చెల్లింపుల్లో జాతి వివక్ష! | Black Workers Earn 23 Percent Less Than White Counterparts: U.K. Study | Sakshi
Sakshi News home page

చెల్లింపుల్లో జాతి వివక్ష!

Published Wed, Feb 3 2016 3:12 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

చెల్లింపుల్లో జాతి వివక్ష!

చెల్లింపుల్లో జాతి వివక్ష!

విద్యార్హతలు ఒక్కటే. ప్రతిభా పాటవాలూ ఒక్కటే.. అయితేనేం జాతి విభేదాలు మాత్రం వారి సంపాదన విషయంలో ప్రభావం చూపిస్తున్నాయి. రంగుల్లో తేడా వారి ఆదాయంలో సమతుల్యత లేకుండా చేస్తోంది. ది గ్రేట్ బ్రిటన్ లోని కార్మికుల పరిస్థితి పై తాజాగా నిర్వహించిన సర్వేలు అదే విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి.  ఒకే విద్యార్హతలు ఉన్నా... నల్ల జాతీయులు, తెల్లవారికన్నాఅన్నింటా దాదాపుగా నాలుగోవంతు తక్కువ ఆర్జించగల్గుతున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి.   

బ్రిటన్ లో జాతి వివక్ష మరోమారు బహిర్గతమైంది. బ్రిటన్ కార్మికుల పరిస్థితులపై అధ్యయనాలు జరిపే లేబర్ థింక్ ట్యాంక్.. ఈ సరికొత్త విషయాలను వెల్లడించింది. ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (TUC) కి చెందిన... 'లేబర్ థింక్ ట్యాంక్'  సంస్థ జరిపిన సర్వేల్లో  2014-15  సంవత్సరాల లెక్కల ప్రకారం...తెల్ల, నల్ల జాతీయులకు చెల్లింపుల విషయంలో సుమారు 23 శాతం తేడా కనిపిస్తోందని తెలిపింది. ఒకే డిగ్రీ చదివిన తెల్లజాతి వారికి గంటకు 27 డాలర్లు చెల్లిస్తుండగా... నల్లజాతీయులకు చెందిన విద్యాలయాలకు చెందిన వారికి మాత్రం గంటకు 21 డాలర్లనే చెల్లిస్తున్నట్లు టియుసి అధ్యయనాల్లో తేలింది.

జాతి వివక్ష చెల్లింపుల పై ప్రభావం చూపిస్తోందని టియుసి జనరల్ సెక్రెటరీ ప్రాన్సెస్ ఓ గ్రేడీ అంటున్నారు. వివక్ష కారణంగా జీతాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని..  అన్ని విషయాల్లో కూడ తెల్ల వారికంటే నల్లజాతి సహా.. ఆసియా కార్మికులకు అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అయితే ఇటువంటి వివక్షపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఓ గ్రేడీ అంటున్నారు. కాగా ఇంగ్లాండ్ లోని విశ్వవిద్యాలయాల్లో సంస్థాగత వివక్ష నిర్మూలించడంలో భాగంగా ప్రధాని డేవిడ్ కామెరూన్ ఇటీవల వర్శిటీలకు నూతన ఆదేశాలు జారీ చేశారు.  జాతి, ప్రదేశాలకు సంబంధించిన మైనారిటీ అభ్యర్థుల నిష్పత్తిని వెంటనే వెల్లడించాలని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement