డిపాజిట్‌దార్లు ఆన్‌లైన్‌లో తమ క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకునేలా డీఐసీజీసీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఆన్‌లైన్ టూల్ ‘దావా సూచక్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారులు తమ డిపాజిట్ల క్లెయిమ్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకే ఈ ‘దావా సూచక్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీఐసీజీసీ తెలిపింది.
బ్యాంక్‌లో నమోదైన మొబైల్ నంబరు ద్వారా ఖాతాదారులు దావా సూచక్‌లోని సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అయితే 2024 ఏప్రిల్ 1 తర్వాత చేసిన క్లెయిమ్‌ల వివరాలు మాత్రమే ఈ టూల్ ద్వారా తెలుసుకునేందుకు వీలుందని డీఐసీజీసీ పేర్కొంది. సంస్థలు(ఇన్‌స్టిట్యూషన్స్) చేసే డిపాజిట్లు మినహా ఇతర అన్నిరకాల క్లెయిమ్‌లను ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంది. అంటే ఉదాహరణకు ఏదైనా బ్యాంకులోగానీ, ఎన్‌బీఎఫ్‌సీలోగానీ రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుకు బీమా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల బ్యాంక్ డీఫాల్ట్ అయితే రూ.5 లక్షలకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా రూ.5 లక్షలు మాత్రం కచ్చితంగా చెల్లిస్తారు.
ఇదీ చదవండి: పెరిగిన ట్రక్ అద్దెలు
దేశంలోని మొత్తం డిపాజిట్లలో 97.8 శాతం ఖాతాలు పూర్తిగా బీమా పరిధిలో ఉన్నాయని డీఐసీజీసీ తెలిపింది. అంటే ఈ మొత్తాలు రూ.5 లక్షల వరకే ఉన్నవి. మరో 2.2 శాతం రూ.5 లక్షలకు మించిన డిపాజిట్లు. వీటిల్లో ఎంత మొత్తం ఉన్నా రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. 1962లో ఈ బీమా రూ.1,500గా ఉండేది. దాన్ని ఫిబ్రవరి 04, 2020 వరకు ఆరుసార్లు సవరించి రూ.5 లక్షలకు పెంచారు. 2023లో డీఐసీజీసీ రూ.1,432 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment