black
-
నిర్వర్ణం
‘ఒకరోజు నలుపు తెలుపు ప్రేమలో పడింది. కానీ ఈ తెలుపు ఆ నలుపుని తనూ ‘తెలుపు’ అయి రమ్మని, అలా మారితేనే ప్రేమిస్తానంటుంది. పాపం ‘నలుపు’! తను తెలుపుగా మారటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. పాల మీగడలు పాత్రలకొద్దీ తింటాడు. ఆకాశాన తెలతెల్లని మబ్బుతరగలపై రోజూ పొర్లుతాడు. సాగర కెరటాల నురగలపై స్నానాలు చేస్తాడు. ధవళ వస్త్రాలెన్నో చుట్టుకుంటాడు. తెల్లని పూలమాలలు లక్షలాదిగా ధరిస్తాడు. హంసలు, పావురాలు వంటి ఎన్నో తెలుపు రంగు పిట్టల రెక్కలను ఎరువు తెచ్చుకుని; ఎగురుతూ, దుముకుతూ క్షీరసాగరాలలో మునకలేస్తాడు. గుడులూ గోపురాలపైన వెలిగే శ్వేతకాంతుల దివ్వెల వెలుగులను తనలోకి స్వీకరిస్తాడు. నింగిచుక్కల తళుకులు తెచ్చుకుని దేహమంతా పులుముకుంటాడు. హేమంత వేళల హిమాద్రుల మంచుమంచెలపై ఎన్నో రాత్రులు శయనిస్తాడు. ఇన్ని చేసినా తీరా నలుపు– తెలుపును సమీపించిన ప్రతిసారీ నలుపుగానే ఉంటున్నాడు. ‘ఎప్పటికైనా నలుపు నలుపే గదా!’ అని దుఃఖిస్తున్నాడు. అలా వేల వసంతాలు వృథా అయిపోవలసిందేనా అని నలుపు ఎంతో బెంగపెట్టుకున్నాడు. చివరికి ఓ క్షణంలో జాలిపడిన తెలుపు నలుపుని దగ్గరకు తీసుకుంటుంది. ఒకే ఒక బిగి కౌగిలి! అంతే! ఆ రాత్రి నక్షత్రాలు నీలాకాశంతో ‘రహస్యంగా’ రమించాయట! నలుపు ప్రాణులన్నీ తెలుపు ప్రాణులను పెనవేసుకున్నాయి. రేయీ పగలూ కలిసి ఒకే మధుపాత్ర నుండి రతిఫలరసాలు తప్పతాగాయి. cవెలుగుల స్పర్శతో ఆ క్షణాన చీకటి ఛాయలన్నీ తీయని స్ఖలనాలు పొందాయట!ఉదయం విరిసింది. వేకువనే లేచి, తెల్లని ఉల్కలను రాలుస్తున్న తన పైటకొంగును సర్దుకుని లేచి వెళ్ళిపోబోతున్న ‘తెలుపు’ చేతిని గట్టిగా పట్టుకుని లాగి ‘అదేంటి? నన్నెందుకు విడిచి పోతున్నావు?’ అని నిలదీస్తాడు నలుపు. అతని బేలతనం చూసి నవ్వుకున్న తెలుపు ‘ఈ లోకం ఏనాడో అనాదిగా నలుపు– తెలుపులుగా విడిపోయిందోయ్! ఎప్పుడైనా, ఎక్కడైనా వాటి మధ్య ఉండే పలుచని విభజన రేఖలు ఒకవేళ ఎవరైనా శాశ్వతంగా చెరపగలిగితేనే, చీకటి వెలుగుల సంగమాల సంజెపొద్దుల్లోనే మనకు శాశ్వత కలయిక సాధ్యం! అప్పటివరకు సెలవా మరీ!’ అంటూ శ్వేత వలయాలుగా పైకి లేచి పరిసరంలోని ప్రతి తెల్లని జీవ నిర్జీవ పదార్థాలలోకి ఇంకిపోయి అదృశ్యమైపోయింది తెలుపు! నలుపు ఎంతో నిస్పృహతో తన కన్నతల్లి అయిన నిశీధి ఒడిలో తలవాల్చి పడుకొని విశ్వంలో కృష్ణబిలాలకు ప్రభాత వేలుగురేఖల కుంచెలతో తెలుపు రంగులద్దుతున్నట్లుగా తెల్లవారు ఝామున కలలు కంటూ ఇంకా తన ప్రేయసి ‘తెలుపు’ తలపులలోనే బతుకెళ్ళదీస్తున్నాడు. యుగాల నిరీక్షణ అది. అయినా నలుపు నలుపే, తెలుపు తెలుపే గదా! వాటి సంగమం అసాధ్యం. సాధ్యమైనా అది క్షణ భంగురమే కదా!’‘ఇప్పుడది ఎందుకే అంత పెద్దగా చదువుతున్నావు?’‘మొత్తం మీద భలే లౌక్యంగా రాశావే మామ్మా, సో క్రాఫ్టీ!’‘తమరి పొగడ్తలేం నాకవసరం లేదులే!’‘సర్లేవే! ఇంతకీ ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిన మహానుభావులెవరో? గట్టిగానే లాబీయింగ్ చేసినట్టున్నావు. మూడొందల పేజీల ముచ్చటైన అబద్ధాలు– అబ్బో! ‘కాల–శ్వేత సంగమం’ అంటూ తమరి ఈ మహావచన కావ్యానికి ఆ టైటిలొకటి! అంతా వొట్టిదే!’’‘నోర్ముయ్! వొట్టిదో గట్టిదో మరి నువ్వూ ఇలా రాయవే చేతనైతే!’‘రాస్తాను.. రాస్తాను.. కానీ ఇలా కాదు!’‘అబ్బో! మరెలా?’‘నే రాస్తే నీలా కాదులే, రాసిందే జీవిస్తా! జీవించేదే రాస్తా!’‘రాసేది అంతా చూసేదేనే ఫూల్! చేసేది కాదు!’‘ఏం? చేసేది రాస్తే? ఒకట్రెండు పుస్తకాల్లోనైనా తమరు చేసింది రాస్తే బాగుండేది!’‘గమ్మునుండవే పిల్లా! భయమెరుగని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!’‘నువ్వే గమ్మునుండవే! వృద్ధనారీ పతివ్రతా! నాకూ వచ్చు సామెతలు’‘ఎంతగా బరితెగిస్తున్నారే మీ తరం!’‘మీ తరాలేమన్నా తక్కువ తిన్నారా ఏంటి?’‘ఏం తెలుసే మా గురించి నీకు కోణంగిదానా?’‘క్లబ్బులూ పబ్బులూ చాలా ఉండేవిగా మీ అభ్యుదయ రైటర్స్ గ్యాంగులకు! ఏ అర్ధరాత్రో, అపరాత్రో గూళ్ళకు చేరుకునేవాళ్ళటగా!’‘ఏయ్.. నోర్మూయ్!’‘హేయ్.. నువ్వే మూసుకో!’‘నువ్వా కులం తక్కువోడితో కులికొచ్చినట్లు కాదులే!’‘ఐతే కులం ఎక్కువైనోళ్లతో గెలుక్కోవచ్చన్న మాట– మీలా!’పొగలు సెగలు కక్కుతూ బామ్మ చెప్పు తీసుకొని కొట్టటానికన్నట్లు చేయి పైకి లేపింది. మనుమరాలు వేగంగా కదిలి, బామ్మ చేతినలాగే ఒడిసి పట్టుకొని ఆమెను విసురుగా నెట్టేసింది. గోడకు కొబ్బరికాయలా తగిలిన బామ్మ తల పగిలి కిందికి జారుతూ ఉంటే ఆ గోడపై సన్నగా, బారుగా ఓ నెత్తురు చిత్తరువును అద్దినట్లయింది. అన్ ఫోర్స్డ్ ఎర్రర్ అయినా, ఆవేశపు అనర్థం అనుకున్నా, మొత్తం మీద జరిగింది వర్ధమాన రచయిత్రి చేతిలో వెటరన్ కవయిత్రి దుర్మరణం.‘బ్రేకింగ్ న్యూస్’‘ప్రముఖ సీనియర్ కవయిత్రి, కథా రచయిత్రి, మూడుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు తీసుకున్న శ్రీమతి సత్యవేణమ్మ హత్య. ఆవేశపరురాలైన ఆమె మనవరాలు విశ్వంభరనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అయితే, ఇంట్లో వాళ్లు తన కులాంతర ప్రేమ వివాహానికి అంగీకరించక హింసించటం వల్లనే అసలిదంతా ఒక్క క్షణంలో ఆవేశకావేశాలు కమ్మి జరిగిపోయిందని హత్యకు పాల్పడ్డ మనవరాలు చెబుతోంది. అతి ఆవేశపరురాలు అయిన ఆ మనవరాలిని సత్యవేణమ్మగారి గదిలో కాకుండా వేరే గదిలో నిర్బంధించి వున్నట్లయితే మహారచయిత్రి ప్రాణాలు నిలిచి ఉండేవని పోలీసులు, నేర నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ ఈ హత్యను ఖండిస్తున్నారు. మన దేశంలో యువతలో ముఖ్యంగా యువతుల్లో నానాటికీ చెలరేగుతున్న హింసా ప్రవృత్తిని చర్చించటానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు జాయినవుతున్నారు ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు, గొప్ప మహిళా అభ్యుదయవాది, మహావక్త శ్రీమతి మౌనమ్మగారు, అలాగే నేషనల్ మెన్స్ రైట్స్ ఫోరమ్ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ శ్రీ వాగేశ్వర్రావుగారు. చర్చకు ముందుగా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్!చాలారోజులపాటు ఆ ఒక్క వార్త నాన్–వెజ్ చానళ్ళ నోటికి నల్లిబొక్కలా, వెజిటేరియన్ చానళ్ళకు ఆవకాయ ముద్దల్లా రుచిగా నలిగింది.∙∙ ‘ఒకరోజు తెలుపు నలుపుని ప్రేమిస్తుంది. నలుపు కూడా తెలుపుని ఇష్టపడతాడు. నలుపు తామిద్దరం కలవటం లోకానికి ఇష్టముండదని, ఒకవేళ కలిసినా లోకం సహించలేక తమను అంతం చేస్తుందని, అందుకే నలుపు తన ప్రియురాలు తెలుపుని తనలా ‘నలుపు’గా రూపాంతరం చెంది తిరిగి రమ్మని కోరుకుంటాడు.పాపం ఆ తెలుపు తాను నలుపు కావటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రకృతిలోని కాటుక వర్ణాలన్నీ సేవిస్తుంది. అగ్గిని తొక్కుతుంది. బుగ్గిని బుక్కుతుంది. నిశరాత్రుల గుండెల్లోని తమస్సునంతా తాగుతుంది. కారు మేఘాలను, కాకులూ కోయిలల రెక్కలను ఎరువు తెచ్చుకుని ఎగురుతుంది. నీలి సంద్రపు గర్భాల అంధకారపు నీడలతో తానమాడుతుంది. కృష్ణపక్షపు నీలిమనంతా గంధలేపనాలుగా పులుముకుంటుంది. పాతాళపు ఛాయలు భుజిస్తుంది. ధైర్యం చేసి ఓ అడుగు ముందుకెళ్ళి భీకర రక్తమాంసాలు పారే వైతరణీ నదిలో యమకింకరుల చేతుల్లో గాలాలకు దొరికిన చేపల్లా వేలాడుతూ, భీకర ఘోషల ప్రతిధ్వనులతో నిండిన శాపగ్రస్థులైన వారి ఆత్మల్లో దాగి ఉన్న పశ్చాత్తాపపు చీకటిని సేవించి, పున్నమి జోత్స్నల వెన్నెల రేఖ ఒక్కటి కూడా తనపై పడకుండా జాగ్రత్తగా ఆకాశ వీథులు దాటి బయలుదేరింది. అలా తెలుపు తాను నలుపు రంగు ముగ్ధమనోహరియై సందెపొద్దుల్లో తన ప్రియుని బిగికౌగిళ్లలో కరిగిపోవాలని ఆశగా ఎగిరొస్తుంటే, తన సొంత తెలుపుజాతి వాళ్లే దారుణంగా దాడిచేసి, ‘ఏమే నీచపుదానా! మన జాతి వర్ణాన్నే మార్చాలని చూస్తావే? హంసలా పుట్టి కాకిలా మారటమేంటే భ్రష్టురాలా!’ అంటూ నలుపుగా మారిన తెలుపుపై చెప్పలేని అశ్లీల భాషను ఉపయోగించారు! ఆ నలుపుగా మారిన తెలుపుని పాతకాలంనాటి పెద్ద పెద్ద గంగాళాలలో పురాతన వర్ణ ద్రావకాలలో ముంచి సంప్రోక్షణలు, శుద్ధి క్రియలూ చేసి దానిని మళ్లీ తెలుపురంగులోకి మార్చి వదిలేశారు! అయ్యో పాపం తెలుపు! గుండెలు పగిలే దుఃఖంతో విలపిస్తూ, తను మళ్లీ నలుపు దగ్గరకు తిరిగొచ్చింది. విషయమంతా గ్రహించిన నలుపు తన ప్రేయసి తెలుపుని దగ్గరకు తీసుకొని విశ్వమంత ప్రేమను పంచి శాశ్వత సంగమంతో తనలో కలిపేసుకుంటుంది. ఆశ్చర్యంగా అనంతర యుగాలలో ఈ నలుపు–తెలుపులు రెండూ కూడా క్రమంగా తమ తమ రంగుల్ని విడిచి ‘నిర్వర్ణం’ కాసాగాయి.’‘ఎందుకమ్మా ఆ ఇంట్రోని మళ్ళీ మళ్ళీ బిగ్గరగా చదువుతున్నావు?’‘అబ్బ బామ్మా! ఇంత లోతుగా రాశావంటే నువ్వు ప్రపంచాన్ని ఎంత బాగా చూసి ఉంటావు!’‘నే చూసింది మాత్రమే రాయలేదే!’‘మరి?’‘నేను చేసింది, నాకు నే చేసుకుంది, లోకం నాకు చేసిందీ కూడా!’‘నిర్వర్ణం– ద కలర్ ఈజ్ డెడ్’– ‘అసలీ పుస్తకం టైటిలే అమోఘం బామ్మా! ఈ పుస్తకానికి ఒకే ఏడాది సాహిత్య అకాడమీ, సరస్వతీ సమ్మాన్ అవార్డులు, బుకర్ ప్రైజ్ రావటం రియల్లీ ఆసమ్! యు మేడ్ హిస్టరీ, గ్రాండీ!’‘ఈ అవార్డులు రివార్డుల కన్నా నా మనవరాలులాంటి ఎంతోమంది యూత్ నా పుస్తకాలు చదివి, స్పందించటం అతి గొప్ప ప్రశంస అమ్మా! రోజూ ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజ్‌లో..’ అంటూ మనవరాలి నుదుటిపై ఓ తియ్యటి ముద్దిచ్చింది విశ్వంభర. ‘గ్రేట్ బామ్మా! కీప్ రాకింగ్!’‘షాకింగ్ టూ బేబీ!’ఇద్దరూ ఒక్కసారే ఫెళ్లుమని నవ్వారు.‘బ్రేకింగ్ న్యూస్’‘ప్రముఖ సంచలనాత్మక, వివాదాస్పద రచయిత్రి శ్రీమతి విశ్వంభరకు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం, ఈ ఉదయం ఆమెకు అవార్డు ప్రకటించిన భారతీయ జ్ఞానపీఠ్ కమిటీ. ఒక భారతీయ మహిళ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను, బాహాటంగా రాయగలగడం మహా సాహసం అని అవార్డు కమిటీ సభ్యులు విశ్వంభరను ప్రశంసించారు. చిన్ననాడు తను ఈడుకొస్తున్న రోజుల్లో తన మేనమామ వెంటబడి ఎలా హింసించాడో, తాను కులాంతర ప్రేమ వివాహం చేసుకుంటానంటే తన తండ్రి తనను ఎలా గృహనిర్బంధంలో ఉంచాడో, ఆ సమయంలో తనను బంధించిన గదిలో మేనబావలు నీచంగా, నిర్లజ్జగా ‘ఆ జాతి తక్కువ వాడితో కాకపోతే మనలోనే ఎవడో వరసైనవాడిని తగులుకోరాదటే!’అంటూ తనపై తోడేళ్లలా ఆ రోజు ఎలా దాడికి సిద్ధమయ్యారో– ఇవన్నీ తెలిసి కూడా ఖండించని తన బామ్మ, అభ్యుదయ రచయిత్రి అయిన శ్రీమతి సత్యవేణమ్మతో ఒక సందర్భంలో మాటా మాటా పెరిగి చివరికి వారిరువురి మధ్యన జరిగిన చిన్న పెనుగులాటలో సీనియర్ రైటర్ అయిన ఆమె దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవటం ఎలా జరిగిందో; అదంతా అన్ ఫోర్స్డ్ ఎర్రర్లా జరిగిందని తాను పశ్చాత్తాపంతో ఎంత మొత్తుకున్నా ఎవరూ అర్థం చేసుకోలేదని; చివరికి తాను జైలుపాలైనప్పుడు సైతం జైలు అధికారుల్లో ఒకడు దారుణంగా భయపెట్టి తనను ఎలా శారీరకంగా దోచుకున్నాడో; ఇదంతా తెలిసీ తను విడుదలైన తర్వాత తనను స్వీకరించి వివాహం చేసుకున్న భర్తతో కూడా సంసార జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు అనుభవించిందో; భర్త మరణం తర్వాత ఒంటరిదై ఒక తోటి నవలా రచయితతో తను స్నేహం చేసేటప్పుడు ఇంటా బయటా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నదో– అలాంటి ఎన్నో జీవితానుభవాల్ని ధైర్యంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా రాసినందుకు శ్రీమతి విశ్వంభర ఎట్టి అవార్డుకైనా అర్హురాలేనని అభ్యుదయవాదులు అంటున్నారు. అయితే మాజీ నేరస్థురాలు, ముప్పయ్యేళ్లుగా తన రచనలతో హద్దుమీరిన స్వేచ్ఛను, తిరుగుబాటు ధోరణిని, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ, దేశంలో ఆడవాళ్ళను తప్పుదారి పట్టిస్తూ వచ్చిన ఈ రచయిత్రికి ఇంత అత్యున్నత సాహితీ పురస్కారం ఇవ్వటం పట్ల అటు పురుషుల ఐక్య సంఘాల జేఏసీనే గాకుండా, ఇటు కొన్ని మహిళా సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. అత్యంత వివాదాస్పదమైన ఈ అవార్డు ప్రకటన అంశం గురించి చర్చించటానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ కవిపండితులు, సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీ అవాకుల అప్పారావుగారు, ప్రముఖ అభ్యుదయవాది, ఎమ్మెల్సీ అయిన శ్రీమతి చెవాకుల సక్కుబాయిగారు– ఇంకా.................గారు, ................. గారు కూడా.’మొదటి వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’రెండవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’మూడవ వక్త: ‘బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా....’‘ఈనాటి ఈ బ్లా..... బ్లా..... బ్లా.... బ్లా.... లైవ్ డిబేట్ ఇంతటితో ముగిసింది. నిత్యం ‘తాజా లొల్లి’ కోసం మన సత్యం‘బాజా’ చానల్‌ను వీక్షిస్తూనే ఉండండి– వీక్షిస్తూనే ఉండండి– తర్వాతి కార్యక్రమం ‘మేం వాగుతునే ఉంటం– మేం వాగుతునే ఉంటం’‘స్టే ట్యూన్డ్!’ -
బ్లాక్ డ్రెస్ ఔట్ఫిట్లో ఫోజులు ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
-
బ్లాక్ సీతాకోకచిలుకలా 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి (ఫొటోలు)
-
ఈ ఆకులను ఎప్పుడైనా చూశారా..? మసిపూసినంత నల్లగా..!
ఆకులు సర్వసాధారణంగా ఆకుపచ్చగా ఉంటాయి. అరుదుగా కొన్ని మొక్కల ఆకులు ఎరుపు, పసుపు, నీలం, ఊదా వంటి రంగుల్లోను, రంగు రంగుల మచ్చల్లోను ఉంటాయి. మసిపూసినంత నల్లని ఆకులు ఉండే మొక్క ఇది. ఈ ఆకులు చిన్నవేమీ కాదు, ఏకంగా ఏనుగు చెవులంత పరిమాణంలో ఉంటాయి. అత్యంత అరుదైన ఈ మొక్కను ‘బ్లాక్ మేజిక్’ అని పిలుచుకుంటారు. దీని శాస్త్రీయనామం ‘కోలోకాసియా ఎస్కలెంటా’. చేమదుంపల జాతికి చెందిన ఈ మొక్క ఆకులు ముదురు ఊదా, ముదురాకుపచ్చ రంగుల్లో కూడా ఉంటాయి. నల్లని ఆకులు వచ్చేలా జన్యుమార్పిడి చేసి వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. వీటిని తోటల్లో అలంకరణ కోసం పెంచుకోవడం యూరోపియన్ దేశాల్లో ఫ్యాషన్‌గా మారింది. ‘హాలోవీన్’ వేడుకల్లో ఈ మొక్కలను అలంకరణ కోసం వాడుతుంటారు. (చదవండి: మెరిసే పుట్టగొడుగులు..! తింటే.. అంతే..!) -
నిగనిగలాడే జుట్టునుంచి గుండె దాకా, నల్ల ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో !
చూడటానికి చిన్నగా ఉన్నా నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లగా నిగనిగలాడుతూ తీయని రుచితో నోరూరిస్తూ ఉంటాయి నల్ల ద్రాక్ష పండ్లు. నల్ల ద్రాక్షలో సీ, ఏ విటమిన్లు, బీ6, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇంకా గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషక గుణాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. అయితే తెల్ల ద్రాక్ష మంచిదా? నల్ల ద్రాక్ష మంచిదా అని ఆలోచిస్తే రెండింటిలోనూ కాస్త రుచిలో తప్ప ప్రయోజనాల్లో పెద్దగా లేదనే చెప్పాలి. నల్ల ద్రాక్షతో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ‘రెస్వెరాట్రాల్’ యాంటీ ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. గుండె జబ్బులు కేన్సర్‌తో సహా అన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచికాపాడుతుంది. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.గుండె ఆరోగ్యానికి : నల్ల ద్రాక్ష అద్భుతమైన ప్రయోజనాల్లో ఒకటి గుండె ఆరోగ్యానికి తోడ్పడే సామర్థ్యం. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డకట్టడాన్నినివారిస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: నల్ల ద్రాక్షలో కనిపించే పాలీఫెనాల్స్‌లో అభిజ్ఞా సామర్థ్యాలు , జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి నరాల కణాలు లేదా న్యూరాన్లను రక్షించడంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నరాల సంబంధిత అనారోగ్యాల సంభావ్యతను తగ్గిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది: నల్ల ద్రాక్షలో కనిపించే విటమిన్ సీ, కే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది : బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ద్రాక్ష మంచి ఎంపిక. అతితక్కువ క్యాలరీలు ,ఫైబర్ అధిక మొత్తంలో నీరు ఉంటుంది. భోజనం మధ్య చిరు తిండిగా తినవచ్చు. ఇంకా, నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల షుగర్ వ్యాధి పీడితులకు మంచి పండుగా చెప్పవచ్చు.జీర్ణ ఆరోగ్యానికి: నల్ల ద్రాక్ష జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని తొలగించడంలో,గట్ బ్యాక్టీరియా అభివృద్ధికి తోడ్పడుతుంది. మెరిసే చర్మం కోసం : నల్ల ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి. మొటిమలు, వివిధ చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది : నల్ల ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం వంటి ఖనిజాలు ఎముకలకు బలాన్నిస్తాయి. బోలు ఎముకల వ్యాధి , పగుళ్లు వంటి ఇతర ఎముక సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో లభించే అధిక శాతం నీరు బాడీని హైడ్రేడెటెడ్గా ఉంచుతుంది. అన్ని వయసుల వారికీ మంచిది.బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది : మధుమేహ నిర్వహణలో ఇది మంచి ఫలితాలనిస్తుంది. ఇందులోని ఫైబర్, రక్తప్రవాహంలోకి సుగర్ స్థాయిలను త్వరగా వెళ్లకుండా నిరోధిస్తుంది.యాంటీఆక్సిడెంట్ ఫినాల్స్ సమ్మేళనాలు ఇన్సులిన్ నియంత్రణలో సహాయపడతాయి.వాపులను తగ్గిస్తుంది : దీర్ఘకాలం వాపు వల్ల ఆర్థరైటిస్ , గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులు వస్తాయి. నల్ల ద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మానవ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల ద్రాక్ష మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. మెరిసే జుట్టు: ఇందులోని విటమిన్ ఈ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.చుండ్రు, జుట్టు రాలడం లేదా తెల్లగా మారడం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు మందంగా, మృదువుగా, బలంగా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. పండురూపంలో తీసుకుంటే ఫైబర్ ఎక్కువ అందుతుంది. జ్యూస్‌లా తీసుకున్నా కూడా మంచిదే. -
వర్ణ వివక్షపై పోరాడిన నేలలో లింగ వివక్ష..!
వర్ణవివక్షపై పోరాడిన దక్షిణాఫ్రికా నేలపై.. లింగ వివక్ష ఇంకా వేళ్లూనుకుని ఉంది. శ్వేతజాతి పాలన అంతమైన 30 ఏళ్ల తరువాత కూడా మహిళలకు సర్వ హక్కులు రాలేదు. జాతి రక్షణ కోసం చేసిన భూ చట్టం నల్లజాతి మహిళలకు మాత్రం అభద్రతను మిగులుస్తోంది. భర్త చనిపోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన పిల్లలు తమ సొంత ఇంటినుంచే గెంటివేతకు గురవుతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. దక్షిణాఫ్రికా పట్టణాల్లోని టౌన్‌షిప్‌లలో లక్షలాది నల్లజాతి కుటుంబాలు ఇదే అభద్రతలో జీవిస్తున్నాయి. శాశ్వతమైన వివక్ష.. జొహన్నెస్‌బర్గ్‌లోని 74 ఏళ్ల వృద్ధురాలు జొహనా మోత్లమ్మ. 1977లో ఆమెకు 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సొవెటోలో ఒక చిన్న ఇంటికి మారారు. 1991లో విడాకులు తీసుకునే వరకు ఇక్కడి టౌన్íÙప్లోని ఇంట్లో నివసించారు. 2000 సంవత్సరంలో ఆమె మాజీ భర్త ఆ ఇంటిని రిజిస్టర్ చేసినప్పుడు, పూర్తి యాజమాన్యం అతనికే వెళ్లింది. మూడేళ్ళ తర్వాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటి యాజమాన్య హక్కుల గురించి అతడిని ఆమె ఎప్పుడూ అడగలేదు. 2013లో అతను చనిపోయిన తర్వాత అంతా మారిపోయింది. అతని రెండో భార్య ఆ ఇంటిని అమ్మేసింది. ఎందుకంటే ఇంటిలో మోత్లమ్మకు 50 శాతం హక్కున్నా... అప్‌గ్రేడ్ అయిన చట్టం విడాకుల తరువాత ఆమెకు ఆస్తి హక్కును అనుమతించలేదు. ఆస్తికి ఆమె కూడా యజమానిగా భర్త రికార్డుల్లో పేర్కొనలేదు. దీంతో ఇంటి అమ్మకాన్ని ఆమె ఆపలేకపోయింది. అప్‌గ్రేడింగ్ చట్టం మహిళల పట్ల వివక్షను శాశ్వతం చేసింది. కోర్టుల చుట్టూ తిరిగి, విసిగి.. 39 తొమ్మిదేళ్ల లెబో బలోయి కూడా దశాబ్దం కిందట తన ఇంటిని కోల్పోయింది. సోవెటోలో ప్రభుత్వం జారీ చేసిన రెండు పడక గదుల ఇల్లు ఆమె తండ్రి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ తరువాత తనకు, తన తల్లికి ఆ ఇంటి వారసత్వం వస్తుందని బలోయి ఆశించింది. అందుకే ఆమె, ఆమె భర్త పాల్ కలిసి ఇంటిని పునరుద్ధరించారు. ఇంటికి మరో రెండు గదులు అదనంగా కట్టారు. 2009లో ఆమె తల్లి చనిపోయిన తరువాత ఆ ఇంటిపై హక్కు తన సవతి తల్లి కూతురుకు వెళ్లిపోయింది. చట్టబద్ధంగా ఆ ఆస్తి ఎవరికి దక్కుతుందనే దానిపై స్పష్టత లేదు. కోర్టుకు తిరిగి తిరిగి విసిగిపోయిన ఆమె.. తన సవతి సోదరితో పోరాడటానికి బదులుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలోని జొహన్నెస్‌బర్గ్ శివారు మెలి్వల్లేలో నివసిస్తోంది.మోత్లమ్మ, బలోయిలే కాదు.. సొవెటోలో లక్షలాది మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంటి గురించి కుటుంబ సభ్యులు గొడవపడానికి ఈ వ్యవస్థ కారణమైందని వారు వాపోతున్నారు. 1994లో ప్రభుత్వం భూమి హక్కుల పునరుద్ధరణ చట్టం–1994 ప్రవేశపెట్టింది. 1991 యొక్క భూ కాలపరిమితి హక్కుల చట్టంలోని నల్లజాతి దీర్ఘకాలిక లీజుదారుల ఆస్తి హక్కులను అప్ గ్రేడ్ చేసింది. చివరికి వారి ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. కానీ ఇందులో ఒక చిక్కుముడి ఉంది. చట్ట నిబంధనల ప్రకారం, కుటుంబ పెద్దగా పరిగణించబడే వ్యక్తి మాత్రమే ఆస్తిపై హక్కును కలిగి ఉంటాడు. అతను బతికున్న కాలంలో విల్లు రాస్తే ఆ జాబితాలో ఉన్నవారికి చెందుతుంది. పితృస్వామ్య సంప్రదాయ వారసత్వ నిబంధనల్లో పాతుకుపోయిన ఈ కొత్త చట్టం భార్యలు, సోదరీమణులు, తల్లులు, కూతుళ్లను వారసత్వానికి దూరం చేస్తోంది. సవరణలకు సుప్రీం ఆదేశం... ఇది మహిళలను చట్టానికి దూరంగా ఉంచడమేనని 2018లో దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు పేర్కొంది. టౌన్íÙప్లో మహిళల భూ హక్కులకు సంబంధించిన ప్రత్యేక కేసుపై తీర్పు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. లింగ, ఆస్తి వారసత్వానికి సంబంధించిన అప్ గ్రేడింగ్ చట్టంలోని సెక్షన్ 2(1) రాజ్యాంగపరంగా చెల్లదని కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇది మహిళల హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. ప్రాపర్టీ పర్మిట్ లేదా టైటిల్ డీడ్‌లో పేర్లు లేకపోయినా బాధిత మహిళలు లేదా ఇప్పటికే ఒక ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమరి్పస్తే హక్కులు వర్తింపజేయాలని సుప్రీంకోర్టు పార్లమెంటును ఆదేశించింది. ఫలితంగా ఈ ఏడాది మేలో దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రభుత్వం భూమి హక్కుల సవరణ చట్టం–2021ను గెజిట్ చేసింది. ఇది ఎన్నికలు ముగిసిన వారం తర్వాత అమల్లోకి వచి్చంది. దీంతో ఇళ్లు కోల్పోయిన ప్రజలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ‘’నాట్ ఫర్ సేల్’... దీంతో ఇళ్ల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలతో జొహన్నెస్‌బర్గ్‌లోని స్వచ్ఛంద సంస్థలు కిటకిటలాడుతున్నాయి. ఈ వివాదాలు సర్వసాధారణమయ్యాయని, మహిళలు కోర్టు ల్లో దీర్ఘకాలికంగా పోరాడుతున్నారని విట్‌వాటర్స్ ర్యాండ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డీన్ బుసిసివే ఎన్కాలా డ్లామిని చెప్పారు. ఇలాంటి చట్టం ఒకటుందని, జీవితకాలం వారు నివసించిన ఇంటిపై హక్కు లేదని... సడన్‌గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచి్చనప్పుడే మహిళలకు తెలుస్తోందని హక్కుల సంఘాలు వాపోతున్నాయి. ఈ చట్టం వల్ల మహిళలు, పిల్లలు తమ జీవితకాల భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని, నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ‘ఎ జెండర్డ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యామిలీ హోమ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా’ అధ్యయనం వెల్లడించింది. పట్టాల సమస్యల కారణంగా ‘నాట్ ఫర్ సేల్’ అని రాసిన ఇళ్లు సోవెటోలో అనేకం కనిపిస్తాయి. ’మాకు మా చిన్ననాటి ఇల్లు కావాలి’ చర్చలతో ప్రభుత్వం, కోర్టులు చేస్తున్న జాప్యానికి ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు అసహనానికి గురవుతున్నాయి. తమ ఇంటిపై యాజమాన్యం విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మోత్లమ్మ కొడుకు మైమానే కోర్టును కోరుతున్నాడు. ‘మా నాన్నకు అన్ని అనుమతులు ఇచ్చి, మా అమ్మను మినహాయించిన ఈ వ్యవస్థ సరైంది కాదు’ అంటున్నాడు. ఇద్దరికీ సమానహక్కులుంటే ఈ సమస్య ఉండేది కాదని, తమ చిన్ననాటి ఇంటిని తిరిగి పొందాలనుకుంటున్నామని చెబుతున్నాడు. -
మోడ్రన్ లుక్‌లో ట్రెండ్ అవుతున్న అనసూయ (ఫోటోలు)
-
ఆలియా లుక్ చూశారా? వావ్ అనాల్సిందే! (ఫోటోలు)
-
హనీరోజ్‌ని ఇలా చూస్తే ఉక్కిరిబిక్కిరే.. రింగుల జట్టుతో అలా! (ఫొటోలు)
-
Shriya Saran: బ్లాక్ అవుట్ ఫిట్ లో శ్రియా పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
ఉల్లిపొర లాంటి చీరలో మాళవిక అందాల జాతర (ఫొటోలు)
-
అజంతా శిల్పంలా మెరిసిపోతున్న సోనాక్షి సిన్హా (ఫొటోలు)
-
సెలబ్రిటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!
చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీల వరకు చాలామంది ఈ నీటినే తాగుతున్నారు. ఎందుకు వాళ్లు ఈ నీటిని తాగుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటి?. మాములు వాటర్‌కి దీనికి తేడా ఏంటీ అంటే.. బ్లాక్ వాటర్.. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతోంది. ముక్యంగా సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తాగుతున్న లేదా క్యారీ చేస్తున్న ఫోటోలే ఇందుకు కారణం. ఇక ఈ బ్లాక్ వాటర్ దగ్గర కొస్తే ఇది చూడటానికి బ్లాక్‌గా ఉంటుంది. అయితే ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట. ముఖ్యంగా వ్యాయామం వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే పొందడంలో తోడ్పడుతుంట. పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి. దీని వల్ల ఒనగురే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. డిటాక్స్ డ్రింక్‌గా.. ఈ బ్లాక్ వాటర్ శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. బ్లాక్ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో శక్తిమంతంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. బ్రాక్ వాటర్ శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. పైగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో కొలస్ట్రాల్ పెరగదు. అదీగాక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజంతా ఉత్సాహాంగా, హెల్తీగా ఉంటారు. నార్మల్ వాటర్‌తో ఈ ప్రయోజనాలు పొందగలమా..? నిపుణులు నార్మల్ వాటర్ తోకూడా ఇలాంటి ప్రయోజనాలనే పొందొచ్చని చెబుతున్నారు.ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేలా 12-15 గ్లాసుల నీరు త్రాగాలని చెప్పారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే.. బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మాములు వాటర్‌తో కూడా సొంతం చేసుకుంటామని అన్నారు. అలా అని డైరెక్ట్‌గా ట్యాప్ వాటర్ తాగొద్దని చెప్పారు. నార్మల్ వాటర్‌ని గోరువెచ్చగా లేదా కాచ చల్లార్చి తాగితే ప్రయోజనాలు పొందగలరిన తెలిపారు. ఇలా చేస్తే.. శరీరంలో టాక్సిన్స్ తొలుగుతాయిన చెప్పారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. దీంతోపాటు శశరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అన్నారు. అంతేగాక మంచి జీర్ణక్రియ కోసం.. ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చియా గింజలు వేసి తీసుకోంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. బ్యాక్ వాటర్‌తో కలిగే దుష్ప్రయోజనాలు.. ఈ బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే అంతే స్థాయిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికి పీహెచ్ స్థాయిలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోయి.. గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిలో ఉండే అధిక pH మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
నల్లరాతి తాజ్‌మహల్ ఎక్కడుంది? దేనికి చిహ్నం?
ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా పేరుగాంచింది. యమునా నది ఒడ్డున ఉన్న ఈ అందమైన పాలరాతి భవనం ప్రేమలో మునిగితేలిన చక్రవర్తి కథను చెబుతుంది. షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. అయితే మన దేశంలో నల్లరాతి తాజ్ మహల్ కూడా ఉందనే సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఇది ఏ భావోద్వేగానికి గుర్తు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నల్లరాతి తాజ్‌మహల్ మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్లో ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ నల్లరాతి తాజ్ మహల్‌ను చూశాకే.. ఆగ్రాలో పాలరాతి తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. బుర్హాన్‌పూర్‌ను చాలా కాలం పాటు మొఘలులు పాలించారు. అందుకే ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌తో పాటు అనేక చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున బ్లాక్ తాజ్ మహల్ నిర్మితమయ్యింది. ఇది ఆగ్రాలోని తాజ్ మహల్ కంటే కొంచెం చిన్నది. ఇది అబ్దుల్ రహీం ఖాన్ఖానా పెద్ద కుమారుడు షానవాజ్ ఖాన్ సమాధి. షానవాజ్ ఖాన్ కేవలం 44 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. అతనిని బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున ఖననం చేశారు. అతను మరణించిన కొంతకాలానికి అతని భార్య కూడా మృతి చెందింది. షానవాజ్ ఖాన్ సమాధి పక్కనే ఆమెను కూడా ఖననం చేశారు. వీరిదిద్దరి మరణం తరువాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1622- 1623 మధ్య కాలంలో ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌ను నిర్మించాడు. ఈ నల్లరాతి తాజ్ మహల్ షానవాజ్ ఖాన్, అతని భార్య మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. నల్లరాళ్లతో నిర్మించిన ఈ తాజ్‌మహల్‌ను చూసేందుకు మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ బ్లాక్ తాజ్‌మహల్‌ను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది. దీని మినార్లు కూడా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి. -
‘ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్’ ముందు ఎర్ర చందనం వెలవెల..
ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అత్యుత్తమ ఫర్నిచర్‌ను సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కలప విషయానికొస్తే భారతదేశంలో ఎర్ర చందనం అత్యంత ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే ప్రపంచంలో దీనికి మించిన ఖరీదైన కలప మరొకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ కలప. దీని ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఆఫ్రికన్ బ్లాక్ కలపను అత్యంత విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అతి అరుదుగా దొరుకుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ కలప ప్రపంచంలోని 26 దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికన్ బ్లాక్ చెట్టు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు ఎక్కువగా ఆఫ్రికన్ ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో పెరుగుతుంది. ఈ కలప ధర కిలో రూ.7 నుంచి 8 వేల వరకూ పలుకుతుంది. ఫర్నిచర్‌తో పాటు, షెహనాయ్, వేణువుతో సహా పలు సంగీత వాయిద్యాలను ఈ చెక్కతో తయారు చేస్తారు. అత్యంత ధనవంతులు తమ ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కలపను ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ కలపకున్న డిమాండ్, ధరను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఈ కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ను రక్షించేందుకు కెన్యా. టాంజానియా తదితర దేశాలలోని ప్రభుత్వాలు సాయుధ బలగాలను వినియోగిస్తున్నాయి. -
నెట్టింట హల్చల్: అరుదైన యాపిల్స్, ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నప్పటికీ యాపిల్ ప్రత్యేకతే వేరు కాదా. యాపిల్ పండు లాంటి బుగ్గలు, ఎర్రటి యాపిల్ ఇలాంటివి ఇప్పటి దాకా విన్నాం. బొద్దుగా ఎర్రగా ఉన్న పిల్లల్ని ముద్దుగా ‘యాపిల్’ అని పిలుచుకోవడం కూడా తెలుసు. ఆ తరువాతి కాలంలో గ్రీన్ యాపిల్స్ కూడా వచ్చాయి. కానీ ఇపుడు బ్లాక్ యాపిల్స్ కూడా వచ్చాయి. మీరు ఎపుడైనా చూశారా? చదువుతూ ఉంటేనో నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? మరి వీటి ధర ఎంత తెలుసా? నెట్టింట తెగ వైరల్ లవుతున్న ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ వివరాలన్నీ తెలుసు కోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. డాక్టర్ అవసరం లేకుండా జీవించాలంటే రోజుకు ఒక యాపిల్ అయినా తినాలనేది. అలా విటమిన్లు, ఫైబర్, పోషకాలు ఇతర శ్రేష్టమైన గుణాలు ఇందులో మెండు. అందుకే యాపిల్ అంటే అంత ప్రత్యేకత. రెడ్ యాపిల్‌లోని లక్షణలతో పోలిస్తే బ్లాక్ రంగులో ఉండే యాపిల్స్ అసాధారణమైన తీపి, అధిక సహజ గ్లూకోజ్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. మందమైన చర్మంతో నిగనిగలాడే ఈ యాపిల్స్ చైనాలోని ఉన్నత స్థాయి రిటైలర్లు మాత్రమే విక్రయిస్తారు. అయితే ధర మాత్రం ఒక్కో పండుకు రూ.500 వరకూ ఉంటుంది. ఇవి కేవలం చైనా, టిబెట్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. అంతేకాదు సాధారణంగా యాపిల్ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెడితే, బ్లాక్ యాపిల్ తొలి పంట చేతికందడానికే కనీసం 8 ఏళ్ల సమయం పడుతుందట. అందులోనూ నిటారుగా ఉన్న పర్వత సానువుల్లో వీటిని పండిస్తారు. ఈ నేపథ్యంలోనే రైతులు వీటి సాగులో అనేక సవాళ్లను ఎదుర్కొంటారట. వీటిని పెద్ద ఎత్తున సాగు చేయడం కూడా కష్టమే అవుతుంది. హార్వెస్టింగ్ సీజన్ కేవలం రెండు నెలలు మాత్రమే. అందులోనూ 30 శాతం పండ్లు మాత్రమే మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండి మార్కెట్లోకి వస్తాయి. అందుకే వీటికి అంత డిమాండ్. Apples are generally red, green, yellow, but if the right geographical conditions are met, they can apparently grow dark purple, almost black, as well. These rare apples are called Black Diamond and they are currently only grown in the mountains of Tibet. pic.twitter.com/j4XXrDlS4X — Massimo (@Rainmaker1973) November 16, 2023 -
బొగ్గును మించిన నల్లని నది ఏది? కారణమేమిటి?
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కొన్ని నదుల నీరు శుభ్రంగా ఉంటుంది. మరికొన్ని నదుల నీరు మురికిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బొగ్గుకన్నా నల్లగా ఉండే నది గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరొందింది. ఈ నదిలో బొగ్గు కన్నా నల్లటి నీరు ప్రవహించడం వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో రుకీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి కారణం.. ఆ నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు ఈ నదికి సంబంధించిన తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు. నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆఫ్రికన్ దేశమైన కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ బేసిన్ ఉంది. దీనిలో కుళ్ళిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి. నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తుంది. దీనికితోడు రుకీ నది.. అమెజాన్ రియో నెగ్రా కంటే 1.5 రెట్లు లోతుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల నీటి నదిగా పేరొందింది. రుకీ బేసిన్ దిగువన పెద్ద మొత్తంలో పీట్ బోగ్ మట్టి ఉంది. కాంగో బేసిన్‌లోని పీట్ బోగ్లలో సుమారు 29 బిలియన్ టన్నుల కార్బన్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా? -
బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..
యాపిల్స్‌లో చాలా రకాలు మనకు తెలుసు. ఎక్కువగా ఎరుపు రంగులోను, ఎరుపు పసుపుల కలగలుపు రంగులోను, లేతాకుపచ్చ రంగులోను ఉంటాయి. ఈ నల్లని యాపిల్స్ వాటన్నింటి కంటే భిన్నమైనవి. ఇవి అత్యంత అరుదైనవి. ఈ నల్లని యాపిల్స్ చైనా అధీనంలో ఉన్న టిబెట్‌లోని న్యింగ్చీ పరిసర ప్రాంతాల్లో పండుతాయి. ఇవి చైనాలోని ఎరుపురంగు యాపిల్స్ అయిన ‘హువా నియు’ యాపిల్స్ జాతికి చెందినవే! టిబెట్‌లోని వాతావరణ పరిస్థితి కారణంగా పగటి వేళల్లో ఎండ కాసేటప్పుడు వీటిపై అల్ట్రావయొలెట్ కిరణాలు పడటం, రాత్రివేళల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రత తగ్గిపోవడం కారణంగా ఈ ప్రాంతంలో పండించే ‘హువా నియు’ యాపిల్స్ పూర్తిగా నలుపు రంగులోను, నేరేడుపండ్ల మాదిరిగా ముదురు ఊదారంగులోను పండుతాయి. అందువల్ల వీటికి బ్లాక్ డైమండ్ యాపిల్స్ అనే పేరు వచ్చింది. ఈ యాపిల్స్ చైనా మార్కెట్లో ఒక్కొక్కటి 50 యువాన్ల (రూ.575) వరకు పలుకుతాయి. (చదవండి: భలే ఉద్యోగ ప్రకటన!..ప్రపంచయాత్రకు సహాయకుడు కావలెను..!) -
పెనుకొండ ఆస్పత్రిలో నల్లనాగు కలకలం
పెనుకొండ: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నల్లనాగు కలకలం సృష్టించింది. బుధవారం 9 గంటలకు ట్రామా కేర్ సెంటర్లో విధులకు హాజరైన సూపర్వైజర్ శ్రీనివాసులు.. అక్కడి డిప్యూటీ డీఎంహెచ్ఓ చాంబర్లో శబ్దం రావడంతో అటుగా వెళ్లి చూశారు. లోపల పడగ విప్పిన నల్లనాగు కనిపించడంతో భయంతో ఎటూ కదల్లేకుండా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో సిబ్బంది, ప్రజలు ట్రామాకేర్ సెంటర్‌కు వద్దకు భారీగా చేరుకున్నారు. కొందరు పాలు తీసుకువచ్చి పాము సమీపంలో ఉంచారు. మరికొందరు పాముకు దండాలు పెట్టారు. దీంతో పాము ఎటూ వెళ్లలేక అక్కడే పడగ విప్పి నిలబడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక రామమందిరం ప్రాంతానికి చెందిన యువకుడు రాజు అక్కడకు చేరుకుని పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పాము కాటు వేసింది. అయినా ఆ యువకుడు పామును పట్టుకుని ఆస్పత్రి వెనుక పొదల్లోకి వదిలాడు. అనంతరం రాజుకు అక్కడే ఉన్న వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం పుట్టపర్తికి తరలించారు. విష ప్రభావం ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై రాజుకు అనంతపురం వైద్యులు చికిత్స చేస్తున్నారు. -
హడలెత్తించిన భారీ నల్లతాచు
శ్రీకాకుళం: మందసలో భారీ నల్లతాచు శనివారం స్థానికులను భయపెట్టింది. పట్టణంలోని వాసుదేవ స్వామి ఆలయం సమీపంలోని కూరగాయల తోటలకు శనివారం ఉదయం స్థానికులు పనికి వెళ్తుండగా చలనం లేకుండా పడి ఉన్న 14 అడుగుల నల్లతాచు కనిపించింది. సర్పాన్ని చూసిన వెంటనే వారు హడలెత్తిపోయారు. కాస్త పరిశీలనగా చూసి మరణించిందని నిర్ధారించుకున్నారు. ఆ పామును చూసేందుకు స్థానికులంతా అక్కడకు వచ్చా రు. మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, జూవాలజీ అధ్యాపకుడు చింతాడ శరత్‌బాబు మాట్లాడుతూ ఇది అరుదైన కింగ్‌కోబ్రా అని, దీనినే రాచనాగు అనికూడా పిలుస్తారన్నారు. దీని జాతి పేరు ఓఫియోఫేగస్ అని, సుమారు 18 నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుందని, జీవితకాలం 20 ఏళ్లన్నారు. ఇది సిగ్గరి అని, ఎవరి కంట పడడానికి ఇష్టపడదని, నాగుపాములు, ఇతర పాములను ఆహారంగా తీసుకుంటుందన్నారు. -
సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..!
సముద్రపు దొంగలకు సంబంధించిన కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది ఈ కథలంటే చెవికోసుకుంటారు. ఈ కథలకు దశాబ్ధాల చరిత్ర ఉంది. సముద్రపు దొంగల చిత్రాలు కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయి. వీరు టోపీ ధరించడంతోపాటు నల్లని ప్యాంటు వేసుకోవడాన్ని మనం గమనించే ఉంటాం. ముఖ్యంగా ముఖానికి ఒక పట్టీ ఉంటుంది. అది ఒక కంటిని కప్పివేస్తూ ఉంటుంది. దీని వెనుక అనేక కథనాలు ఉన్నాయి. ఆ కామెడీ టీవీ సిరీస్‌లో.. దీనిని ఫ్యాషన్ అని కొందరు చెబుతుంటారు. కొన్ని కథలలో ఆ సముద్రపు దొంగకు ఒక కంటికి గాయమయ్యిందని, లేదా ఆ కన్ను లేదని అందుకే అలా పట్టీ కట్టుకున్నట్లు చెబుతారు. స్పాంజ్‌బాబ్ స్క్వేర్ప్యాంట్లు అనే అమెరికన్ కామెడీ టీవీ సిరీస్‌లోని సముద్రపు దొంగ పాత్రకు చిన్నప్పటి నుంచి ఒక కన్నువుండదు. దీంతో అతను తన కంటికి పట్టీ కట్టుకుంటాడు. అయితే సముద్రపు దొంగల పాత్రలన్నింటికీ కంటికి పట్టీ ఉండదు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీ సిరీస్‌లోని సముద్రపు దొంగల కంటికీ పట్టీ ఉండదు. స్ఫూర్తిగా నిలిచిన క్యారెక్టర్ అరేబియా గల్ఫ్‌లో రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీ అనే సముద్రపు దొంగ తన దృష్టిని ఒకే చోట నిలిపి ఉండాలనే ఉద్దేశంలో ఒక కంటికి గంతలు కట్టుకునేవాడని చెబుతారు. ఈ తరహా పాత్రలు, చిత్రాలను సృష్టించడానికి చిత్రకారులు.. రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీను ప్రేరణగా తీసుకుని ఉండవచ్చని చెబుతారు. శాస్త్రీయ కోణంలో.. శాస్త్రీయంగా చూస్తే మన కళ్ళు అకస్మాత్తుగా చీకటి లేదా కాంతిని చూడాల్సి వచ్చినప్పుడు అవి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. అకస్మాత్తుగా చీకటి పడినప్పుడు, మన కంటిలోని కనుబొమ్మ విస్తరిస్తుంది. తద్వారా ఎక్కువ కాంతి లోపలికి ప్రవేశిస్తుంది. కానీ ఆ కాంతి చీకటిలో చూడటానికి సరిపోదు. అప్పుడు రోడాప్సిన్ అనే రసాయనం విచ్ఛిన్నమై మన మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపుతుంది. అప్పుడు మసక చీకటిలో కూడా కళ్లు కొంతమేరకు చూడగలుగుతాం. సముద్రపు దొంగలు చీకటిలో చూసేందుకు ఒక కంటిని, వెలుతురులో చూసేందుకు మరో కంటిని సిద్ధంగా ఉంచుతారట. సముద్రపు దొంగలు ఒక కంటికి పట్టీ కట్టడంవలన మసక చీకటిలో వారు సరిగ్గా చూడటానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదట. మసక చీకటిలో చూసేందుకు వారు ఒక కంటికి ఉన్న పట్టీని తొలగించి, దానిని మరొక కంటికి దానిని అమరుస్తారుట. ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’ -
గోవా టూ గోదావరి.. కేడీ లేడీల లిక్కర్ దందా
కైకలూరు: ఏలూరు జిల్లాలోకి గోవా మద్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కైకలూరు రైల్వేస్టేషన్లో బుధవారం ముగ్గురు మహిళల నుంచి 24 బ్యాగులలో ఏకంగా 2,949 మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.4,54,400 ఉంటుందని అంచనా. తెలంగాణ కాదు.. గోవా బెటర్ గతంలో తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకి తెచ్చేవారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణాకు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు ట్రైన్ల ద్వారా గోవా నుంచి ఏపీ రవాణా చేస్తున్నారు. వామ్మో కిలాడీ లేడీస్ బాపట్ల జిల్లా చీరాల మండలం, ఓడరేవుల గ్రామం వైఎస్సార్‌కాలనీకి చెందిన మహిళలు ఈ మద్యం రవాణాలో కీలక పాత్ర పోషిస్తోన్నారు. గతంలో వీరిపై సారా విక్రయ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొందరు ముఠాలుగా ఏర్పడి ముంబయి మీదుగా గోవాకు రైలులో చేరుకుంటున్నారు. కొన్ని రైళ్లే కన్వినీయంట్ అక్కడ మద్యం కొనుగోలు చేసి తిరిగి ముంబయి–విశాఖ ఎల్టీటీ రైలు ద్వారా ఆంధ్రాకు వస్తున్నారు. ఇలా నెలలో ముఠాలు రెండు సార్లు వెళ్లి వస్తున్నారు. గోవాలో కొనుగోలు చేసిన మద్యం సీసాలను లగేజీ బ్యాగ్‌లలో ప్యాకింగ్ చేయడానికి ప్రత్యేక ముఠా గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. గస్తీ లేని స్టేషన్ల ఎంపిక గోవా నుంచి ముంబయి, విజయవాడ మీదుగా విశాఖపట్నం ఎల్టీటీ రైలు రాత్రి వేళలో ప్రయాణిస్తోంది. ఈ రైలును అక్రమ రవాణాకు ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల మాదిరిగా నలుగురు మహిళలు వేర్వేరు బోగీలలో మద్యం సీసాల లగేజీ బ్యాగులను సీటు అడుగుభాగంలో ఉంచుతున్నారు. లగేజీ మాటున లిక్కర్ ఉదయం విజయవాడ దాటిన తర్వాత రైల్వేస్టేషన్లలో పోలీసుల గస్తీ తగ్గుతుంది. విజయవాడ స్టేషన్ తర్వాత ఎల్టీటీ ట్రైన్ గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం వంటి స్టేషన్లలో ఆగుతోంది. వీరు కై కలూరు, ఆకివీడు స్టేషన్లలో లగేజీలు దించుతున్నారు. ఎక్స్ ప్రెస్ నుంచి ప్యాసింజర్ ఆ తర్వాత పాసింజర్ రైలులో ఎక్కించి రామవరప్పాడు స్టేషన్లో దిగి అక్కడ నుంచి వాహనాల ద్వారా అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ముఠాలో సభ్యులు ఆయా స్టేషన్ల వద్ద ముందుగానే ఉంటూ ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా మహిళలకు సమాచారాన్ని అందిస్తున్నారు. లాభం ఎంతంటే.? గోవాలో ఫుల్‌బాటిల్ ధర రూ.270 ఉంటే ఇక్కడ రూ.800 నుంచి రూ.1000, క్వార్టర్ బాటిల్ రూ.26 ఉంటే ఇక్కడ రూ.150 నుంచి రూ.200కి విక్రయిస్తున్నారు. రైలులో వీరు బ్యాగులను అక్కడక్కడ సీట్ల కింద ముందుగానే సర్ధుతున్నారు. దీంతో పోలీసులు ప్రయాణికుల బ్యాగులుగా భావించి తనిఖీ చేయడం లేదు. రైల్వే పోలీసుల నిఘా లేనిచోట ముందుగానే గమనించి ఆ స్టేషనలో అక్రమ మద్యాన్ని దించుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు అడ్డుకుంటాం స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో(సెబ్) సిబ్బంది మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేస్తుంది. పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. రైలు, బస్ స్టేషన్ల వద్ద ఎవరైన అనుమానంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో మరిన్ని తనిఖీలు చేపడతాం. – ఆకుల రఘు, పట్టణ సీఐ, కై కలూరు -
హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే..
ద్విచక్రవాహం నడిపేవారందరికీ హెల్మెట్కున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసేవుంటుంది. హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపడం వలన ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలుగుతాం. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో చాలామంది తలకు గాయాలై మరణిస్తున్నారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే వాహనం నడిపే ప్రతీఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం చెబుతోంది. చాలావరకూ హెల్మెట్లు నలుపు రంగులోనే ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఇలానే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి గల కారణం ఏమిటో, దీనివెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి హెల్మెట్లు నలుపు రంగులో ఉండటం వెనుక సైన్స్ కన్నా వాటి ఉత్పత్తిదారుల లాభమే అధికంగా ఉంది. హెల్మెట్ తయారీ కంపెనీలు వాటి తయారీలో వినియోగించే ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్ నలుపు రంగులోనే ఉంటాయి. వీటి ప్రాసెస్‌లో వివిధ మెటీరియల్స్ వినియోగిస్తారు. ఫలితంగా పూర్తి మిక్చర్ కలర్ లేదా పిగ్మెంట్ బ్లాక్‌గా మారుతుంది. కంపెనీలు ఖర్చును తగ్గించుకునేందుకు ఈ పిగ్మెంట్తోనే హెల్మెట్లను తయారు చేస్తాయి. ఇది కూడా కారణమేనట! మరోవైపు చూస్తే పలు కంపెనీలు ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకుని నలుపు రంగు హెల్మెట్లను తయారు చేస్తాయని కొందరు చెబుతుంటారు. వాహనం నడిపేవారు ఏ రంగు దుస్తులు ధరించినా, వాటికి నలుపురంగు హెల్మెట్ మ్యాచ్ అవుతుంది. దీంతో వారు హుందాగా కనిపిస్తారుట. అలాగే సాధారణంగా జుట్టు నలుపురంగులోనే ఉంటున్న కారణంగా హెల్మెట్‌ను కూడా నలుపు రంగులోనే తయారు చేస్తారని చెబుతారు. పైగా నలుపురంగు హెల్మెట్లను యువత అత్యధికంగా ఇష్టపడతారని పలు సర్వేలు తెలిపాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2021లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 46,593 మంది హెల్మెట్ ధరించని కారణంగా మృతి చెందారు. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్! -
కనికట్టు కాదిది.. తలకట్టు! 5 అడుగుల 5 అంగుళాలు.. 1999 నుంచి
అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ ఎవిన్ డుగాస్(47) తన 5 అడుగుల 5 అంగుళాల భారీ తలకట్టుతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. అతిపెద్ద తలకట్టును కలిగిన ఆఫ్రికా సంతతి మహిళగా గత 13 ఏళ్లలో ఆమె మూడు పర్యాయాలు తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. లూసియానాకు చెందిన డుగాస్ 1999 నుంచి కురులను పెంచుతోంది. -
మోచేతుల నలుపు తగ్గాలంటే...
♦ రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి. ♦ టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి టవల్‌తో తుడవాలి. ♦ రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ♦ రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి. ♦ పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోటరాసి, రుద్ది, శుభ్రపరచాలి. ♦ టొమాటో రసం లేదా దానిమ్మ రసం తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్ది, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది. ♦ నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికోసారి స్నానానికి నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అంది, మృదువుగా అవుతుంది. -
US midterm elections 2022: లాస్ ఏంజెలిస్ మేయర్‌గా నల్లజాతి మహిళ
లాస్ ఏంజెలిస్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా జరిగిన లాస్ ఏంజెలిస్ మేయర్ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్ ఏంజెలిస్‌కు ఒక మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి. 40 లక్షల జనాభా ఉన్న లాస్ఏంజెలిస్ను పలు సమస్యలు చుట్టుముట్టిన వేళ రిపబ్లికన్ అభ్యర్థి, కుబేరుడు రిక్ కరుసోపై డెమొక్రటిక్ మహిళా అభ్యర్థి కరీన్ బాస్ దాదాపు 47,000 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70 శాతానికిపైగా ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కరీన్ బాస్ గెలుపు దాదాపు ఖరారైనట్లే. రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లోనూ కరీన్ పేరు ఉండటం గమనార్హం. లాస్ ఏంజెలిస్ మేయర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్ కరుసో ఏకంగా దాదాపు రూ.817 కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ‘ ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి’ అని ప్రచారం సందర్భంగా కరీన్ బాస్ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. -
హాట్ టాపిక్‌గా పుతిన్ ఆరోగ్యం.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దిగినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలన్ని పుతిన్ ఆరోగ్యంపై దృష్టి సారించాయి. పుతిన్ ఆరోగ్యం విషమంగా ఉందని ఇక ఆయన ఎన్నోరోజులు బతకరు అంటూ పలు వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత యూకే ఇంటెలిజెన్స్ పుతిన్‌కి క్యాన్సర్ అంటూ ఒక నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత గతేడాది మార్చిలో ఆయనపై హత్యయత్నం జరిగిందని త్రుటిలో తప్పించుకున్నట్లు వార్తలు కూడ వచ్చాయి. ఇప్పడు మళ్లీ ఆయన ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గుప్పుమంటున్నాయి. పుతిన్ ఆరోగ్యం బాగోలేదంటూ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పుతిన్ శరీరం రంగుమారిందని, వింత వింత గుర్తులు ఉన్నాయంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక రిటైర్డ్ బ్రిటీష్ ఆర్మీ అధికారి, హౌస్ లార్డ్స్ సభ్యుడు రిచర్డ్ డానాట్ ఒక మీడియా సమావేశంలో పుతిన్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. పుతిన్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. అతని చేతులు ఒక్కసారిగా నల్లగా మారిపోయి ఉన్నాయని, ఇలా ఏవైనా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడూ శరీరం కమిలి ఇలా రంగు మారుతుందని తెలిపారు. ఇతర భాగాల నుంచి ఇంజెక్షన్ తీసుకోలేనప్పుడూ ఇలా జరుగుతుందని చెబుతున్నారు. నిపుణులు కూడా పుతిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సంకేతం అని తేల్చి చెప్పారు. పుతిన్ ఇటీవలె 70 ఏళ్ల వయసులో అడుగుపెట్టారు. వయసు రీత్యా సమస్యలు ఉండటం అత్యంత సహజం. గానీ ఈ రష్యా ఏ ముహర్తానా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిందో అప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం పెద్ద హాట్‌టాపిగా మారిపోయింది. (చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి) -
కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్
బొగొటా: దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఆగస్ట్ 7న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆఫ్రో–కొలంబియన్ అయిన ఫ్రాన్సియా మార్కెజ్(40) చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ముందుండి నడిపారు. నల్లజాతి కొలంబియన్ల తరఫున పోరాడారు. సుదీర్ఘకాలం కొనసాగిన సాయుధ పోరాటం కారణంగా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తామని మార్కెజ్ మీడియాతో అన్నారు. లా టొమా అనే మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జన్మించిన మార్కెజ్ 16 ఏళ్ల వయస్సులోనే తల్లి అయ్యారు . తన కూతురు కోసం ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు రెస్టారెంట్లో పనిచేసుకుంటూనే లా డిగ్రీ పూర్తి చేశారు. చుట్టు పక్కల గ్రామాల్లోని అఫ్రో–కొలంబియన్లకు చెందిన భూముల్లో అక్రమ బంగారు గనుల తవ్వకాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆమె కృషికి గాను 2018లో గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్మెంటల్ బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్ పోల్ పార్టీలో గత ఏడాది జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి గుస్తావో పెట్రో చేతిలో ఓడిపోయారు. కానీ, పార్టీలోని మిగతా సీనియర్ నేతల కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే పడ్డాయి. సాయుధ వామపక్ష తిరుగుబాటు నేత అయిన పెట్రోకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పేదలు, యువత, పట్టణ ప్రాంత మహిళలు మార్కెజ్ వైపు మొగ్గు చూపారు. ఆఫ్రో–కొలంబియన్ల ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు పెట్రోకు పడ్డాయి. మార్కెజ్ జనాదరణ కూడా విజయానికి బాటలు వేసిందని స్పష్టం చేస్తున్నారు. -
నల్లగా మారిన గంగా జలాలు.. దర్యాప్తుకు ఆదేశం
లక్నో: పవిత్ర గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి వద్ద నదీ జలాలు నల్లగా మారిపోయాయి. మురుగునీరు నదిలోకి చేరడం, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.గత కొద్ది రోజుల నుంచి నదీ జలాలు నల్లగా కనిపిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. కాశీలోని మణికర్ణిక ఘాట్, గంగా మహాల్ ఘాట్, మీర్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్లలో నదీ జలాలు.. స్నానానికి అనుకూలంగా లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వాటర్ కార్పొరేషన్ స్పందించింది. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. మురుగు నీటి పంపులు దెబ్బ తిని...విశ్వనాథ్ ధామ్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరిగిన సమయంలో.. మురుగునీటి పంపులు దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా మురుగునీరు గంగానదిలో కలిసిపోతున్నాయని చెప్పారు. పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోందని పేర్కొన్నారు. చదవండి: కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ.. మురికిగా గంగ నీరు అయితే, కాలుష్య నియంత్రణ విభాగ అధికారి ఎస్కే రాజన్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. మురుగునీటి పంపునకు, నది కాలుష్యానికి సంబంధం లేదని చెప్పారు. సాంకేతిక కమిటీ నీటి నమూనాలు సేకరించి పరిశీలన చేపట్టిందని వెల్లడించారు. 'ఏవైనా సాంకేతిక కారణాల వల్ల నీరు నల్లగా మారిపోయి ఉండొచ్చు. పరిశీలన జరిపిన తర్వాత ఏం జరిగిందనేది తెలుస్తుంది' అని అన్నారు.గంగా నదిలో నీరు నల్లగా మారిపోవడం వల్ల అక్కడికి వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. నదీస్నానాలు చేయడానికి నీరు అనుకూలంగా లేవని స్థానిక పూజారి చెప్పారు. చదవండి: ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం.. జింబాబ్వే మహిళ వద్ద రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ -
అరుదైన నల్ల చిరుతని ఎప్పుడైనా చూశారా..?
