మేరు సంఘ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తా
నిజామాబాద్‌నాగారం: మేరు సంఘ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం జాతీయ టైలర్స్ డే సందర్భంగా ఆదర్శనగర్ మేరు టైలర్స్ అసోసియేషన్ సభ్యులు స్థానిక మేరు సంఘంలో టైలర్స్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించే విధంగా విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా కుల వృత్తులు చేసుకునేవారికి చేయూతగా పని నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ తరగతులు, శిక్షణ సమయంలో రూ. 500 ఉపకారవేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగకిషన్, జిల్లా అధ్యక్షుడు సోమహనుమంతరావు, దశరథం, గడుగు రోహిత్, ఎర్రం సుధీర్, మేరు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టైలరింగ్‌తో ఆర్థికంగా అభివృద్ధి
నిజామాబాద్ రూరల్:టైలరింగ్‌తో మహిళలు ఆర్థి కంగా అభివృద్ధి చెందవచ్చని కపిల మహిళా సొసై టీ అధ్యక్షురాలు టి గోపిక అన్నారు. శుక్రవారం కపి ల మహిళ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని సుభాష్‌నగర్‌లో టైలరింగ్ డేను ఘనంగా నిర్వహించారు. గత 30 ఏళ్లుగా మహిళలకు టైలరింగ్‌పై శిక్ష ణ ఇస్తూ అందరికి ఆదర్శవంతగా గోపిక నిలుస్తోందని సొసైటీ సభ్యులు వివరించారు. అనంతరం గో పికను సొసైటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో కళావతి,స్వాతి,శ్వేత,నాగమణి, రాధ, ప్రవళిక, సందీప, మేఘన, సుమ, చంద్రిక, మానస, సారిక, సుష్మ, రజిత శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లిలో..
ధర్పల్లి: మండల కేంద్రంలో మేర కులస్తులు ప్రపంచ టైలర్స్‌డేను ఘనంగా నిర్వహించారు. పలువురు దర్జీలను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, రెబ్బ కిషన్, శ్రావణ్, శ్రీనివాస్, సతీశ్, సంతోష్, సందీప్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఘనంగా టైలర్స్ డే
మేరు సంఘ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తా
Comments
Please login to add a commentAdd a comment