తిరిగి డిపాజిట్లను ఆకర్షించగలవని ఎస్బీఐ ఎండీ అశ్విని తివారీ అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ డిపాజిట్ల వృద్ధికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలను కీలకంగా చూస్తున్నట్టు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్లలో ర్యాలీతో బ్యాంకుల్లోని డిపాజిట్లు అధిక రాబడులను ఇచ్చే ఇతర సాధనాల్లోకి మళ్లేలా చేసినట్టు పేర్కొన్నారు.కాలక్రమేణా మార్కెట్ కరెక్షన్కు లోనైతే గతంలో తమ వద్ద డిపాజిట్లుగా ఉండే కొంత మొత్తం తిరిగి వెనక్కి వస్తుందన్నారు. తక్కువ విలువైన, చిన్న ఖాతాల ద్వారా డిపాజిట్లు పెంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు తివారీ తెలిపారు. జన్‌ధన్ యోజన ఖాతాలపై గతంలో ప్రత్యేక దృష్టి ఉండేది కాదంటూ, ఇక మీదట ఆ ఖాతాలను కూడా కీలకంగా చూస్తామన్నారు. గడిచిన 18 నెలలుగా బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే రుణాల వృద్ధే అధికంగా నమోదవుతుండడం గమనార్హం. దీంతో డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు రేట్లను పెంచడం లేదంటే రుణ వృద్ధిలో రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.దేశ ఈక్విటీ మార్కెట్ గడిచిన ఏడాదిన్నర పాటు గణనీయమైన వృద్ధిని చూడడం గమనార్హం. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం ఈక్విటీ మ్యూచవుల్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న ధోరణి నెలకొంది. ఈ క్రమంలో అశ్విని తివారీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అన్సెక్యూర్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచడం, ప్రాజెక్టు రుణాలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడం వంటివి డిపాజిట్లలో వృద్ధి నిదానించడానికి సంకేతంగా తివారీ పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైతే డిపాజిట్ల రేట్లను సైతం పెంచుతామని ప్రకటించారు. ప్రత్యామ్నాయాలు.. సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో 90 శాతం మేర రుణ అవసరాలకు సరిపడా నిధులు డిపాజిట్ల రూపంలోనే వస్తుంటాయని.. ఇన్ఫ్రా బాండ్లు వంటి ఇతర సాధనాలవైపు చూడక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్ల వాటా తగ్గొచ్చని తివారీ చెప్పారు. సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియో చెల్లింపుల్లో ఎలాంటి వైరుధ్యాలు లేవన్నారు. -
భలే మంచి డిపాజిట్ బేరం!
గత కొన్నాళ్లుగా బ్యాంకుల రుణ వృద్ధి భారీగా ఎగబాకుతోంది. డిపాజిట్లు మాత్రం ఆ మేరకు పెరగడం లేదు. రెండింటి మధ్య కొంత అంతరం ఉండటం సహజమే కానీ, ఇంత భారీ వ్యత్యాసం ఉండకూడదు. దీనివల్ల బ్యాంకింగ్ రంగంలో వ్యవస్థాగత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) సమస్యలకు దారితీస్తుంది. ప్రజల పొదుపు ధోరణుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. దీన్ని అధిగమించేందుకు బ్యాంకులు వెంటనే తగిన వ్యూహాలను అమలు చేయాలి. – తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యక్తం చేసిన ఆందోళన ఇది.ఈ దెబ్బతో బ్యాంకులు డిపాజిట్ల వేటను ముమ్మరం చేశాయి. ప్రత్యేక స్కీమ్‌ల ద్వారా మరిన్ని రిటైల్ డిపాజిట్ల సమీకరణకు తెరతీస్తున్నాయి. ఇప్పటికే ఉన్న డిపాజిట్ పథకాలతో పోలిస్తే 25–30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు అంటే 1 శాతం) అధిక వడ్డీని కూడా ఆఫర్ చేస్తూ డిపాజిటర్లకు గాలం వేస్తున్నాయి. తాజా పరిణామాలతో, రుణా లపై అధిక వడ్డీరేట్ల భారం మరికొన్నాళ్లు కొనసాగుందని స్పష్టమవుతోంది. డిపాజిట్ల పెంపునకు తక్షణం చర్యలు చేపట్టాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు పొలోమంటూ కొత్త పథకాలను ప్రకటించాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), యూనియన్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రేసులో ముందున్నాయి. 7.25 శాతం నుంచి 7.3 శాతం మేర వడ్డీరేట్లతో డిపాజిట్ స్కీమ్‌లను ప్రకటించాయి. వీటి కాలవ్యవధి 399 రోజుల నుంచి 444 రోజుల వరకు ఉంటోంది. ఐఓబీ అత్యధికంగా 444 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై 7.3 శాతం వడ్డీ ఇస్తోంది. అంతేకాకుండా బ్యాంకులన్నీ సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అర శాతం వడ్డీని కూడా అందిస్తుండటంతో డిపాజిటర్లకు మేలు చేకూరుతోంది. ‘4% స్థాయికి ద్రవ్యోల్బణం శాంతిస్తే, ఆర్బీఐ రేట్ల కోత మొదలవుతుంది. అప్పుడు డిపాజిట్లపై అధిక రేట్ల వల్ల బ్యాంకుల వ్యయాలు పెరిగిపోతాయి. అందుకే బ్యాంకులు స్వల్ప కాలిక డిపాజిట్లకే అధిక వడ్డీని పరిమితం చేస్తున్నాయి’ అని ఇక్రా రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గుప్తా అభిప్రాయపడ్డారు. 20 ఏళ్లలో తొలిసారి... ఈ ఏడాది జూలై 12 నాటికి బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 11 శాతానికి పరిమితమైంది. అయితే, రుణ వృద్ధి మాత్రం 14 పైగా శాతంగా నమోదైంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ, డిపాజిట్ వృద్ధిలో ఇంత తేడా రావడం గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ అంతరాన్ని తగ్గించాల్సిందేనని బ్యాంకు సీఈఓలకు ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్ కూడా అందుకు మినహాయింపు కాదని, పాలసీ వడ్డీ రేట్ల కోత గురించి ఆలోచించడం తొందరపాటేనంటూ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా పేర్కొనడం విశేషం. కాగా, ప్రస్తుత వడ్డీ రేట్లతో రిటైల్ డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు కష్టతరంగా మారిందని, అందుకే పరిమిత కాల స్కీమ్‌లను ప్రారంభించాల్సి వస్తోందని ఓ వాణిజ్య బ్యాంకు ట్రెజరీ హెడ్ పేర్కొన్నారు.ప్రత్యేక డిపాజిట్ ఆఫర్స్...ఎస్బీఐ– అమృత్ వృష్టి: వడ్డీ రేటు 7.25% (కాల వ్యవధి 444 రోజులు) బ్యాంక్ ఆఫ్ బరోడా – మాన్సూన్ ధమాకా: 7.25% (399 రోజులు) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 7.15% (666 రోజులు) యూనియన్ బ్యాంక్: 7.25% (399 రోజులు) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 7.3% (444 రోజులు) -
బ్యాంక్ డిపాజిట్లు డీలా..
న్యూఢిల్లీ: డిపాజిట్ల వృద్ధి స్పీడ్‌ను పెంచడానికి బ్యాంకులు ప్రయతి్నంచినప్పటికీ జూన్ త్రైమాసికంలో నిరాశే మిగిలింది. తక్కువ వ్యయాలకే నిధుల సమీకరణకు దోహదపడే కరెంట్ ఖాతా – సేవింగ్స్ ఖాతా (సీఏఎస్ఏ–కాసా) డిపాజిట్లను సమీకరించడంలో బ్యాంకింగ్ పనితీరు అంత ప్రోత్సాహకరంగా లేదని గణాంకాలు పేర్కొంటున్నాయి. పలు అగ్రశ్రేణి బ్యాంకుల కాసా డిపాజిట్ సమీకరణ వృద్ధి స్పీడ్ 2023–24 మార్చి త్రైమాసికంతో పోలి్చతే తదుపరి 2024–25 జూన్ త్రైమాసికంలో తగ్గింది. కొన్ని బ్యాంకుల విషయంలో డిపాజిట్ల తీరు అక్కడక్కడే ఉండగా, మరికొన్నింటి విషయంలో క్షీణత సైతం నమోదయ్యింది. తొలి సమాచారం ప్రకారం 13 బ్యాంకుల మొత్తం డిపాజిట్లు మార్చి త్రైమాసికంలో పోలి్చతే జూన్ త్రైమాసికంలో 1.15 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసికంలో డిపాజిట్ల తీరు క్లుప్తంగా... -
బంగారం కొంటారా.. బ్యాంకుల్లో దాచుకుంటారా?
న్యూఢిల్లీ: భారతీయులు తమ ఆదాయాలను పరిరక్షించుకోడానికి ఏ మార్గాలను అన్వేషిస్తున్నారన్న అంశంపై మనీ9 నిర్వహించిన 2023 వార్షిక వ్యక్తిగత ఫైనాన్స్ పల్స్ సర్వే ఆసక్తికర అంశాలను వెలువరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 77 శాతం మంది బ్యాంక్ డిపాజిట్లు ఇందుకు తగిన మార్గమని పేర్కొంటే, 21 శాతం మంది బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావించారు. బీమా రంగంపై కూడా సానుకూల ధోరణి నెలకొంది. గతేడాది కన్నా 27 శాతం మంది అధికంగా జీవిత బీమా పాలసీలవైపు మొగ్గుచూపారు. 2022 సర్వేలో ఇది 19 శాతమే కావడం గమనార్హం. దాదాపు 20 రాష్ట్రాల్లో 35,000కుపైగా కుటుంబాల నుంచి ఈ సర్వే జరిగింది. రిసెర్చ్ ట్రయాంగిల్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఐ) ఇంటర్నేషనల్ సహకారంతో జరిగిన ఈ సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. సర్వేలో పాల్గొన్నవారిలో 53 శాతం మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిఉండకపోవడం ఆందోళన కలిగించే అంశం. స్టాక్ మార్కెట్ కూడా క్రమంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. 2022లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు కేవలం 3 శాతం ఉంటే, 2023లో ఇది 9 శాతానికి ఎగసింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు కూడా ఇదే సమయంలో 6 శాతం నుంచి 10 శాతానికి ఎగశాయి. దక్షిణ భారత నగరాలైన బెంగళూరు (69 శాతం), తిరువనంతపురం (66 శాతం) బంగారం పొదుపులో అగ్రగామిగా ఉండడం గమనార్హం. బీమా వ్యాప్తిలో మదురై (84 శాతం) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అమరావతి (79 శాతం), ఔరంగాబాద్ (76 శాతం) ఉన్నాయి. విలాసవంతమైన జీవనశైలిని అనుభవిస్తున్న భారతీయ కుటుంబాల శాతం 2022లో 3 శాతం ఉండగా, 2023లో 5 శాతానికి పెరిగింది. లగ్జరీ ప్రధానంగా మెట్రో నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, ఈ ధోరణి దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
బ్యాంక్ డిపాజిట్లపై పండుగ ఆఫర్లు
న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా బ్యాంక్‌లు రుణాలపై ప్రాసెసింగ్ చార్జీల రద్దు వంటి ఆఫర్లు ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ విడత బ్యాంక్‌లు డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మధ్య స్థాయి బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు సేవింగ్స్ డిపాజిట్లపై ప్రత్యేక రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. మరిన్ని డిపాజిట్లను ఆకర్షించేందుకు అవి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అయితే డిపాజిట్లపై ఏకంగా 9.50 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. రిటైల్ డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, తమ డిపాజిట్ బేస్‌ను పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో బ్యాంక్‌లు ప్రధానంగా బల్క్ డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే, బల్క్ డిపాజిట్ల కంటే రిటైల్ డిపాజిట్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే నాలుగు రకాల సేవింగ్స్ ఖాతాలను ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై రేట్లను 0.50 శాతం వరకు పెంచింది. వివిధ కాలావధితో కూడిన బల్క్ డిపాజిట్లపై రేట్లను ఒక శాతం మేర పెంచింది. యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ అయితే సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై ఏకంగా 7–8 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఏడాది టర్మ్ డిపాజిట్లపైనే ప్రస్తుతం ఈ రేటు లభిస్తుండడం గమనార్హం. కొన్ని బ్యాంకుల్లో 1–3 ఏళ్ల టర్మ్ డిపాజిట్ రేట్లు ఇంతకంటే తక్కువే ఉండడాన్ని గమనించొచ్చు. పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక రేట్లతో ప్రత్యేక పథకాలను కూడా బ్యాంక్‌లు ప్రకటిస్తున్నాయి. ‘‘టర్మ్ డిపాజిట్ల కంటే సేవింగ్స్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఇది చాలా అసహజంగా కనిపిస్తోంది. ఇది కేవలం మార్కెటింగ్ ఎత్తుగడే’’అని మాక్వేర్ రీసెర్చ్ పేర్కొంది. కాసా వృద్ధి కోసం పాట్లు బ్యాంకులకు కరెంట్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు (కాసా) చాలా కీలకం. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై సాధారణంగా 3–4 శాతం మించి బ్యాంక్‌లు రేట్లను ఆఫర్ చేయవు. కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లపై అసలు వడ్డీని ఆఫర్ చేయవు. దీంతో కాసా డిపాజిట్లపై బ్యాంకులకు అయ్యే వ్యయాలు చాలా తక్కువ. అందుకే బ్యాంక్‌లు కాసా డిపాజిట్ల వృద్ధిని ప్రాధాన్యంగా చూస్తుంటాయి. ఇటీవలి కాలంలో కాసా డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, రుణాల వృద్ధిని కాపాడుకునేందుకు అవి నిధుల కోసం అవి సేవింగ్స్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తున్నట్టుందని మాక్వేర్ రీసెర్చ్ తెలిపింది. మొత్తం డిపాజిట్ల వృద్ధిలో సేవింగ్స్ డిపాజిట్ల వృద్ధి 6–7 శాతం తక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. దేశంలోని టాప్–6 బ్యాంక్‌లు మొత్తం సేవింగ్స్ డిపాజిట్లలో 55 శాతం వాటా కలిగి ఉన్నాయి. క్యూ1లో టర్మ్ డిపాజిట్లు ఇతర అన్ని విభాగాలతో పోలిస్తే అధికంగా 17.4 శాతం వద్ధి చెందినట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేస్తోంది. అదే సేవింగ్స్ డిపాజిట్లలో వృద్ధి కేవలం 4.9 శాతంగానే ఉంది. -
సాధికారత సాక్షాత్కారం.. మహిళల బ్యాంకు డిపాజిట్లలో టాప్‌లో ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సాధికారత సాక్షాత్కారమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా అందజేస్తున్న చేయూతతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు వారి జీవన స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ అభ్యున్నతి దిశగా సాగిపోతున్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ వారు విద్య, వ్యాపార రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నారు. ఇందుకయ్యే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్బీఐ రిసెర్చి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 నుంచి 2023 సంవత్సరాల మధ్య డిపాజిట్లు, రుణాలపై సవివర నివేదిక విడుదల చేసింది. ‘మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలే. స్థిరమైన మహిళా సాధికారతకు ఇవి నిదర్శనం’ అని ఆ నివేదిక పేర్కొంది. దేశంతో పాటు రాష్ట్రంలో మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడంతో పాటు మహిళలకు బ్యాంకు రుణాలు కూడా పెరుగుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం బ్యాంకు డిపాజిట్లలో మహిళలు చేసినవే 35 శాతానికిపైగా ఉన్నాయని తెలిపింది. దేశంలో 2019 – 2023 మధ్య మహిళలు చేసిన తలసరి డిపాజిట్ మొత్తం రూ.4,618కి పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6,444కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2023 మార్చికి మొత్తం డిపాజిట్లు రూ. 4.56 లక్షల కోట్లు ఉండగా అందులో మహిళలు చేసినవి రూ.1.59 లక్షల కోట్లు’ అని ఆ నివేదిక వివరించింది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా మహిళల∙డిపాజిట్లు 35 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణలో మహిళల డిపాజిట్ల పెరుగుదల తక్కువగా ఉందని పేర్కొంది. ముగిసిన 2022–23 ఆరి్థక సంవత్సరంలో దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు 10.2 శాతం పెరిగాయని, వీటిలో వ్యక్తుల వాటా తగ్గిందని తెలిపింది. ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లలో మహిళా కస్టమర్ల వాటా 20.5 శాతానికి పెరిగిందని విశ్లేషించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుదల దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. కోవిడ్ సంక్షోభం ముందు సంవత్సరం 2019లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్ల వాటా 25 శాతం ఉండగా 2023కి 30 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్లు బాగా పెరుగుతున్నాయని, 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఇవి 50 శాతానికి చేరాయని పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో 37 శాతం 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపల వారివేనని, వారి వ్యక్తిగత డిపాజిట్లు రూ. 34.7 లక్షల కోట్లని తెలిపింది. 60 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్ల డిపాజిట్లు రూ. 36.2 లక్షల కోట్లు అని, ఈ వ్యక్తిగత డిపాజిట్లు 38 శాతమని తెలిపింది. 60 సంవత్సరాల పైబడిన సీనియర్ మహిళల వ్యక్తిగత డిపాజిట్లు రూ.13.2 లక్షల కోట్లుగా తెలిపింది. పెరిగిన మహిళల పరపతి మరో పక్క గత తొమ్మిదేళ్లుగా మహిళలకు వ్యక్తిగత బ్యాంకు రుణాల మంజూరు బాగా పెరిగిందని నివేదిక తెలిపింది. గత తొమ్మిదేళ్లలో దేశంలో కొత్తగా 7.6 కోట్ల మహిళలకు రూ.10.3 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి మహిళలకు బ్యాంకు రుణాల మంజూరు బాగా పెరిగిందని తెలిపింది. 2019 మార్చికి రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన బ్యాంకు రుణాలు రూ.47,548 కోట్లు ఉండగా 2023 మార్చికి ఏకంగా రూ.1,44,792 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. అంటే ఈ నాలుగేళ్లలో రుణాలు మూడింతలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి ఈ నివేదికే తార్కాణమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడి జీవనం కొనసాగిస్తున్నారని, దీంతో డిపాజిట్లు, వారి పరపతి పెరగడంతో వారికి రుణాలివ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. -
రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్ డిపాజిట్లు
ముంబై: ఆర్బీఐ రూ.2,000 నోటును ఉపసంహరిస్తున్నట్టు చేసిన ప్రకటన బ్యాంక్ డిపాజిట్లు భారీగా పెరిగేందుకు దారితీసింది. బ్యాంక్ డిపాజిట్లు ఆరేళ్ల గరిష్టానికి చేరి, జూన్ 30 నాటికి 191.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యవస్థలో రూ.2,000 నోటు రూపంలో మొత్తం రూ.3.62 లక్షల కోట్లు చెలామణిలో ఉండగా, ఇందులో 75 శాతానికి పైగా బ్యాంక్‌లోకి తిరిగొచ్చినట్టు ఈ నెల మొదట్లో ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం. అంటే రూ.2.7 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు కేవలం రూ.2,000 నోటు రూపంలోనే వచ్చినట్టు తెలుస్తోంది. ఏడాదిలో చూసుకుంటే బ్యాంక్ డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.191.6 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. 2017 మార్చి తర్వాత ఇదే గరిష్ట స్థాయి అని చెప్పారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగడం, రూ.2,000 నోటు ఉపసంహరణ ఇందుకు మద్దతుగా నిలిచినట్టు తెలిపారు. డిపాజిట్లు, రుణాల మధ్య వ్యత్యాసం 3.26 శాతం మేర జూన్ 30తో ముగిసిన పక్షం రోజుల్లో తగ్గింది. మరోవైపు రుణాల్లో వృద్ధి 16.2 శాతంగా ఉంది. ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ జూన్ 30తో ముగిసిన పక్షం రోజుల్లో రూ.143.9 లక్షల కోట్లకు రుణాలు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ, వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రుణ వితరణలో వృద్ధి 14.5 శాతంగానే ఉంది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాల (పీఎల్ఐ) మద్దతుతో మూలధన వ్యయాలు పెరుగుతుండడం, ఇక ముందూ రుణాలకు డిమాండ్‌ను నడిపిస్తుందని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023–24లో 13–13.5 శాతం వృద్ధి చెందొచ్చని పేర్కొంది. -
రూ.154 కోట్లకు తగ్గిన ఎన్పీఏ
సుభాష్‌నగర్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ నిరర్థక ఆస్తుల విలువ (ఎన్పీఏ) రూ.220 కోట్ల నుంచి రూ.154 కోట్లకు తగ్గించడం అభినందనీయమని, ఎన్పీఏ మరింత తగ్గేలా చైర్మన్లు, బ్యాంకు సిబ్బంది కృషి చేయాలని డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్‌రెడ్డి సూచించారు. మంగళవారం వైఎస్ఆర్ సహకార భవనంలో జరిగిన డీసీసీబీ 101వ మహాజన సభకు ఆయన అధ్యక్షత వహించారు. బ్యాంకు సీఈవో గజానంద్ నివేదికను చదివారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్పీఏ రికవరీ సిబ్బందికి చైర్మన్లు సహకరించాలని, తద్వారా మరింత మంది రైతులకు నూతనంగా రుణాలు ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) గడువు జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడగించామని తెలిపారు. బ్యాంకు ద్వారా గ్రామీణ, పట్ట ణ ప్రాంతాల్లో హౌజింగ్ రుణాలు, విద్య, కార్లు, తదితర వాటికి రుణాలు అందించనున్నామన్నారు. బంగారు ఆభరణాలపై రూ.200 కోట్ల వరకు రు ణాలు ఇచ్చామని, ఈయేడాది రూ.50 కోట్ల వరకు రుణాలు పెంచామన్నారు. రైతులకు వానాకాలం పంటరుణాలు ఇస్తున్నారని తెలిపారు. జీవోనెంబర్ 44 ప్రకారం మార్జిన్ అకౌంట్లో నగదు జమ చేసు కున్న తర్వాతే రుణాలకు సంబంధించి మిగతా సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించారు. బ్యాంకు రూ.2.58 కోట్ల వార్షిక లాభంలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో 144 సొసైటీ కేంద్రా ల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు డిపాజిట్లు రూ.614 కోట్ల నుంచి రూ.641.64 కోట్లకు పెరిగాయన్నారు. మనందరం రైతులకు అండగా ఉంటూ వారికి సేవ చేయడంలో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్, గోనె సంచులు, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, గోదాములకు రుణాలు, తదితర అంశాలను సొసైటీ చైర్మన్లు ప్రస్తావించారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలపై వైస్ చైర్మన్ రమేష్‌రెడ్డి, సీఈవో గజానంద్, డీసీఓ సింహాచలం సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. సభలో డీసీసీబీ డైరెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, గోర్కంటి లింగన్న, శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. -
బ్యాంకుల్లోకి రూ.1.5 లక్షల కోట్ల డిపాజిట్లు
ముంబై: బ్యాంకుల్లోకి రూ.2,000 నోట్ల రూపంలో రూ.1–1.5 లక్షల కోట్ల వరకు డిపాజిట్లు అదనంగా వచ్చి చేరొచ్చని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త సౌగత భట్టాచార్య తెలిపారు. దీంతో 2023–24లో డిపాజిట్లలో వృద్ధి 11 శాతానికి పైగా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్బీఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడం తెలిసిందే. వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ నోట్లను వచ్చే సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో మార్చుకోవడం లేదా ఖాతాలలో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. రుణాల్లో వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతానికి తగ్గొచ్చని భట్టాచార్య అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్బీఐ వచ్చే వారం సమీక్షలో రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించొచ్చని, రేట్లను తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు అయితే లేదన్నారు. వృద్ధిపై ఒత్తిళ్లు ఉన్నందున 2023–24 నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటున 4.8 శాతం స్థాయిలో ఉండొచ్చన్నారు. ఇది ఆర్బీఐ నిర్ధేశిత లక్ష్యంలోపు అనే విషయాన్ని గుర్తు చేశారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. చిన్న మొత్తాల వడ్డీ రేట్లు పెంపు!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వీటిపై వడ్డీ రేట్లను ఒక శాతం వరకు పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి – మార్చి కాలానికి కొత్త రేట్లు అమలు కానున్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 2.25 శాతం మేర కీకలమైన రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సవరించినట్టు తెలుస్తోంది. వివిధ పథకాలపై పెంపు 0.20–1.1 శాతం మధ్య ఉంది. తాజా పెంపు తర్వాత కొన్ని పెట్టుబడి పథకాలు ఆకర్షణీయంగా మారాయి. ప్రధానంగా జీవిత లక్ష్యాలకు ఉపకరించే, దీర్ఘకాలంతో కూడిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై రేట్లు పెరగలేదు. అలాగే, సేవింగ్స్ డిపాజిట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేట్లలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. నాలుగేళ్ల విరామం తర్వాత ఈ పథకాల రేట్లను కేంద్ర సర్కారు 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సవరించడం గమనార్హం. అప్పుడు 0.10–0.30 శాతం మేర మూడు పథకాల రేట్లను పెంచింది. తాజా సవరణ తర్వాత బ్యాంక్ ఎఫ్డీ రేట్లకు, ఈ పథకాల రేట్లకు పెద్దగా వ్యత్యాసం లేదు. -
వెంకన్న వద్ద 10,258.37 కిలోల బంగారం
సాక్షి, అమరావతి, తిరుమల: తిరుమల శ్రీవారి మిగులు బంగారం, నగదు డిపాజిట్లన్నీ ప్రముఖ జాతీయ బ్యాంకుల్లో భద్రంగా దాచినట్లు టీటీడీ తెలిపింది. వెంకన్న ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు తరచూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో బ్యాంకులో దాచిన బంగారం, బ్యాంకు డిపాజిట్లపై టీటీడీ శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. బ్యాంకుల వారీగా ఏ బ్యాంకులో ఎంత బంగారం, డిపాజిట్లు ఉన్నాయన్న వివరాలను అందులో వెల్లడించారు. మూడేళ్లలో రూ.2,913.59 కోట్లు పెరిగిన డిపాజిట్లు ప్రస్తుతం 24 బ్యాంకుల్లో స్వామి వారి పేరిట రూ.15,938.68 కోట్లు డిపాజిట్లుగా ఉన్నట్లు టీడీపీ శ్వేతపత్రంలో వెల్లడించింది. 2019 జూన్ 30వతేదీ నాటికి రూ.13,025.09 కోట్లు ఉండగా కరోనా లాంటి అవాంతరాలు ఎదురైనా మూడేళ్లలో బ్యాంకుల్లో స్వామి వారి నగదు నిల్వ రూ.2,913.59 కోట్లు పెరగడం విశేషం. అత్యధికంగా రూ.5,358.11 కోట్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో డిపాజిట్లున్నాయి. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.50.77 కోట్లు స్వామి వారి నగదు బ్యాంకు డిపాజిట్లుగా ఉండగా ఇప్పుడు వాటిని ఇతర జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.1.30 కోట్లు మాత్రమే స్వామి వారి డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొంది. 95% మిగులు బంగారం ఎస్బీఐలోనే.. 2019 జూన్ 30 తర్వాత బ్యాంకుల్లో స్వామి వారి మిగులు బంగారం నిల్వలు 2,918.63 కిలోలు పెరిగినట్లు టీటీడీ తెలిపింది. 2019 జూన్ 30 నాటికి 7,339.74 కిలోల బంగారం బ్యాంకుల్లో ఉండగా ఇప్పుడు 10,258.37 కిలోలకు పెరిగింది. భక్తులు స్వామి వారి హుండీలో సమర్పించే బంగారు కానుకలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మింట్‌లో కరిగించిన అనంతరం నిల్వలను 12 ఏళ్ల కాలానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో బ్యాంకుల్లో ఉంచినట్లు టీటీడీ పేర్కొంది. స్వామివారి మిగులు బంగారంలో 95 శాతం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో దాచినట్లు తెలిపింది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు శ్రీవారి బంగారం, నగదు డిపాజిట్లను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా కొన్నాళ్లుగా సాగిస్తున్న ప్రచారాన్ని భక్తులెవరూ విశ్వసించవద్దని టీటీడీ శ్వేతపత్రంలో విజ్ఞప్తి చేసింది. 2019 తర్వాత స్వామి ఆస్తులను భద్రపరచే అంశంపై కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు వివరించింది. కరోనా సమయాల్లోనూ నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని స్వామివారి ఆదాయం పెరుగుదలకే చర్యలు చేపట్టిందని, మంచి పేరున్న జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఆస్తులను భద్రపరుస్తున్నట్లు తెలిపింది. జాతీయ బ్యాంకుల్లోనే.. టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ డబ్బులు ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఇవ్వదు. చైర్మన్, టీటీడీపై బురద చల్లేందుకు కొందరు హిందూ మత వ్యతిరేకులు ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పటిదాకా రూ.15,900 కోట్లకుపైగా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశాం. ఇకపై కూడా వడ్డీ ఎక్కువ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తాం. – ధర్మారెడ్డి, టీటీడీ ఈవో -
Sakshi Cartoon 22-09-2022
ఇక మన పని స్టార్ట్ చేద్దాం! బ్యాంకులో రుణం తీసుకొని నువ్వు లండన్ వెళ్లు.. నేను అమెరికా వెళ్తా.. నువ్వేమో సింగపూర్.. అతను దుబాయ్! -
బ్యాంకుల్లో జనం దాచుకుంది కోటీ 35 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తలసరి అప్పు గురించి విన్నాం.. తలసరి ఆదాయం గురించి తెలుసుకున్నాం.. దేశం, రాష్ట్రాల అప్పుల చర్చలూ చూశాం.. మరి మన దేశంలో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రూపాల్లో దాచుకున్న సొమ్ము ఎంతో తెలుసా..? రూ.1,35,59,212 కోట్లు.. అక్షరాల్లో చెప్పాలంటే.. కోటీ 35 లక్షల కోట్ల పైచిలుకే. దీనిని మన దేశ జనాభాతో సగటున లెక్కిస్తే ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు అని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ లెక్కలను వెల్లడించింది. ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్ (2021–22) పేరిట రిజర్వు బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. అందులో 1983వ సంవత్సరం నుంచీ 2021–22 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన సొమ్ము లెక్కలను వెల్లడించింది. సేవింగ్స్ భారీగా పెరుగుతూ.. 1983–84 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు దాచుకున్న సేవింగ్స్ డిపాజిట్ల విలువ రూ.17,811 కోట్లు. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.17,430 కోట్లు ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నారు. పదేళ్ల తర్వాత అంటే 1993–94లో సేవింగ్స్ డిపాజిట్లలో సొమ్ము రూ.71,151 కోట్లకు చేరింది. విదేశీ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు రూ.1,718 కోట్లుగా ఉన్నాయి. మరో పదేళ్ల తర్వాత అంటే.. 2003–04 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.3.85 లక్షల కోట్లు దాటాయి. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు చేసిన డిపాజిట్లు రూ.12,232 కోట్లకు చేరాయి. ఇక 2013–14 నాటికి సేవింగ్స్ రూ.20 లక్షల కోట్లు దాటాయి. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.19.6 లక్షల కోట్లకుపైగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.40,390 కోట్లకు చేరాయి. 2014 నుంచి సేవింగ్స్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) ఏడాది భారత బ్యాంకుల్లో విదేశీ బ్యాంకుల్లో మొత్తం 2014–15 21,78,847 41,046 22,19,893 2015–16 24,92,846 43,698 25,36,544 2016–17 33,40,707 52,876 33,93,583 2017–18 35,99,341 55,896 36,55,237 2018–19 39,72,547 58,630 40,31,177 2019–20 42,85,362 65,384 43,50,746 2020–21 49,74,715 81,092 50,55,807 2021–22 55,94,034 87,284 56,81,318 2014 నుంచి వివిధ టర్మ్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) ఏడాది 90 రోజుల్లోపు 6 నెలలు–ఏడాది 5 ఏళ్లపైన 2014 3,64,909 7,34,703 7,73,620 2015 4,27,722 7,19,993 7,91,137 2016 4,35,318 5,55,536 8,47,659 2017 4,47,000 8,40,158 9,45,980 2018 4,25,420 8,05,586 10,00,865 2019 5,16,651 6,19,998 9,25,059 2020 10,84,623 4,58,797 9,93,286 2021 13,02,760 7,96,325 7,47,654 (ఆరు నెలల లోపు, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య.. ఇలా అన్నిరకాల టర్మ్ డిపాజిట్లు కలిపి 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము రూ.78,77,894 కోట్లు అని రిజర్వుబ్యాంకు నివేదికలో పేర్కొంది) అయితే తక్కువ.. లేకుంటే సుదీర్ఘంగా.. టర్మ్ (ఫిక్స్డ్) డిపాజిట్ల విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా అయితే 90 రోజుల్లోపు లేదా ఐదేళ్ల కన్నా ఎక్కువకాలం ఉండే టర్మ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1998లో 90 రోజుల్లోపు టర్మ్ డిపాజిట్ల విలువ రూ.41,365 కోట్లుకాగా.. 2008 నాటికి 1.51 లక్షల కోట్లకు, 2018నాటికి 4.25 లక్షల కోట్ల కు, 2021–22 నాటికి 13,02,760 కోట్లకు చేరాయి. ఇక ఐదేళ్లకన్నా ఎక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లు 1998లో రూ. 46,231 కోట్లు ఉంటే, 2008 నాటికి రూ.1.65 లక్షల కోట్లకు, 2018 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. అయితే 2021 నాటికి ఇవి రూ.7.47 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్బీఐ రాష్ట్రాల వారీగా లెక్కలేమీ వెల్లడించలేదు. అయితే ఆదాయ స్థాయిని బట్టి పొదుపు ఉంటుందనే ఆర్థిక సూత్రం ప్రకారం.. తెలంగాణలో సేవింగ్స్ ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ తలసరి కంటే రాష్ట్ర తలసరి ఆదాయమూ ఎక్కువేనంటున్నారు. ఈ లెక్కన మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో సేవింగ్స్ సొమ్ము ఎక్కువే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
బ్యాంక్ స్టేట్మెంట్నే మార్చి మరీ..
వెల్దుర్తి(తూప్రాన్) : మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో పొదుపు సంఘాల సభ్యుల డబ్బుల చెల్లింపుల్లో వీవోఏలు నమ్మితే నట్టేట ముంచుడే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మహిళా సంఘం సభ్యులు ప్రతినెలా బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల చెల్లింపులోనూ వీవోఏలు చేతివాటం ప్రదర్శించారు. ఈ నెల 20న విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలను గుర్తించి వీవోఏ–2 మాధవి నుంచి రూ.4,65,798 రికవరీకి ఆదేశించారు. విచారణ సమయంలో అధికారులు, మహిళలకు చిక్కకుండా గ్రామానికి చెందిన వీవోఏ–1 మానస ఏకంగా బ్యాంక్ స్టేట్మెంట్ రికార్డులను ఫోర్జరీ చేసినట్లు సుమిత్ర సంఘం సభ్యులు గుర్తించారు. మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి పొదుపు సంఘం సభ్యులు రూ. 20 వేలు చొప్పున వీవోఏ మానసకు డబ్బులు అప్పగించగా బ్యాంకులో మాత్రం కేవలం రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేసింది. సభ్యులకు అనుమానం రాకుండా బ్యాంక్ వోచర్లో ఇరవై వేలుగా మార్చి అక్షరాల్లోనూ రాసి రశీదులను అందజేసింది. విచారణలో బయట పడుతుందని.. విచారణ సమయంలో తక్కువ డబ్బులు డిపాజిట్ చేసిన విషయం బయట పడుతుందనే ఉద్దేశ్యంతో బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ను సైతం ఓ జిరాక్స్ సెంటర్లో మార్చి అటు అధికారులు, ఇటు పొదుపు సంఘాల సభ్యులను పక్కదారి పట్టించింది. మానస తీరుపై అనుమానం వచ్చిన సుమిత్ర సంఘం సభ్యులు శుక్రవారం బ్యాంక్‌లో స్టేట్మెంట్ తీసుకోగా అందులో రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. దీంతో గ్రామచావిడి వద్ద వీవోఏ మానసను కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రజిత ఎదుటే నిలదీశారు. రుణాల మంజూరు విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమను మోసం చేసి డబ్బులు కాజేసిన విషయమై త్వరలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పొదుపు సంఘాల సభ్యులు తెలిపారు. -
బ్యాంకుల్లో డిపాజిట్లు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని వివరాలను వెంటనే తమకు పంపాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, స్థానిక సంస్థలు, జిల్లా కలెక్టర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల వివరాలు, ఆయా అకౌంట్లలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను వెంటనే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో నంబర్ 18ని జారీ చేశారు. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ నేపథ్యంలో బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై పలు జాగ్రత్తలను సూచిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు అకౌంట్లన్నింటినీ ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకునే తెరిచారా.. లేదా? ప్రస్తుతమున్న అకౌంట్లను సమీక్షించి అవసరం లేని అకౌంట్లను మూసివేసే అంశాలపై వచ్చే నెల 10వ తేదీ కల్లా నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆయా బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల పరిస్థితిని పరిశీలించాలని, డిపాజిట్ చేసిన మేరకు నగదు ఉందో లేదో తనిఖీ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల నుంచి తాజాగా సర్టిఫికెట్లు తీసుకుని తమకు పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. ఒకే బ్యాంకులోకి డిపాజిట్లు.. అదే విధంగా ఒక శాఖ లేదా సంస్థకు పలు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్యానెల్మెంట్ చేసిన ఏదైనా ఒకే బ్యాంకులోకి మార్చాలని, ఈ క్రమంలో వడ్డీ తగ్గకుండా చూసుకోవాలని కోరింది. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్‌ను క్లోజ్ చేసే అవకాశం లేకపోతే ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలని పేర్కొంది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వివరాలన్నింటినీ ప్రతి నెలా 10వ తేదీ కల్లా అప్డేట్ చేయాలని వెల్లడించింది. ఇక నుంచి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కొత్తగా బ్యాంకు అకౌంట్లు తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను డిపాజిట్ల రూపంలోకి ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని, డిపాజిట్ల ఉపసంహరణ కాలపరిమితి ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫిక్స్డ్ డిపాజిట్ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో నగదు రూపంలో లావాదేవీలు జరగకూడదని, కచ్చితంగా ప్రభుత్వ అధికారిక ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులపై వచ్చిన వడ్డీని ఆ పథకం కిందనే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది. వడ్డీ కింద వచ్చిన మొత్తాన్ని ఖర్చు చేసే విషయంలో వార్షిక ఆడిట్ నివేదికలో స్పష్టంగా నమోదు చేయాలని ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
కోవిడ్‌లో భారీగా డబ్బులు సేవింగ్!
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున డబ్బులను బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆర్బీఐ నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి డిపాజిట్లలో 12.32 శాతం మేర వృద్ధి నమోదైంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన డిపాజిట్లలో 15.27 శాతం మేర వృద్ధి నమోదైంది. ఇక ఏపీలోని బ్యాంకు డిపాజిట్లలో 10.74 శాతం వృద్ధి రికార్డయ్యింది. రాష్ట్రంలో 2020 మార్చి నాటికి రూ.3,24,873 కోట్ల బ్యాంకు డిపాజిట్లుండగా.. 2021 మార్చి నాటికి రూ.3,59,770 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి పెరుగుదలే కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటకలో 2021 మార్చి నాటికి అత్యధికంగా రూ.12,56,023 కోట్ల డిపాజిట్లుండగా.. ఏపీలో రూ.3,59,770 కోట్ల డిపాజిట్లున్నాయి. -
వారం రోజుల వ్యవధిలో 6.11 శాతం పెరిగిన బ్యాంకింగ్ రుణ వృద్ధి
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021 జూలై 30 తేదీతో ముగిసిన పక్షం రోజులకు (జూలై 31, 2020తో పోల్చి) 6.11 శాతం పెరిగింది. విలువలో ఇది రూ.102.82 లక్షల కోట్ల నుంచి రూ.109.1 లక్షల కోట్లకు చేరింది. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే కాలంలో డిపాజిట్ల రేటు 9.8 శాతం పెరిగి 141.61 లక్షల కోట్ల నుంచి రూ.155.49 లక్షల కోట్లకు ఎగసింది. 2021 జూలైతో ముగిసిన పక్షం రోజుల్లో రుణ వృద్ధి రేటు 6.45 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 10.65 శాతం. గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) బ్యాంక్ రుణ వృద్ధి 5.56 శాతం. డిపాజిట్ల వృద్ధి 11.4 శాతం. -
బ్యాంకులకు వస్తలేరు..
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని ఓ బ్యాంకులో ప్రతిరోజూ సగటున రూ.50 లక్షల డిపాజిట్లు వచ్చేవి. దాదాపు 300 మంది ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి వివిధ రకాల సేవలు పొందేవారు. కానీ లాక్డౌన్ కారణంగా పరిస్థితి మారింది. బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య 50కి మించట్లేదు. అలాగే నగదు డిపాజిట్లు రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలోనే ఉంటున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఖాతాదారుల తాకిడి పూర్తిగా తగ్గిపోతోంది. గతంలో సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు సాగిస్తుండగా, ప్రస్తుతం సా.4 గంటలు దాటగానే బ్యాంకుకు తాళం పడుతోంది. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్.. బ్యాంకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో బ్యాంకుల్లోని లావాదేవీల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక సేవలు విస్తృతం అవుతున్న తరుణంలో నగదు జమలు, ఉపసంహరణ కోసం బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు ప్రస్తుతం క్యాష్ డిపాజిట్ మెషీన్లు (సీడీఎం), ఏటీఎం మెషీన్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుండగా.. లాక్‌డౌన్‌తో పరిస్థితి మరింతగా మారింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం, శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించడం వంటి నిబంధనలను బ్యాంకులు కఠినతరం చేశాయి. దాదాపు 2 నెలలుగా రోజువారీగా బ్యాంకుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య సగానికి తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతానికిపైగా తగ్గినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. రోజువారీగా వచ్చే డిపాజిట్లు సైతం 40 శాతానికి తగ్గినట్లు పేర్కొంటున్నారు. సడలింపుల తర్వాత.. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు అమలవుతుంది. ఆ తర్వాత పొడిగింపు ఉంటుందా.. లేదా అనే దానిపై ఇంకా సందిగ్ధం ఉన్నా.. ప్రస్తుతం ఇచ్చిన సడలింపులు మార్కెట్లో వ్యాపారులకు భారీ ఊరటనిచ్చింది. ఈ పరిస్థితులతో బ్యాంకుల్లోనూ కాస్త సందడి నెలకొన్నా.. రోజువారీ లావాదేవీల్లో పెద్దగా మార్పులు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. సడలింపులు ఇప్పుడిప్పుడే మొదలుకావడంతో కొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బ్యాంకుకు వచ్చే కస్టమర్లలో రోజువారీ లావాదేవీలు జరిపే వారిని పక్కనబెడితే రుణగ్రహీతలే బ్యాంకుకు కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త రుణాల మంజూరీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇదివరకు తీసుకున్న రుణాలపై టాప్అప్ తీసుకోవడం, రీ షెడ్యూలింగ్ తదితర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పుడిప్పుడే వ్యాపార సంస్థలు తెరుచుకుంటుండగా.. వాటి లావాదేవీలు ఇంకా ఊపందుకోలేదు. దీంతో బ్యాంకుల్లో నగదు జమలు ఇంకా పెరగట్లేదు. మరోవైపు రెడ్జోన్లలో కొత్త ఖాతాలు ఇవ్వొద్దనే సూచనలు డిపాజిట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. 11 శాతం పెరిగిన సీడీఎం డిపాజిట్లు.. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు భౌతిక దూరం పాటించడంతో ఎక్కువ సమయం పడుతుందన్న భావన ఖాతాదారుల్లో ఉంది. దీంతో బ్యాంకులో కాకుండా సమీపంలోని సీడీఎంలో డిపాజిట్ చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. గత రెండు నెలల్లో సీడీఎం డిపాజిట్లు 11 శాతం పెరిగినట్లు నగరంలోని ఓ నేషనలైజ్డ్ బ్యాంకు చేసిన పరిశీలన చెబుతోంది. మరోవైపు బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేసేందుకు బ్యాంకు మిత్ర (బీఎం), బిజినెస్ కరస్పాండెంట్(బీసీ)లను ప్రతి బ్యాంకు అందుబాటులోకి తెచ్చింది. మేజర్ పంచాయతీలతో పాటు 2, 3 గ్రామాలు కలిపేలా ఒక బీఎం, బీసీ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఆయా నిర్వాహకులకు బ్యాంకులు కమీషన్ల రూపంలో చెల్లింపులు చేస్తుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో బీఎం, బీసీ పాయింట్ల వల్ల ఖాతాదారులకు ఊరట లభించిందని శంషాబాద్‌లోని ఓ బ్యాంకు కార్యనిర్వాహణాధికారి ‘సాక్షి’తో అన్నారు. -
డిపాజిట్లకు ‘ఐదు లక్షల’ అభయం
న్యూఢిల్లీ: సామాన్య బ్యాంకు డిపాజిటర్లకు భరోసాను కల్పించే తీపి కబురును నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిపాజిట్లకు మరింత రక్షణ కల్పిస్తూ, వాటిపై బీమాను ఐదు రెట్లు– రూ. 5 లక్షలకు పెంచారు. వివరాల్లోకి వెళితే... బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. ప్రస్తుతం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమా సౌలభ్యతను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై చెల్లింపుల్లో విఫలమైతే... అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఆర్థికమంత్రి ఐదు లక్షలకు పెంచారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు సంక్షోభం పాలవడంతో ఆ బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిపాజిటర్ల ఆగ్రహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై వెళ్లిన సందర్భంగా స్వయంగా చవి చూశారు కూడా. ఆర్బీఐ సైతం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని బలంగా చాటాయి. దీంతో కేంద్ర సర్కారు ఈ అవసరాన్ని గుర్తించింది. దీనితో ఆర్థికశాఖ తాజా బడ్జెట్లో కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. 1993 తర్వాత...: చివరిగా 1993 మే1న డిపాజిట్లపై బీమాను సవరించారు. 1992లో జరిగిన సెక్యూరిటీస్ స్కామ్ దెబ్బకు బ్యాంక్ ఆఫ్ కరద్ మూతపడడం నాడు డిపాజిట్లపై గరిష్ట బీమాగా ఉన్న రూ.30,000 మొత్తాన్ని రూ.లక్షకు పెంచడానికి కారణమైంది. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం మరో విడత సవరణ అవసరాన్ని గుర్తు చేసింది. అయితే, డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచితే బ్యాంకులు చెల్లిస్తున్న ప్రీమియం కూడా పెరుగుతుంది. డిపాజిట్ ఎంతున్నా బీమా ఐదు లక్షలకే..! బ్యాంకింగ్ అకౌంట్లు అందులోని మొత్తాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఐదు లక్షల డిపాజిట్ వరకే బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వద్ద రూ.10 లక్షలు ఉన్నాయనుకుందాం. రెండు వేర్వేరు బ్యాంకుల్లో రూ.ఐదు లక్షల చొప్పున డిపాజిట్ చేస్తే, మొత్తం రూ.10 లక్షలకూ బీమా వర్తించదు. పాన్ నెంబర్సహా తాజా బ్యాంకింగ్ సేవల సాంకేతికత వల్ల ఒక వ్యక్తికి బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ మొత్తం ఎంతుందన్న విషయంలో తేలిగ్గా వెల్లడవుతుంది. అందువల్ల బ్యాంకుల్లో డిపాజిట్ పరిమాణం ఎంతయినా, కేవలం రూ. 5 లక్షలకే బీమా వర్తిస్తుందన్న విషయం గమనార్హం. సేవల వ్యయం పెరుగుతుంది తాజా నిర్ణయం వల్ల బ్యాంకింగ్ సేవల వ్యయం పెరుగుతుంది. ప్రీమియం ఐదు రెట్లు పెరగడం వల్ల బ్యాంకులపై వ్యయ భారం తీవ్రంగానే ఉంటుంది. ఇది కస్టమర్లకు బదలాయించే అవకాశాలే ఉన్నాయి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ మాజీ చైర్మన్ -
బ్యాంకు డిపాజిటర్లకు శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వినియోగదారులకు మరింత భరోసా కల్పించేలా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి శుభవార్త అందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ బీమా పరిమితిని ఊహించిన దానికంటే ఎక్కువ పెంచనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రూ .1 లక్ష నుండి రూ .5 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. హోల్‌సేల్ డిపాజిటర్లకు డిపాజిట్ బీమాను రూ.25 లక్షలకు పెంచే కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ‘బిజినెస్ స్టాండర్డ్’ తెలిపింది. ఈ పెంపు అమల్లోకి వస్తే, డిపాజిట్ బీమాకు సంబంధించి ఇదే మొదటి పెంపు అవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొదటిది, చాలాకాలంగా పెండింగ్‌లో అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వ్యక్తులు, లేదా సంస్థలకు ప్రతిపాదిత మెరుగైన పరిమితులకు మించి అదనపు డిపాజిట్ బీమాను పొందడానికి బ్యాంకులను అనుమతించడం. రెండవది, ఆర్బీఐ నియంత్రణలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి), పంజాబ్ అండ్ మహారాష్ట్రల మాదిరిగానే మోసాల కారణంగా నష్టపోతున్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక రిజర్వ్‌ను ఏర్పాటు చేయడం. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో డిసెంబర్ 13న జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కేంద్ర బోర్డు సమావేశంలో వీటిపై చర్చించే అవకాశం ఉంది. బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం అమలులో ఉన్న రూ.1 లక్ష బీమా కవరేజీని పెంచే అవకాశమున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ రెండింటికీ సంబంధించి ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టాల్ని తీసుకొస్తామని చెప్పారు. సహాకార బ్యాంకుల సంక్షోభాల్ని కట్టడి చేసేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే బిల్లు రూపకల్పన జరిగిందని, క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలులోకి తీసుకు వస్తామన్నారు. పీఎంసీ బ్యాంక్‌లో జరిగిన మోసాలు మళ్లీ జరుగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న బ్యాంకుల మార్గదర్శకాలను మార్చి నూతన ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజా పీఎంసీ కుంభకోణంలో పీఎంసీ డిపాజిటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు జమ చేసే మొత్తాలపై డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ రూ.1 లక్ష వరకు బీమా కవరేజీని అందిస్తోంది. 1992 సెక్యూరిటీల కుంభకోణంతో బ్యాంక్ ఆఫ్ కరాడ్ కుప్పకూలిన తరువాత, 1993 నుంచి డిపాజిట్ ఇన్సురెన్స్ రూ.1 లక్ష వరకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. -
డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పెంపు చట్టం శీతాకాల సమావేశాల్లోనే!
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతమున్న రూ.లక్ష బీమా మొత్తాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన చట్టాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, కోపరేటివ్ బ్యాంకుల నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని కూడా తేనున్నట్టు చెప్పారు. మంత్రి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలకు కోత విధించే ప్రణాళికేమీ లేదన్నారు. బడ్జెట్లో కేటాయించిన మేరకు పూర్తి నిధుల వినియోగం దిశగా అన్ని శాఖలను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 18 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏ ఒక్క కంపెనీ వెళ్లిపోకూడదు.. టెలికం కంపెనీల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘ఏ కంపెనీ కూడా కార్యకలాపాలను మూసివేయాలని కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ కార్యకలాపాలు కొనసాగించాలి. వ్యాపారాల్లో ఎన్నో కంపెనీలు కొనసాగే ఆర్థిక వ్యవస్థను కోరుకుంటున్నాం. ఒక్క టెలికం రంగమే కాదు.. ప్రతీ రంగంలోనూ ప్రతీ కంపెనీ కొనసాగాలన్నదే నా అభిలాష’’ అని మంత్రి బదులిచ్చారు. టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు సెక్రటరీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే భవిష్యత్తులో అదనపు పెట్టుబడులు పెట్టడం అసాధ్యమంటూ వొడాఫోన్ ఐడియా కంపెనీ పేర్కొన్న విషయం తెలిసిందే. -
డిపాజిటర్లకు మరింత ధీ(బీ)మా!
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత రక్షణ కలిపించే రోజులు కనుచూపుమేరలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక వ్యక్తి ఒక బ్యాంకు పరిధిలో ఎంత మేర డిపాజిట్ చేసినా కానీ, ఆ బ్యాంకు సంక్షోభం బారిన పడితే గరిష్టంగా రూ.లక్ష వరకే పొందే అవకాశం ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) స్కీమ్ కింద బ్యాంకులు ఈమేరకు బీమాను అందిస్తున్నాయి. కానీ, గత 25 ఏళ్లుగా ఈ బీమా కవరేజీ రూ.లక్ష దగ్గరే ఉండిపోయింది. మారుతున్న పరిస్థితులతోపాటు బీమా కూడా పెరగాల్సి ఉన్నప్పటికీ అది ఆచరణ దాల్చలేదు. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం డిపాజిట్ ఇన్యూరెన్స్ మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. 25 ఏళ్ల క్రితం గరిష్టంగా రూ.లక్ష బీమాను నిర్ణయించడం, నాటి రోజులకు అనుగుణంగానే ఉన్నది. కానీ, ఆర్జనా శక్తి పెరిగి, బ్యాంకుల్లో అధిక మొత్తంలో నిధులను ఉంచుతున్న నేటి పరిస్థితుల్లో ఈ బీమా ఏ మాత్రం చాలదు. దీన్ని పెంచాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ అంశాన్ని డీఐసీజీసీ పరిగణనలోకి తీసుకుంది. దీనిపై త్వరలో కేంద్ర ఆర్థిక శాఖకు ఓ నివేదిక సమ్పరించనుంది. 25 ఏళ్లుగా రూ.లక్ష వద్దే.. డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను చివరిగా 1993లో సవరించారు. అప్పటి వరకు గరిష్ట బీమా రూ.30,000కే ఉండగా, రూ.లక్షకు పెంచారు. నాటి నుంచి సవరణ జోలికి వెళ్లలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2,098 బ్యాంకులు డీఐసీజీసీ స్కీమ్ పరిధిలో నమోదై ఉన్నాయి. వీటిల్లో 157 వాణిజ్య బ్యాంకులు కాగా, 1,941 కోపరేటివ్ బ్యాంకులు. డీఐసీజీసీ ఆర్బీఐ అనుబంధ సంస్థ. బ్యాంకుల్లో డిపాజిట్లకు బీమా అందించేందుకు ఏర్పాటు చేశారు. బీమా కవరేజీ కోసం బ్యాంకులు డీఐసీజీసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 2018–19లో డిపాజిట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం కింద బ్యాంకుల నుంచి రూ.12,043 కోట్లను డీఐసీజీసీ వసూలు చేసింది. వచ్చిన క్లెయిమ్‌లు రూ.37 కోట్లుగా ఉన్నాయి. ఇటీవలి పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సంక్షోభం మరోసారి దేశంలోని బ్యాంకు డిపాజిట్ల బీమాపై ప్రశ్నలకు దారితీసిందని ఎస్బీఐ పరిశోధన నివేదిక ఇటీవలే పేర్కొంది. ‘‘మొత్తం అంచనా వేయతగిన డిపాజిట్లలో బీమా కవరేజీ ఉన్న డిపాజిట్లు 1981–82లో 75%గా ఉంటే, 2017–18 నాటికి అది 28%కి తగ్గిపోయింది. దీంతో బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని సమీక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని ఎస్బీఐ గ్రూపు ముఖ్య ఆరి్థక సలహాదారు సౌమ్యకాంతిఘోష్ అన్నారు. పరిశీలనలో కొత్త విధానం బ్యాంకుల్లో ప్రతీ రూ.100 డిపాజిట్‌కు ప్రీమియం కింద ఫ్లాట్‌గా 10పైసలను వసూలు చేస్తుండగా, నూతన విధానానికి మళ్లడం ఆచరణ సాధ్యమా అన్న దానిపై డీఐసీజీసీ ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ‘‘సవరించిన పథకానికి ఆర్బీఐ, కేంద్ర ఆరి్థక శాఖ ఆమోదం తెలిపితే.. అప్పుడు పర్సనల్, ఇనిస్టిట్యూషనల్ అని రెండు రకాల డిపాజిట్ దారులు ఉంటారు. పర్సనల్ కేటగిరీలోకి రిటైల్, చిన్న వ్యాపారుల డిపాజిట్లు వస్తాయి. ఇనిస్టిట్యూషనల్ విభాగంలోకి పెద్ద కార్పొరేట్లు, ట్రస్ట్‌లు, ప్రభుత్వ ఏజెన్సీల డిపాజిట్లు వస్తాయి. ఒకేసారి కాకుండా క్రమంగా బీమా మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టు ఆరి్థక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రూ.5 లక్షలకు పెంచాలి! బ్యాంకుల్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ గరిష్ట పరిమితిని రూ.5లక్షలకు పెంచాలని బ్యాంకు సేవలపై సూచనల కోసం ఆర్బీఐ నియమించిన ఎం.దామోదరన్ కమిటీ 2011లోనే సిఫారసు చేసింది. కానీ, నాటి యూపీఏ సర్కారు దీన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోయింది. కొంత కాలంగా ఆరి్థక శాఖ డిపాజిట్ ఇన్సూరెన్స్ పెంపును పరిశీలిస్తోంది. తాజాగా పీఎంసీ బ్యాంకు సంక్షోభం ఈ అవసరాన్ని మళ్లీ గుర్తు చేసింది. దీంతో డీఐసీజీసీ 50 ఏళ్ల నాటి డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకాన్ని సమీక్షిస్తోంది. ‘డీఐసీజీసీ బోర్డు ఈ ప్రక్రియను ఆరంభించింది. నివేదికను ఆరి్థక శాఖకు సమరి్పస్తుంది. తదుపరి ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం ఉంటుంది’ అని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. -
వృద్ధులకు బ్యాంకు వడ్డీపై టీడీఎస్ మినహాయింపు
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్ మినహాయింపు విషయంలో వృద్ధులకు సంతోషాన్నిచ్చే నిర్ణయం వెలువడింది. ఇకపై రూ.5 లక్షల వరకు వార్షిక పన్ను ఆదాయం కలిగిన వృద్ధులు బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్) నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికే ఈ అవకాశం ఉంది. 2019–20 మధ్యంతర బడ్జెట్లో రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను రాయితీని కేంద్రం ప్రకటించిన విషయం గమనార్హం. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఫామ్ 15హెచ్‌ను సవరిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద అన్ని రకాల రాయితీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర ఆదాయం పన్ను పరిధిలో లేని వారి నుంచి ఫామ్15 హెచ్‌ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్వీకరించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారు తమ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ నుంచి టీడీఎస్ కోయకుండా, ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఫామ్15 హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. -
ఆ హామీలపై మోదీ మాట్లాడరు
లక్నో/రెవా: ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమచేయడం, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాల కల్పన అంశాలపై మాట్లాడవద్దని ప్రధాని మోదీకి ఆయన టెలీప్రాంప్టర్లు చెబుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని రెవా, రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ల్లో రాహుల్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘మోదీజీ 2014 ఎన్నికల ప్రచారసమయంలో ఇచ్చిన ఉద్యోగ కల్పన, ప్రతీ భారతీయుడి ఖాతాలోకి రూ.15 లక్షలు జమచేసే çహామీలపై పొరపాటున కూడా మాట్లాడకూడదని ఆయన టెలీప్రాంప్టర్ల మీద స్పష్టంగా రాసుంది’ అని రాహుల్ అన్నారు. మోదీ ఎన్నికల ప్రచార సభల్లో అనేకసార్లు సొంతంగానే మాట్లాడుతున్నప్పటికీ ఆయన కొన్నిసార్లు టెలీప్రాంప్టర్లను ఉపయోగించారు. 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం మోదీ మాటలను నమ్మి అత్యంత ఎక్కవగా మోసపోయింది దేశ యువతేననీ రాహుల్ అన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని 2014లో మోదీ హామీనిచ్చారనీ, ఇప్పుడు చూస్తే కొత్త ఉద్యోగాలు పెద్దగా రాకపోగా, ప్రతీ 24 గంటలకు 27 వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని రాహుల్ పేర్కొన్నారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ నిరుద్యోగం రేటు ఈ స్థాయిలో లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అమేథీలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తా.. తాను పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ప్రజలకు రాహుల్ శుక్రవారం ఓ బహిరంగ లేఖ రాస్తూ ఆ నియోజకవర్గంలో సాగుతున్న, బీజేపీ అడ్డుకుంటున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని చెప్పారు. ‘అమేథీ కుటుంబం’కు రాహుల్ భావోద్వేగంతో ఈ లేఖ రాశారు. తాను దృఢంగా నిలబడటానికి, ప్రజల కష్టాలు విని వారి తరఫున పోరాటం చేయటానికి అవసరమైన శక్తిని తాను అమేథీ ప్రజల నుంచే పొందినట్లు రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, బీజేపీ నిలిపివేసిన పనులను మేం ప్రారంభిస్తామని అమేథీ ప్రజలకు నేను మాట ఇస్తున్నా’ అని అన్నారు. -
ఎఫ్డీ.. డెట్ ఫండ్.. ఏది బెటర్?
నేను కొంత మొత్తాన్ని డెట్ ఫండ్‌లో నాలుగేళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. 8 శాతానికి పైగా రాబడినిచ్చే డెట్ ఫండ్స్ ఉన్నాయా? బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా? –ప్రియ, హైదరాబాద్ డెట్ ఫండ్స్‌లో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ 8 శాతానికి పైగా రాబడినిచ్చే అవకాశాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు ఖచ్చితంగా ఇంత వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు. అదే మీరు ఏదైనా బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఏడాది తర్వాత ఇంత మొత్తం, రెండేళ్ల తర్వాత ఇంత మొత్తం ఇలా మీకు గ్యారంటీగా ఎంత రాబడులు వస్తాయో ముందే తెలుస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో అలా గ్యారంటీగా రాబడులు రావు. కాకుంటే చాలా డెట్ ఫండ్స్ గతంలో 8 శాతానికి పైగా రాబడులు ఇచ్చాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ స్థాయి రాబడులు రావచ్చనే అంచనాలు ఉంటాయి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు అదనంగా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కొంత మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం. దీనిపై వచ్చే వడ్డీపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని మీ ఆదాయానికి కలపి పన్ను లెక్కిస్తారు. మీరు 30 శాతం పన్ను శ్లాబులో ఉంటే, ఆ శ్లాబ్ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మూడేళ్లలోపు ఎప్పుడైనా ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, వచ్చే లాభాలను మీ ఆదాయానికి కలిపి పన్ను లెక్కిస్తారు. మీరు యూనిట్లను విక్రయించినప్పుడు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి. ప్రతీ ఏడాది వచ్చే వడ్డీని పరిగణనలోకి తీసుకొని పన్ను లెక్కిస్తారు. మూడేళ్ల తర్వాతనే డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించారనుకుందాం. అప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. అప్పుడు మీరు ఇండేక్సేషన్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వచ్చిన లాభాల నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసివేసి 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు. ఊళ్లో పొలం అమ్మగా నా వాటా కింద రూ.8 లక్షలు వచ్చాయి. దీంట్లో మూడు లక్షలు మా అమ్మ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీకి ఆమెకు అందే ఏర్పాటు చేశాను. మిగిలిన రూ.5 లక్షలను ఒక ఆర్బిటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్ నుంచి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) విధానంలో ఏదైనా ఇండెక్స్ ఫండ్‌లోకి బదిలీ చేయాలనేది నా ఆలోచన. మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమేనా?– సురేందర్, విశాఖపట్టణం మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మొత్తాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఎస్టీపీ ద్వారా ఇండెక్స్ ఫండ్స్‌లోకి బదిలీ చేయాలన్న మీ వ్యూహం మంచిదే. కానీ ఆర్బిట్రేజ్ ఫండ్‌కు బదులుగా మీరు లిక్విడ్ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ రెండు ఫండ్స్‌కు తేడా పెద్దగా ఏమీ ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు లభించినప్పటికీ, ఈ ఫండ్స్ చాలా తక్కువ రాబడులను ఇస్తున్నాయి. అలా కాకుండా లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీకు కొంచెం ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సూచనలివ్వండి. –కార్తికేయ, ఈ మెయిల్ ద్వారా మీరు ఈక్విటీ, ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసే ముందు మొదటగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆరు నెలల అవసరాలకు సరిపడే మొత్తంతో ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో ఉంచడమో లేదా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమో చేయండి. అత్యవసర నిధి తయారైన తర్వాత నెలకు కొంత మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. అది కూడా ఆన్లైన్లోనే తీసుకోండి. చిన్న వయస్సులో టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే, మీకు ఎక్కువ బీమా కవరేజ్, తక్కువ ప్రీమియమ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇక ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే... సమీప భవిష్యత్తులో అవసరం పడని డబ్బులనే మీరు ఈ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా హైబ్రిడ్ ఫండ్స్‌తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆరంభించండి. ఈ హైబ్రిడ్ ఫండ్స్ తమ కార్పస్‌లో మూడింట రెండొంతులు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు ఒకింత రక్షణ హైబ్రిడ్ ఫండ్స్‌కు లభిస్తుంది. మార్కెట్ పతనమవుతున్నప్పుడు కూడా క్రమశిక్షణగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం మరచిపోవద్దు. మీరు ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే, హైబ్రిడ్ ఫండ్‌కు బదులుగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్‌కు లాక్–ఇన్–పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. పైగా మీకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఒక్క నెలలోనే.. 35,000కోట్లు
నోట్ల రద్దు పరిణామాలతో బ్యాంకులంటే భయం బ్యాంకుల్లో కుంభకోణాలు,రుణ ఎగవేతలు, ఐటీ నిబంధనలూ కారణమే! ఖాతాల్లో డిపాజిట్లు కొనసాగించేందుకు జంకుతున్న జనం ఆ సొమ్మంతా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకే.. భారీగా ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, ఇళ్ల కొనుగోళ్లు రిజిస్ట్రేషన్ల శాఖకు ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.513 కోట్ల ఆదాయం ఈ లావాదేవీల రిజిస్ట్రేషన్ విలువ రూ.8,500 కోట్లు..మార్కెట్ ధరల ప్రకారం చూస్తే రూ.30–35 వేల కోట్ల పైమాటే! సాక్షి, హైదరాబాద్: ‘బ్యాంకుల్లో డబ్బుంటే జేబులో ఉన్నట్టే.. నాలుగు రాళ్లు వెనకేసుకుని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవసరానికి పనికొస్తుంది..’..ఇది పాత మాట. ‘బ్యాంకుల్లో డబ్బులు పెట్టి కష్టాలు తెచ్చుకునేకన్నా.. ఆ డబ్బుతో ఎక్కడైనా ఓ ఇల్లు లేదా కొంత స్థలమో కొనుక్కుందాం.. డబ్బులకూ భద్రత.. ధర పెరిగితే మరింత డబ్బూ వస్తుంది..’..ఇది ఇప్పటిమాట. .. కొద్దినెలలుగా ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు జమ చేయడం బాగా తగ్గించేశారు. వీలైతే ఉన్న డిపాజిట్లనూ వెనక్కి తీసేసుకుంటున్నారు. ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ పెట్టుబడులవైపు మళ్లిస్తున్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలు, బ్యాంకుల్లో కుంభకోణాలు, ఆదాయ పన్ను శాఖ నిబంధనలు, రియల్ ఎస్టేట్‌లో పెడితే సొమ్ము వేగంగా పెరుగుతుందన్న ఆశలు వంటివన్నీ దీనికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయం ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతోంది. రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం ఏప్రిల్ ఒక్క నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. 8 వేల కోట్లకు పైగా స్థిరాస్తిలావాదేవీలు జరిగాయి. బహిరంగ మార్కెట్ ధరల లెక్కన చూస్తే ఈ లావాదేవీల విలువ ఏకంగా రూ. 35 వేల కోట్లకుపైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్క నెలలో రూ.513 కోట్ల ఆదాయం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అ«ధికారిక గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా రూ.513 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి రిజిస్ట్రేషన్ లావాదేవీకి సంబంధించి మార్కెట్ ధరలో 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మార్టిగేజ్లు, గిఫ్ట్‌డీడ్‌లు, లీజు ఒప్పందాలకు కొంచెం తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అయితే ఇవి మొత్తం లావాదేవీల్లో 10 శాతానికి మించవు. అంటే ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన రూ.513 కోట్ల ఆదాయాన్ని బట్టి లెక్కిస్తే... ఆయా రిజిస్ట్రేషన్ల విలువ సుమారు రూ.8,500 కోట్లు. ఇది కేవలం రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే. సాధారణంగా> చాలా చోట్ల రిజిస్ట్రేషన్ విలువతో పోలిస్తే.. మార్కెట్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన ఏప్రిల్ నెలలో స్థిరాస్తి లావాదేవీల విలువ కనీసం రూ.30 వేల కోట్ల నుంచి రూ. 35 వేల కోట్ల వరకు ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులన్నీ ఖాళీ! కొద్ది నెలలుగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గిపోయాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. అంటే బ్యాంకుల్లోకి డిపాజిట్లుగా వెళ్లే సొమ్మంతా రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతోందని స్పష్టమవుతోందని.. స్థిరాస్తి లావాదేవీల లెక్కలే దీనికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలో 1,26,655 స్థిరాస్తి లావాదేవీలు జరిగాయని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లావాదేవీల్లో మొత్తంగా నగదు మాత్రమే చేతులు మారే అవకాశం లేదు. బ్యాంకుల్లో ఉన్న సొమ్మును బదలాయించడం ద్వారానే లావాదేవీల చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే స్థిరాస్తిని విక్రయించినవారు ఇలా తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన సొమ్మును.. బ్యాంకుల్లో నిల్వ ఉంచడం లేదు. వాటిని విత్‌డ్రా చేయడం ద్వారాగానీ, ఇతర విక్రేతకు బదలాయించడం ద్వారాగానీ వెంటనే మరో స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ శాతం ఓపెన్ ప్లాట్లకే మొగ్గు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అంచనా ప్రకారం.. స్థిరాస్తి లావాదేవీలు చేస్తున్నవారిలో 75 శాతం మంది ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్నారు. అంటే మొత్తం రూ. 30–35 వేల కోట్ల వ్యాపారంలో దాదాపు రూ. 25 వేల కోట్ల సొమ్ము ఈ లావాదేవీల ద్వారానే చేతులు మారుతోంది. మరో 15 శాతం మంది అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, డూప్లెక్స్లు కొనుగోలు చేస్తుండగా.. ఇంకో 10 శాతం మంది ఇళ్లు, వాణిజ్య సముదాయాల కొనుగోళ్లకు డబ్బు వెచ్చిస్తున్నారు. వీటిలో మరో రూ. 5–10 వేల కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తంగా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం కన్నా.. ఏదో ఒక రకంగా రియల్ఎస్టేట్లో పెట్టుబడులు పెడదామనే భావన పెరిగిపోతోంది. బ్యాంకులంటే భయమెందుకు? ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. డబ్బును బ్యాంకుల్లో జమ చేసుకుందామనే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు, అనంతరం తీవ్రంగా నగదు కొరత ఏర్పడడం, అవసరానికి సొమ్ము తీసుకోలేకపోవడమే దీనికి కారణం. బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేస్తే.. అవసరానికి తీసుకునే వీలు ఉంటుందో లేదోనన్న సందేహంతో చాలా మంది ప్రజలు తమ వద్దే నగదును భద్రపరుచుకుంటూ వస్తున్నారు. అవసరమైతే తప్ప బ్యాంకు లావాదేవీల వైపు మొగ్గు చూపడం లేదు. దీనికితోడు బ్యాంకుల్లో వరుసగా వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు, పలువురు పారిశ్రామికవేత్తలు కూడా బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొడుతుండటం వంటివాటితోనూ తమ డబ్బు భద్రతపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పన్ను నిబంధనల కారణంగానూ.. మరోవైపు బ్యాంకుల్లో రూ.2 లక్షలకు మించి డబ్బులు జమ చేయడానికి, అంతకు మించి లావాదేవీలు జరపడానికి జనం వెనుకంజ వేస్తున్నారు. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, లావాదేవీలపై కేంద్రం కన్నేసి ఉంటుందని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని విచారిస్తుందనే ప్రచారం కూడా ప్రజలను బ్యాంకులకు దూరం చేస్తోంది. బ్యాంకుల్లో జమ చేస్తే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ఎక్కడ నోటీసులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. -
బ్యాంక్ డిపాజిట్లలో ‘ఇంటి’ వాటా ఇంతింత!
ముంబై: పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకు డిపాజిట్లలో కుటుంబాల వాటాను దాదాపు రెండు శాతం పెంచింది. రిజర్వ్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన గణాంకాలు చూస్తే... ౌ 2015–16లో మొత్తం సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లలో కుటుంబాల వాటా 61.5 శాతం. అయితే ఇది 2016–17లో 63.2 శాతానికి చేరింది. అంటే కుటుంబాల బ్యాంకింగ్ డిపాజిట్ల వాటా ఈ కాలంలో దాదాపు 2 శాతం (200 బేసిస్ పాయింట్లు) పెరిగిందన్నమాట. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ►ఇక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లలో 11.20 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది 1,09,43,700 కోట్లు. ఇందులో కేవలం కుటుంబ డిపాజిట్ల పరిమాణం చూస్తే... రూ.69,13,900 కోట్లు. 2015–16తో పోల్చితే ఈ సంఖ్య విషయంలో 14.14 శాతం వృద్ధి నమోదయ్యింది. ►వ్యక్తిగతంగా చూస్తే, సేవింగ్స్ డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి. ఈ విలువ 30 శాతం వృద్ధితో రూ.26,78,200 కోట్లకు ఎగసింది. వ్యక్తిగతంగా దాదాపు 70 శాతం మంది సేవింగ్స్ డిపాజిట్స్నే ఎంచుకున్నారు. ఇది గతానికన్నా భిన్నమైన ధోరణి. ►కుటుంబ డిపాజిట్లతో పాటు, ప్రభుత్వ రంగాల నుంచి డిపాజిట్లూ పెరిగాయి. అయితే ఫైనాన్షియల్, విదేశీ డిపాజిట్లలో మాత్రం క్షీణత నమోదయ్యింది. ►రాష్ట్రాల వారీగా మొత్తం డిపాజిట్ల వాటాను చూస్తే, మొత్తం డిపాజిట్లలో 20.4 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 10 శాతం వాటాతో ఢిల్లీ ఎన్సీఆర్ ద్వితీయ స్థానంలో ఉంది. ►ఒక్క కుటుంబ డిపాజిట్ల వృద్ధిని చూస్తే, ఉత్తరప్రదేశ్ 12.7%తో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంల్లో మహారాష్ట్ర (9.5%), బెంగాల్ (8%) గుజరాత్ (7.1%) నిలిచాయి. -
వడ్డీకాసులవాడికి వందల కోట్ల వడ్డీ ఆదాయం
సాక్షి, అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి పేరిట వివిధ బ్యాంకుల్లో రూ. 7,359 కోట్లు నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లపై ఏటా వడ్డీ రూపంలో టీటీడీకి రూ. 766 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శాసనమండలి హామీల అమలు కమిటీకి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. భక్తులు దర్శన టికెట్ కొనుగోళ్ల ద్వారా టీటీడీకి రెండేళ్ల క్రితం రూ. 210 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది దర్శన టికెట్ల ద్వారా రూ. 256 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే టీటీడీ వార్షిక ఆదాయం రూ. 2,858 కోట్లు. భక్తులు హుండీలో వేసే కానుకల ద్వారా రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇతర కానుకల ద్వారా ఈ ఏడాది రూ. 1,110 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీటీడీకి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలకే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. స్వామి పూజా సామగ్రి, తదితర వస్తువుల కొనుగోలుకు రూ. 300–400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. హామీల అమలు కమిటీకి టీటీడీ ఇచ్చిన నివేదికలో బ్యాంకు డిపాజిట్ల వివరాలు.. బ్యాంకు నగదు డిపాజిట్లు(రూ. కోట్లలో) విజయా బ్యాంకు 2,938 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 1,965.01 సిండికేట్ బ్యాంకు 945.37 స్టేట్ బ్యాంకు 938.06 కెనరా బ్యాంకు 298.10 సప్తగిరి గ్రామీణ బ్యాంకు 105.09 ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు 36 బ్యాంకు ఆఫ్ ఇండియా 31.55 ఆంధ్రా బ్యాంకు 21.79 ఇతర బ్యాంకులు 52.50 మొత్తం 7,359.42 -
మనం తెలుగువాళ్లం... ‘బంగారూ’
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలు స్థిరాస్తి, బంగారంపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు వంటి అనేక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నా తాము భూమి, బంగారాన్నే గట్టిగా నమ్ముతున్నామంటున్నారు. దేశంలో కుటుంబ ఆదాయం, పొదుపు, రుణ అలవాట్లపై ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు సంప్రదాయంగా వస్తున్న స్థిరాస్తి, బంగారంలోనే అత్యధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. తెలంగాణలో ఒక కుటుంబం పొదుపు చేస్తున్న మొత్తంలో 70.5 శాతం రియల్ ఎస్టేట్ ( స్థలాలు, బిల్డింగ్లు)లోనే ఇన్వెస్ట్ చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిగా తక్కువగా 62.8 శాతం స్థిరాస్తిలో మదుపు చేస్తున్నారు. తక్కువ అక్షరాస్యత, గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో అయితే 80 నుంచి 90 శాతం రియల్ ఎస్టేట్‌కే కేటాయిస్తున్నారు. బీహార్ ప్రజలు అత్యధికంగా 90.5 శాతం మంది రియల్ ఎస్టేట్‌కు కేటాయిస్తుండగా, అండమాన్ నికోబార్ ప్రజలు అత్యల్పంగా 42.5 శాతం మంది స్థిరాస్తిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దక్షిణాది ఓటు బంగారానికే... ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ప్రజలు బంగారం కొనుగోలుపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, వారి సాంస్కృతిక అలవాట్లే దీనికి కారణంగా ఆర్బీఐ పేర్కొంది. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రావాళ్లు బంగారం ఎక్కువగా కొంటున్నారు. తెలంగాణలో 17.5 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుండగా, ఆంధ్రాలో అది 21.6 శాతంగా ఉంది. దేశంలో అందరికంటే అత్యధికంగా తమిళనాడులో 28.3 శాతం, పాండిచ్చేరిలో 25.7 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పంజాబ్‌తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో 5 శాతం కూడా బంగారానికి కేటాయించక పోవడం విశేషం. అత్యధిక అక్షరాస్యత, తలసరి ఆదాయం ఉన్న కేరళ ప్రజలకు బంగారంపై మనకంటే ఎక్కువ మోజు లేదు. కేరళలో కేవలం 13.1 శాతం మంది మాత్రమే బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి వాళ్లు బంగారం కొనడమే కాదు... వాటిపై రుణాలు కూడా భారీగానే తీసుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తీసుకుంటున్న రుణాల్లో బంగారం అగ్రస్థానంలో ఉంది. పాండిచ్చేరిలో 50.1 శాతం, తమిళనాడులో 41.3 శాతం రుణాలను బంగారాన్ని తనఖా పెట్టి తీసుకుంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో 9.5 శాతం, తెలంగాణలో 2.9 శాతం మాత్రమే బంగారం రుణాలు ఉన్నాయి. ఆర్థిక అక్షరాస్యతలో ఏపీ ముందంజ ఆర్థిక అక్షరాస్యత విషయంలో కేంద్రపాలిత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఢిల్లీ, చండీఘడ్, సిక్కిం, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ వంటి చోట్ల 10 శాతం వరకు ఫైనాన్షియల్, పెన్షన్ పథకాలకు కేటాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3.8 శాతం బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్స్, షేర్ల వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే.. పెన్షన్ పథకాల్లో 3.1 శాతం ఇన్వెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 2 శాతం ఫైనాన్షియల్ పథకాలకు, 2.4 శాతం పెన్షన్ పథకాలకు కేటాయిస్తున్నారు. రుణాలను విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 48.9 శాతం మంది, తెలంగాణలో 55.8 శాతం మంది ప్రైవేట్ ఫైనాన్స్‌పై ఆధార పడుతున్నారని ఆర్బీఐ ఆ నివేదికలో పేర్కొంది. -
ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా?
♦ డైరెక్ట్, రెగ్యులర్ అంటూ రెండు రకాల ప్లాన్స్ ♦ పెట్టుబడులు పెట్టే తీరు రెండింట్లోనూ ఒకటే ♦ పథకం నిర్వహణ వ్యయాలు రెండింటిలో వేరు ♦ రాబడుల తీరును నిర్ణయించేవి ఇవే ♦ డైరెక్ట్ ప్లాన్స్‌లో కమీషన్లుండవు; వ్యయం తక్కువ ♦ రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో అధిక రాబడులు ♦ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవే అనువైనవి ఇటీవల దేశీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వెలిగిపోతోంది. సాధారణ మధ్య తరగతి ప్రజలు సైతం మెరుగైన రాబడులకు మ్యూచువల్ ఫండ్స్ బాట పడుతున్నారు. సంప్రదాయ బ్యాంకు డిపాజిట్లు, బాండ్లపై రాబడులు కనిష్ట స్థాయిలకు చేరిన తరుణంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే రాబడులకు చుక్కానిలా కనిపిస్తున్నాయి. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులక్కూడా కొంత విషయ పరిజ్ఞానం కావాలి. ఫండ్స్ నుంచి గణనీయమైన రాబడులను అందుకోవాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ వివరాలివీ... ఫండ్స్‌లో రెండు రకాలు మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్స్, డైరెక్ట్ ప్లాన్స్ అని రెండు రకాలుంటాయి. డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేస్తే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో (ఏఎంసీ) నేరుగా మీరు లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు. కంపెనీకి, మీకు మధ్య మరెవరూ ఉండరు. రెగ్యులర్ ప్లాన్లలో మాత్రం పెట్టుబడులను డిస్ట్రిబ్యూటర్ లేదా అడ్వైజర్ ద్వారా చేస్తున్నట్టు. మ్యూచువల్ ఫండ్స్ తమ సేవలు అందించినందుకు గాను మధ్యవర్తులకు అప్‌ఫ్రంట్ ఫీజులు చెల్లిస్తుంటాయి. వీటిని ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లోంచే సర్దుబాటు చేస్తాయి. డైరెక్ట్ ప్లాన్లలో ఈ విధమైన వ్యయాల భారం తగ్గడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. 2012 సెప్టెంబర్ ముందు వరకూ కేవలం రెగ్యులర్ పథకాలే అందుబాటులో ఉండేవి. సంస్కరణల్లో భాగంగా డైరెక్ట్ ప్లాన్ల ప్రవేశానికి అనుకూలంగా సెబీ చర్యలు తీసుకుంది. అన్ని రకాల ఏఎంఎసీలు (మ్యూచువల్ ఫండ్ కంపెనీలు) ప్రతి పథకాన్నీ డైరెక్ట్, రెగ్యులర్ పేరిట రెండు రకాలుగా విడుదల చేస్తున్నాయి. చార్జీలు/ ఫీజులు మ్యూచువల్ ఫండ్ అంటే ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన ఓ నిధి. దీన్ని నిపుణులైన మేనేజర్లు పెట్టుబడులుగా మలుస్తారు. ఎప్పటికప్పుడు సరైన స్టాక్స్, సెక్యూరిటీలను ఎంచుకొంటూ ఇన్వెస్ట్ చేయడం, పెట్టుబడులు మారుస్తుండడం చేస్తుంటారు. ఈ విధమైన నిర్వహణకు గాను ఏఎంసీలు ఫీజులను వసూలు చేస్తుంటాయి. దీనికి తోడు ఇతర వ్యయాలు కలుపుకుంటే ఆ మొత్తాన్ని ఎక్స్పెన్స్ రేషియోగా పేర్కొంటారు. లేదా టోటల్ ఎక్స్పెన్స్ రేషియోగా చెబుతారు. మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా రెండు రకాల వ్యయాలను ఎదుర్కొంటాయి. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓ పథకాన్ని ఆవిష్కరించేందుకు అయ్యే వ్యయాలు ఇవి. దీన్ని ఇన్వెస్టర్ల నుంచి కాకుండా ఏఎంసీయే భరిస్తుంది. రెండోది రికరింగ్ ఎక్స్పెన్సెస్. పథకం నిర్వహించేందుకు అయ్యే వ్యయాలు. వీటిని ఇన్వెస్టర్లే భరించాల్సి ఉంటుంది. పెట్టుబడుల నిర్వహణ, సలహాదారుల రుసుం, ట్రస్టీ ఫీజు, మార్కెటింగ్, విక్రయాల వ్యయాలు ఇవన్నీ ఇందులో భాగం. రోజువారీ ఫండ్ ఆస్తుల విలువ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఏ రోజుకారోజు ఫండ్ ఎన్ఏవీలోంచి తగ్గించడం జరుగుతుంది. వ్యయాలకు నిబంధనలూ ఉన్నాయి.. ప్రస్తుత నిబంధనల మేరకు ఓ మ్యూచువల్ ఫండ్ పథకంలో రికరింగ్ ఎక్స్పెన్సెస్ అన్నవి ఏడాదికి ఆ ఫండ్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువలో 2.5 శాతం మించకూడదు. ఇది ఈక్విటీ పథకాలకు. డెట్ పథకాల్లో ఇది 2.25 శాతం, ఇండెక్స్ పథకాల్లో 1.5 శాతం గరిష్ట పరిమితిగా ఉంది. వీటికి అదనంగా అదనపు వ్యయాల రూపేణా మరో 0.20 శాతం చార్జీలు వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంకా పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో విధించే ఎగ్జిట్ లోడ్ కూడా ఒకటి. ఎక్స్పెన్స్ రేషియో (ఖర్చుల నిష్పత్తి) డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియోను ఒక్కసారి గమనిస్తే... రెగ్యులర్ ప్లాన్ల ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉండడాన్ని గుర్తించొచ్చు. డైరెక్ట్ ప్లాన్లలో ఏఎంసీకి, ఇన్వెస్టర్‌కు మధ్య మధ్యవర్తులు ఎవరూ ఉండరు కనుక కమీషన్లు చెల్లించక్కర్లేదు. దీంతో డైరెక్ట్ ప్లాన్ల ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల ప్లాన్ల మధ్య రాబడుల్లో ఈక్విటీ పథకాలైతే వ్యత్యాసం 0.50 శాతం నుంచి 1.50 శాతం వరకూ ఉంటుంది. డెట్ పథకాల్లో ఇది 0.50 శాతం వరకూ ఉంటుంది. వీటిలో ఎది ఎంచుకున్నా... ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో మాత్రం రెండింటికీ ఒకటే ఉంటుంది. రెండింటికీ వేర్వేరుగా పెట్టుబడులు పెట్టడం ఉండదు. అలాగే పథకం విధివిధానాలు, లక్ష్యాలు, పెట్టుబడుల కేటాయింపులు, ఎగ్జిట్ లోడ్, రిస్క్ ఫ్యాక్టర్, సౌకర్యాలు, నియమ నిబంధనలు కూడా ఒకటే. కాకపోతే కమీషన్లు, వ్యయాలు అన్నవి రెగ్యులర్ ప్లాన్లలో ఎక్కువగా చార్జ్ చేస్తారు. వాటి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉండడానికి కారణం అదే. తేడా కొంచెమే... కానీ రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్ల మధ్య ఎక్స్పెన్స్ రేషియోలో వ్యత్యాసం కొంచెమే కదా అనుకుంటే పొరబడినట్టే. ఈ కొంచెమే దీర్ఘకాలంలో పెట్టుబడులపై రాబడుల్లో ఎక్కువ వ్యత్యాసానికి కారణం అవుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఇక్కడ పలు ఉదాహరణలు చూద్దాం. 2013 జనవరిలో బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్‌లో కామన్ ఎన్ఏవీ (ఒక్కో యూనిట్ విలువ) రూ.100.24 ఉంది. 2016 మార్చి 31న ఈ ఫండ్‌లో డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ రూ.159.9గా ఉంటే, రెగ్యులర్ ప్లాన్ ఎన్ఏవీ రూ.155.50 ఉంది. మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్ 15.45 శాతం రాబడులను ఇస్తే... రెగ్యులర్ ప్లాన్‌లో రాబడులు 14.45 శాతంగా ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియోలో వ్యత్యాసం 1.14 శాతంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో రెగ్యులర్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో 1.95 శాతంగా ఉంటే, డైరెక్ట్ ప్లాన్‌లో 0.85 శాతమే ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌లో రెండు ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో వ్యత్యాసం 1.88 – 0.86 శాతంగా ఉంది. పన్ను ఆదా చేసే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో 1.98 – 1.27 శాతంగా ఉంది. డెట్ ఫండ్ విభాగంలోని బిర్లా సన్‌లైఫ్ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ పథకంలో రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 0.29 శాతంగా ఉంటే, డైరెక్ట్ ప్లాన్‌లో ఇది 0.19 శాతంగా ఉంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఏఎంసీని బట్టి, పథకాన్ని బట్టి మారుతుంది. రెండు కంపెనీలు నిర్వహించే ఒకే తరహా లార్జ్ క్యాప్ ఫండ్లలో ఎక్స్పెన్స్ రేషియో ఒకే మాదిరిగా ఉండదు. ఎందుకంటే ఆ పథకం కింద నిర్వహణలో ఉన్న ఆస్తులు, కంపెనీ పెట్టుబడుల విధివిధానాలు, వ్యయాలు ఇలా ఎన్నో అంశాల్లో తేడా ఉండొచ్చు. వ్యత్యాసం విలువెంతంటే... పైన చెప్పుకున్న పథకాల్లోనే డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో పెట్టుబడులపై రాబడుల మధ్య వ్యత్యాసం చూస్తే... బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్‌లో 2013 జనవరి నుంచి ప్రతీ నెలా రూ.10వేల చొప్పున 2016 మార్చి వరకు మొత్తం రూ.3.9 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టయితే... రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడులు 4.81 లక్షలకు, డైరెక్ట్ ప్లాన్‌లో 4.89 లక్షలకు వృద్ధి చెంది ఉండేవి. వ్యత్యాసం రూ.8వేలు. ఇక 15 ఏళ్ల పాటు ఇదే పథకంలో సిప్ చేస్తూ వెళితే రాబడులు ఇదే విధంగా ఉంటాయనుకుంటే... రెగ్యులర్ ప్లాన్‌లో రూ.51,54,144, డైరెక్ట్ ప్లాన్‌లో రూ.56,52,071 అవుతుంది. రెండింటి మధ్య తేడా దాదాపు రూ.5 లక్షలు. రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఇంత మేర నష్టపోయినట్టే కదా. అదే ఐసీఐసీఐ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌లో 2013 జనవరి నుంచి 2016 జనవరి వరకు ప్రతీ నెలా రూ.10వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళితే రెగ్యులర్ ప్లాన్‌లో రూ.5.49లక్షలు, డైరెక్ట్ ప్లాన్‌లో రూ.5.60లక్షలు అయి ఉండేవి. తేడా రూ.11వేలు. ఇదే పథకంలో రూ.10వేల చొప్పున నెలనెలా సిప్ చేస్తూ వెళితే 15 ఏళ్ల కాలానికి రూ.18 లక్షల పెట్టుబడులు కాస్తా రెగ్యులర్ పథకంలో 1,09,97,467, డైరెక్ట్ పథకంలో రూ.1,22,97,185 అవుతాయి. రెండు పథకాల మధ్య వ్యత్యాసం రూ.13 లక్షలు. ఈక్విటీ పథకాల్లోనే ఇంత భారీ వ్యత్యాసం ఉంటుంది. డెట్ పథకాల్లో ఈ తేడా చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు అన్ని పథకాల్లోనూ అంతే 2013 జనవరి నుంచి చూస్తే 632 పథకాల్లో (ఈక్విటీ, డెట్, హైబ్రిడ్) డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య సగటున ఎక్స్పెన్స్ రేషియో వ్యత్యాసం 0.80 శాతంగా కనిపిస్తోంది. దీంతో ఈక్విటీ ఆధారిత పథకాల్లో (రూ.4,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తున్న ఫండ్లను చూస్తే) రాబడుల మధ్య వ్యత్యాసం గత నాలుగేళ్ల కాలానికి 6 శాతంగా ఉంది. ఇక, ఇన్కమ్, గిల్ట్ లాంగ్‌టర్మ్ ఫండ్లలో డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య ఎక్స్పెన్స్ రేషియో వ్యత్యాసం 0.71 శాతం, 0.60 శాతంగా ఉంది. లిక్విడ్ ఫండ్స్‌లో మాత్రం అతి స్వల్పంగా తేడా 0.12 శాతమే ఉంది.మరీ ముఖ్యంగా డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ పథకాల్లో రాబడులు చాలా తక్కువగా ఉంటాయి గనుక. ఉదాహరణకు బిర్లా సన్ లైఫ్ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ప్రతీ నెలా రూ.10వేల చొప్పున 39 నెలల పాటు ఇన్వెస్ట్ చేస్తే రెగ్యులర్ ప్లాన్‌లో రూ.4.55 లక్షలు, డైరెక్ట్ ప్లాన్‌లో రూ.4.56 లక్షలు అవుతాయి. 15 ఏళ్ల కాలం పాటు ఇదే విధంగా ప్రతి నెలా రూ.10వేలు సిప్ చేస్తూ వెళితే రెగ్యులర్ ప్లాన్‌లో రూ.38,50,799, డైరెక్ట్ ప్లాన్‌లో రూ.38,86,541 అవుతాయి. 15 ఏళ్ల కాలంలో వ్యత్యాసం రూ.35వేలు. తేడా తక్కువగా ఉండడానికి కారణం ఈ పథకంలో రెండు ప్లాన్ల మధ్య ఎక్స్పెన్స్ రేషియో తేడా 0.10శాతమే ఉండడం. ఈ వ్యత్యాసం మరో 0.10 శాతం పెరిగితే రాబడుల్లో ఒకటిన్నర రెట్ల తేడా కనిపిస్తుంది. ఎంత కాలానికి పెట్టొచ్చు! దీర్ఘకాలం పాటు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు మరో ఆలోచన లేకుండా డైరెక్ట్ ప్లాన్స్ ఎంచుకోవడమే నయం. ఎందుకంటే పై ఉదాహరణలు చూస్తే దీర్ఘకాలంలో రాబడుల్లో భారీ వ్యత్యాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల కాలానికి అయితే తేడా స్వల్పమే. ముఖ్యంగా ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడుల లక్ష్యాలకు డైరెక్ట్ ప్లాన్స్ తగినవి. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనంతో పెట్టుబడుల విలువలో చెప్పుకోతగ్గ తేడా కనిపిస్తుంది. ఇక ఎంచుకునే ఫండ్ పథకం కూడా ఆ విభాగంలో మిగిలిన పథకాల కంటే మెరుగైన రాబడులను ఇచ్చేది అయి ఉండాలి. ఆ విధమైన ఎంపికే రాబడులను నిర్ణయిస్తుంది. -
నడిచొచ్చిన నల్లధనం 4 లక్షల కోట్లు!
-
బ్యాంక్ డిపాజిట్లపై ఐటీ
నోట్ల రద్దు తర్వాత ఖాతాల్లో చేరిన నగదుపై ఆరా పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ తొలి దశలో పెట్రోల్ బంక్‌ల యజమానులకు నోటీసుల జారీ రెండో విడతలో ఆస్పత్రులు, నగల దుకాణదారులకు.. ఐటీ చట్టం 133 (6) 1961 ప్రకారం నోటీసులు గడువులోగా ఆధారాలు చూపాలని ఆదేశాలు బెంబేలెత్తుతున్న బడా వ్యాపారులు మొదటి విడతలో పెట్రోల్ బంక్‌ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న ఐటీ శాఖ.. ఆ తర్వాత ఆస్పత్రులు, నగల దుకాణాల వ్యాపారులపై కొరడా ఝుళిపించనున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో పాత నోట్లకు అనుమతించడంతో వాటిల్లో బోగస్ బాధితులను సృష్టించి నకిలీ బిల్లులతో భారీ మొత్తంలో నగదు మార్పిడికి పాల్పడినట్లు ఆ శాఖ పరిశీలనలో తేలింది. 50 రోజుల వ్యవధిలో నగల దుకాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. నల్లగొండ : బ్యాంక్ ఖాతాల్లో దాగి ఉన్న భారీ నగదు నిల్వలపై ఆదాయ పన్ను శాఖ ఆరా తీస్తోంది. గత ఏడాది నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తాలపై దృష్టి సారించిన ఐటీ శాఖ.. ఆ మేరకు ఖాతాదారుల వివరాలు సేకరించింది. నోట్ల రద్దుకు ముందు సంబంధిత వ్యక్తులు, వ్యాపా ర సంస్థలు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు.. వాటికి సంబంధించి బ్యాంక్ డిపాజిట్లపై కూపీ లాగింది. నోట్ల రద్దు తర్వాత జన్‌ధన్ ఖాతాలు, దిక్కుమొక్కులేని (డార్మెంట్ స్టేటస్), జీరో బ్యాలెన్స్ ఖాతాలు (నో ఫ్రిల్స్ అకౌం ట్స్) అన్నింట్లోకి భారీగా నగదు వచ్చి చేరినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు , కేవైసీ ఆధారంగా బ్యాంక్ అధికారులు భారీ మొత్తంలో డిపాజిట్లు స్వీకరించారు. పాత నోట్లనే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారా.. కొత్త నోట్లు జమ చేశారా.. అనేదానిపైనా ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ చేసింది. ఈ క్రమంలో కొత్త నోట్ల డిపాజిట్ల జోలికి వెళ్లకుండా ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన పాత నోట్లపైనే ఆదాయ పన్ను శాఖ, ఇంటెలిజెన్స్, క్రిమినల్ ఇంటెలిజిన్స్ అధికారులు దృష్టి సారించారు. నోట్లు రద్దు అయిన మరుసటి రోజు నుంచి డిసెంబర్ 30 వరకు వివిధ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ చేసినట్లు గుర్తించిన ఖాతాదారులకు ప్రస్తుతం ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. పాత నోట్ల డిపాజిట్లపైనే.. రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను పెట్రోల్ బంక్‌లు, ఆస్పత్రులు, నగల దుకాణాల్లో చెల్లుబాటవుతాయని కేంద్రం ప్రకటించింది. దీంతో అవసరం ఉన్నా.. లేకున్నా వాహనదారులు బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకున్నారు. చిల్లర సమస్య సాకుగా చూపి బంక్ నిర్వాహకులు అందిన కాడికి దోచుకున్నారు. పాత నోట్లకు కమీషన్ తీసుకుని మరీ పెట్రోల్ పోశారు. ఇదే వారి మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. పెట్రోల్ బంక్‌లలో పాత నోట్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్న ఉత్సాహంతో వ్యాపారులు వెనకాముం దు ఆలోచించలేదు. పాత రోజులతో పోలిస్తే బంక్‌లో ఆయిల్ అమ్మకాలు డబుల్, ట్రిపుల్ పెరిగాయి. చెలామణిలో ఉన్న పాత నోట్లలో ఎక్కువ నగదు బంకుల్లోకి చేరింది. ఈ మొత్తం నగదు నిల్వలను వ్యాపారులు తమ కరెంట్ ఖాతాల్లోనూ, బంకుల్లో పనిచేసే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. బంగారం క్రయవిక్రయాలకు రశీదులు చూపించేందుకు వీలున్నా.. పెట్రోల్ బంక్‌లో ఆ అవకాశం లేకుండా పోయింది. ఆయిల్ పోయించుకున్న వాహనదారులకు బంక్ యజమానులు ఎలాంటి రశీదు ఇవ్వకపోవడంతో వ్యాపారులకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. కరెంట్ ఖాతాల్లో జమ చేసిన నగదు నిల్వల వివరాలు, పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లయితే.. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని వ్యాపారులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. నోట్ల రద్దుకు ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆ తర్వాత ఖాతాదారుల ఖాతాల్లో చేరిన నగదు నిల్వల లెక్కలు సమర్పించాలని నోటీస్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఐటీ చట్టం 133 (6) 1961 ప్రకారం జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని.. ఖాతాలకు సంబంధించిన క్యాష్ పుస్తకాలు, బ్యాంకు బ్యాలెన్స్ షీట్లతో తమ ఎదుట హాజరుకావాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. విడతల వారీగా నోటీసులు.. మొదటి విడతలో పెట్రోల్ బంక్‌ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న ఐటీ శాఖ.. ఆ తర్వాత ఆస్పత్రులు, నగల దుకాణాల వ్యాపారులపై కొరడా ఝుళిపిం చనున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో కూడా పాత నోట్లకు అనుమతించడంతో వాటిల్లో బోగస్ బాధితులను సృష్టించి నకిలీ బిల్లులతో భారీ మొత్తంలో నగదు మార్పిడికి పాల్పడినట్లు ఐటీ శాఖ పరిశీలనలో తేలింది. నగల దుకాణాల్లో జరిగిన క్రయవిక్రయాలపైనా నిఘా పెట్టింది. 50 రోజుల వ్యవధిలో నగల దుకాణాల్లో జరిగిన బంగారం అమ్మకాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను బ్యాంకుల ద్వారా ఐటీ అధికారులు సేకరించారు. ఇందులో అక్రమంగా జరిగిన విక్రయాలు ఏమైనా ఉన్నాయా.. అని నిగ్గుతేల్చేందుకు ఐటీ శాఖ నుంచి త్వరలో నోటీసులు జారీ కానున్నట్లు తెలిసింది. ఈక్రమంలో పెట్రోల్ బంక్ యజమా నులు, నగల దుకాణాల వ్యాపారులు, ఆస్పత్రుల నిర్వాహకులు హడలెత్తిపోతున్నారు. -
డిపాజిట్ల నిగ్గుతేల్చేందుకు ఆడిటర్ల సాయం!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకుల్లోకి వెల్లువలా వచ్చిన నగదు డిపాజిట్ల నిగ్గుతేల్చేందుకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తమవుతోంది. సంబంధిత డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం కోసం అంతర్జాతీయ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై), కేపీఎంజీ, ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) వంటి దిగ్గజాల సాయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా సంస్థలతో దీనిపై ఐటీ శాఖ చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా డిపాజిట్ల ద్వారా వచ్చిన సొమ్ములో ఏదైనా మనీల్యాండరింగ్ చోటుచేసుకుందా అనేది తేల్చడం కోసం ఐటీ శాఖ ఈ చర్యలను తీసుకుంటోంది. రద్దయిన నోట్లలో దాదాపు 95 శాతంపైగా(రూ.15 లక్షల కోట్లు) ఇప్పటికే బ్యాంకుల్లోకి వెనక్కివచ్చేసినట్లు తాజాగా అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా, నోట్ల రద్దు తర్వాత 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు భారీస్థాయిలో పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేసినట్లు అంచనా. వీటి విలువ రూ. 7 లక్షల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. రూ.4 లక్షల కోట్ల విలువైన వ్యక్తిగత డిపాజిట్లపై ఐటీ శాఖ కొన్ని లొసుగులను గుర్తించినట్లు సమాచారం. మరోవైపు అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ) నుంచి ఐటీ శాఖ ఇప్పటికే సమాచారం సేకరించింది. నిద్రాణంగా ఉన్న, జన్‌ధన్ ఖాతాలతోపాటు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఎంతమేరకు డిపాజిట్లు వచ్చాయన్న వివరాలన్నీ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎంతో చెప్పరా?
ఆర్బీఐ మౌనం డిసెంబరు 30 గడువు ముగిసేనాటికి బ్యాంకుల్లోకి తిరిగి రాకుండా ఉండిపోయిన మొత్తమెంతో రిజర్వు బ్యాంకు వెల్లడించలేదు. 31న ప్రధాని మోదీ సైతం తన ప్రసంగంలో ఎక్కడా దీని ఊసెత్తలేదు. చెల్లకుండా పోయినా 15.44 లక్షల కోట్ల పాత పెద్ద నోట్లలో బ్యాంకుల్లోకి తిరిగి వచ్చిందెంత? రాకుండా ఉండిపోయిన నల్లధనమెంత? వివిధ సందర్భాల్లో ఆర్బీఐ, ఆర్థికశాఖ అధికారులు చెప్పిన లెక్కలు, ఆర్థిక రంగ నిపుణులు, వార్తా సంస్థల అంచనాల ప్రకారం ఈ గణాంకాలపై దృష్టి సారిస్తే... నవంబరు 8 నాటికి పెద్దనోట్ల రూపంలో చలామణిలో ఉన్న 15.44 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత మొత్తం బ్యాంకుల్లోకి డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చిందనేది ఆర్బీఐ చెప్పడం లేదు. పాతనోట్లను డిపాజిట్ చేసే గడువు డిసెంబరు 30నే ముగిసింది. నగదు అందుబాటులో లేక 50 రోజుల పాటు జనం తీవ్ర అవస్థలు పడ్డారు. బ్యాంకుల్లోకి తిరిగి రాకుండా ఉన్న మొత్తమెంత? ఎంత నల్లధనం వృధా అయిందనేది తెలుసుకునే హక్కు వీరికి లేదా? (డిసెంబరు 10న ఇచ్చిన అధికారిక సమాచారం మేరకు ఇంకా 20 రోజులు గడువు ఉండగానే 12.44 లక్షల కోట్లు తిరిగి వచ్చేసింది.) బ్యాంకు లావాదేవీలు, చెల్లింపులకు, కార్డుల ద్వారా కొనుగోళ్లు... తదితర డాటా ఆర్బీఐకి ఎప్పటికప్పుడు చేరుతుంది. బ్యాంకులు ఏ రోజుకారోజు ఈ సమాచారాన్ని ఆర్బీఐకి చేరవేస్తాయి. మరి ఆర్బీఐ ఎందుకు ఈ వివరాలు వెల్లడించడం లేదు. ఎందుకీ గోప్యత? బ్యాంకుల్లోకి రాకుండా ఉండిపోయిన మొత్తం తక్కు వగా ఉంటే పరువు పోతుందనా? 2.53 లక్షల కోట్లు వంద అంతకంటే చిన్న నోట్ల రూపంలో చలామణిలో ఉన్న నగదు. 5 లక్షల కోట్లు రద్దయిన పెద్దనోట్లలో... బ్యాంకుల్లోకి తిరిగి రాకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన మొత్తం. ప్రజల వద్ద చలామణిలో ఉన్న డబ్బు, బ్యాంకుల్లోని నగదును కలిపి...రిజర్వు మనీ డాటా పేరిట ఆర్బీఐ ప్రతివారం భారత్‌లో చలామణిలో ఉన్న మొత్తం డబ్బుకు (సీఐసీ– కరెన్సీ ఇన్ సర్క్యులేషన్) సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తుంది. 9.42 లక్షల కోట్లు ఆర్బీఐ ఇచ్చిన సీఐసీ గణాంకాల ప్రకారం డిసెంబరు 23 నాటికి చలామణిలో ఉన్న నగదు. ఇందులోంచి చిన్ననోట్ల రూపంలో ఉన్న 2.53 లక్షల కోట్లను తీసివేస్తే... కొత్తనోట్ల రూపంలో ఆర్బీఐ జారీచేసిన మొత్తం 6.89 కోట్లు. అంటే ఉపసంహరించిన నోట్ల స్థానంలో ఆర్బీఐ 45 శాతానికంటే తక్కువ నోట్లను తిరిగి జనానికి అందుబాటులోకి తెచ్చింది. 8.55 లక్షల కోట్లు డిసెంబరు 23 నాటికి ఇంకా ఆర్బీఐ జారీచేయాల్సిన కొత్తనోట్లు. (ఇందులో నుంచి బ్యాంకుల్లోకి తిరిగి రాని మొత్తాన్ని తీసివేయాలి. ఇది ఎంతనేది ఆర్బీఐ గానీ, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖగానీ వెల్లడించడం లేదు). 14.9 లక్షల కోట్లు పాత నోట్లను డిపాజిట్ చేసే గడువు... డిసెంబరు 30వ తేదీ ముగిసేనాటికి 14.9 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోని తిరిగి వచ్చిందని వార్తా సంస్థ (ప్రజలు బ్యాంకు కౌంటర్ల దగ్గర మార్పిడి చేసుకున్న మొత్తం కూడా కలిపితే) ఐఏఎన్ఎస్ అంచనా. దీని ప్రకారం తిరిగిరాని మొత్తం 54 వేల కోట్ల రూపాయలుగా తేలుతుంది. మొత్తం రద్దుచేసిన కరెన్సీలో ఇది 3.5 శాతం మాత్రమే. ఇందులో ఎన్ఆర్ఐల వద్ద ఉండిపోయిన భారత కరెన్సీ కూడా కలిపి ఉంటుంది. జేఎన్‌యూ ఎకనమిక్స్ ప్రొఫెసర్ సురజిత్ మజుందార్ అంచనా కూడా తిరిగిరాని మొత్తం లక్ష కోట్లే లోపే ఉంటుందని. ఒకవేళ ఇది లక్ష కోట్లున్నా మొత్తం రద్దు చేసిన కరెన్సీ విలువలో ఇది 6.5 శాతమే. 1.5 లక్షల కోట్లు పాత పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం ఆర్థిక కార్యకలాపాలు మందగించడం... అసంఘటిత రంగంలో ఉద్యోగాలు పోవడం తదితర పరిణామాల మూలంగా... భారత స్థూల దేశీయోత్పత్తిపై లక్షన్నర కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా. దీనికి కొత్తనోట్ల ముద్రణ, రవాణా, పంపిణీ ఖర్చులు అదనం. 4,663 కోట్లు నవంబరు 8 నుంచి జనవరి ఒకటో తేదీ దాకా ఆదాయపు పన్ను శాఖ పట్టుకున్న వెల్లడించని ఆదాయం 4,663 కోట్ల రూపాయలు. ఈ కాలంలో దేశవ్యాప్తం 253 చోట్ల ఐటీ దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేతకు సంబంధించి 5,062 నోటీసులు జారీచేసింది. రోజుకు 1,000 కోట్లు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. భీమ్ యాప్‌ను కూడా తెచ్చింది. నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8న దేశంలో జరిగిన నగదు రహిత లావాదేవీలను డిసెంబర్ 26న జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా రోజుకు వెయ్యి కోట్ల రూపాయల ఈ ట్రాన్షాక్షన్ పెరిగాయి. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి... డిసెంబర్ నెలలో రోజువారీ డాటాను ఆర్బీఐ విడుదల చేస్తోంది. దాని ప్రకారం... -
8 గంటలు..630 కోట్లు డిపాజిట్లు
-
చివరి రోజు..630 కోట్లు
► తెలంగాణ, ఏపీల్లో శుక్రవారం నాటి డిపాజిట్లివి ► ఒక్క హైదరాబాద్‌లోనే జమ అయిన డిపాజిట్లు రూ. 330 కోట్లు ► 2 బ్యాంకుల్లోని 5 ఖాతాల్లో డిపాజిట్లు రూ. 67 కోట్లు ► తిరుపతిలో పది ఖాతాల్లో సగటున 6 కోట్లు డిపాజిట్ ► రూ.కోటి కంటే ఎక్కువ జమ అయిన ఖాతాలు 115 ► విశాఖ, విజయవాడ, వరంగల్, నెల్లూరు, కరీంనగర్‌లలో భారీగా డిపాజిట్లు ► చివరి రోజున ఎప్పటికప్పుడు ఐటీ అధికారుల పరిశీలన ► ‘నోట్ల రద్దు’ నుంచి ఇరు రాష్ట్రాల్లో కలిపి రూ.1.48 లక్షల కోట్లు జమ! సాక్షి, హైదరాబాద్: రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేయడానికి చివరి రోజైన శుక్రవారం.. తెలంగాణ, ఏపీల్లో ఏకంగా రూ.630 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరం పరిధిలోనే రూ.330 కోట్లు జమ అయినట్లు సమాచారం. చివరి రోజున డిపాజిట్ల పరిస్థితిని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. భారీగా డిపాజిట్లు చేసిన ఖాతాదారుల వివరాలను సేకరించాయి. కోట్లలో డిపాజిట్లు.. తమ వద్ద ఉన్న పాత రూ.500, 1,000 నోట్లను జమ చేయడానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన కొందరు చివరి రోజు దాకా నిరీక్షించారు. చివరి రోజునే ఏకంగా రూ.కోటి అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. చివరిరోజున ఏపీలోని తిరుపతిలో ఓ మామూలు వ్యాపారి తన ఖాతాలో రూ.50 లక్షలు డిపాజిట్ చేశారు. గత ఏడాది కాలంలో ఆయన ఖాతాలో జమ అయిన మొత్తం కేవలం రూ.11 వేలే కావడం గమనార్హం. ఇక తిరుపతిలోని వివిధ బ్యాంకుల్లో పది మంది ఖాతాదారులు సగటున రూ.6 కోట్ల కంటే ఎక్కువ జమ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఐదు ఖాతాల్లో ఏకంగా రూ.67 కోట్లు జమ చేసినట్లు తెలిసింది. ఇందులో రెండు ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీలతో పాటు ముగ్గురు వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరంతా ముందుగానే ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇచ్చి.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద పన్ను చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆమోద లేఖలు అందజేసినట్లు తెలిసింది. ఇక చివరి రోజున కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసిన వారు 115 మంది దాకా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. దీంతో ఏడాది కాలంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తాలు, ఆదాయ పన్ను రిటర్నులను పరిశీలించే పనిలో నిమగ్నమైంది. చివరి రోజు డిపాజిట్ అయిన మొత్తంతో కలుపుకొంటే... నోట్ల రద్దు నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి రూ.1.48 లక్షల కోట్ల మేర పాత నోట్లు జమ అయినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి జనవరి 1వ తేదీన పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడిస్తామని ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రధాన నగరాల్లోని బ్రాంచీల్లో నిఘా.. బ్యాంకుల్లో చివరి రోజు జమయ్యే మొత్తాలను ఆదాయ పన్ను శాఖ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, రాజమండ్రి నగరాల్లోని బ్యాంకు శాఖల్లో లావాదేవీలపై నిఘా పెట్టినట్లు సమాచారం. చివరిరోజు దాకా నిరీక్షించి రూ.2.5 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్లు చేసిన ఖాతాదారులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. వచ్చే వారం రోజుల్లోనే వీరికి నోటీసులు జారీ అవుతాయని ఆ శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఇక నవంబర్ 8 తరువాత అనుమానిత డిపాజిట్లు పెద్ద ఎత్తున బయటపడ్డాయని, వారందరికీ నోటీసులు జారీ చేసే ప్రక్రియ వారంలో ప్రారంభమవుతుందని వెల్లడించాయి. -
నోట్ల రద్దు: ఆలయాల పెద్ద మనసు
వంద నోట్లు, ఇతర చిల్లర దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యులను ఆదుకోడానికి భగవంతుడే దిగి రానక్కర్లేదు.. ఆలయాలు ఆ పని చేసినా చాలు. ఇన్నాళ్లుగా భక్తులు హుండీలలో విరాళాల రూపంలో వేసిన చిన్న నోట్లను ప్రజలకు అందించేందుకు వీలుగా.. గుజరాత్‌లోని పెద్ద ఆలయాలు ముందుకొచ్చాయి. అక్కడి ప్రముఖ దేవాలయాలైన అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయాలు తమకు ప్రతిరోజూ వస్తున్న చిన్న నోట్లను అన్నింటినీ బ్యాంకులలో జమ చేస్తున్నాయి. దాంతో బ్యాంకులు వాటిని తిరిగి ప్రజలకు అందిస్తున్నాయి. 500, 1000 రూపాయల పాత నోట్లను మార్చుకోడానికి తీసుకొచ్చేవాళ్లు ఇవ్వడం లేదా ఏటీఎంలలో పెట్టించడం ద్వారా వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు. తమకు వచ్చిన విరాళాలు అన్నింటినీ ఏరోజుకారోజే బ్యాంకులలో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం ఒక ఉత్తర్వు కూడా జారీ చేయడంతో అక్కడి సామాన్యలు కష్టాలు కొంతవరకు తగ్గాయి. అహ్మదాబాద్‌లోని భద్రకాళి ఆలయానికి మామూలుగా అయితే భక్తులు రోజూ పెద్దసంఖ్యలోనే వస్తారని, కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత వారి సంఖ్య కొంతవరకు తగ్గిందని ఆలయ ట్రస్టీ శక్తికాంత తివారీ చెప్పారు. అయితే శుక్రవారం మాత్రం భక్తులు యథాతథంగా భారీ సంఖ్యలోనే వెల్లువెత్తుతున్నారన్నారు. -
బ్యాంకులను ఖాళీ చేసేస్తున్నారు!
పటేల్ వర్గానికి రిజర్వేషన్లలో కోటా కల్పించాలంటూ గుజరాత్లో జరుగుతున్న ఆందోళన రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతోంది. తాజాగా పటేల్ వర్గానికి చెందినవాళ్లు అక్కడి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. బ్యాంకులలో తమ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లలోని సొమ్మును వెనక్కి తీసేసుకుంటున్నారు. తద్వారా ఆర్థిక దిగ్బంధనం సృష్టించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నది వాళ్ల వ్యూహం. బాబూభాయ్ పటేల్ అనే ఓ చిరుద్యోగి పొద్దున్నే బ్యాంకుకు వెళ్లి, తన పేరుమీద ఉన్న రెండు లక్షల రూపాయలు డ్రా చేసేసుకున్నారు. దానిమీద వడ్డీ రాకపోయినంత మాత్రాన తనకు వచ్చే నష్టం ఏమీ లేదని.. కానీ ప్రభుత్వానికి సమస్య తీవ్రత తెలిసి వస్తుందని ఆయన అన్నారు. ఒక్కరోజులోనే తమ బ్యాంకులో రూ. 27 లక్షలను డ్రా చేసేశారని ఉత్తర గుజరాత్లో పటేల్ వర్గం ఎక్కువగా ఉండే వాద్రాద్ గ్రామంలో బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో.. బ్యాంకుల లోంచి ఎంత మొత్తం నగదును బయటకు తీసేస్తారో చూడాల్సి ఉంది. -
మీ డిపాజిట్లు భద్రమేనా?
- ముందు బ్యాంకు పరిస్థితి తెలుసుకోవటం ముఖ్యం - బ్యాంకు దివాలా తీస్తే రూ. లక్ష వరకు డీఐసీజీసీ బీమా ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో బ్యాంక్ డిపాజిట్లది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇవే అన్నిటికన్నా సురక్షితమైనవని జనం భావిస్తారు. పెపైచ్చు గడువు తీరాక చేతికి ఎంత వస్తుందో ముందే తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉన్నా... బ్యాంకులు దివాలా తీస్తే!!? ఇతర బ్యాంకుల్లో విలీనమైతే? అప్పుడు మీ డిపాజిట్ల సంగతేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? రిస్క్ ఆస్తులతో ఆందోళన... ఒకవైపు బ్యాంకుల రిస్క్ ఆస్తులు పెరిగిపోతున్నాయి. 2011 మార్చి నుంచి 2015 మార్చి వరకు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిస్క్ ఆస్తులతో పోల్చినపుడు మూలధన పటిష్టత 1.8 శాతం పాయింట్లు తగ్గింది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల రిస్క్ ఆస్తుల విలువ 13.5 శాతం. ఇదే సమయంలో నికర ఎన్పీఏల నిష్పత్తి 3.1 శాతం. ఇవన్నీ చూసినపుడే డిపాజిట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ విభా బాత్రా మాటల్లో చెప్పాలంటే... ‘‘పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బయట పడటానికి వాటిక్కొంత సమయం పడుతుంది. తగినంత మూలధనం ఉంది కనక ఈ బ్యాంకులకు వేరొకదాంట్లో విలీనమయ్యే అవసరం ప్రస్తుతానికి లేదు. కానీ కొన్ని బ్యాంకులు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాయి కనక వాటిలో విలీనాలనూ కొట్టిపారేయలేం’’. డిపాజిట్లకు డీఐసీజీసీ రక్ష! ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రానికి అధిక వాటా ఉంటుంది. ఒక బ్యాంకు దివాలా అంచులకు వచ్చినప్పుడు కేంద్రం దాన్ని ఆర్థికంగా బలంగా ఉన్న మరో బ్యాంకుతో విలీనం చేస్తుంది. అలాంటపుడు ఆందోళన అవసరం లేదు. దివాలా తీసే బ్యాంకులో రూ.లక్ష వరకు డిపాజిట్లుంటే వాటికి డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) రక్షణ ఉంటుంది. బ్యాంకులన్నీ డీఐసీజీసీకి కొంత ప్రీమియం చెల్లించి ఈ బీమా చేస్తాయి. ప్రీమియం చెల్లించిన డిపాజిట్లకే బీమా రక్షణ ఉంటుందనేది గుర్తించాలి. ఎఫ్ఎస్ఆర్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి చివరికి రూ.26 లక్షల కోట్ల విలువైన 134 కోట్ల డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా రక్షణ ఉంది. ఇది మొత్తం బ్యాంకు డిపాజిట్లలో (145 కోట్లు) 92 శాతం. అయితే ఒక బ్యాంకులో ఒక వ్యక్తి పేరిట ఎన్ని డిపాజిట్లున్నా డీఐసీజీసీ బీమా మాత్రం ఒక్కదానికే వర్తిస్తుంది. అదే జాయింట్ ఖాతా అయితే ఇద్దరికి విడిగా రూ.లక్ష చొప్పున రూ.2 లక్షల వరకు బీమా ఉంటుంది. బ్యాంకు గురించి అవగాహన ఉండాలి... ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు దాని ఆర్థిక పరిస్థితిని గమనించాలి. బ్యాంకు మొండిబకాయిలు, వాటికి చేసిన కేటాయింపులు, రీస్ట్రక్చర్డ్ ఖాతాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీరు డిపాజిట్ చేసిన బ్యాంకు ఇబ్బందుల్లో ఉందని భావిస్తే వెంటనే దాన్నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడం మంచిది. ఇక మీరు లోన్ తీసుకున్న బ్యాంకు మరొక బ్యాంకుతో విలీనమైతే పరిస్థితేంటనే ప్రశ్న రావచ్చు. వడ్డీ రేటులో మార్పు ఉండొచ్చు. ఒకోసారి ఉండకపోవచ్చు కూడా. విలీనం చేసుకున్న బ్యాంకు లోన్ బుక్‌తో పోల్చినపుడు మీ బ్యాంకు లోన్ బుక్ చిన్నదైతే విలీనం చేసుకున్న బ్యాంకు మీకు తక్కువ వడ్డీని ఆఫర్ చేయొచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న లోన్ రేటునే చెల్లించమని కోరవచ్చు. -
మెరుపు తగ్గిన పసిడి
ఇదీ... నిపుణులు చెబుతున్న మాట ♦ బంగారం పెరుగుతుంది అనడానికి సంకేతం ఒక్కటీ లేదు ♦ ఇంకా తగ్గే అవకాశం ఉండటంతో బంగారంలో ఇన్వెస్ట్ చేయొద్దు ♦ పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉండాలనుకునే వారు 3-5 శాతం దాటకుండా చూసుకోండి ♦ ఇప్పటి వరకు లేనివారు 5-7 ఏళ్ల దృష్టితో ఒకేసారిగా కాకుండా కొద్దికొద్దిగా కొనండి ♦ వెయ్యి రూపాయలు తగ్గినప్పుడల్లా కొనాలనుకున్న దాంట్లో కొంత మొత్తం కొనండి ♦ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం బంగారం కొనాలనుకునే వారు కూడా ఇలాగే కొనండి... బ్యాంకు డిపాజిట్లు, రియల్ ఎస్టేటు, షేర్లు మాత్రమే కాదు. నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్లలో బంగారం ఒకటి. ఎందుకంటే అది ఆభరణాల రూపంలో అందానికి మెరుగులు దిద్దటమే కాదు. ఏటా ధర పెరుగుతూ ఇన్వెస్ట్మెంట్ రూపంలో లాభాన్నీ ఇస్తుంది. అవసరమైనపుడు తనఖా పెట్టినా, అమ్మినా వెంటనే నగదు చేతికొచ్చేస్తుంది. వీటన్నిటికీ తోడు... ఎన్నేళ్లయినా ఎంచక్కా దాచుకోవచ్చు. ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టే భారతీయులకు పసిడిపై తగని మోజు. పిల్లలు... ప్రత్యేకించి ఆడపిల్లలు పుడితే... వారి జీవితంలో ప్రతి సందర్భంలోనూ తల్లిదండ్రులు తమకు వీలైనంత బంగారాన్ని కొని వెనకేస్తుంటారు. మనవాళ్లు బంగారం ధరలు పడినపుడల్లా ఎగబడి కొంటుంటారు. అలాంటిది... ఇపుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బంగారం ధర గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరింది. గతంలో ఈ ధరకు వచ్చినపుడు ఎగబడి కొన్నవాళ్లు కూడా ఇపుడు వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గుతుందిలే... అపుడు కొందాం... అంటున్నారు. ఎందుకిలా? అసలు బంగారం ధర ఎందుకు పడుతోంది? మున్ముందు ఇంకా తగ్గుతుందా? లేక ఇదే సరైన ధరా? నిపుణులేమంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ విభాగం అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం... 18 వేలకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు! పసిడికి ప్రస్తుతం ప్రతికూల సంకేతాలే ఉన్నాయి. సాంకేతికంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కీలకమైన 1,140 డాలర్ల మద్దతు స్థాయిని కోల్పోయి ఐదేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పతనం 800 డాలర్ల వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచేలోగా పది గ్రాముల బంగారం ధర భారత్‌లో రూ. 22,000 - 23,000 వరకు రావచ్చు. అప్పుడు కొద్దిగా కొనుగోళ్ళ మద్దతు లభించినా వచ్చే 6 నెలల్లో రూ.20,000 - 18,000 దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు బంగారం కూడా తగ్గుతుంది. అగ్రదేశాలతో ఇరాన్ చరిత్రాత్మక అణు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో చమురు ధరలు ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాసహా పలు దేశాల్లో వడ్డీరేట్లు జీరో స్థాయి వద్ద ఉండటంతో పెట్టుబడి కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేసేవారు. ఒక్కసారి వడ్డీరేట్లు పెరిగితే బంగారంలోకి పెట్టుబడులు ఆగిపోతాయి. మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో డాలరు విలువ మరింత పెరిగే అవకాశాలు తక్కువ. దీంతో రూపాయి విలువ క్షీణించడం ద్వారా బంగారం పెరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మొత్తం మీద చూస్తే స్వల్ప, మధ్య కాలానికి బంగారం మరింత క్షీణించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. - ఆర్. నమశ్మివాయ, డెరైక్టర్, జెన్‌మనీ. టార్గెట్ రూ. 23,500 అంతర్జాతీయంగా సంక్షోభాలు సద్దుమణుగుతుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్ ఉండే ఈక్విటీ వంటి పథకాల కేసి చూస్తున్నారు. ఇండియాలో కూడా డిమాండ్ తగ్గటం విశేషం. 2014 మేలో 3.12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా ఈ ఏడాది మేలో 2.42 బిలియన్ డాలర్ల విలువైన పసిడి మాత్రమే దిగుమతి చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కీలకమైన 1,128 డాలర్ల మద్దతు స్థాయిని కోల్పోవడంతో సాంకేతికంగా 990 డాలర్లకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ లెక్కన చూస్తే ఇండియా మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 24,000-23,500కు రావచ్చు. - రవీంద్రరావు, కమోడిటీ రీసెర్చ్ హెడ్, ఆనంద్‌రాఠి కమోడిటీస్. 610 డాలర్లకు పడిపోతుందా? కొన్నాళ్లుగా పరిమిత శ్రేణిలో కదిలిన బంగారం ఒక్కసారిగా నేల చూపులు చూస్తోంది. మున్ముందు ఈ పతనం మరింత వేగం పెంచుకునే అవకాశముంది. ప్రస్తుతం 1,100 డాలర్ల దిగువనున్న ఔన్స్ బంగారం ధర ఇంకా ఎంత తగ్గుతుందనేది అమెరికా ఫెడరల్ బ్యాంక్, డాలరు విలువపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా డాలరు, బంగారం ధరలు వ్యతిరేక దిశలో పయనిస్తాయి. డాలరు పెరిగితే బంగారం తగ్గడం, డాలరు తగ్గితే బంగారం పెరగడం జరుగుతుంది. గడిచిన ఏడాదిలో డాలరు విలువ రూ.60.50 నుంచి రూ. 64.131కు పెరిగింది. ఒక్కసారి డాలరు విలువ పెరిగితే సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉన్న బంగారానికున్న పేరు పోతుంది. అమెరికా వడ్డీరేట్లు పెంచితే డాలరు రూపంలో ఉండే పెట్టుబడి సాధనాలకు డిమాండ్ పెరుగుతుంది. మున్ముందు బంగారం 1,000 డాలర్లకు కిందకు రావడమే కాకుండా 2007 స్థాయికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2007లో అమెరికా ఆర్థిక సంక్షోభం మొదలైనప్పుడు పసిడి 610 డాలర్లుండేది. ఆ స్థాయికి ఇప్పుడు వస్తుందా రాదా అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఆధారపడి ఉంటుంది. - జమ్మీల్ అహ్మద్, చీఫ్ మార్కెట్ ఎనలిస్ట్, ఫారెక్స్ టైమ్. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గటంతో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా దీని గురించే మాట్లాడుకునే పరిస్థితి తలెత్తింది. ఔన్స్ బంగారం ధర ఐదున్నరేళ్ల కనిష్ట స్థాయి 1,100 డాలర్ల దిగువకు పడిపోయింది. 2011 సెప్టెంబర్‌లో 1,900 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టస్థాయి ఉండగా... ఇప్పటికి ఏకంగా 42 శాతం నష్టపోయింది. డాలర్ ధర కూడా పెరగటం వల్ల దేశీ మార్కెట్లో ఈ స్థాయిలో ధర తగ్గలేదు. అయితే గరిష్ఠ స్థాయి నుంచి 29 శాతం వరకూ తగ్గింది. గతంలో పది గ్రాముల బంగారం ధర రూ.34,000 రికార్డు స్థాయి ఉండగా ఇపుడు రూ.25,000 కిందకు వచ్చింది. ఇంతకంటే ఇంకా తగ్గుతుందా లేదా అన్నదానిపై నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నా... ఒక్క విషయంలో మాత్రం అంతా ఏకీభవిస్తున్నారు. ధరలు మరింత తగ్గకపోయినా తక్షణం వేగంగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే బాగా క్షీణించడంతో ప్రస్తుత స్థాయి నుంచి కొద్దిగా పెరిగినా తిరిగి తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇపుడు బంగారాన్ని సూచించలేమని, అవసరాల కోసం కొనేవారు తగ్గుతున్నప్పుడు కొంచెం కొంచెంగా కొనటం మేలని వారు చెబుతున్నారు. -
పన్నుపోటు తగ్గేరూటు
సంపాదిస్తున్న మొత్తంలోంచి కొంత మొత్తం పన్ను రూపంలో చెల్లించాలంటే చాలామందికి భారంగానే ఉంటుంది. కాని కొంచెం తెలివిగా వ్యవహరిస్తే ఈ పన్ను భారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మన ఆదాయ పన్ను చట్టంలో అనేక సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి తప్పని ఖర్చులను చూపించడంతో పాటు, ఎంపిక చేసిన పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందచ్చు. పన్ను భారం తగ్గించుకోవడంలో కొన్ని కీలకమైన సెక్షన్ల సమాచారమే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరి... పన్ను భారం తగ్గించుకోవడంలో ముఖ్యమైనది సెక్షన్ 80సీ. ఈ సెక్షన్ కింద చేసిన కొన్ని పొదుపులు, చెల్లింపుల ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సెక్షన్ పరిధిలోకి అనేక సాధనాలు వచ్చినా గరిష్టంగా లక్షన్నర రూపాయలు మించి ప్రయోజనం పొందలేరు. ఈ సెక్షన్ పరిధిలోకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), 5 ఏళ్ల బ్యాంక్ డిపాజిట్లు, ఎన్ఎస్సీ, సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, బీమా, యులిప్, పెన్షన్ వంటి సేవింగ్ పథకాలతో పాటు, గృహరుణ ఈఎంఐలో అసలుకు చెల్లించే వాటా, ఇంటి రిజిస్ట్రేషన్‌కి చెందిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు వంటి వ్యయాలను చూపించడం ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇంటి రుణ వడ్డీపై: రుణం తీసుకుని నిర్మించిన ఇంటికి రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. చెల్లిస్తున్న రుణంలో అసలుకు (అంటే వడ్డీ కాకుండా)చెల్లించే మొత్తంపై సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. అదే రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల ప్రయోజనానికి అదనం. అంటే.. ఇంటి రుణం తీసుకుంటే కనీసం మూడు లక్షల వరకు పన్ను ఆదాయం తగ్గుతుంది. ఉన్నత చదువుల కోసం.. సొంతంగా ఉన్నత చదువు కోసం రుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ వడ్డీ మినహాయింపులపై ఎటువంటి పరిమితులు లేవు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ మినహాయింపు కేవలం వడ్డీ చెల్లింపులపైన మాత్రమే. అసలుకు చెల్లించే వాటిపైన ఎటువంటి మినహాయింపులుండవు. అలాగే గరిష్టంగా 8 సంవత్సరాల వరకు ఈ మినహాయింపులను పొందవచ్చు. రుణం తీసుకుని ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ మినహాయింపులు లభించవు. భార్య లేదా భర్త, పిల్లలు లేదా సొంతంగా ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణాలన్నింటిపైనా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. పిల్లల ట్యూషన్ ఫీజులకు సెక్షన్ 80సీ ద్వారా లభించే ప్రయోజనాలకు ఇవి అదనం. ఆస్తులు అమ్మితే.. ఈ మధ్య కాలంలో షేర్లు, రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరిగాయి. ఇలా దీర్ఘకాలిక ఆస్తులు అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై మూల ధన పన్ను (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) చెల్లించాలి. కాని ఈ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో ప్రత్యేకంగా 54ఈసీ పేరుతో ఒక సెక్షన్ ఉంది. 54ఈసీ పరిధిలోకి వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఈ లాభాలను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. దీని ప్రకారం బంగారం, షేర్లు, స్థలాలు, ఇల్లు వంటివి అమ్మినప్పుడు వచ్చే లాభాలను ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్స్ మూడేళ్ళ లాకిన్ పిరియడ్‌ను కలిగి ఉంటాయి. కాని ఈ బాండ్స్ అందించే వడ్డీ మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు. హెచ్ఆర్ఏ లేకపోయినా.. హెచ్ఆర్ఏ లేకపోయినా చెల్లించే ఇంటద్దెపై పన్ను ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియనే తెలియదు. సెక్షన్ 80జీజీ ప్రకారం హెచ్ఆర్ఏ సౌలభ్యం లేని వృత్తినిపుణులు, వ్యాపారస్తులు వంటి వారు ఈ ప్రయోజనం పొందచ్చు. ఈ సెక్షన్ ప్రకారం మీ ఆదాయంలో గరిష్టంగా 25% లేదా నెలకు గరిష్టంగా రూ.2,000 వరకు ఆదా యం నుంచి మినహాయింపు పొందవచ్చు. కాని ఈ ప్రయోజనం పొందాలంటే నివసిస్తున్న ఊరిలో మీ పేరు మీద లేక భార్య పిల్లల పేర సొంతిల్లు ఉండకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన ఎటువంటి ఇతర పన్ను ప్రయోజనాలను పొంది ఉండకూడదు. కొత్తగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే... రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం పేరుతో కొత్తగా సెక్షన్ 80సీసీజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఆరోగ్యం కోసం... హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియంలపై సెక్షన్ 80డీ ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. గరిష్టంగా రూ.15,000 వరకు సీనియర్ సిటిజన్స్ అయితే రూ.20,000 వరకు ఈ విధంగా తగ్గించుకోవచ్చు. అదే తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా తీసుకుంటే అదనంగా మరో రూ. 5,000 ప్రయోజనం లభిస్తుంది. ముందుజాగ్రత్త చర్యగా చేయిం చుక్‌ను వైద్య పరీక్షలపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వైద్యపరీక్షలకూ ఇది వర్తిస్తుంది. అలాగే కొన్ని ప్రధానమైన వ్యాధులకు చికిత్సకు అయ్యే వ్యయాలపై సెక్షన్ 80డీడీబీ కింద పన్ను ప్రయోజనాలను లభిస్తాయి. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 40,000 ఆదాయంతగ్గించి చూపించుకోవచ్చు. ఏ వ్యాధులకు మినహాయింపులు లభిస్తాయన్నది సెక్షన్లో పేర్కొనడం జరిగింది. సీనియర్ సిటిజన్‌కు రూ.60,000 వరకు చూపించుకోవచ్చు. విరాళాలు ఇస్తే... హుద్‌హుద్ తుఫాన్, కాశ్మీర్ వరదలు వంటి వాటికి ఇచ్చే విరాళాలపై కూడా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇలా విరాళాలపై మినహాయింపులు పొందడానికి సెక్షన్ 80జీ ఉంది. కానీ అన్ని విరాళాలకు ఈ మినహాయింపులు లభించవు. ఇందుకు అర్హత ఉన్న సంస్థలకు ఇస్తేనే ఈ మినహాయింపులు వర్తిస్తాయి. ఇందుకు సంబంధించి సెక్షన్ 80జీలో అనేక నిబంధనలు ఉన్నాయి. కొన్ని విరాళాలపై పూర్తిగా 100 శాతం తగ్గింపు(డిడక్షన్) లభిస్తే మరికొన్నింటిపై 50 శాతం మాత్రమే లభిస్తాయి. జాతీయ రక్షణ నిధి, ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి సహాయ నిధి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యునల్ హార్మోని, జిల్లా సాక్షరతా మిషన్, కేంద్ర స్పోర్ట్స్ ఫండ్, కేంద్ర సాంస్కృతిక ఫండ్, నేషనల్ టెక్నాలజీ ఫండ్ వాటికి ఇచ్చే విరాళాలపై ఎటువంటి పరిమితులు లేకుండా పూర్తిగా 100 శాతం మినహాయింపులు లభిస్తాయి. జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు సహాయక నిధి, జాతీయ చిల్డ్రన్ ఫండ్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వంటి వాటికిచ్చే విరాళాలపై 50 శాతం తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. అలాగే నగదు రూపంలో ఇచ్చే విరాళాలు, స్థూల జీతంలో 10 శాతం దాటని విరాళాలకు మాత్రమే ఈ డిడక్షన్స్ వర్తిస్తాయి. -
‘స్త్రీ నిధి’ నిలువుదోపిడీ
డిపాజిట్ల పేరుతోరూ.44 కోట్ల వసూలు వడ్డీలేని రుణాలకు మంగళం మైక్రోఫైనాన్స్‌ను మించిపోయిన వైనం చిత్తూరు (అగ్రికల్చర్): స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అత్యవసర సమయాల్లో రుణాలిచ్చి ఆదుకోవాల్సిన స్త్రీ నిధి బ్యాంకు డిపాజిట్ల పేరుతో నిలువుదోపిడీ చేస్తోంది. వివిధ రకాల డిపాజిట్ల పేరుతో ఎస్‌హెచ్‌జీ మహిళల నుంచి రూ.44 కోట్ల మేరకు వసూలు చేసుకుంది. ఇది చాలదన్నట్లు స్త్రీనిధి ద్వారా అందించాల్సిన వడ్డీలేని రుణాలకు ప్రభుత్వం జూలై నుంచి మంగళం పాడింది. దీన్నిబట్టి చూస్తుంటే స్త్రీనిధి మైక్రోఫైనాన్స్లను మించిపోయినట్లు కనిపిస్తోంది. మహిళలను మైక్రో ఫైనాన్స్ సంస్థల దోపిడీ నుంచి కాపాడేందుకు 2011 అక్టోబర్ 06 తేదీన అప్పటి ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును హైదరాబాదులో ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకు ద్వారా అత్యవసర సమయాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణాలను అందించి ఆదుకోవాల్సి ఉంటుంది. మహిళలు తమ సంఘం తరఫున సెల్‌ఫోన్ ద్వారా స్త్రీనిధి బ్యాంకుకు ఎస్ఎంఎస్ పంపిన 48 గంటల్లో రుణాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసింది. స్త్రీనిధి ద్వారా పొందిన రుణాలకు వడ్డీలేని విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాల్లో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 2012-13 సంవత్సరానికిగాను 10,554 సంఘాలకు చెందిన 48,306 మంది మహిళలు రూ.80 కోట్ల మేరకు రుణాలను పొందారు. 2013-14కు గాను 17,192 సంఘాలకు చెందిన 77,065 మంది మహిళలు రూ.123 కోట్ల మేరకు రుణాల కింద తీసుకున్నారు. డిపాజిట్ల పేరుతో వసూళ్లు స్త్రీనిధి బ్యాంకు ద్వారా ప్రభుత్వం మహిళల వద్ద డిపాజిట్ల పేరుతో రూ.44 కోట్ల మేరకు వసూలు చేసింది. అత్యవసర సమయాల్లో రుణాలను అందించేందుకు గాను మహిళా సంఘాలు స్త్రీనిధి బ్యాంకుకు ముందస్తుగా డిపాజిట్లు చేయాలని షరతును విధించింది. దీంతో ప్రతి మండల సమాఖ్య ద్వారా మహిళలు రూ.10 లక్షల చొప్పున జిల్లా వ్యాప్తంగా 64 మండలాలకుగాను రూ.6.40 కోట్ల మేరకు స్త్రీనిధి బ్యాంకులో డిపాజిట్ చేశారు. అయినా రుణాలు సక్రమంగా అందకపోవడంతో మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని మభ్యపెడుతూ మరోసారి గ్రామ సమాఖ్యల ఖాతాల్లో కొంత మెత్తాలను డిపాజిట్లు చేసుకోవాలని సూచించింది. అత్యవసర సమయాల్లో ఆ నిధుల నుంచి రుణాలను తీసుకుంటే అటు తర్వాత స్త్రీనిధి బ్యాంకు నుంచి వచ్చే రుణాల మొత్తాలను గ్రామ సమాఖ్యకు జమచేస్తామని తెలియజేసింది. జిల్లా వ్యాప్తంగా మరోమారు 61 వేల సంఘాలు రూ.2 వేలు చొప్పున గ్రామ సమాఖ్య ఖాతాలకు మొత్తం రూ.12 కోట్ల మేరకు డిపాజిట్లు చేశారు. బీఎంసీల ద్వారానూ వసూలు.. మహిళా సంఘాల ద్వారా ఆయా మండలాల పరిధిలో నడిపే పాలశీతలీకరణ కేంద్రం (బీఎంసీయూ) ద్వారా వచ్చే లాభాలను స్త్రీనిధి బ్యాంకులో జమచేస్తే వడ్డీ ఇస్తామని తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా రూ.12 కోట్ల మేరకు వసూలు చేసుకుంది. వ్యక్తిగత పొదుపుల పేరుతో.. స్త్రీనిధి బ్యాంకు రుణాలు పొందాలంటే ప్రతి ఎస్ెహ చ్జీ సంఘం రూ.2 వేల మేరకు కనీస మొత్తాన్ని వ్యక్తిగత పొదుపులో ఉంచాలని ఇటీవల షరతు విధించింది. 2012 అక్టోబరు నుంచి 2014 అక్టోబరు వరకు నెలకు రూ.100 చొప్పున రెండేళ్లకు గాను ఒకేసారి రూ.2400 మేరకు కట్టించుకుంది. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 61 వేల సంఘాలకు గాను రూ.14 కోట్ల మేరకు కట్టించుకుంది. ఇప్పటికే దాదాపు 80 శాతం సంఘాల వరకు పొదుపు మొత్తాలను స్త్రీనిధి బ్యాంకుకు కట్టాయి. వడ్డీలేని రుణాలకు మంగళం.. స్త్రీనిధి ద్వారా అందిస్తున్న వడ్డీలేని రుణాలకు నూతన ప్రభుత్వం మంగళం పాడింది. ఫలితంగా స్త్రీనిధి రుణాలు పొందిన మహిళలు ఈనెల నుంచి చెల్లించాల్సిన మొత్తాలతోపాటు 14 శాతం వడ్డీతో కలిపి రుణాలను తిరిగి స్త్రీనిధి బ్యాంకుకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిం చింది. మైక్రోఫైనాన్స్ కన్నా స్త్రీనిధి బ్యాంకు రుణాలు దారుణంగా తయారయ్యాయని మహిళలు వాపోతున్నారు. -
రాబడిలో ఎఫ్డీ కంటే బెస్ట్
మనలో చాలామంది సేవింగ్స్ అనగానే బ్యాంకు డిపాజిట్లకే మొదట ప్రాధాన్యతను ఇస్తారు. దీనికి కారణం వీటిల్లో ఎటువంటి రిస్క్ లేకపోవడమే. కానీ, ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని అందించే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు మన సంపదను పెంచకపోగా, కొనుగోలు శక్తిని ఏ విధంగా నష్టపరుస్తున్నాయి, అధిక రాబడిని ఇచ్చే ఇతర సాధనాలు ఏమిటి అన్న వాటిపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఎటువంటి నష్ట భయం లేని ఇన్వెస్ట్మెంట్స్ సాధనాలపైనే ఎక్కువమంది మొగ్గు చూపుతుంటారు. అందుకే మనలో చాలామంది క్యాపిటల్ ప్రొటెక్షన్ (అసలుకి హామీ) ఉన్న బ్యాంకు డిపాజిట్లలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వాస్తవంగా అసలుకి రక్షణ కల్పించే శక్తి బ్యాంకు డిపాజిట్లకు ఉందా? పెరుగుతున్న ధరలు (ద్రవ్యోల్బణం) సంపదను హరించేస్తున్న సంగతి గురించి ఎంతమందికి అవగాహన ఉంది? బ్యాంకు డిపాజిట్లలో పన్నుల భారం, దీర్ఘకాలంలో వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులు వంటి అనేక ప్రతికూలాంశాలున్నాయి. అందుకే డిపాజిట్ చేసేముందు వాస్తవిక రాబడి ఎంతుంటుందో లెక్కించాలి. సగానికి సగం నష్టం.. పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకు డిపాజిట్లు వాస్తవంగా ఎంత రాబడిని అందిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 1972లో కేజీ బియ్యం ఖరీదు రూ.2 ఉండేది. అంటే, రూ.10కి 5కేజీలు వచ్చేవి. ఈ పది రూపాయలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశారనుకుందాం. ఈ 41 ఏళ్లలో ఎస్బీఐ డిపాజిట్లపై సగటున 8.1 శాతం వడ్డీరేటును అందించింది. దీని ప్రకారం ఈ మొత్తం ఇప్పుడు రూ. 94 (33 శాతం ఆదాయ పన్నును లెక్కలోకి తీసుకున్న తర్వాత అవుతుంది. కానీ ఇదే సమయంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 7.7 శాతం. అంటే ఈ 41 ఏళ్లలో 10 కేజీల బియ్యం ధర రూ.225కి చేరినట్లు. అంటే డిపాజిట్ చేసిన మొత్తంతో అంటే రూ.94తో కేవలం రూ.2.4 కేజీలే వస్తాయి. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల కొనుగోలు శక్తి సగానికి పడిపోయింది. ఇంకో విధంగా చెప్పాలంటే సంపద విలువ 52 శాతం క్షీణించినట్టు లెక్క. సంపద విలువను ద్రవ్యోల్బణం ఏ విధంగా హరిస్తుందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. ఈ విధంగా చూస్తే ఎఫ్డీ అనేది వాస్తవంగా సంపదను పెంచకపోగా కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. బ్యాంకు డిపాజిట్లకంటే అధిక రాబడిని పొందడానికి అనేక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి డెట్ ఫండ్స్. ఇవి ఇంచుమించు మన బ్యాంక్ డిపాజిట్లవలే పనిచేస్తాయి. కానీ పన్నులు, రాబడి పరంగా చూస్తే ఇవి ఎఫ్డీ కంటే అధిక ప్రయోజనాన్ని అందిస్తాయి. పన్నుభారం తక్కువ రిస్క్ అంటే ఇష్టపడని వారికి ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చెప్పొచ్చు. వీటికి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చే శక్తి ఉండటమే కాకుండా రాబడిపై పన్ను భారం కూడా తక్కువే. బ్యాంకు డిపాజిట్లు అందించే వడ్డీపై అధిక ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నవారు 33 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే డెట్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 22.66 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇండెక్సేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే 11.33% చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఏడాది తర్వాత రూ.10,586 అవుతుంది. ఇదే మొత్తాన్ని ఏడాది కాలపరిమితిగల ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. అది కూడా ఇదే విధమైన రాబడిని అందించిందనుకుందాం. కానీ ఈ ఫండ్స్ నుంచి రూ.10,874 చేతికి వస్తుంది. దీనికి కారణం పన్ను భారం తగ్గడమే. అంటే దీనివల్ల బ్యాంకు డిపాజిట్ల కంటే 2.84% అధిక రాబడిని పొందవచ్చు. అంతేకాదు ఈ ఫండ్స్ అందించే డివిడెండ్లపైన కూడా పన్ను భారం తక్కువే. అధిక రాబడి.. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఈల్డ్స్ (రాబడులు) అధికంగా ఉన్నాయి. బ్యాంకులు వాటి లాభాలను పెంచుకోవడానికి డిపాజిట్లపై తక్కువ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తుంటాయి. సాధారణంగా డిపాజిట్లు, రుణాలపై ఇచ్చే వడ్డీల మధ్య 4-5 శాతం తేడా (స్ప్రెడ్) ఉండే విధంగా చూసుకుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో రుసుములు 1-1.5 శాతం మించి ఉండవు కాబట్టి ఆ మేరకు రాబడులు పెరుగుతాయి. ట్యాక్స్ ఫ్రీనే కానీ రిస్క్ ఫ్రీ కాదు ఇప్పుడు చాలామంది రాబడిపై ఎటువంటి పన్ను ఉండదన్న ఉద్దేశంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది 10, 20 ఏళ్ల దీర్ఘకాలిక బాండ్స్ అయినప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ దీర్ఘకాలిక బాండ్స్‌పై 8.5 శాతం వడ్డీరేటును ఇస్తుంటే, పన్ను భారం లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ వడ్డీరేటు 12.6 శాతం అవుతుంది. కానీ వీటిల్లో ఉండే రిస్క్‌ను గమనించడం లేదు. ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10-20 ఏళ్ల కాలానికి ద్రవ్యోల్బణం ఇదే విధంగా ఉండదు. మధ్య మధ్యలో తీవ్ర హెచ్చు తగ్గులకు గురవుతుంటాయి. అటువంటి సమయంలో ఈ దీర్ఘకాలిక బాండ్స్ వడ్డీరేట్లు అక్కరకురాకపోగా, వీటి నుంచి వైదొలిగే అవకాశం కూడా ఉండదు. అదే స్వల్పకాలానికి 1-2 ఏళ్లకు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రాబడులను పొందే అవకాశం ఉంటుంది. - మనీష్ డంగి కో-సీఐవో, బిర్లాసన్లైఫ్ ఏఎంసీ -
ఆపత్కాలంలో బీమా భరోసా
మన ఆర్థిక అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. హఠాత్పరిణామాల వల్ల ఆదాయ మార్గాలు మూసుకుపోయినప్పుడు కుటుంబం కుదేలయ్యే ఘటనలు ప్రాంతాలకు అతీతంగా నగరాల్లోనూ, గ్రామాల్లోనూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ఇలాంటి రిస్కులు ఉన్నాయని తెలిసినా సరే.. చాలా మంది వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సాధనాలను సమకూర్చుకోరు. వీటిని ఎదుర్కొనడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఇందుకోసం కొంత ప్లానింగ్, కొన్ని క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, మరికొంత క్రమశిక్షణ అవసర మవుతాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నంత కాలం ఇంట్లో ఎవరికి ఆర్థిక కష్టాలు వచ్చినా కుటుంబసభ్యులు బాసటగా నిల్చేవారు. ప్రస్తుతం న్యూక్లియర్ కుటుంబాలు పెరుగుతున్న కొద్దీ అటువంటి పరిస్థితి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి భరోసా కల్పించేది జీవిత బీమా. ఇది కూడా ఒక్కరి కష్టాన్ని అందరూ కలిసి పంచుకునేవంటిదే. అందుకే, ప్రస్తుతం బీమా కవరేజి ప్రాముఖ్యత పెరుగుతోంది. జీవిత బీమా, వైద్య బీమాతో పాటు రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు ప్లానింగ్ ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొంగొత్త పొదుపు సాధనాలు వస్తున్నప్పటికీ .. భారతీయులకు వీటిపై అంతగా అవగాహన ఉండటం లేదు. బ్యాంక్ డిపాజిట్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులకే ఇప్పటికీ ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రైవేట్ ఆర్థిక సంస్థలపై అపనమ్మకం ఇందుకు కారణం కావొచ్చు. ఇలాంటి అపోహల వల్లే వారు ఇన్వెస్ట్మెంట్ పరంగాను, భద్రతపరంగా ధీమానిచ్చే బీమా వంటి సరైన సాధనాలను ఎంపిక చేసుకోలేకపోతున్నారు. నిజానికి జీవిత బీమా కవరేజిలో రెండిందాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ కుటుంబ పెద్దకి అనుకోనిది ఏమైనా జరిగినా.. కుటుంబ సభ్యుల అవసరాలకు కావాల్సిన నిధి అందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ అలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా, అంతా సవ్యంగానే సాగితే కనీసం రిటైర్మెంట్ అవసరాలకైనా బీమా సొమ్ము ఉపయోగపడగలదు. అందుకే దీర్ఘకాలంలో ఇటు క్రమం తప్పకుండా పొదుపు, అటు చక్రవడ్డీ తరహా రాబడిలనుసాధనాల్లో బీమా ఒకటని చెప్పవచ్చు. ఇక, చివరిగా.. పాలసీలు తీసుకున్న వారిలో చాలా మంది.. తాము వీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెబుతుంటారు. ఇది మంచిదే. కానీ ఏదో ఒక పాలసీ..ఎంతో కొంతకు తీసుకోవడం సరికాదు. జీవితంలో వివిధ దశలకు అనుగుణంగా సరిపడినంత కవరేజి ఉండేలా తీసుకుంటేనే పాలసీ ప్రయోజనాలు పొందగలమని గుర్తుంచుకోవాలి. -
షేరుకూ గీటురాళ్లు!
బంగారం మేలిమో కాదో తేల్చడానికి గీటురాయిపై చూడాలి. ఏదైనా బ్యాంకు డిపాజిట్టు లాభమో కాదో తేల్చడానికి వడ్డీ రేటు తెలుసుకోవాలి. మరి షేర్ల సంగతో..? నిత్యం లక్షల కోట్ల లావాదేవీలు జరిగే షేర్ మార్కెట్లో ఒక షేరు మంచిదో కాదో తెలుసుకోవాలంటే ఎలా? ఆ షేరుపై లాభం వస్తుందో లేక మొదటికే మోసం వస్తుందో తెలుసుకోవటమెలా? దీనికి గీటురాళ్లున్నాయా? లేకేం ఉన్నాయి!! చాలా గీటురాళ్లున్నాయి. వీటన్నిటినీ చూసి పెట్టుబడి పెడితే... పరిస్థితి వికటించినా మనం సేఫ్‌గా ఉండొచ్చు.మరి ఆ గీటురాళ్లు ఎలాంటివో... వాటి ఆధారంగా షేర్లను ఎలా ఎంపిక చేసుకోవాలో చూద్దామా..! ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్. తెలుగులో షేరు వారీ ఆర్జన. ఉదాహరణకు కంపెనీ ఒక ఏడాదిలో కోటి రూపాయల నికర లాభాన్ని ఆర్జించిందనుకుందాం. ఆ కంపెనీ మొత్తం షేర్లు మార్కెట్లో కోటి వరకూ ఉన్నాయని అనుకుందాం. అపుడు షేరుకు ఆర్జన రూ.1 అవుతుంది. అదే ఈపీఎస్. ప్రతి కంపెనీ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పేర్కొని ఫలితాల్ని ప్రకటిస్తుంది. ఈ 12 నెలల కాలంలో ఆర్జించిన నికర లాభాన్ని కంపెనీ షేర్ల (ఈక్విటీ) సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువే ఈపీఎస్. పీఈ రేషియో ప్రైస్ ఎర్నింగ్ రేషియో... అంటే ధరలు-ఆర్జన నిష్పత్తి అన్నమాట. స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రతి కంపెనీ షేరూ ఎంతో కొంత ధర వద్ద ట్రేడవుతూ ఉంటుంది. ఆ ధర ఒకోసారి పెరుగుతుంది, ఒకోసారి తగ్గుతుంది. అయితే ధరను ఈపీఎస్‌తో భాగిస్తే వచ్చేదే పీఈ రేషియో. ఉదాహరణకు ఒక కంపెనీ షేరు రూ.31 వద్ద ట్రేడవుతోందనుకుందాం. దాని ఈపీఎస్ గనక 5 రూపాయలైతే... 31/5 = 6.2 అనేది దాని పీఈ రేషియో. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే... షేరు అంత ప్రియంగా ఉన్నట్టు లెక్క. నిష్పత్తి తక్కువగా ఉంటే... షేరు చౌకగా లభిస్తున్నట్టే లెక్క. అయితే ప్రతి కంపెనీ ఏదో ఒక రంగానికి చెందినదై ఉంటుంది. ఆ రంగం సగటు పీఈ ఎంత ఉందో చూసినపుడు... సదరు కంపెనీ పీఈతో దాన్ని పోల్చి, అది ఎక్కువ ధరకు దొరుకుతోందో, తక్కువ ధరకు దొరుకుతోందో తేల్చుకోవచ్చు. బుక్ వేల్యూ పుస్తక విలువ. అంటే కంపెనీకున్న ఈక్విటీ మూలధనానికి షేర్‌హోల్డర్ల రిజర్వ్ నిధులను కలపాలి. తరవాత ఈ మొత్తాన్ని ఈక్విటీ షేర్ల సంఖ్యతో భాగించాలి. అపుడు వచ్చేదే పుస్తక విలువ. మరోరకంగా చెప్పాలంటే... కంపెనీని ఉన్నఫళాన విక్రయిస్తే(లిక్విడేట్) కనీసంగా ఒక్కో షేరుకి లభించే విలువగా దీన్ని భావించవచ్చు. కంపెనీ షేరు ట్రేడవుతున్న ధర తక్కువగా ఉండి బుక్ వేల్యూ ఎక్కువగా ఉంటే... ఆ కంపెనీ షేరు చాలా చౌకగా వస్తున్నట్లు లెక్క. బుక్‌వేల్యూ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ధర పలుకుతుంటే... అంత ప్రియంగా ఉన్నట్లు లెక్క. డివిడెండ్ కంపెనీ ఏటా సాధించే నిర్వహణ లాభాల్లో అన్ని ఖర్చులూపోను మిగిలే లాభాన్ని నికర లాభం(నెట్ ప్రాఫిట్)గా వ్యవహరిస్తారు. దీన్లో కొంత భాగాన్ని కంపెనీ వాటాదారులకు పంచుతుంది. ఇదే డివిడెండ్. డివిడెండ్ మొత్తాన్ని ఈక్విటీ షేర్లతో భాగిస్తే వచ్చేదే ఒక్కో షేరుకి అందే డివిడెండ్. ఉదాహరణకు ఒక కంపెనీ షేరు రూ.600 వద్ద ట్రేడవుతోందనుకుందాం. ఆ షేరు ముఖ విలువ రూ.10 ఉందనుకుందాం. కంపెనీ గనక షేరుకు రూ.30 డివిడెండ్ చెల్లిస్తే... అది 300 శాతం డివిడెండ్ ఇచ్చినట్లు లెక్క. ఎందుకంటే డివిడెండ్‌ను లెక్కించేది ముఖవిలువతోనే. అయితే డివిడెండ్ ఈల్డ్ (రాబడి) మాత్రం 2 శాతంకిందే లెక్క. డివిడెండ్‌ను మార్కెట్ ధరతో విభజించి దాన్ని 100తో గుణిస్తే వచ్చేదే ఈల్డ్. ఉదాహరణకు రూ.30/600 గీ 100 = 2. అందుకని షేరు కొనేముందు ఆ కంపెనీ క్రమం తప్పకుండా డివిడెండ్ ఇస్తోందా? దాని ఈల్డ్ ఎంత? ఇలాంటివి కూడా చూడాలి. కొన్ని కంపెనీల డివిడెండ్ ఈల్డ్ 10 శాతం వరకూ ఉంటుంది. అలాంటివి కొంటే... ఏటా 10 శాతం రాబడి గ్యారంటీ. బ్యాంకు వడ్డీకన్నా ఇది ఎక్కువేగా!! లిక్విడిటీ ఏవో కొన్ని షేర్లు మినహా స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ప్రతి షేర్‌లోనూ రోజూ క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని షేర్లలో రోజుకు కొన్ని కోట్ల షేర్ల క్రయవిక్రయాలుంటే కొన్నింట్లో వందల సంఖ్యలో మాత్రమే ఉంటాయి. ఒక షేరును విక్రయించాలనుకున్నపుడు... దాన్ని ఎంత త్వరగా విక్రయించగలిగితే, దానికి అంత లిక్విడిటీ ఉన్నట్లు లెక్క. అందుకే షేర్లు కొనేటపుడు లిక్విడిటీ ఉండేలా కూడా చూసుకోవాలి. లేదనుకోండి! ఒక షేరును మనం ఒక ధర వద్ద విక్రయించాలని అనుకున్నా... కొనేవారు లేకపోతే అమ్మలేం. ఆ రకంగా నష్టపోయే ప్రమాదమూ ఉంటుంది. కంపెనీ పనితీరు పైవన్నీ షేరుకు గీటురాళ్లనుకోవచ్చు. అయితే ఒకోసారి వీటిని బట్టే షేరు కొనలేం. ఈపీఎస్ ఎక్కువగా ఉండి, పీఈ రేషియో తక్కువగా ఉండి, బుక్‌వేల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతూ... డివిడెండ్ క్రమం తప్పకుండా చెల్లిస్తున్న కంపెనీలను కూడా ఒకోసారి విశ్వసించలేం. ఎందుకంటే కంపెనీ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్నా, లాభం అదేపనిగా తగ్గుతూ వస్తున్నా వాటిని కొనలేం. షేరు కొనేముందు కంపెనీ యాజమాన్యం చరిత్ర, షేర్‌హోల్డర్ల పట్ల దాని వైఖరి కూడా చూసి తీరాల్సిందే!!! ఒక కంపెనీ పనితీరుకు కొలమానంగా నిలిచేది ఈపీఎస్ ఆ షేరు విలువ ఏ స్థాయిలో ఉందో తెలిపేది పీఈ నిష్పత్తి ఇక కంపెనీ నికర విలువను తెలిపేదే బుక్ వేల్యూ షేరు కొనడం ద్వారా వాటాదారుడిగా మారితే కంపెనీ నుంచి మనకు అందే లాభమే డివిడెండ్ -
సక్సెస్ అంటే స్థిరపడటమే..
ఇపుడు సక్సెస్ అంటే వేరే ఏమీ కాదు. ఆర్థికంగా స్థిరపడటం...అంతే!! మరి దీన్ని సాధించటం అసాధ్యమా? కానే కాదు! అలాగని ఈజీ కూడా కాదు. కావాల్సిందల్లా పక్కా ప్రణాళిక... దాని అమలు. ఇక ఉద్యోగాలు.. ఇళ్లు మారడం, పిల్లలు, రిటైర్మెంట్ లాంటి ఎన్నో సంఘటనలు మన ఆర్థిక లక్ష్యాల్ని ప్రభావితం చేస్తుంటాయి కనక వీటిని కనీసం ఆరు నెలలకోసారైనా సమీక్షించుకుంటూ వెళ్లాలి. మొత్తంగా ఎవ్వరైనా తమ ఆర్థిక ప్రణాళికలో దృష్టి పెట్టాల్సింది ఐదంశాల మీద. ఆ ఐదూ ఏమిటో తెలుసా...? పెట్టుబడులు.. బ్యాంకు డిపాజిట్ల నుంచి షేర్లు, మ్యూచ్‌వల్ ఫండ్లు, రియల్టీ, బాండ్లు లాంటి అనేక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చిత్ర కళాకృతులు కూడా ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా మారుతున్నాయి. మనం దేన్లో పెట్టుబడి పెట్టాం? ఏ స్థాయిలో పెట్టాం? అనేదే మన ఆర్థిక లక్ష్యాలకు పునాది. ఆదాయం, వయసు, రిస్కు సామర్థ్యం, సాధించదల్చుకున్న ఆర్థిక లక్ష్యాలు... వీటి ఆధారంగా దేన్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చో ఒక అవగాహనకు రావచ్చు. పొదుపు కోసమైనా, పెట్టుబడులకైనా ప్రతి నెలా బడ్జెట్‌ను నిర్దేశించుకుని, దానికి కట్టుబడి ఉండాలి. వీలైనంత చిన్న వయసు నుంచే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే... చక్రవడ్డీ ప్రయోజనాలను అత్యధికంగా పొందొచ్చు. పన్నులపై దృష్టి తప్పనిసరి... సంపాదించినదాన్లో సగం పన్నులే పోతే మిగిలేదేముంటుంది? అందుకే పన్ను ప్లానింగ్ చాలా ముఖ్యం. పన్ను భారం పడకుండా తగిన పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలంటే ట్యాక్స్ ఎక్స్‌పర్ట్‌ల సలహా తీసుకోవాలి. పన్ను భారం తగ్గేలా కొన్నింట్లో ప్రభుత్వం మినహాయింపునిస్తోంది. ఉదాహరణకు పిల్లల స్కూలు ఫీజు, మనపై ఆధారపడిన తల్లిదండ్రుల వైద్య ఖర్చులు, గృహ రుణం, ఇంటి పునర్నిర్మాణం కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ... ఇవన్నీ మినహాయింపులున్నవే. సెక్షన్ 80సి కింద మామూలుగానే రూ. 1లక్ష దాకా మినహాయింపు లభిస్తుంది. నిపుణుల్ని సంప్రదిస్తే పన్ను భారం తగ్గకపోదు. బీమా కవరేజీ... నేను నిక్షేపంగా ఉన్నా. నాకెందుకు బీమా... అనుకుంటారు చాలామంది. కానీ, మనపై ఆధారపడ్డవారి శ్రేయస్సు కోసం ఇది చాలా ముఖ్యం. వార్షికాదాయానికి కనీసం పది రెట్ల కవరేజి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు మీ వార్షికాదాయం రూ.10 లక్షలయితే కనీసం కోటి రూపాయల మేర బీమా కవరేజి ఉండాలి. దీన్ని ఎన్నాళ్లకు తీసుకోవాలి? ప్రీమియం ఎంతన్నది వయస్సు, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మనీ మేనేజ్మెంట్... ఆదాయ వ్యయాలకు సంబంధించి కచ్చితంగా ఒక బడ్జెట్‌కి కట్టుబడి ఉండాలి. లేనిపక్షంలో ఎంత వస్తోంది, ఎంత పోతోందన్నది తేలదు. బడ్జెట్‌పై అదుపు లేకుంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని సొంత బడ్జెట్‌కు కట్టుబడి ఉంటే ఏ సమస్యా ఉండదు. ఇవన్నీ పాటిస్తే భవిష్యత్ అవసరాల కోసం ఇబ్బంది పడకుండా ధీమాగా రిటైర్ కావొచ్చు. అత్యవసర నిధి.. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో, దానికెంత ఖర్చవుతుందో ముందే చెప్పలేం. కాబట్టి.. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ నిధి ఎంత ఉండాలంటే... కనీసం మీ నెల జీతం లేదా ఆదాయానికి మూడు నుంచి ఆరు రెట్లుండాలి. ఏ క్షణంలోనైనా విత్‌డ్రా చేయడానికి దీన్ని సేవింగ్స్ ఖాతాలోనే ఉంచుకోవాలి. -
క్లెయిమ్‌కాని సొమ్ముతో డిపాజిటర్ల చైతన్య నిధి
ముంబై: బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు దేశంలో రూ.3,500 కోట్లకు పైగా ఉంటాయి. డిపాజిటర్లను చైతన్యవంతుల్ని చేయడానికి ఈ సొమ్మును వినియోగించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మంగళవారం ప్రతిపాదించింది. బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా ఉంటూ ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్మును డిపాజిటర్ల విద్య, చైతన్య నిధి పథకానికి బదిలీ చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ మేరకు ఓ ముసాయిదా పత్రాన్ని రూపొందించి, వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది. ఓ అంచనా ప్రకారం... బ్యాంకుల్లో రూ.3,652 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 15 శాతం భారతీయ స్టేట్ బ్యాంకులోనే ఉన్నాయి. డిపాజిటర్ల చైతన్య నిధికి బదిలీ చేసిన సొమ్మును మళ్లీ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. సంబంధిత బ్యాంకు ఆ ఖాతాదారునికి డబ్బు చెల్లించి, చైతన్య నిధి నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ నిధిని 11 మంది సభ్యులు గల కమిటీ పర్యవేక్షిస్తుంది.