శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నిజామాబాద్‌నాగారం: నిత్య జీవన శైలిలో సైన్స్ చాలా ముఖ్యమైందని, విద్యార్థి దశ నుంచి శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్‌ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల పరిశోధనలు చేసినప్పుడు వారి మెదడులో శాసీ్త్రయ దృక్పథం అలవడుతుందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సోలార్ విద్యుత్ ప్రయోగం, జల విద్యుత్ ప్రయోగం, మానవ శ్వాస వ్యవస్థ ఇతర ప్రయోగాలు చూసి సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, సిద్దయ్య, జ్యోతి, రాజేశ్వరి, నర్ర రామారావు, సీడీపీవో సౌందర్య, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment