మహాజన సభలో మాట్లాడుతున్న డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి
సుభాష్‌నగర్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ నిరర్థక ఆస్తుల విలువ (ఎన్‌పీఏ) రూ.220 కోట్ల నుంచి రూ.154 కోట్లకు తగ్గించడం అభినందనీయమని, ఎన్‌పీఏ మరింత తగ్గేలా చైర్మన్లు, బ్యాంకు సిబ్బంది కృషి చేయాలని డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్‌రెడ్డి సూచించారు. మంగళవారం వైఎస్‌ఆర్ సహకార భవనంలో జరిగిన డీసీసీబీ 101వ మహాజన సభకు ఆయన అధ్యక్షత వహించారు. బ్యాంకు సీఈవో గజానంద్ నివేదికను చదివారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌పీఏ రికవరీ సిబ్బందికి చైర్మన్లు సహకరించాలని, తద్వారా మరింత మంది రైతులకు నూతనంగా రుణాలు ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) గడువు జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడగించామని తెలిపారు. బ్యాంకు ద్వారా గ్రామీణ, పట్ట ణ ప్రాంతాల్లో హౌజింగ్ రుణాలు, విద్య, కార్లు, తదితర వాటికి రుణాలు అందించనున్నామన్నారు. బంగారు ఆభరణాలపై రూ.200 కోట్ల వరకు రు ణాలు ఇచ్చామని, ఈయేడాది రూ.50 కోట్ల వరకు రుణాలు పెంచామన్నారు. రైతులకు వానాకాలం పంటరుణాలు ఇస్తున్నారని తెలిపారు. జీవోనెంబర్ 44 ప్రకారం మార్జిన్ అకౌంట్‌లో నగదు జమ చేసు కున్న తర్వాతే రుణాలకు సంబంధించి మిగతా సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించారు. బ్యాంకు రూ.2.58 కోట్ల వార్షిక లాభంలో ఉందన్నారు.
ఉమ్మడి జిల్లాలో 144 సొసైటీ కేంద్రా ల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు డిపాజిట్లు రూ.614 కోట్ల నుంచి రూ.641.64 కోట్లకు పెరిగాయన్నారు. మనందరం రైతులకు అండగా ఉంటూ వారికి సేవ చేయడంలో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్, గోనె సంచులు, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, గోదాములకు రుణాలు, తదితర అంశాలను సొసైటీ చైర్మన్లు ప్రస్తావించారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలపై వైస్ చైర్మన్ రమేష్‌రెడ్డి, సీఈవో గజానంద్, డీసీఓ సింహాచలం సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. సభలో డీసీసీబీ డైరెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, గోర్కంటి లింగన్న, శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment