less
-
‘కలిసి ఉండలేరు..తోడులేక బతకలేరు’ : సింగర్ అల్కా ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ
ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ బాలీవుడ్లో 90లలో ఒక సెన్సేషన్. అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రసిద్ధ గాయకులలో ఒకరిగా మెలోడీ క్వీన్‌గా సత్తా చాటుకున్నారు. మెలోడీ, పాప్ ఇలా వివిధ రకాల పాటల్లో రాణించి అభిమానుల మనసు దోచుకున్న సీనియర్-మోస్ట్ గాయని. అల్కా యాగ్నిక్ 14 ఏళ్ల వయస్సులో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. 90ల నాటి ఆ మెలోడీ క్వీన్ 16కు పైగా భాషల్లో వేల పాటలను రికార్డ్ పాడింది.ఏడు సార్లు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. చోళీ కే పీచే, ఏక్ దో తీన్, మేరీ మెహబూబా, తాల్ సే తాల్, దిల్ నే యే కహా హై దిల్ సే, ఓ రే చోరీ, హమ్ తుమ్, ఘూంగట్ కి ఆద్ సే, కుచ్ కుచ్ లాంటి సూపర్ డూపర్ సాంగ్స ఆమె ఖాతలో ఉన్నాయి. హోతా హై, కహో నా... ప్యార్ హై, సాన్ సాన్ సనా, కభీ అల్విదా నా కెహనా, అగర్ తుమ్ సాథ్ హో ఇలా చెప్పుకుంటూ పోతే...ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇంకా టెలివిజన్ రియాలిటీ షోలు, స రే గ మ పా లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్, సూపర్ స్టార్ సింగర్, అనేక ఇతర వాటితో పాటు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. బాల్యం, ప్రేమ పెళ్లి1966 మార్చి 20, న కోల్‌కతాలో గుజరాతీ కుటుంబంలో ధర్మేంద్ర శంకర్ శుభ దంపతులకు జన్మించింది అల్కా యాగ్నిక్. తల్లి, భారతీయ శాస్త్రీయ గాయకురాలు శుభా నుంచే అల్కాకు సంగీతం అబ్బింది. ఆల్కాఆరేళ్ల వయసునుంచే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో భక్తి పాటలు, భజనలు పాడటం ప్రారంభించింది. కేవలం 14 సంవత్సరాల వయస్సులో, అల్కా యాగ్నిక్ ‘పాయల్ కి ఝంకార్’ చిత్రంలో తిర్కత్ అంగ్ పాటతో ప్రొఫెషనల్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.రైలు ప్రయాణంలో షిల్లాంగ్‌కు చెందిన నీరజ్ కపూర్‌ని 1986లో తొలిసారి కలిసింది. ఢిల్లీలోని అల్కాను, ఆమెతల్లిని స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. (నీరజ్ అల్కా తల్లి స్నేహితురాలి మేనల్లుడు) తొలిచూపులోనే ఇద్దరిలోనూ ప్రేమ పుట్టేసింది. ఆరేళ్లకు మాట కలిసింది. మొదట వీరి పెళ్లికి అల్కా ఇంట్లో ఒప్పుకోకపోయినప్పటికీ, రెండేళ్ల డేటింగ్ చేసిన తర్వాత 1989లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె సాయేషా కపూర్. ఈమె అమిత్ దేశాయ్‌ని వివాహం చేసుకుంది.అటు బాధ్యతల రీత్యా ఈ జంట ఒకరికొరు దూరంగా ఉండాల్సింది వచ్చింది.. కలిసి ఉండేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. నీరజ్ నిర్ణీత వ్యవధిలో ముంబైకి వెళ్లేవాడు, అల్కా కుటుంబంతో ప్రతీ ఏడాది షిల్లాంగ్‌లో ఒక నెల గడిపేది. అయితే, దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. అల్కా యాగ్నిక్ కెరీర్ కారణంగా, ఆమె ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చేది. నీరజ్ షిల్లాంగ్‌లో వ్యాపారంలో రాణిస్తాడని అల్కా ఆశపడింది. కానీ దురదృష్టవశాత్తూ అతను వ్యాపారంలో మోసపోయాడు. నష్టాలెదుర్కొన్నాడు. మరోవైపు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కూతురి బాధ్యతలనుఒంటరిగానే స్వీకరించింది. దాదాపు అయిదారేళ్లు అస్సలు మాటలు కూడా లేవు. వీరు విడిపోతారని కూడా అందరూ అనుకున్నారు. కానీ మూడు దశాబ్దాలుగా వీరి ప్రేమ ప్రయాణం అసామాన్యంగా కొనసాగుతోంది.ఇద్దరి మధ్య దూరం ఎంతున్నా, ఒకరికొకరు లేకుండా జీవించలేరని ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు ద్వారా గ్రహించారు. ఒకరి పట్ల ఒకరికి స్వచ్ఛమైన ప్రేమ, గౌరవం అలాగే ఉన్నాయని అర్థమైంది. తమది అంత ఈజీగా ఓడిపోయే ప్రేమ కాదని నిర్ధారించేసుకున్నారు. అల్కా ముంబైలో, నీరజ్ షిల్లాంగ్‌లో నివసిస్తూనే ఒకరి కలల్ని ఒకరు గౌరవించుకుంటూ, కష్టాలు, కన్నీళ్లలో ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ గత 28 ఏళ్లుగా తమ జీవితాన్ని కొనసాగించారు. ఈ దంపతులే స్వయంగా చెప్పినట్టు, వీళ్లది విచిత్రమైన దాంపత్యం ‘కలిసి ఉండలేరు.. ఒకరికొకరు తోడు లేకుండా బతకలేరు’ -
మధ్యప్రదేశ్: గతం కన్నా తగ్గుతున్న ఓటింగ్?
మధ్యప్రదేశ్‌లో ఈరోజు నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగిన మూడు దశల లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదయ్యింది. దీంతో ఎన్నికల సంఘం నాల్గవ దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు పలు ప్రయత్నాలు చేసింది.2019తో పోల్చిచూస్తే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో నాటి కన్నా ఐదు శాతం ఓటింగ్ తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. గత మూడు దశల పోలింగ్‌లో మధ్యప్రదేశ్‌లో మొత్తంగా 64.76 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2019లో 69.74 శాతం పోలింగ్ నమోదయ్యింది. దీని ప్రకారం చూస్తే ఇప్పటివరకూ జరిగిన మూడు దశల పోలింగ్‌లో మొత్తంగా నాటి కన్నా ఐదు శాతం తక్కువ ఓటింగ్ నమోదయ్యింది. -
1996 ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? స్వతంత్రులకు పరాభవమేనా?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనే నిలిచింది. 1996 ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. అది ప్రతీ ఎన్నికల్లోనూ చర్చకు వస్తుంటుంది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిసారీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 500 దాటగా, కొన్నిసార్లు రెండు అంకెలకే పరిమితమైంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు లోక్‌సభ స్థానాలున్నప్పుడు కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 523 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1984 ఎన్నికల్లో 189 మంది, 1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడూ ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలవకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 17 మంది అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఏడుగురు విజేతలు, ఏడుగురు ప్రత్యర్థి అభ్యర్థులు మినహా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. -
ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్‌కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్‌కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్‌కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. -
‘సామాజిక’ దూరంతో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి
న్యూఢిల్లీ: అస్తమానం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోయేకంటే కాస్తంత సేపు వాటిని పక్కనబెడితే మానసిక ఆరోగ్యంతోపాటు ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. జర్మనీలోని ప్రఖ్యాత రూహర్–యూనివర్సిటీ బూచమ్, జర్మనీ మానసిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ► సామాజిక మాధ్యమాల్లో గడిపేవారు తమ ఉద్యోగంపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వీరు ఒక 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆర్యోగం మెరుగవడంతోపాటు వృత్తిజీవితం పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు ► సోషల్‌మీడియాలో ఆన్లైన్లో లేనపుడు ఏదో మిస్ అవుతున్నామే అనే భావన ఈ 30 నిమిషాల దూరం తర్వాత తగ్గిందట ► ఇంతకాలం సోషల్ మీడియాలో గడుపుతూనే పని చేసిన వాళ్లు అతిగా పనిచేశామని భావించేవారట. 30 నిమిషాలు సోషల్‌మీడియా పక్కనబెడితే ‘అతిపని’ భావన కొంచెం తగ్గిందట ► పని మధ్యలో వదిలేసి వాట్సాప్, ఫేస్బుక్ చూసేవాళ్లు తిరిగి పని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పనిలో చక్కని ఫలితాలు అందుకోలేకపోతున్నారు ► రోజుకు కనీసం 35 నిమిషాలు సోషల్‌మీడియాలో గడిపేవారిపై అధ్యయనం చేశారు ► అధ్యయనంలో భాగంగా సగం మంది పాత అలవాట్లనే కొనసాగించగా, మిగతా వారిని పూర్తిగా మీడియాకు దూరంపెట్టారు ► ఒక ఏడు రోజుల తర్వాత వారి పనిభారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని పట్ల అంకితభావం, మీడియాకు ఎందుకు అతుక్కుపోవాల్సి వస్తోంది? వంటి ప్రశ్నలడిగి విశ్లేíÙంచారు. ► దైనందిన జీవితంలో కోల్పోయిన భావోద్వే గాలను ‘సోషల్ మీడియా’ ద్వారానైనా పొందేందుకు కొందరు వాటికి అతుక్కుపోయారని అధ్యయనం అభిప్రాయపడింది ► కొందరు మెరుగైన ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ వంటి వేదికను ఆశ్రయించారు. ► వాస్తవిక ప్రపంచం నుంచి తప్పించుకునేందుకు కొందరు సోషల్ నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇవిలాగే కొనసాగితే ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం హెచ్చరించింది. -
ఈసారి వానలు తక్కువే.. కరువుకు 20 శాతం ఛాన్స్! ఇబ్బందులు తప్పవు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్ వెదర్’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. వరుసగా గత నాలుగేళ్లుగా దేశంలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవు. పంటల ఉత్పత్తి పడిపోతుంది. తద్వారా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. చదవండి: ఆప్‌కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్ -
అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకూ బర్త్ రేషియో (జననాల నిష్పత్తి) పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ ఉండటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు. చదవండి: టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్ చివరి స్థానంలో అనంత.. అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే జిల్లాలో చూస్తే వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీన్నిబట్టి రమారమి వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 908 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఎందుకిలా? కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలంటే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మగ సంతానానికి ఇస్తున్న ప్రాధాన్యత అమ్మాయిల విషయంలో ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం, అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించడం పరిపాటిగా మారింది. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. జిల్లాలో లింగనిర్ధారణ నిరోధక చట్టం ( పీసీ పీ అండ్ డీటీ) గట్టిగానే అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేశారని తేలితే తీవ్ర చర్యలుంటాయని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు అధికారులు హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యుల (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు కుమ్మక్కై లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎవరైనా లింగనిర్ధారణ చేసినట్టు ఫిర్యాదు చేసి.. అది నిజమని తేలితే ఫిర్యాదుదారుడికి రూ.25 వేల బహుమతి ఇస్తారు. అలాగే ఆ ఫిర్యాదుపై విచారణ జరిగి డాక్టరుకు గానీ, నిర్వాహకులకు గానీ శిక్షపడితే రూ.లక్ష బహుమతి ఇస్తామని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. నిఘా మరింత పెంచాం జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లపైనా నిఘా ఉంచాం. ఎక్కడైనా లింగనిర్ధారణ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయొచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరిస్తే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. – డాక్టర్ కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్ఓ రాయలసీమ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య ఇలా.. జిల్లా అమ్మాయిలు వైఎస్సార్ జిల్లా 925 చిత్తూరు 924 కర్నూలు 908 అనంతపురం 902 -
AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే..
సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఊదరగొడుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తేటతెల్లమైంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. మరో పక్క కోవిడ్ నియంత్రణ, నివారణ వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అదనపు అప్పులకు అనుమతిచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక ఏడాది అంటే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా పరిమితికి లోబడే అప్పులు చేసింది. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) ప్రాథమిక అకౌంట్ల పరిశీలనలో వెల్లడైంది. తమిళనాడు గత ఆర్థిక ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ఏకంగా 55.54 శాతం మేర అప్పు చేసింది. బిహార్ 47.69 శాతం, కర్ణాటక 40.12 శాతం, తెలంగాణ 37.50 శాతం, పంజాబ్ 24.22 శాతం బడ్జెట్ అంచనాకు మించి అప్పు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాకు మించి కేవలం 14.23 శాతమే అప్పు చేసింది. ఆదాయం తగ్గినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిలుపుదల చేయకుండా కొనసాగించింది. కోవిడ్ సంక్షోభం, లాక్డౌన్ల నేపథ్యంలో 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో ఏకంగా రూ.14 వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. మరో వైపు కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలకు ఏకంగా రూ.8 వేల కోట్లు వ్యయం చేసింది. మొత్తం మీద రూ.30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2020–21 ఆర్థిక ఏడాదిలో కాగ్ ప్రాథమిక అకౌంట్ల మేరకు వివిధ రాష్ట్రాల బడ్జెట్ అంచనాలు, వాస్తవంగా చేసిన అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటే తక్కువే విభజన సమయం నుంచి ఏపీకి తప్పనిసరి రెవెన్యూ వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కోవిడ్ సమయంలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అదనపు రుణాలకు అనుమతించింది. అయితే ఇటీవల కొంత మంది ఏపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తోందని తరుచూ ప్రస్తావిస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ఆర్థికంగా బలహీనంగా ఉంది. కోవిడ్ సంక్షోభంతో పాటు మరో పక్క రెవెన్యూ రాబడికి మించి తప్పసరి వ్యయాలు చేయాల్సి వస్తోంది. ఆస్తుల కల్పనకు సంబంధించి ఇరిగేషన్, విద్యుత్ వంటి ప్రాజెక్టులపై వ్యయం చేస్తున్నప్పటికీ వాటి ద్వారా వచ్చే రాబడి వాటి నిర్వహణకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తప్పనిసరి ఖర్చులు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప్రభుత్వం 2020–21లో చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయి. – ఎం.ప్రసాదరావు, రిటైర్డ్ ఎకనమిక్ ప్రొఫెసర్, ఆంధ్రా విశ్వ విద్యాలయం -
భారత్ లో థర్డ్ వేవ్ రావడానికి అవకాశాలు తక్కువే : ICMR
-
ఖరీఫ్ దిగుబడులపై అనుమానాలు
వరుణుడిపైనే భారంవర్షాకాలం మొదలై రెండున్నర నెలలు కావొస్తున్నా.. జిల్లాలోని జలాశయాలు ఇంకా బోసిగానే దర్శనమిస్తున్నాయి. 90 శాతానికి పైగా చెరువులు, కుంటలు సగంలోపే నిండి వరుణదేవుడి కటాక్షం కోసం వేచి చూస్తున్నాయి. ఈ క్రమంలో పంటలు చేతికొస్తాయా అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు పెద్దగా లోటు వర్షపాతం లేనప్పటికీ.. చిన్న నీటి వనరుల ఆధారంగా పంటలు వేసిన వారు దిగాలుగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. సాక్షి, మెదక్: నైరుతి రుతుపవనాలు ముగింపు దశకు చేరుకుంటున్నా.. జిల్లాలో చెరువులు, కుంటలు నిండలేదు. వర్షాకాలం సీజన్‌కు సుమారు ఒక నెలే మిగిలి ఉండగా.. ఇప్పటివరకు ఏడు మాత్రమే మత్తడి పోస్తున్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 2,681 చెరువులు ఉన్నట్లు సర్వేలో అధికారులు తేల్చారు. ఇందులో 2,455 చెరువులు సగంలోపే నిండినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 90 శాతానికి పైగా చెరువులు, కుంటలు పొలాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి కింద పంటలు సాగు చేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మత్తడి పోస్తున్న వాటిలో అధిక శాతం రెండు, మూడు వర్షాలకే పొంగిపొర్లేటివి. మిగిలినవి నిండాలంటే జిల్లాలో భారీ వర్షాలు కురవాల్సిందే. దోబూచులాట.. జూన్‌లో వర్షాకాలం సీజన్ మొదలైంది. రెండు నెలలుగా వరుణదేవుడు కరుణించలేదు. ఆగస్టు నెల మొదట్లో మాత్రం కొంత నయం అనిపించేలా జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం వారానికిపైగా చినుకు పడిన దాఖలాలు లేవు. అంతేకాదు.. వర్షాకాలంలోనూ ఎండ తీవ్రత వేసవి వాతావరణాన్ని తలపించేలా ఉండడం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెద్దగా ‘లోటు’ లేకున్నా.. జూన్, జూలైలో వరుణుడు ముఖం చాటేసినా.. నెల మొదట్లో కురిసిన వర్షం పంటలకు ఊపిరిపోసింది. ఆ రెండు నెలల లోటును వరుణుడు ఈ నెలలో భర్తీ చేసినప్పటికీ 90 శాతానికి పైగా చెరువులు, కుంటలు సగం కూడా నిండలేదు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 10382.3 మిల్లీమీటర్లు కాగా.. 9897.3 మి.మీ కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లా సగటును లెక్కలోకి తీసుకుంటే 519.1 మీ.మీల వర్షం కురవాల్సి ఉండగా.. 494.9 మి.మీలు కురిసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే పెద్దగా లోటు లేదని స్పష్టమవుతోంది. వరుస కరువు పరిస్థితులు, భూతాపంతో వచ్చిన నీరు వచ్చినట్లే ఇంకిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంతో పోల్చితే.. జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి 2017లో సగటు సాధారణ వర్షపాతం 622.9 మి.మీలు కాగా.. 482.9 మి.మీ కురిసింది. 2018లో 482.9 మి.మీ.. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు 494.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అంటే మూడేళ్లలో ఈ మూడు నెలల్లో మొత్తంగా ఏ ఒక్కసారి కూడా సాధారణ వర్షపాతాన్ని మించి నమోదు కాలేదని అర్థమవుతోంది. ఈ ఏడాది కొంత నయం అనిపించినప్పటికీ.. చెరువుల్లో తగినంత నీరు చేరకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 50 శాతానికి పైగా నిండినవి 219 మాత్రమే.. మత్తడి పోస్తున్న ఏడు మినహా 50 నుంచి 75 శాతం వరకు నీరు చేరిన చెరువులు, కుంటలు 121.. 75 నుంచి 100 శాతం వరకు నిండినవి 98 మాత్రమే ఉన్నాయి. సగానికి పైగా నీరు చేరిన చిన్న తరహా జలాశయాలు 10 శాతమేనని తెలుస్తోంది. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతోంది. ఈ క్రమంలో చెరువులు, కుంటల ఆధారంగా పంటలు వేసిన రైతులు సెప్టెంబర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. చెరువు నిండితేనే పంట పండేది.. ఊర చెరువు కింద మా భూమి ఉంది. ఈ భూమిలో పంట పండించాలంటే చెరువే దిక్కు. చెరువు నిండితేనే పంట పండేది. 10, 15 ఏళ్లుగా ఈ చెరువు నిండింది లేదు. మేము పంట పండించింది లేదు.. సంపాదించింది లేదు. ఆశతో ఎకరంలో మాత్రమే మొక్కజొన్న సాగు చేశా. ఇప్పటివరకు చెరువు సగం కూడా నిండలేదు. దిగుబడి వచ్చేది అనుమానమే. కట్టు కాల్వలు ధ్వంసం కావడంతో చెరువు నిండడం లేదు. – గానుగు సత్తయ్య, కాళ్లకళ్, మనోహరాబాద్ -
సభ్యుల గైర్హాజరుపై వెంకయ్య ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభలో హాజరుశాతం తక్కువగా ఉండటంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించే సమయంలో సభ్యులు గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ (123వ సవరణ) బిల్లును సోమవారం ఆమోదించిన సమయంలో 156 మంది సభ్యులే సభలో ఉన్నారు. ‘చారిత్రక బిల్లును సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించాం. కానీ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఎంతమంది హాజరయ్యారు? 245 మంది సభ్యులకు గాను 156 మందే హాజరయ్యారు. ఒకరిద్దరు తగ్గినా బిల్లు పాసయ్యేది కాదు. అతి తక్కువ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది’ అని అన్నారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం సమయంలో సభ్యులు తప్పకుండా హాజరయ్యేలా రాజకీయ పార్టీలు విప్‌లు జారీ చేయాలని వెంకయ్య అన్నారు. -
అటెండెన్స్ తక్కువని విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
-
ఇదేమి బాదుడు
– నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు – 0.75 నుంచి 2 శాతం వరకూ వసూళ్లు – ఆర్టీసీ టిక్కెట్లు బుక్ చేసినా బాదుడే – నగదు రహిత లావాదేవీలపై ప్రజల విముఖత – ఏటీఎంలలో నగదు నిల్వలు నిల్ సాక్షి, రాజమహేంద్రవరం: రూ. వెయ్యి, రూ. 500 నోట్ల చెలామణి రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన నగదు రహిత లావాదేవీలపై ప్రస్తుతం విముఖత వ్యక్తమవుతోంది. నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు వసూలు చేయడమే ఇందుకు కారణం. పెట్రోలు కొనుగోలు మినహా ఇతర అన్ని సేవలు, వస్తు కొనుగోళ్లపై ఆయా డెబిట్, క్రెడిట్ కార్డుల బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిసెంబర్లో పెద్ద నోట్లు రద్దు తర్వాత రెండు నెలలపాటు ఏటీఎం విత్‌డ్రాలు, నగదు రహిత సేవలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ చార్జీలు రద్దు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థ బ్యాంకులు తరువాత అంతకుముందులాగే సర్వీస్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. లావాదేవీల మొత్తం ఆధారంగా 0.75 శాతం నుంచి 2 శాతం వరకూ సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. ఫలితంగా వినియోగదారులు నగదు రహిత సేవలపై విముఖంగా ఉన్నారు. ఆర్టీసీ టిక్కెట్లు కొన్నా బాదుడే... పెట్రోలు మినహా ఇక ఏ సర్వీస్ పొందినా, ఏ వస్తువు కొనుగోలు చేసి కార్డు ద్వారా నగుదు చెల్లిస్తే మాత్రం సర్వీస్ చార్జీ చెల్లించుకోవాల్సిందే. చివరకు ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీ రూపంలో కొనుగోలు చేసినా సర్వీస్ చార్జీ బాదుడు సరేసరి. రూ.2000 లోపు నగదు రహిత లావాదేవీలపై 0.75 శాతం ఆపై గరీష్టంగా 2 శాతం సర్వీస్ చార్జీ రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఉదహరణకు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ టిక్కెట్లు రూ.600 అనుకుంటే దానిపై రూ.5 (0.75శాతం) సర్వీస్ చార్జీ అదనంగా తీసుకుంటున్నారు. ఏదైనా రూ.30,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసి నగదు కార్డుల ద్వారా చెల్లించాలంటే రూ. 600 (2 శాతం) సర్వీస్ చార్జీ అవుతుందని ఆయా దుకాణాల క్యాష్ కౌంటర్లో ముందుగానే చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారులు కార్డుల ద్వారా చెల్లించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఏటీఎంల వద్దకు పరిగెడుతున్నారు. ఏటీఎంలలో కనిష్టంగా రూ. 20,00, గరిష్టంగా రూ.40,000 వస్తున్నాయి. ఒకసారి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీ రూ.30లోపు ఉంటోంది. అన్ని బ్యాంకులు తమ కార్డుదారులకు నెలకు ఐదుసార్లు లావాదేవీల వరకు ఎలాంటి సర్వీస్ చార్జీలు వేయడంలేదు. రూ.30,000 మొత్తం నగదు రహితంగా చెల్లిస్తే రూ.600 సర్వీస్ చార్జీ అవుతుంది. అదే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.30 లేదా అసలే చార్జీ ఉండదు. దీంతో ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువుల చెల్లింపులను నగదు రూపంలో ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. ఏటీఎం.. ఎనీ టైం నో మనీ... వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత నగదు కోసం ఏటీఎంల వద్దకు పరిగెడుతున్న ప్రజలకు ఏటీఎంల వద్ద నో క్యాష్, ఆవుట్ ఆఫ్ ఆర్డర్ వంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలో ఆయా బ్యాంకులు పెడుతున్న నగదు కొద్ది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో 811 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికారిక లెక్కల ప్రాకారం దాదాపు 60 శాతం ఏటీ ఎంలలో మాత్రమే నగదు నిల్వలు ఉంటున్నాయి. వీటిలో కూడా 24 గంటలూ నగదు ఉండే ఏటీఎంలు 10 శాతం కూడా లేవు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే 24 గంటలు నగదు ఉంటోంది. జిల్లాలో ప్రతి రోజు అన్ని బ్యాంకులు దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరుపుతున్నాయి. ఇందులో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలు దాదాపు 70 శాతంగా ఉన్నాయి. వస్తు,సేవలకు ప్రజలు నగదు రహిత లావాదేవీలు దాదాపు 10 శాతం జరుగుతున్నాయి. సర్వీస్ చార్జీలు లేనప్పుడు 75 శాతం నగదు రహితమే.. పెద్దనోట్ల రద్దు సమయంలో సర్వీస్ చార్జీలు ఎత్తివేసినప్పుడు ప్రతి రోజు మేము చేసే వ్యాపారంలో 75 శాతం కార్డుల ద్వారానే నగదు తీసుకున్నాం. ప్రస్తుతం సర్వీస్ చార్జీలు వసూలు చేస్తుండడతో వ్యాపారంలో కనీసం 10 శాతం కూడా కార్డుల ద్వారా లావాదేవీలు జరగడం లేదు. రెండు శాతం సర్వీస్ చార్జీలు అని కస్టమర్లకు చెప్పడంతోనే నగదు తెస్తామంటూ ఏటీఎంల వద్దకు వెళుతున్నారు. – రత్నాకర్, శ్రీ కంప్యూటర్ వరల్డ్, రాజమహేంద్రవరం. సేవలకు సర్వీస్ చార్జీలు తప్పనిసరి పెద్దనోట్ల రద్దుకు ముందు నుంచే నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం రెండు నెలలపాటు కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం యథాతథంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే నామమాత్రపు సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 60 శాతం ఏటీఎంలు పని చేస్తున్నాయి. కొన్ని ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్ది గంటల్లోనే అయిపోతున్నాయి. – సుబ్రమణ్యం, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, కాకినాడ. -
నేర రహిత రాజమహేంద్రవరానికి కృషి
అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి లాకింగ్ హౌస్‌కు సీసీ కెమెరాలు ఏర్పాటు కమ్యూనిటీ పోలీసింగ్ ఆఫీసర్ల నియమకం రాజమహేంద్రవరం క్రైం : నేర రహిత నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో అర్బన్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో క్రైమ్ రివ్యూ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నగరంలో హౌస్ బ్రేకింగ్ చోరీలు పెరుగుతున్న దృషా్ట్య వాటిని అరికట్టేందుకు తీర్థయాత్రలకు, ఊరెళ్లే వారి వివరాలు ముందుగా పోలీసులకు అందజేస్తే వారి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని వల్ల ఇల్లు చోరీకి గురైతే నిందితులను అరెస్ట్ చేయడంలో సహకరిస్తాయని పేర్కొన్నారు. నగరంలో నేరాలు అరికట్టేందుకు కమ్యునిటీ పోలీసింగ్ ఆఫీసర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. దీనికోసం వెయ్యి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల ఆధారంగా 18 నుంచి 60 ఏళ్ల వయస్సుగల వారిని ఎంపిక చేసి ఆయా వార్డుల్లో నియమించి నేరాలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై వేధింపులు, చైన్ స్నాచింగ్స్ అరికట్టేందుకు విజుబుల్ పోలీసింగ్ సిస్టమ్‌ను çపటిష్ట పరుస్తామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పలు సూ చనలు చేస్తున్నామని తెలిపారు. కేడీలు, గేంబ్లింగ్, కోడిపందాలు, సింగిల్ నెంబర్ లాటరీ, హైటెక్ వ్యభిచారం వంటి వాటిపై నిఘా పెట్టి నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పదో తరగతి పరీక్షలు, ఓపెన్ స్కూల్, ఇంటర్ తదితర పరీక్షలు సమయం కావడం వల్ల అంవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని 12 మంది డీఎస్పీలు, 13 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, ఎస్బీ సిబ్బంది, డీసీఆర్బీ సిబ్బంది, ఫింగర్ ప్రింట్ సిబ్బంది, కమ్యూనికేషన్ సిబ్బంది, ఐటీ కోర్ టీమ్, ఏఆర్ సిబ్బంది, మినిస్ట్రియల్ సిబ్బంది పాల్గొన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఎస్పీ పోలీస్ క్యాలండర్‌ను ఆవిష్కరించారు. -
ఇలాగైతే దివాలాయే
నగదు రహితంతో చిరు వ్యాపారుల ఇక్కట్లు వర్తక సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆవేదన రాజమహేంద్రవరం సిటీ : నగదు రహిత లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉందని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు ఆధ్యక్షతన నగరంలో పలు సంఘాల ప్రతినిధులతో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారుల హక్కులు కాపాడుతానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ తుంగలో తొక్కారని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చే నూతన విధానం ద్వారా పీజీ డిగ్రీ పొందిన వారు మాత్రమే బిల్లు బయటకు తీసే అవకాశం ఉంటుందన్నారు. ఏ మాత్రం చదువు లేని వారు వ్యాపారాలను మూసుకోవాల్సిన దుస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పలు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంతో దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది చిరు వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడనున్నాయని పలువురు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని రూపొందించి నిధుల సమీకరణ కోసం చిరు వ్యాపారులు, ప్రజలపై ఒత్తిడి తీసుకు రావడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 16న రాజమహేంద్రవరం కేంద్రంగా వివిధ జిల్లాల వర్తక ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు తీర్మానించారు. ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్, జిల్లా ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ నందెపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గ్రంధి వెంకటేశ్వర్రావు,ç కార్యదర్శి కాలేపు రామచంద్రరావు, హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొండపాటి ప్రవీణ్‌కుమార్, కాలేపు వెంకట వీరభద్రరావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
దైన్యాగారం
ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమడెల్టా దైన్యాగారంగా మారుతోంది. వరి విస్తీర్ణం రోజురోజుకూ కుచించుకుపోతోంది. చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం చాపకింద నీరులా పెరుగుతోంది. ఫలితంగా జిల్లాలో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచిఉంది. చెరువుల జోరుకు ఇప్పుడే కళ్లెం వేయకపోతే భవిష్యత్తులో వరిసాగు కనుమరుగైపోయే పెనుప్రమాదం పొంచి ఉంది. కొవ్వూరు : పశ్చిమడెల్టా ఆయకట్టు మొత్తం 5, 29, 962 ఎకరాలు. దీనిలో ఇప్పటికే సుమారు లక్ష ఎకరాలు చెరువులుగా మారిపోయాయి. గత పదేళ్లుగా చెరువులపై మోజు విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది కొత్తగా 11వేల ఎకరాలు చెరువులుగా మారినట్టు అధికారిక అంచనా. ఈ లెక్క వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటుంది. కొందరు అధిక లాభాల ఆశచూపి రైతుల చేత చెరువులు తవ్వించేస్తున్నారు. దీనివల్ల పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఆహార భద్రత కొరవడడంతోపాటు కాలుష్యం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో చేపలు, రొయ్యల చెరువులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలూ కలుషితమైపోయాయి. పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ రొయ్యల చెరువులు విస్తరిస్తున్నాయి. సాగునీటి దోపిడీ చేపల చెరువులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల సాగునీటి దోపిడీ కూడా పెరిగింది. పశ్చిమడెల్టా కాలువల నుంచి ప్రధానంగా సాగు, తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత చేపల చెరువులకు నీరు తోడుకోవచ్చు. కానీ చేపల చెరువుల యజమానులు విచ్చలవిడిగా నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. పంట కాలువల నుంచి యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు. పెను నీటి ఎద్దడి దీనివల్ల వరి సాగుకు, తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. ఈ ఏడాది సాగునీటి ఎద్దడితోపాటు మంచినీటి చెరువులనూ నింపుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో వరిచేలు బీటలు వారుతున్నాయి. మంచినీటి చెరువులు వెలవెలబోతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అర్రులుచాస్తున్నారు. నిబంధనలకు తూట్లు.. కాలుష్యపు కాట్లు చేపల చెరువుల తవ్వకంలో యజమానులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. వాస్తవానికి చేపల చెరువులు తవ్వాలంటే పంట కాలువలకు మూడు మీటర్లు దూరం పాటించాలి. విధిగా ఇన్లెట్, అవుట్లెట్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. కానీ యజమానులు ఈ నిబంధనలు పాటించడం లేదు. పంటకాలువల గట్లను ఆనుకుని చెరువులను తవ్వేస్తున్నారు. ఇ¯Œలెట్, అవుట్లెట్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పంట కాలువల నుంచి నీటిని యథేచ్ఛగా తోడుకుంటూ చెరువుల్లోని వ్యర్థ ఉప్పనీటిని పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ నీరు పొలాల్లోకి చేరడంతో చేలు చౌడుబారుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం భీమవరం : చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రజాప్రతినిధులే ప్రోత్సాహం అదిస్తున్నారు. చెరువుల యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇప్పిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భీమవరం, ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి నెలకొన్నట్టు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులే కాక వారి అనుచరులు, సహాయకులు కూడా చెరువుల తవ్వకం పేరిట భారీగా లాభపడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే చెరువులకు అనుమతులు ఇప్పించి లాభపడడాన్ని దగ్గరుండి చూసిన అతని సహాయకుడూ అదే బాట పట్టాడు. అతను చెరువులకు అనుమతులు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.రెండుకోట్ల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల డెల్టాలో చెరువుల తవ్వకాన్ని ఉన్నతాధికారులు కట్టుదిట్టం చేయడం ఆ సహాయకునికి వరంగా మారింది. చెరువుల తవ్వకానికి ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.40వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే సిఫార్సు పేరుతో అనుమతులివ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఎట్టకేలకు ఎమ్మెల్యే చెవిన పడడంతో ఆ సహాయకుడిని ఆయన విధుల నుంచి తప్పించినట్టు ప్రచారం జరగుతోంది. నిబంధనల సడలింపు వల్లే.. చెరువులకు అనుమతుల విషయంలో నిబంధనల సడలించడం వల్ల తవ్వకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో చెరువు తవ్వాలంటే రెవెన్యూ, నీటిపారుదలశాఖ, మత్స్యశాఖ తదితర 13 శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉండేది. దీంతో పంటభూములు చెరువులుగా మారాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే 2014లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెరువుల తవ్వకానికి అనుమతులను సరళతరం చేసింది. దీంతో చెరువుల తవ్వకానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వాస్తవానికి జిల్లాలో ఎక్కడా రొయ్యల సాగుకు అనుమతి లేదు. అయినా అక్రమార్కులు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు చేపట్టేస్తున్నారు. చేపల చెరువులకు అనుమతి తీసుకుని రొయ్యల సాగు చేపడుతున్నారు. చేపల చెరువుల కంటే రొయ్యల చెరువుల సాగు వల్లే జల కాలుష్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా స్వరూపం ఇదీ.. జిల్లాలో పశ్చిమడెల్టా 29 మండలాల్లో విస్తరించి ఉంది. దీనిపరిధిలో డెల్టా ప్రధాన కాలువతో కలిపి 357 కిలోమీటర్ల పొడవున 11 కాలువలు ఉన్నాయి. పంపిణీ కాలువలు 1,766 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. నాలుగు సబ్డివిజన్లలో 19 సెక్షన్ల పరిధిలో ఆయకట్టు ఉంది. నీటి పారుదల కోసం ప్రాజెక్టు కమిటీతోపాటు 20 పంపిణీ కమిటీలు, 131 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. -
ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?
న్యూఢిల్లీ: అమెరికా 45 అధ్యక్షుడిగా ట్రంప్ చేపట్టనున్న విధానాలు, వివిధ పరిపాలనా సంస్కరణలు మన దేశాన్నికూడా ప్రమాదంలోకి నెట్టనున్నాయా? వివాదాస్పద నిర్ణయంతో ముస్లిందేశాలకు గట్టి షాకిచ్చిన ట్రంప్ మన మార్కెట్లను, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయనున్నాడా? ఇపుడిదే చర్చ మార్కెట్ నిపుణులను ఆలోచనలో పడవేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే భారతీయ మార్కెట్లపై తక్కువ ప్రభావం ఉండనున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చైనా, హాంగ్ కాంగ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేసియా లాంటి దేశాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్టు తెలుస్తోంది. వీటి ఆర్థిక వ్యవస్థల కంటే దేశీయంగా తక్కువగా ఉండనుందని భావిస్తున్నారు. లోయర్ ఫిస్కల్ రేటు, కరెంట్ ఖాతా లోటుతో బలంగా ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ విధానాలు ఎఫెక్ట్ పెద్దగా ఉండదని భావిస్తున్నారు. ట్రంప్ ఎఫెక్ట్ దేశీయంగా తటస్థమని నోమురా ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుని అంచనా. బలమైన ఆర్థిక వ్యవస్త, తక్కువ అంతర్జాతీయ వ్యాపారం కారణంగా ఇతర మార్కెట్లతో పోలిస్తే సాంకేతికంగా బలంగా ఉన్నట్టు చెప్పారు. టీపీపీలో ఒప్పందంలో ఇండియా భాగస్వామ్యం లేనందున అమెరికా చేపట్టిన వ్యాపార రక్షణాత్మక చర్యల ప్రభావం చాలా పరోక్షంగా ఉండనున్నట్టు చెప్పారు. అయితే కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భారతీయ సాఫ్ట్ వేర్ సంస్థలకు కొంత నష్టమేనని తెలిపింది. అలాగే అమెరికా సరిహద్దు పన్ను పెరుగుదల ఔషధ తయారీ, టెక్స్ టైల్స్, జెమ్స్ అండ్ జ్యుయల్లరీ, ఆటో ఉత్పత్తులను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చైనా, అమెరికా ట్రేడ్ వార్ చైనా, లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టనుందని నోమురా ఎనలిస్ట్ అంచనావేశారు. అలాగే హాంక్ కాంగ్ జీడీపీ లో 25శాతం వాటావున్న ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రాపర్టీ మార్కెట్ కి పెద్ద దెబ్బేనని వ్యాఖ్యానించారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలు భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని పడవేయనున్నాయి? టంపోనమిక్స్ ఫలితాలు మన ఆర్థిక వ్యవస్థపై సానుకూలమా? అనుకూలమా అనేది మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యగా ప్రమాణం చేసినప్పటినుంచి తనదైన దూకుడుతో తీసుకుంటున్న వివాదాస్పద పరిపాలన నిర్ణయాలు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఏడు ముస్లిం దేశాలకు షాకిస్తూ తీసుకున్న కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తీవ్ర విమర్శలకు గురవుతోంది. అమెరికాలో రెండో రోజూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. -
హైటెక్కే ముద్దు...ఎన్నాళ్లీ హద్దు
నగదు రహితమే ముద్దంటూ అవగాహన ర్యాలీలు ఓ వైపు జిల్లాలో జరుగుతుంటే ఇంకో వైపు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులుదీరిన జనం మాత్రం ఎన్నాళ్లీ హద్దులు..కష్ట, నష్టాలంటూ పెదవి విరుస్తున్నారు. కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించారని వాపోయారు. ఈ క్యూలు పక్క నుంచే పోలీసుల రక్షణతో అవగాహన ర్యాలీలు జరుగుతుండడంతో అక్కడక్కడా జనం నిలదీసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్ వద్ద విద్యార్థులు, ఇతరులు మానవహారం చేసి అవసరాల కోసం హైటెక్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునివ్వగా బ్యాంకుల్లో నగదు పెట్టకుండా ఏమీటీ ప్రవచనాలంటూ బాధితులు విమర్శించారు. రాజానగరంలో కూడా ర్యాలీని నగదు బాధితులు అడ్డుకున్నారు. 20 రోజులుగా అన్ని పనులు ఆగిపోయాయని రైతులు, వ్యాపారులు, గృహిణులు ధ్వజమెత్తారు. రాజానగరం : నగదు రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్యపరుస్తూ రాజానగరంలో పోలీసులు, బ్యాంకు అధికారులు కలిసి ఇంజినీరింగ్ విద్యార్థినుల సాయంతో బుధవారం రాజానగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జనం తిరగబడ్డారు. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, సీఐ శంకర్‌నాయక్‌ల ఆధ్వర్యంలో గ్రామంలోని షిరిడీ సాయిబాబా సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైతులు, వ్యాపారులు అక్కడకు చేరుకుని ర్యాలీలో ఉన్న బ్యాంకు అధికారులు తమకు సమాధానం చెప్పాలంటూ పట్టుపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు ఒకవైపు, రబీ సాగు మరోవైపు జరుగుతున్న నేప«థ్యంలో పొలాల్లో పనులు చేస్తున్న కూలీలకు సొమ్ములు ఇవ్వలేకపోతున్నామని వైఎస్సార్సీపీకి చెందిన దూలం పెద్ద, ప్రగడ చక్రితోపాటు మరికొందరు రైతులు తమ ఆవేదనను తెలిపారు. తమ ఖాతాలో ఉన్న సొమ్ములు ఇమ్మంటే రూ.రెండు వేలు ఇస్తున్నారు, ఆ డబ్బులు తీసుకువెళ్లి ఎంతమందికి కూలీ ఇవ్వాలన్నారు. ఇలాగైతే ఎలా వ్యవసాయం చేసేందంటూ నిలదీశారు. వ్యాపారులు కూడా చిల్లర సమస్యతో సతమతమవుతున్నామని, బ్యాంకులో రూ.రెండు వేల నోట్లు తప్ప చిల్లర నోట్లు ఇవ్వడం లేదన్నారు. మా ఖాతాలో ఉన్న కరెన్సీనుంచి మేము అడిగినంత ఇవ్వాలని, మేనేజర్ సమాధానం చెప్పాలని పట్టుపడ్డారు. ఈ సమయంలో డీఎస్పీ, సీఐలు అడ్డుకుంటూ బ్యాంకుకు వెళ్లి మాట్లాడండి.. ఇక్కడ కాదు అని సర్థిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. బ్యాంకుకు వెళ్తుంటే తమను పురుగుల్లా చూస్తున్నారని, ఇక్కడే సమాధానం చెప్పాలన్నారు. దీంతో అక్కడే ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మాధవ కలుగజేసుకుని తాము పై అధికారులు చెప్పిన విధంగా చేస్తున్నామని, మీ ఇబ్బందులను వారి దృష్టిలో పెట్టి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననడంతో వివాదం సద్దుమణిగి, ర్యాలీ ముందుకు సాగింది. -
నేటి నుంచి నగదు రహిత రేషన్ సరుకులు పంపిణీ
కార్డుదారుడు ఖాతాలో సొమ్ము లేకుంటే డీలర్ క్రెడిట్ కార్డుతో సరఫరా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ పెద్దాపురం :చౌక ధరల దుకాణాల డీలర్లు నేటి నుంచి కార్డుదారులకు నగదు రహిత రేషన్ సరుకు సరఫరాకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ లోని రేషన్ డీలర్లతో బుధవారం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నేటి నుంచి వినియోగదారులకు రూపే కార్డు ద్వారా నగదు రహితంగా సరుకులు అందజేయనున్నట్టు తెలిపారు. కార్డుదారుడు ఖాతాలో నగదు లేకపోతే డీలర్ల క్రెడిట్ కార్డుపై సరుకుల అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ కార్డుదారు నుంచి నగదును స్వీకరించకూడదని తెలిపారు. క్రెడిట్‌పై ఇచ్చిన సరుకుకు తరువాతి నెలలో కార్డుదారుడు బ్యాంక్ నిల్వ నుంచి డీలరు పొందాలని సూచించారు. డీలర్లు రానున్న రోజుల్లో బిజినెస్ కరస్పాండెంట్‌గా గ్రామాల్లో పని చేయాల్సి ఉంటుందని జేసీ అన్నారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల ప్రకారంగా రేషన్ డీలర్లు నగదు రహితంగా సరుకులు పంపిణీ చేయాలని, ఎటువంటి అపవాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎఎస్వో పురుషోత్తమరావు నగదు రహిత రేషన్ సరుకుల పంపిణీపై డీలర్లకు శిక్షణ ఇచ్చారు. తహిసీల్దార్ జి.వరహాలయ్య, ఎంఎస్‌వో లక్ష్మికుమారి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా..
విద్యార్థులకు అవగాహన కల్పించనున్న విద్యాశాఖ ఈ బాధ్యతను ఎంఈఓలకు అప్పగిస్తూ ఎస్ఎస్ఏ పీవో ఆదేశాలు రాయవరం : నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు నగదు రహిత లావాదేవీలో మేలనే రీతిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఈ బాధ్యతను ఎంఈఓలకు అప్పగిస్తూ ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల ప్రకారం జిల్లాలోని అన్ని మండల విద్యాశాకాధికారి కార్యాలయాలకు సోమవారం పీవో ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా నిర్వహించాలి అనే విషయమై అవగాహన కల్పించి, వారి ద్వారా తల్లిదండ్రులకు గ్రామస్తులకు నగదు రహిత లావాదేవీల విషయంలో చైతన్యపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకిగ్ ఏ విధంగా చేయాలి? స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించే పద్ధతులను విద్యార్థులకు తెలియజేసి వారి ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. నగదురహిత లావాదేవీలను పెంచితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఆయన తెలిపారు. అందరు ప్రధానోపాధ్యాయులు/స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు/ఎంఈవో/కేజీబీవీ అధికారులు నగదు లావాదేవీలు కాకుండా, అన్ని చెల్లింపులు కేవలం అకౌంట్ పేయి చెక్‌ల ద్వారా చెల్లించవలసినదిగా ఆదేశించడమైనది. -
వంట గ్యాస్‌కు నగదు రహిత బదిలీలు
ఎల్పీజీ డీలర్లకు జేసీ సత్యనారాయణ ఆదేశం కాకినాడ సిటీ : గ్యాస్ వినియోగదారుల సౌకర్యార్థం ఎల్పీజీ డీలర్లు విధిగా నగదు రహిత బదిలీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఎల్పీజీ డీలర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు సర్క్యులేషన్ లేక మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలు తక్కువగా ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత బదిలీలు, స్వైపింగ్, యాప్‌ల డౌన్లోడ్ల ద్వారా నగదు బదిలీలు నిర్వహించడానికి చర్యలు చేపట్టిందని చెప్పారు. జిల్లాలో 13 లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారని, వీరందరికీ ఆధార్, బ్యాంక్ ఖాతా సీడింగ్ జరిగిందన్నారు. వీరందరికీ నగదు రహిత బదిలీ చేయాల్సిన అవసరం ఉందని, దీని వల్ల లబ్ధి ఉంటుందన్నారు. ఈ పోస్ మెషీన్ ద్వారా స్వైపింగ్ ఆంధ్రా బ్యాంక్ బిజిలీ యాప్, స్టేట్‌బ్యాంక్ బడ్డీ, ఎం–పే యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని నెట్ కనెక్టివిటీ ఉంటే వీటిని నిర్వహించుకోవచ్చున్నారు. డెలివరీ బాయస్కు యాప్‌లు, స్వైప్‌లపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్ ఉంటే దానికి స్వైపింగ్ కనెక్టివిటీ ఇస్తారని, దాన్ని మొబైల్గా ఉపయోగించి నగదు బదిలీ చేయవచ్చన్నారు. యాప్స్ అయితే వినియోగదారులు, డీలర్లు ఇద్దరూ డౌన్లోడ్ చేసుకుంటేనే నగదు రహిత బదిలీకి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ ప్రతినిధులు యాప్‌ల డౌన్లోడ్, స్వైపింగ్లపై డీలర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, నాబార్డ్ ఏజీఎం ప్రసాద్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు. -
అంధత్వ రహిత సమాజానికి ముందుకు రావాలి
ఆదివెలమ సంక్షేమ సంఘం పిలుపు నేత్రదానం చేస్తున్నట్టు ప్రమాణ స్వీకారం కిర్లంపూడి : అంధత్వ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆదివెలమ సంక్షేమ సంఘం నాయకులు మోటేపల్లి వీరభద్రరావు (వీరబాబు), తోట గోపీత్రినాథ్‌లు పిలుపునిచ్చారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పద్మనాభ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాటు ఆదివెలమ కులానికి చెందిన సుమారు 50 మందితో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్‌కు నేత్రదానం చేస్తూ ప్రమాణపత్రాలపై సంతకాలు చేయడమే కాకుండా వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వీరబాబు, గోపీత్రినాథ్‌లు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. నేత్రదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా తాను చనిపోతూ మరో ఇద్దరికి కంటి చూపు ప్రసాదించాలని పిలుపునిచ్చారు. అలాగే మోటేపల్లి జనార్ధన్‌రావు, తోట గోపీత్రినా«ద్లు తమ మరణానంతరం తమ దేహాలను కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు అప్పగిస్తూ వీలునామా రాయనున్నట్టు తెలియజేశారు. నేత్రదానం చేస్తూ ప్రమాణం చేసిన వారిలో నానిశెట్టి శివరామకృష్ణ, మాదిరెడ్డి శ్రీరామ్‌కుమార్, రూపాదేవి, వాణీ విజయలక్ష్మి, మోటేపల్లి వీరభద్రరావు, నానిశెట్టి నారాయణరావు, తోట నాగమోహిని, కోకా సరోజినీదేవి, అరవ సుదర్శనరావు, మోటేపల్లి జనార్దనరావు తదితరులు ఉన్నారు. -
ఏదీ ఆ తాకిడి!
* తొలిరోజు స్వల్పంగా భక్తుల రాక * తెల్లవారుజాము నుంచే స్నానాలు * వెలవెలబోయిన క్యూలైన్లు సాక్షి, అమరావతి : అమరావతిలో కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే శుక్రవారం ఉదయం 5.44 గంటలకు అమరేశ్వరుని ఘాట్‌లో పూజలు నిర్వహించి, అమరావతిలో పుష్కర స్నానాలను ప్రారంభించారు. ధ్యానబుద్ధ ఘాట్‌లో కృష్ణవేణి విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజలు చేశారు.తెల్లవారుజామునే పుష్కర స్నానాలు చేయాలన్న ఆక్షాంక్షతో చేరుకున్న భక్తులు కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. మహిళలు కృష్ణమ్మకు సారె, చీరె, పసుపు, కుంకుమ సమర్పించి కృష్ణవేణి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు చేశారు. తొలిరోజే వెలవెల.. కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తుల తాకిడి తక్కువగా ఉండటంతో ఘాట్లతో పాటు, ఏర్పాటు చేసిన క్యూలైన్లు వెలవెలబోయాయి. మధ్యాహ్న సమయానికి భక్తులు పూర్తిగా పలుచబడ్డారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు, వరలక్ష్మీ పూజలు నిర్వహిస్తారని అధికారులు అంచనా వేశారు. వారి అంచనాలు తలకిందులయ్యాయి. గుంటూరు జిల్లాలోని ఘాట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానికులు తప్ప, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అంతంతమాత్రమే. అధికారులు తెల్లవారుజాము నుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు ఘాట్ల వద్దనే ఉండి సమీక్షలు చేశారు. శివరాత్రి పర్వదినాల్లో వచ్చే భక్తుల స్థాయిలో కూడా తొలిరోజు భక్తులు కనిపించలేదు. నదిలో నీళ్లు తక్కువగా ఉండటం, ఘాట్ నిర్మాణాలు పూర్తికాకపోవడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దాతల స్పందన... దారి వెంబడి గ్రామాల ప్రజలు ఉచిత అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలకు వేడి పాలు, పెద్దలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పుష్కర నగర్లలో భోజనాలు ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా భక్తులు రాలేదు. దీనికితోడు అమరావతిలో 8 ప్రాంతాల్లో అన్నదానాలు ఏర్పాటు చేశారు. -
హడావుడి జాస్తి.. నాణ్యత నాస్తి
-
కొబ్బరి ముక్కల్లో రూ.44లక్షలు నష్టం
రాజన్న ఆలయంలో తొమ్మిదోసారికి సాగిన వేలం రూ.71.10 లక్షలకే కాంట్రాక్టర్‌కు అప్పగింత వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో కొబ్బరిముక్కలు పోగుచేసుకునే వేలంలో రూ. 44 లక్షలు నష్టమొచ్చింది. గతంలో రూ.1.15 కోట్లకు టెండర్ కుదిరింది. ఈ ఏడాది (20 నెలలు)కిగాను గురువారం ఆలయ ఓపెన్‌స్లాబ్‌లో వేలం వేశారు. రూ. 71.10 లక్షలకే వేలం పాడడంతో గతంతో పోల్చితే ఏకంగా రూ.44 లక్షల మేర తగ్గినట్లయ్యింది. రాజన్న దర్శనం కోసం వేములవాడ వచ్చే భక్తులు ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితీ. ఆ కొబ్బరి ముక్కలను పోగుచేసుకునేందుకు దేవాదాయశాఖ వేలం ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ వస్తోంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు రాజన్న ఆలయంతోపాటు అనుబంధ దేవాలయాల్లోని కొబ్బరిముక్కలను కూడా పోగుచేసుకునే హక్కు ఉంటుంది. ఇందుకోసం రెండేళ్లకోమారు వేలం నిర్వహిస్తారు. పోయినసారి కొబ్బరిముక్కల సేకరణకు వేలం వేయగా.. ఓ కాంట్రాక్టర్ రూ.1.15 కోట్లకు దక్కించుకున్నాడు. ఆయన కాంట్రాక్ట్ గడువు ముగియడంతో రాజన్న ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొబ్బరిముక్కలకు ధర లేదంటూ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురాలేదు. ఏకంగా ఎనిమిదిసార్లు టెండర్లు ఆహ్వానించినా ఫలితం లేకుండాపోయింది. తొమ్మిదోసారి వేలం వేయగా.. లాల నర్సింగం అనే కాంట్రాక్టర్ రూ.71.10 లక్షల వరకు మాత్రమే పాడాడు. ఈ విషయమై ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ను వివరణ కోరగా నాలుగు నెలల నుంచి తొమ్మిదిసార్లు వేలం వేస్తున్నామని, ఎవరూ ముందుకురాలేదని, డెప్యుటీ కమిషనర్ రమేశ్‌బాబు ఆధ్వర్యంలో వేలం వేసి కాంట్రాక్ట్‌ను ఫైనల్ చేశామని పేర్కొన్నారు. గతంలో రెండేళ్లకుగాను వేలం వేశామని, ఈసారి మాత్రం కేవలం 20 నెలలకే కాంట్రాక్ట్ ముగుస్తుందని వివరించారు. అలాగే పాదరక్షలు భద్రపరిచే హక్కును పి.జనార్ధన్‌కు అప్పగించినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో అలయ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
ఎంసెట్‌కు తక్కువ దరఖాస్తులు
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ఎంసెట్-2కు ఇప్పటివరకు 30,787 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జూలై 7న నిర్వహించే ఈ పరీక్షకు ఈనెల 1 నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు మరో రెండు రోజలు మాత్రమే ఉంది. ఈనెల 7వ తేదీతో ఆన్లైన్లో దరఖాస్తుల గడువు ముగియనుంది. జూన్ 7న నిర్వహించబోయే ఎంసెట్-2 ద్వారా కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోనే ప్రవేశాలు చేపట్టనున్న నేపథ్యంలో దరఖాస్తుల తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. -
దేశంలో అగ్నిమాపక కేంద్రాల కొరత!
న్యూఢిల్లీః భారత నగరాలు, గ్రామీణ ప్రాంతాలు అగ్నిమాపక కేంద్రాల కొరత తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని లోక్ సభ తెలిపింది. దేశంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందలకు పైగా ఉండాల్సిన కేంద్రాలు.. కేవలం మూడు వేల పైచిలుకు ఉన్నాయని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి రిజిజు వెల్లడించారు. దేశంలోని నగరాలు, గ్రామీణ ప్రాంతాలను అగ్నిమాపక కేంద్రాల కొరత వేధిస్తోందని లోక్ సభ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 8,559 ఫైర్ స్టేషన్ల అవసరం ఉండగా, కేవలం 2,987 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, దీంతో అగ్నిమాపక సేవల్లో 65 శాతం లోటు కనిపిస్తోందని హోం శాఖ సహాయ మంత్రి రిజిజు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అవసరానికి అనుగుణంగా అర్బన్ ఏరియాలకు 5 నుంచి 7 నిమిషాల్లోనూ, గ్రామీణ ప్రాంతాలకు 20 నమిషాల్లోపు వెళ్ళేలా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలంటే... అవసరమైనన్ని అగ్నిమాపక కేంద్రాలుండాలని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కలిగిన స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సేవలను పురపాలక కేంద్రాలు నిర్వహించడమే కాక, అగ్ని ప్రమాదాలను అధిగమించాలంటే కేంద్రం కూడ నిధులతోపాటు, తగినంత సహకారం అందించి, సిబ్బందికి అత్యవసర సేవల్లో నాణ్యత పెరిగేలా శిక్షణ కూడ అందించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 2012 లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆధునీకరణను అమల్లోకి తెచ్చి, తగిన పరికరాలను అందుబాటులో ఉంచడం ఎంతైనా అవసరమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అర్బన్ ఏరియాల్లో పెరుగుతున్న పారిశ్రామికీకరణను దృష్టిలో ఉంచుకొని నాగపూర్ లోని నేషనల్ ఫైర్స్ సర్వీస్ కాలేజ్ ఫైర్ ఆఫీసర్స్ కు ప్రత్యేక ట్రైనింగ్ అందిస్తోందని, అగ్ని ప్రమాదాల సమయంలో ఆధునిక పద్ధతుల వాడకం, సందర్భాను సారం స్పందించేందుకు కావలసిన పద్ధతులను నేర్పిస్తోందని రిజుజు ఓ రాత ప్రతిలో తెలిపారు. -
బురదతో మహిళల హోలీ!
హోలీ అంటే రంగుల పండుగ. పసుపు, గులాబి, ఎరుపు, ఆకుపచ్చ.. ఇలా సప్తవర్ణాలు ముఖాల మీద పులుముకొని ఆడుకోవడం మనకందరికీ తెలుసు. కానీ ఒకే ఒక్క రంగుతో హోలీ ఆడటం ఎప్పుడైనా చూశారా? అది కూడా బురదతో!! అవును.. రాజస్థానీ మహిళలు హోలీని చాలా విభిన్నంగా చేసుకున్నారు. కెమికల్ రంగులతో పాటు ఆర్గానిక్ రంగులు కూడా అక్కర్లేదని చెబుతూ.. ప్రకృతి వైద్య చికిత్సగా భావించే మడ్ బాత్‌ను తలపించేలా బురద మట్టితో స్నానాలు చేస్తూ హోలీ పండుగను నిర్వహించారు. అందరికీ భిన్నంగా మట్టిని స్విమ్మింగ్ పూల్ గా మార్చుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి చికిత్సా విధానంలో చర్మవ్యాధులు, చుండ్రు వంటి వ్యాధులను తగ్గించేందుకు, శరీరంలోని మలినాలను తొలగించేందుకు బురదతో చికిత్స అందిస్తుంటారు. రేగడి మట్టిని మెత్తగా బురదలా చేసి తలనుంచి పాదాల వరకూ పట్టించి, ఆరిన తర్వాత స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా వేసవిలో శరీరంలోని ఉష్ణతాపం వల్ల వచ్చే చెమట, మలినాలు బయటకు వచ్చి, చర్మవ్యాధులుంటే నశిస్తాయి. ప్రస్తుతం ఉదయపూర్ మహిళలు ఇదే పద్ధతిని హోలీతో రంగరించారు. చిన్నా పెద్దా కేరింతల మధ్య బురదలో మునిగితేలారు. -
చెల్లింపుల్లో జాతి వివక్ష!
విద్యార్హతలు ఒక్కటే. ప్రతిభా పాటవాలూ ఒక్కటే.. అయితేనేం జాతి విభేదాలు మాత్రం వారి సంపాదన విషయంలో ప్రభావం చూపిస్తున్నాయి. రంగుల్లో తేడా వారి ఆదాయంలో సమతుల్యత లేకుండా చేస్తోంది. ది గ్రేట్ బ్రిటన్ లోని కార్మికుల పరిస్థితి పై తాజాగా నిర్వహించిన సర్వేలు అదే విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఒకే విద్యార్హతలు ఉన్నా... నల్ల జాతీయులు, తెల్లవారికన్నాఅన్నింటా దాదాపుగా నాలుగోవంతు తక్కువ ఆర్జించగల్గుతున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. బ్రిటన్ లో జాతి వివక్ష మరోమారు బహిర్గతమైంది. బ్రిటన్ కార్మికుల పరిస్థితులపై అధ్యయనాలు జరిపే లేబర్ థింక్ ట్యాంక్.. ఈ సరికొత్త విషయాలను వెల్లడించింది. ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (TUC) కి చెందిన... 'లేబర్ థింక్ ట్యాంక్' సంస్థ జరిపిన సర్వేల్లో 2014-15 సంవత్సరాల లెక్కల ప్రకారం...తెల్ల, నల్ల జాతీయులకు చెల్లింపుల విషయంలో సుమారు 23 శాతం తేడా కనిపిస్తోందని తెలిపింది. ఒకే డిగ్రీ చదివిన తెల్లజాతి వారికి గంటకు 27 డాలర్లు చెల్లిస్తుండగా... నల్లజాతీయులకు చెందిన విద్యాలయాలకు చెందిన వారికి మాత్రం గంటకు 21 డాలర్లనే చెల్లిస్తున్నట్లు టియుసి అధ్యయనాల్లో తేలింది. జాతి వివక్ష చెల్లింపుల పై ప్రభావం చూపిస్తోందని టియుసి జనరల్ సెక్రెటరీ ప్రాన్సెస్ ఓ గ్రేడీ అంటున్నారు. వివక్ష కారణంగా జీతాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని.. అన్ని విషయాల్లో కూడ తెల్ల వారికంటే నల్లజాతి సహా.. ఆసియా కార్మికులకు అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అయితే ఇటువంటి వివక్షపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఓ గ్రేడీ అంటున్నారు. కాగా ఇంగ్లాండ్ లోని విశ్వవిద్యాలయాల్లో సంస్థాగత వివక్ష నిర్మూలించడంలో భాగంగా ప్రధాని డేవిడ్ కామెరూన్ ఇటీవల వర్శిటీలకు నూతన ఆదేశాలు జారీ చేశారు. జాతి, ప్రదేశాలకు సంబంధించిన మైనారిటీ అభ్యర్థుల నిష్పత్తిని వెంటనే వెల్లడించాలని ఆయన తెలిపారు. -
భారత్ పై ‘విదేశీ’ ప్రభావం తక్కువే..
♦ ఎస్ అండ్ పీ విశ్లేషణ ♦ దేశీయ డిమాండ్ కారణమని వెల్లడి ♦ ద్రవ్యలోటు, వృద్ధి రికవరీపై మరో ♦ ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ హెచ్చరిక న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై తక్కువగానే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) పేర్కొంది. దీనికి దేశీయంగా పటిష్టంగా ఉన్న ప్రజా వినియోగం, ప్రభుత్వ వ్యయాలు కారణమని ఎస్ అండ్ పీ ఇండియా సావరిన్ అనలిస్ట్ కిర్యాన్ క్యూరీ పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు, ఆర్థికాభివృద్ధి రికవరీలో వేగం ప్రస్తుత సమస్యలని మరో ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీబీఎస్) అభిప్రాయపడింది. ఎస్ అండ్ పీ.. విశ్లేషణాంశాలు... భారత్ డిమాండ్ దేశీయంగా పటిష్టంగా ఉంది. దేశం నుంచి వేగంగా వెనక్కు వెళ్లిపోయే నిధులపై పూర్తిగా ఆధారపడి ఆర్థికవ్యవస్థ లేదు. విదేశీ మారకద్రవ్యం రాక, పోకల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.4 శాతం వద్ద (స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే) ఉండే అవకాశం ఉంది. 2018 వరకూ ఇదే పరిస్థితి కొనసాగే వీలుంది. ఎగుమతులు పెరక్కపోవడం కరెంట్ అకౌంట్ లోటు 1.4 శాతం స్థాయిలోనే కొనసాగడానికి కారణం. అయితే దేశంలోకి పసిడి దిగుమతులు పెరిగితే... కరెంట్ అకౌంట్ లోటు మరికొంత పెరిగే అవకాశం ఉంది. 2014-15లో క్యాడ్ 1.3 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) ముగిసిన ఆరు నెలల కాలంలో ఈ లోటు 1.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో క్యాడ్ 1.8 శాతంగా నమోదైంది.అదే విధంగా తన వృద్ధి నిధికి విదేశీ పొదుపుపై ఆధారపడ్డం చాలా తక్కువ. బ్యాంకింగ్‌కు దేశీయ డిపాజిట్ బేసే ప్రధానంగా అధికంగా ఉంది. భారత్ క్యాపిటల్ మార్కెట్లు వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కంపెనీల నిధుల సమీకరణకు ఇది తగిన పరిస్థితి. రేటింగ్ అప్‌గ్రేడ్‌పై ద్రవ్యలోటు ప్రభావం: డీబీఎస్ ప్రభుత్వ రాబడి-వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు తీవ్రత రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ఇబ్బంది కలిగించే అంశమని మరో ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- డన్ అండ్ బ్రాడ్స్ట్రీస్ (డీబీఎస్) తన తాజా నివేదికలో పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ప్రభుత్వ లక్ష్యం స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం కాగా 3.7 శాతం కన్నా అధికంగా ఉండే వీలుందని విశ్లేషించింది. దీనివల్ల రేటింగ్ అప్‌గ్రేడ్ ఆలస్యం అయ్యే వీలుందని అభిప్రాయపడింది. అయితే కేవలం దీని ప్రాతిపదికన ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగే నిర్ణయాలు ఏవీ చేపట్టబోరని కూడా విశ్లేషించింది. విదేశీ చెల్లింపుల పరిస్థితి బాగుండడం, వృద్ధి అవకాశాలు, దిగువ స్థాయి ద్రవ్యోల్బణం వంటి అంశాలన్నింటినీ ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకుంటాయన్నది తమ అంచనా అని తెలిపింది. ప్రస్తుతం విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి స్టేబుల్ అవుట్‌లుక్‌తో బీబీబీ- గ్రేడ్‌ను ఇస్తున్నాయి. జంక్ స్టేటస్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. ద్రవ్యలోటు తీవ్రతరమైతే... జంక్ స్టేటస్‌కు రేటింగ్‌ను దించుతామని ఇటీవల విదేశీ రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2016-17 బడ్జెట్‌పై ఈ సంస్థలు దృష్టి సారించాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశలో సైతం భారత్ వేగంగా అడుగులు వేయడం లేదన్నది డీ అండ్ బీ అభిప్రాయం.