
ముంబై: పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకు డిపాజిట్లలో కుటుంబాల వాటాను దాదాపు రెండు శాతం పెంచింది. రిజర్వ్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన గణాంకాలు చూస్తే...
ౌ 2015–16లో మొత్తం సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లలో కుటుంబాల వాటా 61.5 శాతం. అయితే ఇది 2016–17లో 63.2 శాతానికి చేరింది. అంటే కుటుంబాల బ్యాంకింగ్ డిపాజిట్ల వాటా ఈ కాలంలో దాదాపు 2 శాతం (200 బేసిస్ పాయింట్లు) పెరిగిందన్నమాట. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.
►ఇక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లలో 11.20 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది 1,09,43,700 కోట్లు. ఇందులో కేవలం కుటుంబ డిపాజిట్ల పరిమాణం చూస్తే... రూ.69,13,900 కోట్లు. 2015–16తో పోల్చితే ఈ సంఖ్య విషయంలో 14.14 శాతం వృద్ధి నమోదయ్యింది.
►వ్యక్తిగతంగా చూస్తే, సేవింగ్స్ డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి. ఈ విలువ 30 శాతం వృద్ధితో రూ.26,78,200 కోట్లకు ఎగసింది. వ్యక్తిగతంగా దాదాపు 70 శాతం మంది సేవింగ్స్ డిపాజిట్స్‌నే ఎంచుకున్నారు. ఇది గతానికన్నా భిన్నమైన ధోరణి.
►కుటుంబ డిపాజిట్లతో పాటు, ప్రభుత్వ రంగాల నుంచి డిపాజిట్లూ పెరిగాయి. అయితే ఫైనాన్షియల్, విదేశీ డిపాజిట్లలో మాత్రం క్షీణత నమోదయ్యింది.
►రాష్ట్రాల వారీగా మొత్తం డిపాజిట్ల వాటాను చూస్తే, మొత్తం డిపాజిట్లలో 20.4 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 10 శాతం వాటాతో ఢిల్లీ ఎన్‌సీఆర్ ద్వితీయ స్థానంలో ఉంది.
►ఒక్క కుటుంబ డిపాజిట్ల వృద్ధిని చూస్తే, ఉత్తరప్రదేశ్ 12.7%తో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంల్లో మహారాష్ట్ర (9.5%), బెంగాల్ (8%) గుజరాత్ (7.1%) నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment