మధ్యప్రదేశ్‌లో ఈరోజు నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగిన మూడు దశల లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదయ్యింది. దీంతో ఎన్నికల సంఘం నాల్గవ దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు పలు ప్రయత్నాలు చేసింది.
2019తో పోల్చిచూస్తే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో నాటి కన్నా ఐదు శాతం ఓటింగ్ తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. గత మూడు దశల పోలింగ్‌లో మధ్యప్రదేశ్‌లో మొత్తంగా 64.76 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2019లో 69.74 శాతం పోలింగ్ నమోదయ్యింది. దీని ప్రకారం చూస్తే ఇప్పటివరకూ జరిగిన మూడు దశల పోలింగ్‌లో మొత్తంగా నాటి కన్నా ఐదు శాతం తక్కువ ఓటింగ్ నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment