
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021 జూలై 30 తేదీతో ముగిసిన పక్షం రోజులకు (జూలై 31, 2020తో పోల్చి) 6.11 శాతం పెరిగింది. విలువలో ఇది రూ.102.82 లక్షల కోట్ల నుంచి రూ.109.1 లక్షల కోట్లకు చేరింది. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే కాలంలో డిపాజిట్ల రేటు 9.8 శాతం పెరిగి 141.61 లక్షల కోట్ల నుంచి రూ.155.49 లక్షల కోట్లకు ఎగసింది.
2021 జూలైతో ముగిసిన పక్షం రోజుల్లో రుణ వృద్ధి రేటు 6.45 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 10.65 శాతం. గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) బ్యాంక్ రుణ వృద్ధి 5.56 శాతం. డిపాజిట్ల వృద్ధి 11.4 శాతం.
Comments
Please login to add a commentAdd a comment