earn
-
నిమిషానికి రూ.2 కోట్లు!.. గూగుల్ ఎలా సంపాదిస్తుందో తెలుసా?
ఏ విషయం తెలుసుకోవాలన్నా.. వెంటనే గూగుల్ సెర్చ్ చేసేస్తారు. ఆలా నేడు గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌గా మారిపోయింది. ఇంతలా అభివృద్ధి చెందిన గూగుల్ నిమిషానికి ఏకంగా రూ.2 కోట్లు సంపాదిస్తుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది యూజర్లను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. అయినప్పటికీ గూగుల్ భారీ మొత్తంలో సంపాదించడానికి ప్రధాన కారణం 'యాడ్స్' (ప్రకటనలు).మనం ఏమైనా తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసినప్పుడు, కావలసిన సమాచారంతో పాటు యాడ్స్ కూడా కనిపిస్తాయి. ఈ ప్రకటలను ఇచ్చే కంపెనీలు గూగుల్‌కు డబ్బు చెల్లిస్తాయి. దీంతో పాటు గూగుల్ క్లౌడ్ వంటి సేవలను అందిస్తుంది. వీటిని ఉపయోగించుకోవడానికి కూడా యూజర్లు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.గూగుల్ యూట్యూబ్, ప్లే స్టోర్, మ్యాప్స్ వంటి సేవల ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తుంది. ఇలా గూగుల్ ఒక్క సెకనుకు ఏకంగా 333333.33 రూపాయలు, నిమిషానికి రూ. 2 కోట్లు సంపాదిస్తుందని తెలుస్తోంది. ఈ లెక్కన గూగుల్ రోజుకు, నెలకు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో ఊహించుకోవచ్చు. -
బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..
చేస్తున్న పనిలో సవాళ్లు లేకుంటే.. కొందరు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, నచ్చినపని చేస్తూ.. కొందరికి సాయపడాలనుకుంటారు. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు 'నిశ్చా షా' (Nischa Shah). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతంలో ఎందుకు ఉద్యోగం వదిలేశారు. ఇరులకు ఎలా సాయం చేస్తున్నారనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..'నిశ్చా షా' ఒకప్పుడు లండన్‌లో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఈ రంగంలో ఈమెకు ఏకంగా తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా, క్రెడిట్ అగ్రికోల్లో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తూ ఏడాది రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వేతనం తీసుకునేది. చేస్తున్న పనిలో సవాళ్లు కనిపించకపోవడంతో జాబ్ వదిలేయాలనుకుంది. అనుకున్న విధంగా ఉద్యోగం వైదిలేసి యూట్యూబ్ ఛానల్ చెస్ట్ చేసింది.ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించిన నిశ్చా షా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ విషయాలను చెబుతూ కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తింది. దీనికోసం 2023లో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. యూట్యూబ్ ద్వారా ఏకంగా రూ. 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం.ప్రారంభంలో అనుకున్న విధంగా చేయడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు.. వెయ్యిమంది సబ్స్క్రైబర్లను సంపాదించడానికి 11 నెలల సమయం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో నిశ్చా షా పేర్కొన్నారు. ఆ సమయంలో పొదుపు చేసుకున్న డబ్బును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో 50వేలమంది సబ్స్క్రైబర్లను పొందేలా చేసింది. అప్పుడు ఒకేసారి రూ.3 లక్షలు సంపాదించినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే! ఇప్పుడు నిశ్చా షా యూట్యూబ్ ఛానల్ 1.16 మిలియన్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. దీంతో ఈమె యూట్యూబ్ వీడియోలు చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. అనుకున్నది సాధించడానికి ఉన్న ఉద్యోగం వదిలి సక్సెస్ సాధించింది. అయితే ఇది అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి వాటికి పూనుకునే ముందు పదిసార్లు ఆలోచించడం మంచింది. -
స్థిరమైన ఆదాయం కోసం మార్గాలు - తెలుసుకోవాల్సిందే!
నేను ఒకేసారి రూ.12 లక్షలను మూడు, నాలుగేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. మెరుగైన రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? డెట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి.. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా మంచి రాబడులు అందుకోవచ్చా? – మయూర్ సంపద సృష్టి మూడు నాలుగేళ్లలో సాధ్యపడుతుందా? ఇది ఆందోళన కలిగించే అంశం. మూడు నుంచి నాలుగేళ్లలో సంపద సృష్టి సాధ్యపడదు. ఈక్విటీలు గణనీయమైన రాబడులను అందిస్తాయి. కానీ వాటికి కూడా 10–15 ఏళ్ల కాల వ్యవధి కావాలి. అంత కాలవ్యవధి మీకు లేకపోతే అప్పుడు సంప్రదాయ ఇన్వెస్టర్‌గానే ఆలోచించాలి. మూడు నుంచి నాలుగేళ్లలోనే పెట్టుబడిపై చెప్పుకోతగ్గంత రాబడి కావాలని కోరుకునేట్టు అయితే.. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఎక్కువ మొత్తాన్ని డెట్ సాధానాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధి కోసం అంటున్నారు కనుక 12–18 నెలల కాలం పాటు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంపిక చేసుకుంటే మొత్తం పెట్టుబడుల్లో సగం కాల వ్యవధి అవుతుంది. దీనికి బదులు మూడు నుంచి నాలుగు నెలల్లోగా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ద్వారా ఈక్విటీలకు కేటాయించుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం ఉన్న మార్గాలు ఏవి? – నారాయణ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని ఉండాలి. అప్పుడే ఆ మొత్తం నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసర సమయాల్లో పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకునే విధంగా లిక్విడిటీ ఉండాలని కోరుకుంటారు. సీనియర్ సిటిజన్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కు వ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకా అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40% చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలను పరిశీలించాలి. ఎస్సీఎస్ఎస్, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కొంత మొత్తాన్ని అధిక నాణ్య తతో కూడిన డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40% మేర ఉండేలా ఏడాదికోసారి అస్సెట్ (పెట్టుబడులు)రీబ్యాలన్స్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆమె టార్చర్ కోసం పురుషుల క్యూ.. ఎందుకంటే..
మనిషి ఎంత విచిత్రమైన జీవి అంటే ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కో విధంగా ఉంటాయి. వాటిని ఎదుటివారు అర్థం చేసుకోలేరు. ఒకరికి నచ్చని అనుభవం మరొకరికి నచ్చవచ్చు. కొందరు పురుషులు తమ భాగస్వామితో మాత్రమే రొమాన్స్ చేయాలని అనుకుంటారు. మరికొందరు రొమాన్స్‌లో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. అలాంటి తాపత్రయం కలిగిన పురుషులకు కావాల్సినంత టార్చర్ చూపిస్తూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది ఇంగ్లండ్ కు చెందిన ఓ అమ్మడు. ఆమె పురుషులపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుంది. వారిని తీవ్రంగా వేధిస్తుంది. ఇందుకోసం వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుంది. సర్రేలోని ఫర్న్హామ్ నివాసి అయిన అరి మక్టాన్స్ పురుషులను కొట్టడం ద్వారా డబ్బు సంపాదిస్తూ వెనకేసుకుంటోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలా డబ్బులిచ్చి కొట్టించుకునేందుకు పురుష పుంగవులు ఆమె ముందు బారులు తీరుతున్నారు. డైలీ మెయిల్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఒక డామినేట్రిక్స్ అంటే శృంగార సమయంలో పురుషులను వేధించే మహిళ. ఆమె ఒక గంటకు 17 వేల రూపాయలు సంపాదిస్తుంది. తిట్టడం మొదలుకొని తోలు బెల్టుతో కొట్టడం వరకు.. ఇలా వివిధ పనులు చేయించుకునే మగవారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది. తాను చాలా మంది వివాహాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడినట్లు ఆ మహిళ తెలిపింది. చాలా మంది పురుషులు తమ భాగస్వామి వ్యక్తం చేసే ప్రేమలో హింస ఉందనుకుంటారని, అందుకే వారు భార్యకు దూరంగా ఉంటారని ఆమె పేర్కొంది. అయితే తాను ప్రేమలోని హింసను వారికి అర్థమయ్యేలా చెప్పి, పలువురి కాపురాలు నిలబెడుతున్నానని ఆమె తెలిపింది. కాగా ఆమె తన 19 సంవత్సరాల వయసు నుంచే ఈ పనిని ప్రారంభించింది. ఆమెకు 25 ఏళ్లు వచ్చేసరికి పూర్తి స్థాయి డామినేట్రిక్స్ గా మారింది. ఆమె ఒక నెలకు దాదాపు 20 మంది పురుషుల డిమాండ్లను నెరవేరుస్తుందని సమాచారం. ఇలా వచ్చేవారితో ఆమె ఎప్పుడూ శారీరక సంబంధాలు పెట్టుకోదు. వారి వింత కోరికలను మాత్రమే నెరవేరుస్తుంది. ఆమె కెరీర్‌కు మద్దతు పలికే బాయ్‌ఫ్రెండ్ కూడా ఆమెకు ఉన్నాడు. ఆమె తన పాదాలతో పురుషుల ముఖాన్ని తన్నుతుంటుంది. ఈ తన్నుల కోసం పురుషులు ఆమె దగ్గరికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
ఈ టెక్నిక్ పాటిస్తే.. ఈజీగా డబ్బు సంపాదించగలరు!
పొద్దిన లేచిన దగ్గర నుంచి డబ్బు లేకుండా ఒక్క పని కూడా కాదు. దీంతో అందరూ డబ్బు సంపాదించే మార్గాలను తెగ అన్వేషిస్తుంటారు. ఎలా సంపాదించాలి. ఏవిధంగా ఈజీగా సంపాదించగలం అని రకరకాలు ఆలోచించేస్తుంటారు. ఆ క్రమంలో వారికి తెలియకుండానే ఒత్తిడికి గురవ్వడం, నిద్రలేమి తదితర సమస్యల బారిన పడతారు. పోనీ అంతలా ట్రై చేసినా.. సక్సెస్ అయ్యేవారు కొందరే. చాలామంది రీచ్ అవ్వరు. అలాంటివాళ్లు ఈ టెక్నీక్ ఫాలో అయితే ఎక్కువ డబ్బు సంపాదించడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండగలరు. జపనీస్ వాళ్లు ఈ టెక్నిక్‌నే ఫాలో అవుతారట. ఇంతకీ ఆ టెక్నిక్ ఏంటంటే.. "అరిగాటో".. అంటే.. జపనీస్ భాషలో "ధన్యవాదాలు" అని అర్థం. ఏంటిది? డబ్బు సంపాదించడానికి "ధన్యవాదాలకు" సంబంధం ఏంటీ అని కొట్టిపడేయొద్దు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా సంతృప్తి అనేది ఉండదు. ఇప్పుడు ఉన్న ట్రెండ్‌కి.. మనకు, మన కుటుంబ అవసరాలు.. రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని పడరాని పాట్లు పడతాం. పోనీ అంతలా కష్టపడ్డా.. సంతోషంగా మాత్రం ఉండం. నిరాశ నిస్ప్రుహలకు లోనే మళ్లీ జీరో పొజిషన్‌కి వచ్చే ప్రమాదం లేకపోలేదు. దీంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా చేజేతులారా తెలియకుండానే నాశనం చేసుకుంటాం. అందువల్ల ముందు పాజిటివ్ దృక్పథాన్ని అనుసరిస్తూ దాన్నే మననం చేస్తే డబ్బులు హాయిగా సంపాదించడమే కాదు, కొత్త కొత్త ఐడియాలు తట్టి మరింత సంపాదించే అవకాశాలు రావచ్చు. ఇంతకీ ధన్యవాదాలు అంటున్నారు.. ఎవ్వరికి చెప్పాలనే కదా!. మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకు? అనే కదా..నిజానికి మనం సంపాదించే డబ్బు రెండు రకాలుగా ఉంటుంది. (1) సంతోషాన్నిచ్చే డబ్బు, (2) ఎలాంటి సంతోషం ఇవ్వని డబ్బు. సంతోషాన్నిచ్చే డబ్బు అంటే.. మీరు ఆనందించే వస్తువులను కొనడానికి ఉపయోగించే డబ్బు లేదా మీరు ప్రేమించే వ్యక్తులకు వినియోగించే డబ్బు అన్నమాట. ఇందులోకి మంచి పనులకు ఆనందంగా ఎంతకొంత కేటాయించేది కూడా వస్తుంది. ఇక్కడ మీరు సంతోషంగా వినియోగిస్తే అది విశ్వంలోకి చేరి మీకు తెలియకుండానే అధిక డబ్బు తిరిగి పొందే అవకాశం వస్తుంది. ఎలాంటి సంతోషం ఇవ్వని డబ్బు.. డబ్బుకి ఎలాంటి విలువ ఇవ్వకుండా ఇష్టానుసారం ఖర్చు చేసేది. నచ్చని ఉద్యోగం చేస్తూ.. సంపాదించేది. బిల్లులు లేదా అప్పులు చెల్లించడం కోసం భారంగా చేసేది. కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి తప్పక చేసేది. ఇది మీకు తెలియకుండానే డబ్బుపై వ్యతిరేకతను విశ్వంలోకి పంపుతుంది తద్వారా మనఃశాంతి కోల్పోతాం. అది మన ప్రేరణతోనే జరుగుతోందని గమనించం అంతే. మనసతత్వ నిపుణులు కూడా చెప్పేది ఇదే. పాజిటివ్ మైండ్‌తో ఉంటే దేన్నైనా సునాయాసంగా సాధించగలరని పదే పదే చెబుతుంటారు. అందుకే ముందు మీరు సంపాదించేది ఎంతైనా సరే.. చాలా చిన్న మొత్తం డబ్బైనా వస్తున్నందుకు ధన్యావాదాలు చెప్పుకోండి అంటే ఇక్కడ అర్థం దేవుడిన నమ్మే వాళ్ల అయితే దేవుడికి లేదా ఇంతైనా సంపాదించగలుగుతున్నా అని మీకు మీరు కృతజ్క్షతలు చెప్పుకుని సంతృప్తిగా ఫీలవ్వండి. ఎంత వచ్చినా దాన్ని మీరు కరెక్ట్‌గా ఖర్చుపెట్టడాన్ని గ్రేట్‌గా భావించండి. ఆ డబ్బును సరైన రీతిలో ఖర్చు బెట్టి బతకగలుగుతున్నందుకు హ్యపీగా ఫీలవ్వండి. ఆ డబ్బును వినియోగిస్తున్న సంతోషంగానే భావించండి తప్ప ఏదో సంపాదిస్తున్నానే లే అన్నట్లు మీకు మీరుగా మిమ్మిల్ని తక్కువ చేసుకోవద్దు. ఇలా పాజిటివిటిని మీ మనుసు తరంగాల ద్వారా విశ్వంలోకి పంపితే అదే మీకు తిరిగి అధిక డబ్బును ఏదో ఒక రూపంలోనో లేక మంచి ఆలోచనల రూపంలోనో అందిస్తుంది. మంచిగా డబ్బు సంపాదించడమే కాదు అధికంగా కూడా ఆర్జించగలుగుతారు కూడా. అందుకనే పెద్దలు చెప్పేది మీ మీద మీరు నమ్మకంతో చేసే ఏ పనైనా సఫలమే గాని విఫలం కాదని. ఇందులో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించి సర్వత్రా పాజిటివ్ మైండ్‌ని నింపి మంచి విజయాలు అందుకోండి. మంచైనా చెడైయినా అంతా మన మంచికే అని ఊరికే అనలేదు పెద్దలు. ఇలా భావిస్తే మనం ముందుగా పోగల ధైర్యం లభిస్తుంది. సో ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ఎంత వచ్చినా మ్యానేజ్ చేసి హాయిగా బతకగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
నెలకు 50 లక్షలు సంపాదిస్తున్న ఆయా..!
-
ఏటా 20 ఈఎల్స్ వాడాల్సిందే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఏడాదిలో 20 ఎర్న్›్డ లీవులు(ఈఎల్స్–ఆర్జిత సెలవులు) తప్పనిసరిగా వాడుకోవలసి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇకపై వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 ఈఎల్‌లు ఉంటాయి. ఇకపై ఏడాదికి పది ఈఎల్స్ మాత్రమే తర్వాతి సంవత్సరం సెలవుల్లో కలుస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే మిగతా 20 సెలవులను వాడుకోకుంటే వృథా అవుతాయి. ప్రభుత్వ బ్యాంకులు గత ఏడాది చివరి నుంచే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. తమ సిబ్బందిని కచ్చితంగా పది రోజులు సెలవుపై పంపుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 3.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల భత్యాల చెల్లింపు కోసం దాదాపు రూ.63,232 కోట్లు కేటాయించింది. -
కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?
ముంబై: ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కార్యక్రమంతో పాపులరయిన కపిల్ శర్మ సినిమా తారలకు దీటుగా సంపాదిస్తున్నాడు. నెలకు దాదాపు 5 కోట్ల రూపాయల పారితోషికం అతడి ఖాతాలో పడుతున్నట్టు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 60 నుంచి 80 లక్షలు తీసుకుంటున్నట్టు తెలిపింది. కామెడీ నైట్స్ షో సూపర్ హిట్ కావడంతో కపిల్ సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ సినీ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడి షోలో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలు అమితాసక్తి చూపిస్తున్నారు. స్క్రిప్టింగ్ నుంచి ప్రొడక్షన్ వరకు అంతా తానే అయి ఈషోను కపిల్ నడిపిస్తున్నాడు. విభిన్నమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తున్నాడు. అంతేకాదు ఫిట్నెస్ పై కూడా ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నాడు. కపిల్ టీమ్ లోని వారు కూడా భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు సునీల్ గ్రోవర్ రూ.10 నుంచి 12 లక్షలు, కికు షర్దా రూ.5 నుంచి 7 లక్షలు, చందన్ ప్రభాకర్ రూ. 4 లక్షలు, సుమన చక్రవర్తి రూ. 6 నుంచి 7 లక్షలు, రొచెల్లె రావు రూ. 3 నుంచి 4 లక్షలు పారితోషికం తీసుకుంటున్నట్టు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఎపిసోడ్ కు రూ.8 నుంచి 10 లక్షలు ఇస్తున్నారని తెలిపింది. -
పాకెట్ మనీలోనూ వివక్షే..
లండన్ః ఏ దేశంలో అయినా తల్లిదండ్రులు చిన్న పిల్లల ఖర్చులకు పాకెట్ మనీ ఇవ్వడం మామూలే. అయితే ఆ దేశంలో పాకెట్ మనీ విషయంలోనూ అమ్మాయిల పట్ల వివక్ష కనిపిస్తోందట. బ్రిటిష్ పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీపై ఓ బ్యాంకు చేపట్టిన అధ్యయనాల్లో అక్కడ పాకెట్ మనీ విషయంలో ఆడపిల్లలు వెనుకబడ్డట్టు తెలుసుకున్నారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల పాకెట్ మనీ 12 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రులనుంచీ సగటున వారానికి 6.55 పౌండ్లు అంటే సుమారు 640 రూపాయలు పాకెట్ మనీగా పొందుతున్నారట. అయితే అందులో ఆడ పిల్లలు 12 శాతం తక్కువ డబ్బును పొందుతున్నట్లు హాలిఫాక్స్ బ్యాంకు ప్రచురించిన అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యత్యాసం బ్రిటన్ లో గత సంవత్సర కాలంగా కొనసాగుతోన్నట్లు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. 8 నుంచి 15 ఏళ్ళ వయస్సు లోపల అబ్బాయిలు వారానికి సుమారు 640 రూపాయల వరకూ పాకెట్ మనీ పొందుతుండగా... అదే వయసులోని బాలికలు మాత్రం 597 రూపాయలు మాత్రమే పొందుతున్నారట. అయితే అమ్మాయిలు కూడ తమకు మరింత అధికంగా పాకెట్ మనీ కావాలని కోరుకుంటున్నట్లు తెలుసుకున్నారు. కాగా 1,202 మంది పిల్లలు, 575 మంది తల్లిదండ్రులపై చేపట్టిన సర్వే ప్రకారం లింగ వివక్ష గతేడాది 1.2 శాతం పెరిగినట్లు అధ్యయనాల్లో తెలుసుకున్నారు. తొమ్మిదేళ్ళకాలంతో పోలిస్తే గతేడాది బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రులనుంచి పొందే పాకెట్ మనీ ఆరు శాతం పెరిగి 640 రూపాయలకు చేరిందట. అలాగే బ్రిటన్ మహిళలు కూడ అక్కడి మగవారితో పోలిస్తే 19.2 శాతం తక్కువ వేతనాలను అందుకుంటున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే 22 నుంచి 29 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు మగవారికంటే సగటున 1.111 పౌండ్లు ఎక్కువ వేతనాన్నే పొందుతున్నారని, 30 ఏళ్ళ వయసు దాటిన తర్వాత మాత్రం వేతనాల విషయంలో వెనుకబడిపోతున్నారని ఇటీవలి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఏది ఏమైనా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆడపిల్లల పట్ల వివక్ష కనిపిపిస్తోందనేందుకు ఈ తాజా అధ్యయనాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
చెల్లింపుల్లో జాతి వివక్ష!
విద్యార్హతలు ఒక్కటే. ప్రతిభా పాటవాలూ ఒక్కటే.. అయితేనేం జాతి విభేదాలు మాత్రం వారి సంపాదన విషయంలో ప్రభావం చూపిస్తున్నాయి. రంగుల్లో తేడా వారి ఆదాయంలో సమతుల్యత లేకుండా చేస్తోంది. ది గ్రేట్ బ్రిటన్ లోని కార్మికుల పరిస్థితి పై తాజాగా నిర్వహించిన సర్వేలు అదే విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఒకే విద్యార్హతలు ఉన్నా... నల్ల జాతీయులు, తెల్లవారికన్నాఅన్నింటా దాదాపుగా నాలుగోవంతు తక్కువ ఆర్జించగల్గుతున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. బ్రిటన్ లో జాతి వివక్ష మరోమారు బహిర్గతమైంది. బ్రిటన్ కార్మికుల పరిస్థితులపై అధ్యయనాలు జరిపే లేబర్ థింక్ ట్యాంక్.. ఈ సరికొత్త విషయాలను వెల్లడించింది. ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (TUC) కి చెందిన... 'లేబర్ థింక్ ట్యాంక్' సంస్థ జరిపిన సర్వేల్లో 2014-15 సంవత్సరాల లెక్కల ప్రకారం...తెల్ల, నల్ల జాతీయులకు చెల్లింపుల విషయంలో సుమారు 23 శాతం తేడా కనిపిస్తోందని తెలిపింది. ఒకే డిగ్రీ చదివిన తెల్లజాతి వారికి గంటకు 27 డాలర్లు చెల్లిస్తుండగా... నల్లజాతీయులకు చెందిన విద్యాలయాలకు చెందిన వారికి మాత్రం గంటకు 21 డాలర్లనే చెల్లిస్తున్నట్లు టియుసి అధ్యయనాల్లో తేలింది. జాతి వివక్ష చెల్లింపుల పై ప్రభావం చూపిస్తోందని టియుసి జనరల్ సెక్రెటరీ ప్రాన్సెస్ ఓ గ్రేడీ అంటున్నారు. వివక్ష కారణంగా జీతాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని.. అన్ని విషయాల్లో కూడ తెల్ల వారికంటే నల్లజాతి సహా.. ఆసియా కార్మికులకు అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అయితే ఇటువంటి వివక్షపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఓ గ్రేడీ అంటున్నారు. కాగా ఇంగ్లాండ్ లోని విశ్వవిద్యాలయాల్లో సంస్థాగత వివక్ష నిర్మూలించడంలో భాగంగా ప్రధాని డేవిడ్ కామెరూన్ ఇటీవల వర్శిటీలకు నూతన ఆదేశాలు జారీ చేశారు. జాతి, ప్రదేశాలకు సంబంధించిన మైనారిటీ అభ్యర్థుల నిష్పత్తిని వెంటనే వెల్లడించాలని ఆయన తెలిపారు. -
క్రీడల్లో కుబేరులు వీరే