
నిజామాబాద్: శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి వైన్‌షాపులు, బార్‌లు తెరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వేములవాడకు ప్రత్యేక బస్సులు
ఖలీల్‌వాడి: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగినన్ని బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకు ఆర్మూర్, నిజామాబాద్–2, కామారెడ్డి డిపోల నుంచి 136 బస్సులను నడుపుతామని తె లిపారు. నిజామాబాద్ నుంచి లోంక, కామారెడ్డి నుంచి మద్దికుంట సంతాయిపేట్, కొమురవెల్లి పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment