ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ఎంసెట్-2కు ఇప్పటివరకు 30,787 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ఎంసెట్-2కు ఇప్పటివరకు 30,787 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జూలై 7న నిర్వహించే ఈ పరీక్షకు ఈనెల 1 నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు మరో రెండు రోజలు మాత్రమే ఉంది. ఈనెల 7వ తేదీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల గడువు ముగియనుంది. జూన్ 7న నిర్వహించబోయే ఎంసెట్-2 ద్వారా కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోనే ప్రవేశాలు చేపట్టనున్న నేపథ్యంలో దరఖాస్తుల తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.