నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత
● దిగువకు 0.6 టీఎంసీల
నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శనివారం ఎత్తనున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ప్రతి సంవత్సరం జూలై 1న ఎత్తి అక్టోబర్ 28న మూసివేయాలి. అనంతరం ఎగువ ప్రాంతాల్లోని అక్కడక్కడా గుంతల్లో నిలిచిన నీటికి బదులుగా 0.6 టీఎంసీల నీటిని మార్చి 1న బాబ్లీ నుంచి ఎస్సారెస్పీకి వదలాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు తెరిచి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదులుతారు. దీంతో ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో గోదావరికి జలకళ రానుండగా, ప్రాజెక్టులోకి అంతగా నీరు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్‌లో కొంతమేర నీరుంది. ఏటా మార్చి 1న గేట్లు ఎత్తితే 0.2 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరుతుంది. కాగా, 0.6 టీఎంసీల కోటా పూర్తికాగానే గేట్లను మూసివేయనున్నారు. నీటి విడుదల పర్యవేక్షణలో ఎస్సారెస్పీ తరఫున ఈఈ చక్రపాణి పాల్గొంటారని అధికారులు తెలిపారు.
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు
ఖలీల్‌వాడి: ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఇన్‌చార్జి సీపీ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సెంటర్ నుంచి 100 మీటర్ల మేర ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెక్షన్ అమలులో ఉంటుందన్నా రు. పరీక్ష కేంద్రాల వద్ద షాపులు మూసి వేయాలని పేర్కొన్నారు.
జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా భవానిశ్రీ
సుభాష్‌నగర్: జాతీయ పసుపు బో ర్డు కార్యదర్శిగా ఎన్ భవానిశ్రీని నియమిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. భవానిశ్రీ 2017వ బ్యాచ్ నాగాలాండ్ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. భవానిశ్రీ , సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ (పరిశోధన) డాక్టర్ ఎబీ రెమాశ్రీ కలిసి సుగంధ ద్రవ్యాల బోర్డు, జాతీయ పసుపు బోర్డు మధ్య కార్యకలాపాలను సమన్వయం చేస్తారు.
నియామకం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్‌గా సువర్చల నియమితులయ్యారు. వీసీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి శుక్రవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సువర్చలకు ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపల్ సాయిలు ఉత్తర్వులను అందజేశారు.
నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత
Comments
Please login to add a commentAdd a comment