percent
-
మహారాష్ట్రలో ఓటింగ్ సరళి ఉందిలా..
నేడు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 11 గంటలకు 17.5 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న లోక్‌సభ స్థానాల్లో జాల్నా సీటుపై అందరి దృష్టి నిలిచింది. ఈ స్థానం నుంచి మొత్తం 26 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు.మహారాష్ట్రలోని జాల్నా లోక్‌సభ నియోజకవర్గాన్ని 1999 నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ స్థానంలో ప్రస్తుతం రావ్‌సాహెబ్ దాన్వే ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఆయనే బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి కల్యాణ్ కాలే ఎన్నికల బరిలో దిగారు. వంచిత్ బహుజన్ అఘాడీ తన అభ్యర్థిగా ప్రభాకర్ దేవ్‌గన్‌ను రంగంలోకి దించింది.మహారాష్ట్రలో ఈరోజు (సోమవారం) 11 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుండగా, వాటిలో ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, పశ్చమ మహారాష్ట్ర ప్రాంతాలు ఉన్నాయి. ఈ నాల్గవ దశ పోలింగ్‌లో 2 కోట్ల 28 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 298 మంది అభ్యర్థులు నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. -
మధ్యప్రదేశ్: గతం కన్నా తగ్గుతున్న ఓటింగ్?
మధ్యప్రదేశ్‌లో ఈరోజు నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగిన మూడు దశల లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదయ్యింది. దీంతో ఎన్నికల సంఘం నాల్గవ దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు పలు ప్రయత్నాలు చేసింది.2019తో పోల్చిచూస్తే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో నాటి కన్నా ఐదు శాతం ఓటింగ్ తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. గత మూడు దశల పోలింగ్‌లో మధ్యప్రదేశ్‌లో మొత్తంగా 64.76 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2019లో 69.74 శాతం పోలింగ్ నమోదయ్యింది. దీని ప్రకారం చూస్తే ఇప్పటివరకూ జరిగిన మూడు దశల పోలింగ్‌లో మొత్తంగా నాటి కన్నా ఐదు శాతం తక్కువ ఓటింగ్ నమోదయ్యింది. -
సీటు రానివారికి టెలీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ, నీట్, జేఈఈ వంటి ప్రముఖ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చి ఎంబీబీఎస్, ఐఐటీ వంటి వాటిల్లో సీటు రాని వారికి మానసిక చికిత్స అందజేసేందుకు 24 గంటల టెలీ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆయా పరీక్షలు రాసి కొద్ది మార్కులతో సీట్లు కోల్పోతున్నవారు అనేకమంది ఉంటున్నారు. వీరిలో కొందరు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మానసిక ఆరోగ్యం.. వర్తమాన పరిస్థితుల్లో దాని నిర్వహణ’అనే అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేసింది. వివరాలిలా ఉన్నాయి.. ఆత్మహత్యలు 10 శాతానికి తగ్గాలి పాఠశాలల్లోనూ మానసికంగా కుంగిపోయే విద్యార్థుల కోసం కౌన్సిలర్లను నియమించాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను 2030 నాటికి 10 శాతానికి తగ్గించాలి. కేంద్రీకృత సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. జైళ్లల్లోనూ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మానసిక ఆరోగ్య, సమస్యలను ఆరోగ్య బీమాలో చేర్చాలి. దేశంలో 47 మానసిక చికిత్సాలయాలున్నాయి. అయితే 2017లో ఏర్పాటైన మానసిక ఆరోగ్య చట్టానికి అనుగుణంగా అవి లేవు. ఆ మేరకు వాటిని తీర్చిదిద్దాలి. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మెంటల్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మానసిక చికిత్సకు సంబంధించిన 17 రకాల మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవన్నీ మెడికల్ కాలేజీలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఉన్నాయి. వాటిల్లో కనీసం 13 మందులను ప్రాథమిక ఆసుపత్రి స్థాయికి తీసుకురావాలి. పోలియో చుక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సినీ తారలు, క్రీడాకారుల వంటి ప్రముఖులతో ప్రచారం చేస్తారు. అలాగే మానసిక సమస్యలకు సంబంధించి కూడా ఆయా రంగాల ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి అవగాహన పెంచాలి. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. స్వయం ఉపాధి పొందుతున్నవారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తర్వాత వేతన జీవులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రైవేట్ రంగం, రైతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2021లో స్వయం ఉపాధికి చెందిన వారి లో 20,237 మంది ఆత్మహత్య చేసుకు న్నారు. వేతన జీవులు 15,870, నిరుద్యోగులు 13,714, విద్యార్థులు 13,089, వ్యా పారస్తులు 12,055, ప్రైవేట్‌రంగ ఉద్యోగులు 11,439, రైతులు 5,318, కూలీలు 5,563 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ తర్వాత మానసిక సమస్యలు 28% పెరిగాయి. 2017లో 1.29 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే, 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్కహాల్ వల్ల 4.7 శాతం మంది, పొగాకు వల్ల 20.9 శాతం మంది మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్, ఉద్వేగాలు, ఇతరత్రా కారణాలతో 10.9 శాతం మందికి సమస్యలు వస్తున్నాయి. తీవ్రమైన స్కిజోఫ్రేనియా వంటి సమస్యలతో 1.4 శాతం, యాంగ్జయిటీతో 3.2 శాతం, స్ట్రెస్‌తో 3.7 శాతం, ఇతరత్రా ఏదో ఒక మానసిక సమస్యతో 13.7 శాతం బాధపడుతున్నారు. దేశంలో లక్ష జనాభాకు 0.75 మంది మానసిక చికిత్స నిపుణులు ఉన్నారు. అంటే 1.34 లక్షల మంది జనాభాకు ఒక మానసిక చికిత్స నిపుణుడు మాత్రమే ఉన్నారు. ప్రపంచ సగటు 1.7గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షకు 8.6 మంది మానసిక నిపుణులు ఉన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్లో రెండు శాతమే మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక మానసిక రోగుల్లో 85 శాతం మందికి తగిన వైద్యం అందడం లేదు. మానసిక చికిత్సలను ఆయుర్వేద, యోగా పరిధిలోకి తీసుకురావాలి. జిల్లా కేంద్రంగా మానసిక వైద్యం ఉండాలి. మానసిక రోగుల్లో అవగాహన పెంచాలి జిల్లాకొక యువ స్పందన కార్యక్రమం పెట్టి 20 మందిని రిక్రూట్ చేసుకొని ప్రజల్లో మానసిక రోగాలపై అవగాహన పెంచాలి. బ్రిక్స్ దేశాల్లోని దక్షిణాఫ్రికాలో 35.8 శాతం మంది మానసిక సమస్యలున్నవారే. మన దేశంలో 30.1 శాతం మంది ఏదో ఒక మానసిక సమస్యలతో ఉన్నారు. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్‌లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్‌ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్‌లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్‌లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్‌లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్‌గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ. శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
జూన్‌లో 12% పెరిగిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది జూన్ జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ కింద రూ.1,61,497 కోట్లు వసూలైనట్లు చెప్పారు. రాజ్య సభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవా బిచ్చారు. ఒక్క నెలలో జీఎస్టీ మొత్తం వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు అధిగమించడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారని చెప్పారు. జీఎస్టీ వసూళ్లలో ప్రతి సంవత్సరం సాధిస్తున్న వృద్ధితో అనుకూల ధోరణి కనిపిస్తోందన్నారు. తాత్కాలికంగా అనుమతించిన జీఎస్టీ నష్టపరిహారం కింద మొత్తం సొమ్మును కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిందని, బకాయిలేమీ లేవని చెప్పారు. పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి జీఎస్టీ యాక్ట్ ప్రకారం జీఎస్టీ అమలు చేయడం ద్వారా మొదటి 5 సంవత్సరాలు 2017 జూన్ 1 నుంచి 2022 జూన్ 30 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పడిన రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్రం నష్టపరి హారం చెల్లించిందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రతి రెండు నెలల కోసారి లెక్కించి విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వ్యవస్థను బలోపేతం చేస్తేనే మీడియేషన్ ద్వారా కేసుల పరిష్కారం: విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం (మీడియేషన్)తో కేసులు పరిష్కరించాలంటే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కోటికి పైగా కేసులు పరిష్కరించాలంటే ఈ వ్యవస్థను వందరెట్లు బలోపేతం చేయాల్సి ఉంటుందన్నారు. మధ్యవర్తిత్వం బిల్లు–2021పై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ కోర్టుల్లో నాలుగున్నర కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే.. అందులో కోటికిపైగా సివిల్ కేసులేనని తెలిపారు. దేశంలో 2022 నాటికి 570 మీడియేషన్ కేంద్రాలు, 16 వేలమంది మీడియేటర్లు ఉన్నారని చెప్పారు. ఈ సివిల్ కేసుల్లో 90 వేల కేసులను మాత్రమే పరిష్కరించగల సామర్థ్యం ప్రస్తుత మీడియేషన్ వ్యవస్థకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాలిస్తే తగినన్ని మీడియేషన్ సెంటర్లు, మీడియేటర్లు లేనందున ఆ వ్యవస్థపై మోయలేనంత భారం పడుతుందన్నారు. వ్యవస్థను వందరెట్లకు పైగా బలోపేతం చేయకపోతే ఈ బిల్లు ప్రయోజనం నెరవేరదని చెప్పారు. కమ్యూనిటీ మీడియేషన్ ఈ బిల్లులోని ప్రధాన అంశాల్లో ఒకటని, సున్నితమైన రాజకీయ అంశాలు ఇమిడి ఉండే కేసుల పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. ఇదే బిల్లుపై వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రీ లిటిగేషన్ మీడియేషన్ మాండేటరీపై కేంద్రానికి పలు సూచనలు చేశారు. ప్రీ లిటిగేషన్ మీడియేషన్‌కు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీవవైవిధ్య పరిరక్షణకు తగినన్ని నిధులేవి? విస్తారమైన జీవవైవిధ్యం ఉన్న దేశంలో దాని పరిరక్షణకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.7 కోట్లు మాత్రమే కేటాయిస్తోందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో జీవవైవిధ్య సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 34 జీవవైవిధ్య హాట్స్పాట్లలో నాలుగు మనదేశంలో ఉన్నాయని చెప్పారు. ఈ నాలుగు హాట్‌స్పాట్స్‌లో 90 శాతం ప్రాంతం కోల్పోయినట్లుగా డేటా చెబుతోందన్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని కోరారు. ప్రపంచం మొత్తం మీద నమోదైన జీవరాశుల్లో 96 వేల జాతులు భారత్‌లోనే ఉన్నాయని తెలిపారు. 47 వేల వృక్షజాతులు, ప్రపంచంలోకెల్లా సగం నీటి మొక్కలతో భారత్ విలక్షణమైన జీవవైవిధ్యం కలిగి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా లంకమహేశ్వరం వన్యసంరక్షణ కేంద్రం, తిరుమల, సింహాచలం గిరులతోపాటు అనేక ప్రాంతాల్లో రోగచికిత్సకు వినియోగించే అరుదైన మొక్కలున్నా యని చెప్పారు.ఇలాంటి జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం తగినన్ని నిధులతో కార్యా చరణ చేపట్టాలని ఆయన కోరారు. ఇదే బిల్లుపై వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల తీవ్రత జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతున్న ందున ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (సీబీడీ)లో భాగంగా దేశ అంతర్జాతీయ బాధ్యతల్లో సమన్వయం అవసరమని చెప్పారు. జీవవైవిధ్యం, ప్రయోజనాలు రక్షించడానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. బిల్లులో ప్రయోజనం – భాగస్వామ్య నిబంధనలు నిర్ణయించడంలో స్థానిక సంఘాల ప్రత్యక్ష పాత్రను తీసివేయడం సరికాదని చెప్పా రు. పరిహారం విషయాల్లో జరిమానా ఎలా అంచనా వేయాలనే దానిపై న్యాయనిర్ణయ అధికారికి మార్గద ర్శకత్వం లేకపోవడం సమస్యలకు తావిచ్చేలా ఉందన్నారు. న్యాయమూర్తులు, లేదా కోర్టులకు కాకుండా ప్రభుత్వ అధికారులకు ఆ తరహా అధికారం అవసర మా అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నందున బిల్లులో ఆ అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. అటల్ జ్యోతి కింద ఏపీలో 5,500 సోలార్ వీధిలైట్లు అటల్ జ్యోతి యోజన ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్‌లో యాస్పిరేషనల్ జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నాల్లో 5,500 సోలార్ వీధిలైట్లు అమర్చినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అటల్ జ్యోతి పథకం మొదటి ఫేజ్‌లో ఆమోదిత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు మొత్తం 5,500 సోలార్ వీధిలైట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయగా వాటిని అమర్చినట్లు తెలిపారు. -
వారం రోజుల వ్యవధిలో 6.11 శాతం పెరిగిన బ్యాంకింగ్ రుణ వృద్ధి
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021 జూలై 30 తేదీతో ముగిసిన పక్షం రోజులకు (జూలై 31, 2020తో పోల్చి) 6.11 శాతం పెరిగింది. విలువలో ఇది రూ.102.82 లక్షల కోట్ల నుంచి రూ.109.1 లక్షల కోట్లకు చేరింది. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే కాలంలో డిపాజిట్ల రేటు 9.8 శాతం పెరిగి 141.61 లక్షల కోట్ల నుంచి రూ.155.49 లక్షల కోట్లకు ఎగసింది. 2021 జూలైతో ముగిసిన పక్షం రోజుల్లో రుణ వృద్ధి రేటు 6.45 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 10.65 శాతం. గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) బ్యాంక్ రుణ వృద్ధి 5.56 శాతం. డిపాజిట్ల వృద్ధి 11.4 శాతం. -
మహానగరంలో సాధారణం కంటే తగ్గిన వర్షపాతం
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో జూలైలో 31 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వరుసగా వర్షాలు కురిసినప్పటికీ సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడం గమనార్హం. జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఒకటి వరకు సాధారణంగా నగరంలో 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటి వరకు 193.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 31 శాతం లోటు వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. షేక్‌పేట్ మండలం మినహా అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యధికంగా ముషీరాబాద్‌లో 42.4 శాతం, అంబర్‌పేటలో 40.4 శాతం, మారేడ్‌పల్లిలో 37.5 శాతం, తిరుమలగిరిలో 50.6 శాతం, బహదూర్‌పురాలో 49.3 శాతం, బండ్లగూడలో 47.6 శాతం మేర లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం. ఒక్క షేక్‌పేట మండలంలో మాత్రం 3.1 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్ 1 – ఆగస్టు 1 వరకు గ్రేటర్లోనిమండలాల్లో వర్షపాతం వివరాలివీ వర్షపాతం మిల్లీ మీటర్లలో, లోటు శాతాల్లో.. -
జిల్లాలో ఇప్పటికి 31 శాతం వరినాట్లు
-నెలాఖరుకల్లా పూర్తిచేయాలి -వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్ కరప(కాకినాడ రూరల్) : జిల్లాలో ఇంతవరకు 31 శాతం మేర ఖరీఫ్ వరినాట్లు పడ్డాయని వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జేవీఎస్ ప్రసాద్ తెలిపారు. కరప మండలం వలసపాకలలో బుధవారం ఆయన డీడీఏ వీటీ రామారావుతో కలిసి వెదజల్లిన పంటపొలాలను, నారుమళ్లను పరిశీలించి, రైతులకు సూచనలుచేశారు. సార్వాలో 2.32 లక్షల హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా 71,568 హెక్టార్లలో నాట్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. నెలాఖరుకల్లా వరినాట్లు పూర్తిచేసుకోవాలని సూచించారు. ప్రత్తినాట్లు 35 శాతం వేశారన్నారు. వరిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టేందుకు నూరుశాతం రాయితీపై ఇస్తున్న జిప్సం, జింకు, బోరాన్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో పెద్దగా నష్టం జరగలేదన్నారు. వెదజల్లిన పొలాలు ముంపునకు గురైతే మళ్లల్లోంచి నీరుపోయేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా గోతుల్లో పడిన విత్తనాల మొలకశాతం దెబ్బతింటే మళ్లీ జల్లుకుంటే సరిపోతుందని చెప్పారు. పల్లపు ప్రాంతాల్లో వరినాట్లు వేసిన పొలాలు ముంపుకు గురైతే నీరుతీసేసి, బూస్టర్ డోస్‌గా 10 కిలోల యూరియా, 15 కిలోలు పొటాష్ వేయాలన్నారు. శిలీంధ్ర, కీటకనాశిని మందులు హెక్సాకొనజోల్, కార్బండిజమ్, క్లోరిఫైరిపాస్, మోనోక్రోటోపాస్ మందులలో ఏదో ఒకటి పిచికారీ చేస్తే పంటతెగుళ్లు అదుపుచేయవచ్చన్నారు. కౌలు రైతులకు రూ.101 కోట్ల రుణాలు జిల్లాలో 1,34,777 కౌలురైతులు ఉండగా 81,820 మందికి రుణఅర్హత కార్డులు ఇచ్చి, వివిధ బ్యాంకుల ద్వారా రూ 101.73 కోట్లు పంటరుణాలు అందజేశామని ప్రసాద్ తెలిపారు. 59,600 మంది సాగురైతులకు సీఓసీ కార్డులు ఇవ్వగా రూ.58 కోట్లు రుణాలు ఇచ్చారన్నారు. రుణాలు తీసుకునే రైతులు ప్రధానమంత్రి ఫసలీ బీమా పథకం ప్రీమియం ఆగష్టు 21లోగా చెల్లించాలని, రుణాలు తీసుకోని రైతులు ఎకరానికి రూ.587 లు ప్రీమియంగా ఈనెలాఖరులోగా చెల్లించాలని సూచించారు. రైతురథంలో 680 ట్రాక్టర్లు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై ట్రాక్టర్లు ఇచ్చేందుకు రైతురథం పథకంలో జిల్లాకు 680 ట్రాక్టర్లు మంజూరయ్యాయని జేడీ తెలిపారు. నియోజకవర్గాల వారీగా కేటాయించిన ట్రాక్టర్ల కోసం జిల్లాఇన్‌చార్జ్ మంత్రి ఆమోదంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఏఓ ఎ.అచ్యుతరావు, ఏఈఓలు ఎస్.సత్యనారాయణస్వామి, ఐ.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీఈఓలు కె.దివ్య, కె.సాయిశరణ్య, సొసైటీ అధ్యక్షుడు నక్కా వీరభద్రరావు, సర్పంచ్ వాసంశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తి : జేసీ
రంగంపేట : జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో జిల్లాలోని అన్ని మండల అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,800 మంది సిబ్బంది స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. 17 లక్షల కుటుంబాలకు గాను, ఇప్పటి వరకూ 6 లక్షల 13 వేల కుటుంబాల సర్వే పూర్తి చేశారని తెలిపారు. నెల రోజుల్లోగా ఈ సర్వే పూర్తి చేస్తామన్నారు. సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఎంపీడీఓ కె.కిషోర్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సూర్య ప్రభ తదితరులు పాల్గొన్నారు. -
తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తత్కాల్ రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారికి నిజంగా ఇది తీపి కబురే. అవును....ఇపుడు తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి సొమ్ము నష్టపోతామనే భయం లేదు. దాదాపు సగం సొమ్ము తిరిగి మన ఖాతాలో చేరుతుంది. ఇప్పటి వరకు తత్కాల్ సేవ ద్వారా బుక్ చేసుకున్న రైల్వే టికెట్‌ను క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు ఒక్కపైసా కూడా వెనక్కి వచ్చేది కాదు. కానీ ఇక ముందు తత్కాల్ టికెట్ కాన్సిల్ చేసుకుంటే దాదాపు 50 శాతం డబ్బులు తిరిగి రానున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వేస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే తత్కాల్ టికెట్లు బుకింగ్ వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మారిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఏసీ క్లాస్ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు , నాన్ ఏసీ టికెట్లను ఉదయం 11 -12 గంటల మధ్య బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. దీంతో పాటు బాగా రద్దీ ఉండే కొన్ని రూట్లలో ప్రత్యేక తత్కాల్ రైళ్లను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్టు సమాచారం. మరోవైపు తత్కాల్ స్పెషల్ రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని 10 రోజుల నుంచి రెండు నెలల లోపు(60 రోజులు) బుక్ చేసుకునే వీలుగా నిబంధనలు సవరించినట్టు సమాచారం.