మైసూరు(కర్ణాటక): వన్యజీవుల ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి సందర్శకులకు కనువిందు చేసింది. మైసూరు జిల్లాలో ఉన్న హెచ్డీ కోటె తాలూకాలో నాగరహొళె అభయారణ్యంలోని దమ్మనకట్టి రేంజిలో సోమవారం సఫారీకి వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చింది. దీంతో సందర్శకులు తమ కెమెరాలకు పనిచెప్పారు. అరుదైన నల్ల చిరుత ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. చాలా అరుదుగా నల్ల చిరుత బయటకు వస్తూ ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని.. -
ఆ ప్రాంతాన్ని నల్లటి మంచు కమ్మేస్తోంది.. భయాందోళనలో స్థానికులు
ప్రకృతికి సంబంధించిన ప్రతీది అందంగానూ, మనల్ని సంతోషపెట్టేలాగా ఉంటాయి. అయితే కొందరు స్వలాభం కోసం చేసే కొన్ని పనుల వల్ల ప్రకృతి ప్రకోపాన్ని గురికావాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు పేరిట ప్రతి ఏటా మనం నష్టపోతూనే ఉన్నాం. కొందరు అంటుంటారు.. ప్రకృతితో ఆడుకుంటే అది మనతో ఆడుకుంటుందని. అలాంటి ఘటనే తాజాగా రష్యాలో వెలుగు చూసింది. సైబీరియాలోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌లో ప్రకృతి కన్నేర్రకు నిదర్శనగా ఆ ప్రాంతమంతా నల్లటి దుప్పటి కప్పినట్లు మంచు కప్పేసింది. అదేంటి మంచు కురవడం సాధారణమే కదా అనిపిస్తుంది. కానీ అక్కడ కురిసే మంచు తెల్లగా కాకుండా నల్లగా కురుస్తూ ఆ ప్రాంత ప్రజలని భయపెడుతోంది. అయినా మంచు నల్లరంగులో కురవడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రకృతి ప్రకోపం.. నల్లటి మంచు అసలు విషయమేంటంటే.. బొగ్గుతో పనిచేసే వేడి నీటి ప్లాంట్ ఓంసుచన్ ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ సహాయంతో ఆ ప్రాంతంలోని నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తున్నారు. బొగ్గ ఆధారిత ప్లాంట్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని నుంచి వెలువడే దుమ్ము, మసి వాతావారణంలో కలిసి కాలుష్యంగా మారింది. దీంతో ఆకాశం నుంచి పడుతున్న మంచు భూమిపై పడకముందే నల్లగా కాలుష్యంతో నిండిపోయిన ఆ ఆవరణంలోకి రాగానే.. అది కూడా నల్లగా మారి కురుస్తుంది. బూడిద, నల్లటి మంచుతో కప్పబడిన వీధుల్లోతమ పిల్లలు ఆటలాడుకోవల్సి వస్తుందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ నల్లటి మంచుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Russia is a country of outstanding natural beauty and diversity. But the sheer lack of environmental regulations is a devastating effect for residents in #Kuzbass, where last night there was BLACK SNOW. pic.twitter.com/zMiEWBJbnh — Mikhail Khodorkovsky (English) (@mbk_center) February 14, 2019 -
శ్వేత దేశపు నాణేంపై నల్ల జాతి మ(తె)గువ
వర్ణ వివక్షకు కేరాఫ్ అయిన అగ్రరాజ్యంలో.. ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి ఓ నల్ల జాతి మగువ ముఖచిత్రంతో అమెరికన్ కాయిన్ విడుదల చేశారు. అమెరికన్ ఉమెన్ క్వార్టర్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో-అమెరికన్ రైటర్ మయా అంజెలు ముఖచిత్రంతో కాయిన్‌ను విడుదల చేశారు. ఏడేళ్ల వయసులో తల్లి ప్రియుడి చేతిలో అఘాయిత్యానికి గురై.. చావు దెబ్బలు తింది మయా అంజెలు. చివరికి బంధువుల చొరవతో ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి.. ఆరేళ్లపాటు మూగదానిగా ఉండిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ఆ చిన్నవయసు నుంచే అక్షరాల్ని ఆశ్రయించింది. కాలక్రమంలో ఆఫ్రో-అమెరికన్ రచయితగా, జాతి-వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలిగా మయా అంజెలుకు ఒక పేరు దక్కింది. ఉద్వేగంగా సాగే ఆమె రచనలు ప్రముఖులెందరినో ప్రభావితం చేశాయి కూడా. ఆమె ఆత్మకథ I Know Why the Caged Bird Sings ద్వారా ఎన్నో సమస్యల గురించి చర్చించారామె. 1993లో బిల్‌క్లింటన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్వయంగా కవిత వినిపించి.. ఆ అరుదైన గౌరవం అందుకున్న తొలి బ్లాక్ లేడీగా గౌరవం అందుకుంది. తన జీవిత కాలంలో 30కి పైగా అత్యున్నత డాక్టరేట్లు అందుకున్న మయా అంజెలు.. 2010లో అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ‘స్వేచ్ఛా’ మెడల్‌ను సైతం స్వీకరించింది. 2014లో 86 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. మయా అంజెలుతో పాటు చైనా సంతతికి చెందిన హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్, అమెరికా తొలి మహిళా వ్యోమగామి సాలీ రైడ్ ముఖ చిత్రాల మీదుగా కూడా కాయిన్స్ రిలీజ్ చేసింది అమెరికా మింట్. -
అక్కడ తెలుగోడి నల్ల ఇడ్లీ ఎంత ఫేమసో..!!
-
విడుదలకు సిద్దం అవుతున్న ఆది సాయికుమార్ ‘బ్లాక్’
ఆది సాయి కుమార్ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వం లో మహంకాళి మూవీస్ పతాకం పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్’.ఈ సినిమాలో ఆది సాయి కుమార్ తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా బ్లాక్ సినిమా నుంచి దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్ని విడుదలైంది. టీజర్ లో కనిపించిన యాక్షన్ షాట్స్ తో సరికొత్త క్యారెక్టర్ తో ఆకట్టుకునే సంభాషణలతో ఈ చిత్రం పై అంచనాలను మరింత పెంచింది. ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కుశాల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. -
చైనా చర్యలు.. ఆ నదిలో నీళ్లు నల్లగా మారాయి.. తీవ్ర ఇబ్బందుల్లో భారత ప్రజలు
Kameng River Suddenly Turns Black సాధారణంగా నదులంటే మంచి నీటితో పరవళ్లు తొక్కుతూ జీవ రాశులతో కళకళలాడుతుంది. అలాంటిది అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవహిస్తున్న కామెంగ్ నది మాత్రం అకస్మాత్తుగా నల్లగా మారి కళ తప్పింది. దీనికి కారణం ఏదైనా, కారకులెవరైనా నదిలో వేలాది చేపలు కూడా చనిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరి ఈ నదిలోని నీరంతా విషమయం కావడానికి కారణమేంటో తెలుసా ! మన పొరుగు దేశమైన చైనానే అని నదికి సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని సెప్పా వద్ద శుక్రవారం నదిలో వేల సంఖ్యలో చేపలు చనిపోయాయని జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి (డీఎఫ్‌డీవో) హాలి తాజో తెలిపారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం, మరణాలకు కారణం నదిలోని నీళ్లలో టీడీఎస్ అధిక శాతం ఉండడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. నది నీటిలో అధిక టీడీఎస్ ఉన్నందున, చేపలు ఆక్సిజన్‌ను పీల్చుకోవడం కష్టంగా మారుతుందని దీని కారణంగా అవి చనిపోయినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆ నదిలో టీడీఎస్ లీటరుకు 6,800 మిల్లీగ్రాములుగా ఉంది. సాధారణంగా అయితే నీటిలో ఒక లీటరుకు 300-1,200 మిల్లీగ్రాముల ఉంటుంది. తూర్పు కమెంగ్ జిల్లా యంత్రాంగం కామెంగ్ నదికి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని, చనిపోయిన చేపలను విక్రయించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. నదిలో టిడిఎస్ పెరగడానికి చైనా కారణమని సెప్పా ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రాగన్ దేశం చేస్తున్న భారీ నిర్మాణ కార్యకలాపాల వల్ల నీటి రంగు నల్లగా మారిందని ఆరోపించారు. కమెంగ్ నది నీటి రంగు ఆకస్మికంగా మారడం, పెద్ద మొత్తంలో చేపలు చనిపోవడం వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సెప్పా తూర్పు ఎమ్మెల్యే తపుక్ టాకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Even after three days, there is no sign of improvement in Kameng River. Water continues to be muddied, flowing in huge quantities of fresh logs while fishes and aquatic lives washed to the bank. State govt constitutes fact finding committee. pic.twitter.com/XBNjpEm8Iz — The Arunachal Times (@arunachaltimes_) October 31, 2021 చదవండి: కేంద్రం మరోషాక్ ! భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర -
బ్లాక్ ఫంగస్: అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్
జైపూర్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతోంది. కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారినపడ్డారు, వారిలో కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్తకాదు. మన పూర్వీకులు ఎదుర్కొన్న అంటురోగాల్లో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్న విషయం తెలిసిందే.అయితే మహమ్మారి రూపంలో ప్రపంచాన్ని భయపెట్టిన కొన్ని అంటువ్యాధులు కాలక్రమేణా అంతమైపోయాయి. బ్యుబోనిక్ ప్లేగు, మశూచి, కలరా, ఇన్ఫ్లుయెంజా, సార్స్ వ్యాధులు వల్ల ఎంతో మంది మృతి చెందారు. ఇక దేశమంతా కరోనా వైరస్ ఉధృతితో వణుకుతుంటే మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మ్యుకర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) వ్యాధి లక్షణాలు కరోనా బాధితుల్లో కనిపించడం కలవరపెడుతోంది. తాజాగా బ్లాక్ ఫంగస్‌ను(మ్యూకోర్‌మైకోసిస్‌ను) రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో దాదాపు 100మంది బ్లాక్‌ఫంగస్ బారిన పడినట్టు గుర్తించారు. వీరికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు. ‘రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చాం’ అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. బ్లాక్ ఫంగస్, కరోనా వైరస్‌కు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అరోరా తెలిపారు. మధుమేహ రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఢిల్లీలో 75, ఉత్తరప్రదేశ్‌లో 50, మధ్యప్రదేశ్ 19, ఉత్తరాఖండ్‌లో 38, హర్యానాలో 115, మహారాష్ట్రలో 201 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు తెలుస్తోంది. (చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!) -
నిడదవోలులో బ్లాక్ ఫంగస్ లక్షణాలు
సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. సమాచారం ప్రకారం..15 రోజుల క్రితం బాధితుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కాగా ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడు కన్నువాపుగా ఉండేది. అయితే గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో రాజమండ్రి, విశాఖ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకోగా ఫంగస్ లక్షణాలుగా నిర్థారణ అయ్యింది. ఈ వాపు కన్నుతో పాటు, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ( చదవండి: ఏలూరు ఆంధ్రా హాస్పిటల్‌పై క్రిమినల్ కేసు ) -
అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’
మనసును తాకండి. అందమే అంతా కాదు. అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’. ఆశల్ని తుంచేయకండి. నవ్వుల్ని ఆర్పేయకండి. అమ్మాయిల్ని.. జబ్బున పడేయకండి. కొత్త కొరియన్ ‘పాప్’! గర్ల్ బ్యాండ్ పాడుతోంది. ప్రపంచం ఇష్టంగా వింటోంది. ‘‘నీ కళ్ల ముందే కూలిపోతున్నా.. పాతాళంలోకి జారిపోతున్నా.. అయినా రెండు చేతులతో నా ఆశను పట్టుకుని పైకి ఎగబాకుతున్నా.’’పాడుతున్నారు ‘బ్లాక్‌పింక్’ గర్ల్స్. ‘‘నన్ను చూడు, నీకు ఏమనిపిస్తోంది?’’ అని.. కొనసాగింపుగా అడుగుతున్నారు జెన్నీ, జిసూ, లిసా, రోజ్. ఎవరిని అడుగుతున్నారు! ఆడపిల్లకు ఆశలు కల్పించి పారిపోయే మగధీరుడొకడు ఉంటాడు కదా, అతడిని. కొరియన్ గర్ల్ పాప్ బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’ కొత్త ఆల్బమ్ ‘ది అల్బమ్’ లోని ఎనిమిది పాటల్లో ఒకటైన ‘హౌ యు లైక్ దట్’ లోని కూలిన ఆశల గీతమిది. అక్టోబర్ 2న ఈ నలుగురమ్మాయిల బ్యాండ్ విడుదల చేసిన ‘ది ఆల్బమ్’ అక్టోబర్ 26 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల 20 వేల కాపీలకు పైగా అమ్ముడై చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియా అంటే ఇంతవరకు ఆ ఏడుగురు అబ్బాయిల బి.టి.ఎస్. బాయ్ బ్యాండ్ మాత్రమే. వారే పాప్ హీరోలు, వారే పాప్ కింగులు. ఇప్పుడీ గర్ల్ బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’ ధాటికి ఆ ఏడుగురు 2013 నుంచీ నిర్మించుకుంటూ వస్తున్న ‘పాప్’ లోక దుర్భేద్య మహా సామ్య్రాజ్యం బీటలు వారబోతున్న దృశ్యం లీలగా ఆవిష్కృతం కాబోతున్నట్లే ఉంది. బ్లాక్‌పింక్ వరుసగా మూడో వారం ‘బిల్బోర్డ్ 200’ లిస్టులో తొలి పదిస్థానాలలో ఉంటూ వస్తోంది! ‘ది ఆల్బమ్’లోని రెండో ట్రాక్ ‘ది ఐస్ క్రీమ్’! ‘దాహంగా ఉన్నట్లున్నావు.. కొంచెం దగ్గరకు రా..’ అని కోన్ల లా మూతిని తెరిచి మూడు నిముషాల మూడు సెకన్లలో అబ్బాయిల్ని ఫ్రీజ్ చేసేసే బ్లాక్‌పింక్ గర్ల్స్.. మూడో ట్రాక్ ‘ప్రెట్టీ శావేజ్’లో ‘బాయ్స్.. మేం వైలెంట్గానే ఉంటాం. తట్టుకోగలిగితే ఉండండి’ అని కొంచెం రూడ్గానే చెబుతారు. ‘రూడ్ కాదు, అందరికన్నా రూడ్’ అని ఇప్పటికే, ఈ నాలుగేళ్లలో ఈ నలుగురు పిల్లలకు పేరొచ్చేసింది! 2016లో ప్రారంభించారు బ్లాక్‌పింక్ పాప్ బ్యాండ్‌ని. ఈ ఎనిమిది ట్రాక్‌లకు ముందు ఐదు సింగిల్స్ ఉన్నాయి. అసలు వాటితోనే వాళ్లేమిటో చూపించారు. ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే మళ్లీ వాళ్ల దగ్గరికే వెళ్లాలి ‘ది ఐస్ క్రీమ్’ కోసం! మొత్తం 174 సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో పది లక్షల ఆల్బమ్ కాపీలు అమ్ముడై రికార్డు నెలకొల్పిన తొలి బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’! ఏమిటి బ్లాక్‌పింక్ అంటే?! ఈ అమ్మాయిలు కల్పించిన అర్థం.. ‘అందమే అంతా కాదు’ అని! అమ్మాయిల్ని అందమైన పింక్ గులాబీతో పోలుస్తాం. ‘అందాన్నే చూడకండి’ అంటూ పింక్‌కి బ్లాక్‌ని జోడించి బ్లాక్‌పింక్ అని తమ బ్యాండ్‌కి పేరు పెట్టుకున్నారు. బ్లాక్‌పింక్ అని కాకుండా, పింక్బ్లాక్ అంటే మళ్లీ అది బ్లాక్‌కి పింక్ అందాన్ని అంటు కట్టినట్లు. అందుకే బ్లాక్‌ని ముందుకు తీసుకున్నారు. తెలివైన అమ్మాయిలే. ‘లవ్సిక్ గర్ల్స్’ ఐదో ట్రాక్. అమ్మాయిల్ని ప్రేమ సతాయింపులు ఎంత జబ్బున పడేస్తాయో చూడండి. ‘ప్రేమ మనల్ని వలపన్ని కిటీకీలు లేని గదిలో బంధించింది. ప్రతిసారీ బాధిస్తోంది. గుండెలు పగిలి ఏడ్చేలా చేస్తోంది. చివరికి ఏడుపు కూడా రానంతగా మొద్దుబారుతున్నాం..’’ అని పాడతారు. ‘బెట్ యు వాన్నా’, ‘క్రేజీ ఓవర్ యు’, ‘లవ్ టు హేట్ మీ’, ‘యూ నెవర్ నో’ మిగతా నాలుగు ట్రాక్స్. ‘ఎక్కడికెళదామో చెప్పు, అన్నీ సర్దుకుని నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను..’ (బెట్ యు వాన్నా), ‘నువ్వంటే నాకు పిచ్చి. నీ మనసులోనూ నేను ఉన్నానని తెలుసు. అయినా కానీ నువ్వు గీసుకున్న గీతను దాటి రానులే’ (క్రేజీ ఓవర్ యు), ‘నెగిటివ్ డేస్, నెగిటివ్ నైట్స్. బేబీ యు ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్’ (లవ్ టు హేట్ మీ), ‘నేను ప్రకాశవంతంగా నవ్వుదామని ప్రయత్నించిన రోజు.. చీకటి మరింతగా గాఢమైన నన్ను మింగేయాలని చూస్తుంటుంది ఎందుకనో..’ (యూ నెవర్ నో).. అని జెన్నీ, జిసూ, లిసా, రోజ్.. అమ్మాయిలు ఎంతగా ప్రేమిస్తారో, ఆ ప్రేమ వల్ల అంతగా హర్ట్ అవుతూ ఉంటారని ‘ది అల్బమ్’ ట్రాకులలో పాడతారు. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’ అని చెబుతారు. అందుకే ‘బ్లాక్‌పింక్’ ఇంతగా హిట్ అయినట్లుంది. -
మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో మరోసారి ఒక నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన బాడీ కెమెరా ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు. 18 ఏళ్ల డియోన్ కే అనే యువకుడిని పోలీసులు వెంబడించి అతని ఛాతీలో కాల్చారు. అతనిని ఒక వీధి రౌడీగా పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియోలో పోలీసులు ఒక అపార్ట్మెంట్ దగ్గరకు కారులో వెళతారు. అప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తి పరిగెడుతూ కనిపిస్తాడు. అతడిని వెంటాడిన ఒక పోలీసు అధికారి అతని ఛాతీలో కాలుస్తాడు. వెంటనే అతను కింద పడిపోతాడు. అక్కడ కొంచెం సేపు వీడియో బ్లర్‌గా కనిపిస్తోంది. తరువాత కొంతసేపు వీడియో ఆగిపోతుంది. తరువాత డియోన్ కే తన చేతిలో ఉన్న గన్ను దూరంగా విసురుతాడు. అది దూరంగా ఉన్న గడ్డిలో పడుతుంది. ఇంకో పోలీస్ ఆఫీసర్ గడ్డిలో ఆ గన్ కోసం వెతుకుతాడు. అయితే ఆ గన్ కెన్ ఉన్న ప్రదేశం నుంచి 96 మీటర్ల దూరంలో పడిందని, అంత దూరం పడటం అసాధ్యమని కొంత మంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డియోన్ కే చేతిలో ఆ గన్ ఎందుకు ఉంది, దానిని ఉపయోగించి పోలీసులపై దాడి చేయాలనుకున్నాడా లేదా గన్ను విసిరేయాలనుకున్నాడా అన్నది ఆ వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. నల్లజాతీయుల మీద దాడులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో చట్టాలలో కొన్ని మార్పులు తెచ్చారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడంతో పలువురు నల్లజాతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువకుడిని కాల్చి చంపిన పోలీసు అధికారిని 2018 లో డిపార్ట్మెంట్లో చేరిన అలెగ్జాండర్ అల్వారెజ్గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిని అడ్మినిస్ట్రేటివ్ సెలవులో ఉంచారు. కేసును విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని చంపడంతో అమెరికాలో గతంలో నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చదవండి: పోలీసు సంస్కరణలకు ట్రంప్ ఓకే -
వేరు చెయ్యకు పేరయ్యా
లవ్ ఈజ్ బ్లైండ్. నలుపూ తెలుపు చూసుకోదు ప్రేమ. పెళ్లిళ్ల సైట్లే.. నాట్ కైండ్! అన్నీ చూస్తాయి.అడుగులు.. అంగుళాలు..ఆస్తులు.. అంతస్థులు..చేస్తున్న ఉద్యోగం.. వస్తున్న జీతం..రంగు కూడా! ‘కూడా’ ఏంటి! రంగే మెయిన్.ఇద్దరమ్మాయిలకు ఇది నచ్చలేదు.రంగుతో వేరు చెయ్యొదన్నారు.రంగు ‘ఫిల్టర్’ను తీయించేశారు. అబ్బాయికి అమ్మాయిని వెదకాలి. అమ్మాయికి అబ్బాయిని చూడాలి. వెదకడానికి, చూడ్డానికి తేడా ఉంది. ‘వెదకడం’ అంటే అబ్బాయికి అమ్మాయి దొరకడం లేదని! ‘చూడడం’ అంటే అబ్బాయిలు కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నారని! మరీ మునుపటిలా లేవు రోజులు. కొద్దిగా తారుమారయ్యాయి. వధువులు దొరకడం కష్టమైపోయింది. ఇంత కష్టమైపోయినా కూడా అబ్బాయిలు ఒక విషయంలో మాత్రం ‘ఎస్’ అందామా, ‘నో’ అందామా అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ ఆలోచన.. అమ్మాయి ఒంటి రంగు గురించి! వధువు తెల్లగా ఉండాలి. పెళ్లిచూపుల్లో అయినా అదే చూపు, ఆన్లైన్ పరిచయ వేదికల్లో అయినా అదే చూపు. మగవాళ్లలో రంగును చూసే అమ్మాయిలు ఉంటే ఉండొచ్చు. అది రెండో చాయిస్‌గానే ఉంటుంది. ఫస్ట్ చాయిస్ మాత్రం ‘అబ్బాయి మంచివాడైతే చాలు’ అనే. పైకి ఎన్నిచెప్పినా పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దవాళ్లందరి ‘ఔట్లుక్’ ఒకేలా ఉంటుంది. పిల్లల ‘ఫస్ట్ లుక్’ వేరుగా ఉంటుంది. పిల్లల్ని అలా వదిలేద్దాం. వాళ్లు చూసేది ఎలాగూ రంగును కాదు, వాళ్లు చేసుకునేదీ రంగును కాదు. పెద్దవాళ్లయితే మాత్రం కచ్చితంగా ఈడూజోడూ చూస్తారు. పిల్లకన్నా పిల్లవాడు రెండంగుళాలైనా ఎత్తుండేలా చూసుకుంటారు. ఎత్తు చూసే ముందే.. ఉద్యోగంలో ఎంత ఎత్తుకు ఎదగగలడో చూసుకుని ఉంటారు. ఆస్తులు ఉంటే మంచిదే. తోబుట్టువులు పెద్దగా లేకుంటే మరీ మంచిది. ఇన్ని ఉంటాయి. అన్నీ కుదిరితే అప్పుడు అబ్బాయి రంగును కూడా కుదురుతుందేమోనని చూస్తారు. అబ్బాయి వైపు వాళ్లయితే ముందుగా పిల్ల రంగును చూసుకుంటారు. తర్వాతే మిగతావన్నీ. అందుకే మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో కూడా ‘ఒంటి ఛాయ’ కాలమ్ మస్ట్‌గా కనిపిస్తుంటుంది. పెళ్లి సైట్లకు ఫొటో, వివరాలు ఇచ్చేవారు.. ఫొటోలో ఎలా ఉన్నా, రంగును మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయాలి. తెలుపు అనీ, నలుపు అని, మరీ నలుపు కాదనీ, నలుపు కంటే కాస్త తక్కువని, చామన చాయ కంటే పిసరంత ఎక్కువనీ.. డీటెయిల్డ్‌గా ఇవ్వాలి. ‘షాదీ డాట్ కామ్’ ఇండియాలో పేరున్న పెద్ద పెళ్లిళ్ల పేరయ్య. ఆ సైట్లో రంగుకు ఏకంగా ఒక స్కిన్ కలర్ ఫిల్టరే ఉంటుంది. ఫెయిర్, వీటిష్, డార్క్. ముట్టుకుంటే కందిపోవడం ఫెయిర్. గోధుమ రంగులో ఉండటం వీటిష్. డార్క్ అంటే నలుపు. ఇప్పుడు ఈ ఫిల్టర్‌ని షాదీ డాట్ కామ్ తొలగించబోతోంది! పెద్ద విషయమే అనుకోవాలి. హీతల్, మేఘన్ అనే ఇద్దరు అమ్మాయిలు రంగును పెద్ద విషయం చెయ్యబట్టే షాదీ డాట్ కామ్ చిన్న విషయంగా కొట్టివేయలేకపోయింది. హీతల్ సంతకాల ఉద్యమం స్క్రీన్‌షాట్ పెళ్లీడుకొచ్చిన పిల్లల ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’లో ఏ రంగూ లేని ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఇదే పిల్లలు పెళ్లిళ్ల సైట్‌కి వెళ్తే మాత్రం మొదట క్లిక్ కొట్టేది రంగునే. ఆ కేటగిరీలోకి వెళ్లి ఇక ఆ దారంటా అన్వేషణ మొదలు పెడతారు. మానవ స్వభావం. సైట్ల వాళ్లను కూడా తప్పు పట్టేందుకు లేదు. కస్టమర్‌కి కావలసింది ఇవ్వలేకపోతే కొన్నాళ్లకు సైటే లేకుండా పోతుంది. అయితే మేఘన్ నాగ్‌పాల్ అనే యువతి దీన్నొక తప్పు పట్టకూడని విషయంగా తీసుకోలేకపోయారు. షాదీ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ దృష్టికి తీసుకెళ్లి సైట్‌లోని ఆ కలర్ ఫిల్టర్లను తొలగించమని కోరారు. ‘‘కానీ మేడమ్.. చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా రంగు గురించే మమ్మల్ని అడుగుతుంటారు’’ అని సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని ఫేస్బుక్లో చర్చకు పెట్టారు మేఘన్. నిజమే ఈ ‘వర్ణవివక్ష’ ఏమిటి అన్నట్లు అంతా ఆమెను సపోర్ట్ చేశారు. యు.ఎస్.లో ఉంటున్న హేతల్ లఖానీ అనే యువతి మాత్రం ఆ సపోర్ట్‌ని ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్లారు. ఆన్లైన్లో పిటిషన్ తయారు చేసి సంతకాలు సేకరించారు. ‘ఛేంజ్ డాట్ ఒఆర్జి’లో ఆమె ఆ పిటిషన్ పెట్టిన పద్నాలుగు గంటల్లోనే 1500 మంది ఫర్గా సంతకాలు చేశారు! దానిని షాదీ డాట్ కామ్‌కి ఫార్వర్డ్ చేశారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ తన సైట్‌లోని స్కిన్ కలర్ ఫిల్టర్‌ను తొలగించబోతోంది ఆ పెళ్లిచూపుల సంస్థ. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (నల్లవారి ప్రాణాలూ ముఖ్యమే) ఉద్యమం విస్తృతం అవుతుండటంతో.. రంగుకు ప్రాధాన్యతనిచ్చే ధోరణులు అన్ని రంగాలలోనూ మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రసిద్ధ యు.ఎస్. కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇటీవలే.. చర్మాన్ని తెల్లబరిచే సౌందర్యసాధనాల విక్రయాన్ని ఇండియాలో నిలిపివేయబోతున్నట్లు ప్రకటì ంచింది. తర్వాత షాదీ డాట్ కామ్. ఇప్పుడిక తాజాగా మన దేశవాళీ హిందుస్థాన్ లీవర్ సంస్థ కూడా తమ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ నుంచి ‘ఫెయిర్’ అనే మాటను తొలగిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫెయిర్, వైట్, లైట్ అనే మాటల్ని అందానికి ఏకపద ఆదర్శ నిర్వచనాలుగా వాడటం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. క్రమంగా మరికొన్ని. మరికొన్ని. మరికొన్ని. ప్రశ్నించడం వల్లనే సాధ్యమౌతున్నవీ, సాధించుకుంటున్నవీ.. ఈ మార్పులన్నీ. నాలో ఉండేవి ఉంటాయి. లేనివీ ఉంటాయి. ఉన్నవీ, లేనివీ నా రంగు చాటున ఉండిపోవడం ఏమిటి? తెలుపు రంగు నా లోపాలను కప్పిపుచ్చే పనైతే అంతకన్నా అసహ్యం ఇంకోటి ఉంటుందా? – హీతల్ లఖానీ, డాలస్, యూఎస్ బాలీవుడ్ తారలు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు ఇస్తూనే ఫెయిర్‌నెస్ క్రీములకు ప్రచారం ఇస్తున్నారు. దీని వల్ల ఉపయోగం ఏమిటి? తెలుపు ఘనమైనది అనే భావన ఎలా పోతుంది? ఎప్పటికి పోతుంది?– మేఘన్ నాగ్‌పాల్ -
గతంతో ఘర్షిస్తేనే అమెరికాకు భవిష్యత్తు
నల్లజాతీయులపై అమెరికాలో కొనసాగుతున్న జాతివివక్షాపరమైన దాడులు, హత్యలు శతాబ్దాలుగా కొనసాగుతున్న బానిసత్వ సంస్కృతి గతం నుంచి ఆ దేశం ఏమాత్రం బయటపడలేదని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. మినియాపోలీస్, సియాటిల్‌లో ఇద్దరు నల్లజాతీయులను పోలీసు అధికారులు దారుణంగా హత్య చేసిన ఘటన అటు అమెరికాలో, ఇటు గ్రేట్ బ్రిటన్‌లో ఒక సరికొత్త సాంస్కృతిక విప్లవానికి నాంది పలుకుతోంది. గతచరిత్ర తప్పిదాలతో ఘర్షణ పడటం ద్వారానే అమెరికా ఒక సరికొత్త, వివక్షారహితమైన సంస్కృతి పథంలో పయనించగలదు. 1970లో, పలువురు వృద్ధ తరం జర్మన్లు గతంలో నాజీలు తలపెట్టిన నేరాలకు గానూ ప్రపంచానికి క్షమాపణ తెలియజేస్తూ వార్సా ఘెట్టో స్మారక స్తూపం వద్ద మోకాళ్లు వంచి నిలబడటం చరిత్రకెక్కింది. జాతివివక్ష, జాతీయ, సామ్రాజ్యవాద భ్రమల్లో మునిగితేలుతున్న వారు తమ సమాజం సుదూర గతంలో చేసిన తప్పులను అంగీకరించడం అంటే అది తమ బలహీనతే అని భావిస్తారు. అయితే అదేసమయంలో అవమానకరమైన గత చరిత్రతో ఘర్షించి కొత్త మార్గం చేపట్టడం అనేది ఏ జాతికైనా, సమాజానికైనా అతిగొప్ప బలానికి చెందిన వనరుగానే ఉంటుంది. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అక్షరాలా ఒక సాంస్కృతిక విప్లవం చెలరేగుతోంది. బానిస యజమానుల విగ్రహాలను కూల్చివేస్తున్న నిరసనకారులు తమపట్ల శ్వేతజాతీయులు గతంలో చేసిన పాపాలకు గాను నైతిక నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వస్తున్నారు. బానిసత్వం, సామ్రాజ్యవాదం అనేవి ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశాల్లో సంపదకు, అధికారవర్గాలకు మద్దతుగా నిలుస్తున్నాయని, అదేసమయంలో కోట్లాదిమంది నల్లజాతి ప్రజలను తరాలపాటు దారిద్య్రంలోకి నెడుతూ అవమానిస్తున్నాయని నిరసనకారులు ఎలుగెత్తి చాటుతున్నారు. తాజాగా విగ్రహాలను విధ్వంసం చేస్తున్నవారు చాలావరకు ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కెంట్‌లో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన శాసనసభ్యులు జాతిపరమైన హింసాకాండకు బలవుతున్న బాధితుల పట్ల సంఘీభావం ప్రదర్శిస్తూ మోకాళ్లమీద నిలబడుతూ ఒక అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించడం నిజంగా నమ్మలేని విషయమే. అసంఖ్యాకంగా వ్యక్తులు, సంస్థలు జాతిపరమైన న్యాయానికి మద్దతుగా ముందుకువస్తున్నారు. జాతి సమానత్వాన్ని ఉల్లంఘిస్తున్నవారిని పేరుపెట్టి మరీ అగౌరవపరుస్తున్నారు. అయితే ప్రత్యేకించి కరోనా వైరస్ విధ్వంసం శిథిలాల నుంచి లేచి నిలబడాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్ దేశాల్లో సరికొత్త జాతీయ గుర్తింపునకు సంబంధించి మరింత లోతుగా, దృఢంగా సాగుతున్న సమరం ఇప్పుడే ప్రారంభమైంది. తిరిగి మార్చడానికి వీల్లేనంత వైవిధ్యపూరితంగా ఉంటున్న అమెరికన్ సమాజంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూర్తీభవించిన శ్వేతజాతి దురహంకారానికి తిరుగులేని నిదర్శనంగా కనిపిస్తున్నారు. అలాగే విన్స్టన్ చర్చిల్‌పై ఇప్పటికీ బ్రిటన్‌లో కొనసాగుతున్న ఆరాధనా భావం బోరిస్ జాన్సన్ హయాంలో సంఖ్యరీత్యా మరింతగా పెరుగుతోందే తప్ప జాత్యహంకార ధోరణి తగ్గుముఖం పడుతున్న సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. బానిస యజమానులకు సంబంధించి ససాక్ష్యంగా నేటికీ మిగిలివున్న వాస్తవాలు.. ప్రస్తుతం అమెరికాలో అసంఖ్యాక ప్రజలను ఆకర్షించనట్లుగానే, బ్రిటిష్ సామ్రాజ్యంపై, అలనాటి రవి అస్తమించని సామ్రాజ్య వైభవంపై, దాని విస్తార అధికారంపై భావోద్వేగపరంగా పెంచుకుంటూ వస్తున్న అనుబంధం కూడా టోరీ ప్రభుత్వ అప్రయోజకత్వాన్ని కాపాడలేదు. బ్రెగ్జిట్ నుంచి ఎలా బయటపడాలన్న విషయంపై టోరీ ప్రభుత్వం ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. జాతివివక్షానంతర, సామ్రాజ్యవాద అనంతర గుర్తింపు కోసం ప్రస్తుతం శోధిస్తున్న అమెరికా, బ్రిటన్ దేశాలు.. రెండు ప్రపంచ యుద్ధాల్లో తమకు రాజీపడని శత్రువుగా నిలిచిన జర్మనీ నుంచి తెలివైన పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఒకవైపు అమెరికాలోని వర్జీనియాలోని కార్లోటెస్విల్లీలో ‘మా నేల, మా నెత్తురు’ అంటూ స్వస్తిక్ బేనర్లు ధరించి మరీ శ్వేతజాతి దురహంకారులు నినదిస్తుండగా, బ్రెగ్జిట్ మార్గంలో వలసప్రజలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి బ్రిటన్‌లో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ గతంలో జాత్యహంకారానికి మారుపేరుగా నిలిచిన జర్మనీ మాత్రం పదిలక్షల మందికిపైగా వలస ప్రజలకు స్వాగతం పలుకుతూ కొత్త్త సంస్కృతికి తలుపులు తెరిచింది. ఇదే విషయాన్ని సుసాన్ నీమన్ సకాలంలో రాసిన ’లెర్నింగ్ ఫ్రమ్ ది జర్మన్స్’ పుస్తకం ఈ పరిణామాన్ని రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో తలెత్తిన అతి పెద్ద, విస్తృత సామాజిక ఉద్యమంగా వర్ణించింది. ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో విజయవంతంగా ఉనికిలోకి వచ్చి నిలిచిన పచ్చిమితవాద పార్టీ ది ’ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ ఈ సరికొత్త జర్మనీ చైతన్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించింది. కానీ చిన్న ప్రజాపునాది మాత్రమే కలిగి ఉన్న ఈ పార్టీ అంతర్యుద్ధం, కరోనా వైరస్ వ్యూహం మధ్య ప్రస్తుతం కొట్టుమిట్టులాడుతూ తమ ప్రాభవాన్ని చాలావరకు కోల్పోయింది. పైగా, దేశ నాజీ గతాన్ని తిరస్కరించడం కానీ, తగ్గించడానికి ప్రయత్నించడం కానీ చేస్తున్న ఈ పార్టీ దేశంలో పెరుగుతున్న జాత్యహంకార వ్యతిరేక మనోభావాలను బలోపేతం చేయడానికి తోడ్పడింది. జాతి దురహంకారతత్వం నుంచి స్థిరంగా, విస్తృతంగా బయటపడినందువల్లే, ఇటీవలి సంవత్సరాల్లో ఆంగ్లో–అమెరికాను ధ్వంసం చేసిన విషఫూరిత రాజకీయాలనుంచి పూర్తిగా బయటపడే ప్రక్రియలో జర్మనీ అత్యున్నత స్థాయికి చేరుకుంది. అయితే ఇది ఒక్కరాత్రిలో సంభవించింది కాదు. అమెరికా దక్షిణ ప్రాంతంలో పూర్తిగా విడిపోయిన జాతుల మధ్య పెరిగిన తత్వవేత్త నీమన్, చాలాకాలం బెర్లిన్‌లో నివసిస్తూ, ఒక గొప్ప వ్యాఖ్య చేశాడు. ’’చరిత్రలో అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన వారు తమ నేరాలను అంగీకరించడానికి దశాబ్దాల కఠిన కృషి అవసరమైంది. ఆ తర్వాతే వారు తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం మొదలెట్టారు.’’ అమెరికా నుంచి వచ్చి పశ్చిమజర్మనీలో నివసిస్తున్న వారు నాజీ సంస్కృతిని రద్దు చేయాలంటూ చేసిన డిమాండ్ పాక్షికంగా మాత్రమే ఫలవంతమైంది. అనేకమంది నాజీ నేరస్తులు ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్ కమ్యూనిజానికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డారని అమెరికా నిఘా సంస్థలు కనుగొన్నాయి. నిజానికి 1960లలో జర్మనీలో చెలరేగిన విద్యార్థి తిరుగుబాటును నాజీ అనుకూలురైన వ్యక్తులు, సంస్థలు రెచ్చగొట్టారు. నాజీల శకంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు, ప్రొఫెసర్లు తమ ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇలా ప్రయత్నించారు. అనేకమంది జర్మన్లు నేటికీ తాము బాధితులమేనని తలుస్తుంటారు. దశాబ్దాల తర్వాత సైతం ఒక అలనాటి నాజీ సంస్కృతిని స్మరించుకోవడం, వేడుకలు జరపటం జర్మనీలో తరగతి గదుల్లో, వెలుపల కూడా జరుగుతూ వచ్చింది. నాజీ నేరాలకు బలైన బాధితులు పెద్ద, చిన్న స్మారక చిహ్నాలు జర్మనీ వ్యాప్తంగా నెలకొన్నాయి. బెర్లిన్‌లోని నాటి మారణహోమానికి చిహ్నంగా నిర్మించిన స్మారక చిహ్నం కానీ, స్థానిక వీధుల్లో నెలకొల్పిన శిలా విగ్రహాలు కానీ ఒకప్పుడు తమతో జీవించి తర్వాత నాజీలతో బలవంతంగా తరలించబడిన వారి పేర్లు, తేదీలను నమోదు చేశాయి. 1970లో, పలువురు వృద్ధ తరం జర్మన్లు నాజీ నేరాలకు గానూ ప్రపంచానికి క్షమాపణ తెలియజేస్తూ వార్సా ఘెట్టో స్మారక స్తూపం వద్ద మోకాళ్లు వంచి నిలబడటం చరిత్రకెక్కింది. కానీ ఆనాటి ఆ దృశ్యం అసాధారణమైన బలాన్ని కలిగి ఉంది. నైతిక అంతర్ముఖత్వం, చారిత్రక విచారణ ద్వారా పునరుత్తేజం చెందిన ఒక సమాజం, సంస్కృతి సరికొత్త రూపాన్ని అది ప్రతిబింబించింది. జర్మనీలోని ఈ సరికొత్త సంస్కృతితో ఆంగ్లో–అమెరికన్ ప్రవృత్తులను పోల్చి చూద్దాం. వామపక్ష భావాలున్న నాటి బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్ 2005లో తూర్పు ఆఫ్రికాలో పర్యటించినప్పుడు బ్రిటన్ తన వలసవాద గతానికి గానూ క్షమాపణ చెప్పే రోజులు శాశ్వతంగా ముగిసిపోయాయి అని ప్రకటించాడు. వాస్తవానికి బ్రిటన్ తన వలసపాలన దురాగతాలకు ఎన్నడూ క్షమాపణ చెప్పింది లేదు. తన జాతివివక్షకు సంబంధించిన గతంతో ఘర్షణపడి మారిపోయిన జర్మనీ తరహా ప్రవర్తన ఆంగ్లో–అమెరికా ప్రాంతంలో సమీప భవిష్యత్తులో కూడా ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫాక్స్ న్యూస్‌కి చెందిన పచ్చి మితవాద జర్నలిస్టు టక్కర్ కార్ల్సన్ వంటి అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నవారు తాజాగా ప్రదర్శిస్తున్న పశ్చాత్తాపమన్నదే ఎరుగని జాత్యహంకార ధోరణి.. బ్రిటన్, అమెరికాలను ఆవరిస్తున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక విషమ పరిస్థితులను మరింతగా పెంచి పోషించగలదు. జాతివివక్ష, జాతీయ, సామ్రాజ్యవాద భ్రమల్లో మునిగితేలుతున్న వారు తమ సమాజం సుదూర గతంలో చేసిన తప్పులను అంగీకరించడం అంటే అది తమ బలహీనతే అని నిస్సందేహంగా భావిస్తారు. అయితే అదేసమయంలో అవమానకరమైన గత చరిత్రతో ఘర్షించి కొత్త మార్గం చేపట్టడం అనేది ఏ జాతికైనా, సమాజానికైనా అతిగొప్ప బలానికి చెందిన వనరుగానే ఉంటుంది. పంకజ్ మిశ్రా వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్ -
ఆది బ్లాక్
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్లాక్’ అనే టైటిల్ ఖరారైంది. ఇందులో దర్శనా బానిక్ హీరోయిన్గా నటిస్తున్నారు. మహంకాళి మూవీస్ బ్యానర్‌పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.బి కృష్ణ దర్శకుడు. ఇందులో పోలీసాఫీసర్ గెటప్‌లో కనిపించనున్నారు ఆది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూట్‌ను పూర్తి చేసేందుకు ప్రణాళిక వేస్తున్నారు చిత్రబృందం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. మిగిలిన షూట్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత దివాకర్. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్. -
నలుపే దైవం
తెలుపును కోరుకోవడంలో తప్పేం లేదు. నలుపును చెరిపేయాలనుకోవడంలోనే..n తెలుపంటే మనకున్న ‘పెద్దచూపు’ బయటపడుతుంది. చూపు పెద్దదవకూడదు. చిన్నదవకూడదు. సమంగా ఉండాలి. శ్రీకృష్ణుడు నల్లనివాడు. ఈవెన్ థో అందగాడు. ఆరాధించేస్తారు గోపికలు. ఆయన మురళీరవంలో ఉందీ అందం. ఫ్లూట్ ప్లే చేస్తున్నప్పుడు కాలు మీదుగా కాలు పోనిచ్చి నిలుచోవడంలో ఉంది అందం. కబుర్లేం చెప్పేవాడో గానీ వాటిల్లో ఉండేది అందం. చుట్టూ చేరేవారు పదహారువేల మంది ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల్స్. ఆ నీలమేఘశ్యాముడి కళ్లలోకి చూస్తూ టైమ్ మర్చిపోయేవారు. వాళ్లెప్పుడూ లార్డ్ కృష్ణ.. బ్లాకా వైటా అని చూసుకోలేదు!అయితే, మనవాళ్లు చూసుకుంటున్నారు. మనవాళ్లు అంటే.. ఇండియన్స్. ఈమధ్య క్యాలెండర్లలో, స్టిక్కర్లలో శ్రీకృష్ణుడు ఫెయిర్ స్కిన్‌తో కనిపిస్తున్నాడు. పురాణాలను ఇలా ఇష్టంవచ్చినట్లు మార్చేయొచ్చా! నల్లగా ఉంటే తెల్లగా!! మార్చేస్తున్నారు. ఇంట్లో తగిలించుకునే పోస్టర్లో, ఇంటి తలుపుకు అంటించుకునే స్టిక్కర్లో నల్లనయ్య తెల్లనయ్యగా దర్శనం ఇస్తున్నాడు. గణపయ్య అయితే మన చిన్నప్పట్నుంచే వైట్ కలర్‌తో భారతీయ భువిలోకి వచ్చి ఉంటున్నాడు.ఎప్పుడైనా, ఎక్కడైనా చూశామా.. బ్లాక్ విఘ్నేశ్వరుడిని! పోనీ బాడీ మొత్తాన్ని వదిలేసినా ఆయన తల నల్లరంగులోనే ఉండాలి కదా.. ఇండియాలో కనిపించేవన్నీ బ్లాక్ ఎలిఫెంట్సే కాబట్టి! అలా ఉండడు. పాల మీగడ రంగులో ఉంటాడు. తెలుపంటే మనకు పిచ్చి ప్రేమ కాబట్టి, చర్మాన్ని తెల్లగా మార్చే క్రీములు పూసుకోవడంతో సరిపెట్టుకోవడం లేదు. నలుపు రంగులో ఉండే దేవుళ్లను కూడా తెలుపులోకి మార్చుకుంటున్నాం. పెళ్లి చేసుకోవడానికి తెల్లటివాళ్లు కావాలి. íసినిమాల్లో యాక్ట్ చెయ్యడానికి తెలుపే కావాలి. యాడ్ షూటింగుల్లో మోడలింగ్కీ ౖవైటే. ఇప్పుడు నల్లగా ఉండే దేవుళ్లకి కూడా వైట్ పెయింట్ వేసుకుంటున్నాం! తెలుపును కోరుకోవడంలో తప్పేం లేదు. నలుపును చెరిపేయాలనుకోవడంలోనే.. తెలుపంటే మనకున్న ‘పెద్దచూపు’ బయటపడుతుంది. చూపు పెద్దదవకూడదు. చిన్నదవకూడదు. సమానంగా ఉండాలి.ఇన్నాళ్లు నలుపుపై ఉన్న చిన్నచూపును పోగొట్టడానికి క్యాంపెయిన్లు నడిచాయి. ‘డార్క్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ ఇలాంటివి. ఫెయిర్‌నెస్ క్రీములకు పబ్లిసిటీ ఇచ్చే సినీ తారలు కూడా అవేర్నెస్తో అవతలికి వెళ్లిపోతున్నారు.. మేం చెయ్యం పొమ్మని. అయినా గానీ, వైట్కి ఉన్న వెయిట్ తగ్గడం లేదు. బ్లాక్‌కి ఉన్న ‘డ్రాబ్యాక్’ తగ్గడం లేదు. అమ్మాయిల విషయమైతే మరీ అన్యాయం. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత క్యూట్‌గా ఉన్నా, ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నా.. చివరికి కౌంట్ అయ్యేది తెలుపే కానీ, నలుపు కాదు. అందుకనిప్పుడు.. భరద్వాజ్ సుందర్ అనే చెన్నై యాడ్మేకర్, నరేశ్ నీల్ అనే ఫొటో గ్రాఫర్ కలిసి ‘డార్క్ ఈజ్ డివైన్’ అనే రివర్స్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. తెల్లటి దేవతామూర్తులను, తెల్లటి పౌరాణిక పాత్రలను నలుపు రంగులో ప్రెజెంట్ చేస్తున్నారు! అందుకోసం డార్క్‌గా, డాషింగ్‌గా ఉన్న మోడల్స్‌ని ఎంపిక చేసుకుని ఫొటోలు షూట్ చేస్తున్నారు. అపచారం కదా! ‘‘కానే కాదు’’ అంటున్నారు సుందర్, నరేశ్ నీల్. ‘‘దేవుడి సృష్టిలో అన్నీ సమానం అయినప్పుడు నలుపు ఇన్ఫీరియరు, తెలుపు సుపీరియరు ఎలా అవుతాయి? కావు అని చెప్పడానికే దేవుణ్ణి ఆశ్రయించాం. దేవుణ్ని దేహీ అనడం అపచారం అవుతుందా’’ అంటున్నారు. పాయింటే. -
నెయిల్ పాలిష్ ధర వింటే.. గుండె ఆగుతుంది?!
ప్రతి మనిషి జీవితంలో తన స్థాయిలో లగ్జరీని కోరుకుంటున్నాడు. వస్తువు ఎలాంటిది అయినా.. దాని ఖరీదు మాత్రం తన స్థాయికన్నా అధికంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతి వస్తువును తయారీదారులు అదే స్థాయిలో రూపొందించిస్తున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తేన్న నెయిల్ పాలిష్ కూడా అటువంటిదే. దీనిని ప్రపంచంలోని కోటీశ్వరుల్లో చాలాతక్కువ మంది మాత్రమే ఉపయోగించలరు. లగ్జరీకి పరాకాష్టగా కూడాదీనిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఖరీదు. కేవలం కోటీ 63 లక్షల 66 వేల రూపాయలు మాత్రమే. దీనిని దిగుమతి చేసుకోవాలంటే అదనంగా మరో పది లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. ఇంతటి ఖరీదైన నెయిల్ పాలిష్‌ని లాస ఏంజెల్స్‌లోని లగ్జరీ సౌందర్య సాధానాల తయారీ సంస్థ అజాతురే రూపొందించింది. ఈ నెయిల్ పాలిష్‌లో 267 కేరట్ల బ్లాక్ డైమండ్‌ను ఉపయోగించారు. అందుకే ఇంత ఖరీదు అని సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను కేవలం ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తామని చెప్పారు. -
కెమరూన్ దేశస్తుల ‘బ్లాక్’ వ్యూహం
- విద్యార్థుల ముసుగులో ఘరానా మోసం - నోట్లను డాలర్లుగా మారుస్తామని బురిడీ - పాస్‌పోర్టు లేకుండా తిరుగుతున్న నల్లజాతీయుడు - పక్కా సమాచారంతో అదుపులోకి.. నంద్యాల: విద్యార్థుల ముసుగులో దొంగ నోట్ల తయారీ పేరిట ఘరానా మోసం చేస్తున్న ఆఫ్రికాలోని కెమరూన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ హరినాథరెడ్డి స్థానిక పోలీస్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కెమరూన్ దేశానికి చెందిన 37 ఏళ్ల రోబర్ట్ విద్యార్థి వీసా సంపాదించి ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు చేరుకున్నాడు. ఇక జాన్సన్ దవే ఎలాంటి పాస్‌పోర్టు లేకుండానే ఇండియాలోకి ప్రవేశించి బెంగళూరులోని కెంపెగౌడ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇండియన్ అకాడమీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నట్లు గుర్తింపు కార్డును సృష్టించుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ దొంగనోట్ల తయారీ పేరిట అమాయకులకు ఎరవేసి డబ్బు లాగడం ప్రారంభించారు. ఆళ్లగడ్డకు చెందిన ఫైనాన్షియర్ లక్ష్మీనారాయణ, బెంగళూరులో బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసిన మహేష్ స్నేహితులు. మహేష్‌కు కెమరూన్ గ్యాంగ్‌తో పరిచయం ఉంది. వీరిని లక్ష్మీనారాయణకు పరిచయం చేశాడు. ఆర్బీఐ జారీ చేసిన రూ.2వేల నోట్లను తయారు చేసిస్తామని కెమరూన్ గ్యాంగ్ ఆయనను మభ్యపెట్టింది. నంద్యాల కేంద్రంగా... నంద్యాల కేంద్రంగా కెమరూన్ గ్యాంగ్ నోట్ల తయారీ మోసానికి సిద్ధమైంది. స్థానిక శ్రీనివాస సెంటర్లోని ఓ లాడ్జిలో కెమరూన్ గ్యాంగ్, మహేష్ మకాం వేశారు. లక్ష్మీనారాయణ రూ.8లక్షల రూ.2వేల నోట్ల కట్టలను ఆళ్లగడ్డకు చెందిన రాజీవ్ ద్వారా పంపారు. ఈ గ్యాంగ్ నోట్ల కట్టలను తయారు చేస్తామని మభ్యపెడుతుండగా పోలీసులకు సమాచారం అందింది. సీఐ ప్రవీన్‌కుమార్, ఎస్ఐ నవీన్ లాడ్జిపై దాడి చేసి కెమరూన్ దేశస్తులు జాన్సన్, రోబర్ట్లను అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబ్ క్లిప్పింగ్ ఆధారంగా వ్యూహం యూట్యూబ్‌లో వచ్చిన వీడియో ఆధారంగా కెమరూన్ గ్యాంగ్ నకిలీ నోట్ల తయారీ పేరిట ఘరానా మోసానికి వ్యూహం పన్నింది. రూ.లక్ష ఇస్తే, తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూ.3లక్షల అమెరికన్ డాలర్లను తయారు చేసి ఇస్తామని మభ్యపెట్టారు. రూ.2వేల నోట్ల కట్టలకు విదేశాల నుంచి తెచ్చిన పౌడర్‌ను కలిపి, వాటిపై బరువు పెట్టి 30 గంటలు గాలి సోకకుండా భద్రపరుస్తామని, తర్వాత ఈ పౌడర్‌కు రసాయనాలను కలిపి బ్లాక్ నోట్లపై పూస్తే అమెరికా డాలర్లు తయారు అవుతాయని మభ్యపెట్టారు. చేతికి డబ్బు అందగానే పరారు కావాలనేది వీరి వ్యూహం. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ రూ.8లక్షలు అందజేయడం.. ఇంతలో పోలీసులకు సమాచారం అందడంతో వ్యవహారం బట్టబయలయింది. లాడ్జిపై దాడి చేసిన పోలీసులు 20 కట్టల బ్లాక్ కోటెడ్ కరెన్సీ బండిళ్లు, ఐదు సెల్ఫోన్లు, కెమికల్ బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు ఆదేశించారు. మూలాలకై ఆరా.. కెమరూన్ దేశానికి చెందిన నల్లజాతీయులు సరైన పాస్‌పోర్టులు లేకుండా ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో నిర్భయంగా తిరగడంపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం సబ్‌జైలులో ఉన్న వీరిని రెండు మూడు రోజుల్లో జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో నైజీరియా, కెమరూన్ ప్రాంతానికి చెందిన నల్లజాతీయులు డ్రగ్స్, మారణాధాయాల అమ్మకాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. దీంతో రోబర్ట్, జాన్సన్‌ల వెనుక నేర చరిత్ర ఉందేమోననే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం రోబర్ట్ వద్ద మాత్రమే 2020 వరకు గడువున్నా పాస్‌పోర్టు ఉంది. ఇది అసలైనదా.. నకిలీదా అనే విషయమై విచారిస్తున్నారు. ఇందుకోసం పాస్‌పోర్టును సీజ్ చేశారు. -
రూ.9.64 లక్షల మినపప్పు స్వాధీనం
కాకినాడ సిటీ : అక్రమంగా నిల్వ ఉంచిన రూ.9.64 లక్షల విలువైన 120 క్వింటాళ్ల మినపప్పును పౌర సరఫరాల శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి కాకినాడ గొడారిగుంట సీతారామనగర్లోని ఒక ఇంటి నుంచి విశాఖపట్నం తరలించేందుకు లారీలో పప్పు లోడ్ చేస్తుండగా అసిస్టెంట్ పౌర సరఫరా శాఖాధికారి పి.సురేష్ నేతృత్వంలోని అధికారుల బృందం దాడి చేసింది. మహలక్ష్మి ట్రేడర్స్ పేరిట నారపురెడ్డి శ్యామల ఫుడ్ గ్రేన్ లైసెన్స్ (ఎఫ్జీఎల్) లేకుండా పప్పు దినుసుల వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిల్వ ఉంచిన సరుకును సీజ్ చేసి దిగుమర్తివారి వీధిలోని సాయికృష్ణ ట్రేడర్స్‌కు అప్పగించారు. సరుకు తరలిస్తున్న లారీని సీజ్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మహలక్ష్మి ట్రేడర్స్ అధినేత శ్యామలపై నిత్యావసర వస్తువుల చట్టం 6ఏ కేసు నమోదు చేశామని, తగిన చర్యలకు కలెక్టర్‌కు నివేదిక అందజేసినట్టు అసిస్టెంట్ పౌర సరఫరా శాఖాధికారి సురేష్ తెలిపారు. నూనె, పంచదార, పప్పు దినుసులు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పౌర సరఫరాలశాఖ నుంచి ఫుడ్‌గ్రేన్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. డిప్యూటి తహసీల్దార్లు ఎ.తాతారావు, ఎస్ఎం.బాషా, జీపీఏ పి.సుబ్బారావు పాల్గొన్నారు. -
బ్యూటిప్స్
నునుపైన మెడ కోసం బంగాళదుంప – 1, పచ్చి పాలు – పావు కప్పు కొబ్బరి నూనె – టీ స్పూన్ బంగాళదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్‌లా కలపాలి. శుభ్రపరచుకున్న మెడ పై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా నెల రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే మెడ మీద పేరుకుపోయిన నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. మొటిమల నివారణకు... కొద్దిగా తేనె తీసుకుని దానిలో శనగపిండి కలుపుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మొటిమలపై అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తులసి ఆకులు మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్‌లో కొద్దిగా నీటిని కలిపి యాక్నే ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. -
బ్యూటిప్స్
బాదం పప్పును నానబెట్టి ఒలిచి హల్వాల్లో వేసుకుంటాం. ఆ పొట్టును పారేస్తుంటాం. ఆ పొట్టును ఒంటికి రుద్దుకుంటే శరీరం మెరుపు సంతరించుకుంటుంది. జుట్టురాలడం తగ్గాలంటే రోజూ పరగడుపున ఒక టే బుల్ స్పూన్ దోరగా వేయించిన నువ్వులు, చిన్న బెల్లం ముక్కతో కలిపి తినాలి. నువ్వులను దోరగా వేయించి చల్లార్చి డబ్బాలో నిల్వ చేసుకుంటే రోజూ వేయించుకునే బాధ తప్పుతుంది. కాళ్ల పగుళ్లు తగ్గాలంటే అలొవెరా (కలబంద)ఆకు జిగురును రాయాలి. ఆకును విరిచి నేరుగా కాలికి రాసుకోవచ్చు లేదా మెత్తగా గ్రైండ్ చేసుకుని వాడుకోవచ్చు. గోళ్లు పెళుసుబారి విరుగుతుంటే, నిమ్మకాయ తొక్క రుద్దాలి. మోచేతి నలుపు పోవడానికి కూడా నిమ్మతొక్క బాగా పని చేస్తుంది. -
సినిమా చూపిస్త మామా!
ఖరీదైన వినోదం రెట్టింపు ధరలకు టిక్కెట్ల విక్రయం ఆన్లైన్లో బుక్ చేసి బ్లాక్‌లో అమ్మకాలు ప్రేక్షకుల జేబులు గుల్ల దందా వెనుక యాజమాన్యాలు మౌనం వహిస్తున్న రెవెన్యూ, పోలీసు వర్గాలు సాక్షి, రాజమహేంద్రవరం : సినిమా రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకుల జేబులు గుల్ల అవుతున్నాయి. రిలీజైన మొదటి రెండు,మూడు రోజులు.. వారాంతాలు.. డిమాండ్ ఉన్న ప్రతి సమయంలో కూడా బ్లాక్ టిక్కెట్ల విక్రయం విచ్చలవిడిగా సాగుతోంది. థియేటర్ల ప్రాంగణంలోనే ఈ దందా సాగుతోంది. కొన్ని యాజమాన్యాలు ఈ దందాను అధికారికంగా నడిపిస్తున్నాయి. థియేటర్ సిబ్బందికి టిక్కెట్లు ఇచ్చి రెట్టింపు ధరలకు అమ్మిస్తున్నాయి. మరికొన్ని యాజమాన్యాలు బ్లాక్ టిక్కెట్ల విక్రయానికి అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ జిల్లాలో 90 శాతం హాళ్లలో బ్లాక్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయంపై అక్కడక్కడా ప్రేక్షకులు యాజమాన్యాలను అడుగుతున్నప్పటికీ బ్లాక్ టిక్కెట్ల విక్రయంతో తమకు సంబంధంలేదని చెప్పి తప్పించుకుంటున్నాయి. మీ థియేటర్ ప్రాంగణంలోనే టిక్కెట్లు విక్రయిస్తున్నారంటున్నా వారు ఎవరో తమకు పట్టించాలని వితండవాదం చేస్తున్నారు. బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని అరికట్టాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యాలపై ఉన్నప్పటికీ ఆ విషయం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. బయట వ్యక్తులు వచ్చి థియేటర్ ప్రాంగణంలో బ్లాక్ టిక్కెట్లు విక్రయిస్తుంటే ఏ యాజమాన్యం చూస్తూ ఊరుకోదు. అలాంటిది థియేటర్ వద్ద నలుగురైదుగురు వ్యక్తులు బహిరంగంగా అరుస్తూ రూ.40 టిక్కెట్టు రూ.80, రూ.90 టిక్కెట్టు రూ.500 అంటూ అమ్ముతున్నారంటే వారి వెనుక యాజమాన్యాలు తప్పనిసరిగా ఉంటాయన్నది నగ్నసత్యం. అలా లేకపోతే ఎవరో బయట వ్యక్తులకు పదుల సంఖ్యలో టిక్కెట్లు ఎలా వస్తాయన్నది ఇక్కడ ప్రేక్షక్షులు అడుగుతున్న ప్రశ్న. దీనికి సరైన సమాధానం యాజమాన్యాల వద్ద లేదు. క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకుంటున్నారంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. క్యూలో నిలుచున్న వ్యక్తికి ఒక్క టిక్కెట్టు మాత్రమే ఇస్తారు. కుటుంబంతో వస్తే రెండు టిక్కెట్లు ఇస్తారు. అలాంటిది ఒక్కో వ్యక్తి వద్ద 30 నుంచి 50 టిక్కెట్లు ఎలా ఉంటున్నాయి?. ఆన్లైన్ దందా... థియేటర్లలో బాల్కనీ టిక్కెట్ ధర రూ.90, సెంకడ్ క్లాస్ రూ.75, థర్డ్ కాస్ల్ టిక్కెట్టు ధర రూ.30 ఉంటుంది. థియేటర్లను బట్టీ ఈ ధరలు కొంచెం పెరుగుతాయి. ఈ మూడు క్లాస్‌లలో బాల్కనీ టిక్కెట్లు మాత్రమే ఆన్లైన్లో అమ్మకానికి పెడతారు. ఇందులోనూ 50 శాతం టిక్కెట్లు మాత్రమే ఆన్లైన్లో పెడుతూ మిగతావి కౌంటర్లో విక్రయించాలి. ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకుడికి ఇచ్చే టిక్కెట్‌పై అతని ఫొటోను నిబంధనల ప్రకారం తప్పక ముద్రించి ఉండాలి. కాని ఎక్కడా ఇది అమలు కావడంలేదు. ఒకే వ్యక్తి పేరుపై నాలుగు టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. అలా బుక్ చేసిన టిక్కెట్లను థియేటర్ ప్రాంగణంలో విక్రయిస్తున్నారు. ఆన్లైన్ పత్రాలు తీసుకొస్తున్న ప్రేక్షకులకు కౌంటర్లో ఉన్న సిబ్బంది టిక్కెట్ ఇస్తున్నారు. నాలుగు టిక్కెట్లను వేర్వేరు వ్యక్తులు వచ్చి తీసుకుంటుంటే టిక్కెట్ ఇచ్చే సిబ్బంది ఎక్కడా ప్రశ్నించరు. ఆన్లైన్ పత్రంలో ప్రేక్షకుడి ఫొటో లేకపోయినా టిక్కెట్ ఇస్తారు. కౌంటర్ వద్దకు వచ్చిన ప్రేక్షకులు టిక్కెట్ కావాలని అడిగితే ఆన్లైన్లో అయిపోయాయంటూ సిబ్బంది సమాధానం చెబుతారు. నిబంధనల ప్రకారం చేస్తున్నామంటూ చెప్పుకోవడానికి ఓ 10 టిక్కెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలి టిక్కెట్లను తమ సిబ్బందితో బ్లాక్‌లో విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువునా దోచుకుంటున్నారు. చివరకు రూ.30, రూ.75ల టిక్కెట్లు కూడా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. సీజన్.. సినిమాను బట్టీ రేట్లు! సినిమా, హీరో, సీజన్, డిమాండ్‌ను బట్టి బ్లాక్ టిక్కెట్ల ధరలు రెట్టింపవుతుంటాయి. బుధవారం విడుదలైన ఓ అగ్రహీరో సినిమాకు రూ.90 టికెట్‌ను యాజమాన్యాలే అధికారికంగా రూ.150 చొప్పున విక్రయించాయి. బ్లాక్‌లో అయితే రూ.500 వరకు అమ్మారు. అదే మధ్యస్థాయి హీరో సినిమా అయినా ఈ ధర రూ.250 వరకు ఉంటుంది. ఇక వారాంతాలు, పండగ సీజన్లలో సినిమా చూడాలంటే నలుగురు ఉన్న కుటుంబం కనీసం రూ.1,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక వాహనం పార్కింగ్, తినుబండారాలు, శీతలపానీయాలు రెట్టింపు ధరలకు అమ్ముతున్నా అడిగేవారు లేరు. థియేటర్లలో లభించే ఆహారం నాణ్యతపై ఫుడ్ కంట్రోలర్, సేఫ్టీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. థియేటర్ల వద్ద అధిక ధరలకు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నప్పటికీ అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీసు విభాగాలు మౌనం వహిస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం... సినిమా హాళ్లలో టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే అందుకు బాధ్యత థియేటర్ యాజమాన్యానిదే. యాజమాన్యానికి తెలియకుండా ఒక్కో వ్యక్తి వద్ద పదుల సంఖ్యలో టిక్కెట్లు ఎలా ఉంటున్నాయి. ఆన్లైన్ టిక్కెట్ల విక్రయంపై కూడా పరిమితులు ఉన్నాయి. బ్లాక్ టిక్కెట్ల వ్యహారంపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. – హెచ్.అరుణ్‌కుమార్, జిల్లా కలెక్టర్. -
సహజ సౌందర్యం
బ్యూటిప్స్ ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె కాని ఆలివ్ ఆయిల్ కాని ముఖానికి, చర్మం పొడిబారిన ప్రదేశాల్లోనూ రాయాలి. ఆయిల్ అప్లయ్ చేసే ముందు మురికి, దుమ్ము లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలి. పొడిచర్మాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. దోసిట్లో నీళ్లు తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇలా రోజూ పది నిమిషాల సేపు ముఖానికి హాట్‌వాటర్ థెరపీ చేయాలి. ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను ఒంటికి రాసి మర్దన చేస్తే సరి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును వదిలిస్తుంది. -
నల్లధనం వెలికితీసే అస్త్రాలు సిద్ధం
విశాఖ జోన్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఓంకారేశ్వర్ భానుగుడి (కాకినాడ) : దేశంలో పన్ను పరిధిలోకి రాకుండా బ్లాక్‌మనీ రూపంలో చలామణిలో ఉన్న సొమ్ము రూ.14.5 లక్షల కోట్లని, అందులో రూ.ఎనిమిది లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉండగా మిగిలిన నల్లధనాన్ని డిసెంబరు 30 నాటికి ఏ మూలనఉన్నా వెలికితీసేందుకు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని విశాఖపట్నం జోన్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఓంకారేశ్వర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో వ్యాపార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నల్లకుబేరులకు పలు హెచ్చరికలు జారీచేశారు. 2017 జనవరి నుంచి జీఎస్టీ బిల్లు అమలు కానుందని, దాచుకున్న నల్లధనాన్ని బయటపెట్టకుంటే కటాకటాల పాలవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. లక్ష్యంగా పెట్టుకున్న సొమ్ములో రూ.7వేల కోట్లు ఉగ్రవాదుల వద్ద, రూ.700 కోట్లు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఉన్న మావోయిస్టుల వద్ద ఉందని ఇది రికవరీ కాదన్నారు. మిగిలినదంతా ఏ రూపంలో ఉన్నా పన్ను పరిధిలోకి తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. 25 కోట్ల పాన్‌కార్డులు జారీచేస్తే అందులో ఐదుకోట్ల మంది మాత్రమే వాడుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొనే ప్రతి విధాన నిర్ణయానికి కొందరు మోకాలడ్డుతూ పన్ను ఎగవేద్దామనుకుంటున్నారని, రానున్న చట్టాలతో అడ్డులన్నీ తొలగిపోనున్నట్టు పేర్కొన్నారు. కెన్యాలో 80 శాతం లావాదేవీలన్నీ నగదు రహితమేనని, మున్ముందు మనదేశం యావత్తు అదే తరహా వ్యవస్థ ఏర్పాటు కానుందన్నారు. పన్ను చెల్లించకుండా దాచినది ఏదైనా ( బంగారం, భవనాలు, స్థలాలు) అది బ్లాక్‌మనీ లిస్టులోకే వస్తుందన్నారు. అలా దాచినవారెవరైనా కఠినశిక్షలు అనుభవించక తప్పదని ఓంకారేశ్వర్ హెచ్చరించారు. వ్యాపారస్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో 300 కోట్ల నగదు స్వాధీన పరుచుకున్న చరిత్ర ఉందన్నారు. ఇక అంతా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరగనున్నందున దాచినవన్నీ బయటపెట్టి శిక్షల నుంచి తప్పించుకోవాలని సూచించారు. ఈ నగదు రహిత లావాదేవీల కారణంగా పేదప్రజలకు న్యాయం జరుగుతుందని, సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అర్హులకు అందుతాయన్నారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధినారాయణరావు(బాబ్జీ), పలు వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మరపురాని మతిమరుపు చిత్రాలు
సిల్వర్ అల్జైమర్స్ ‘బ్లాక్ ’ చిత్రంలోని ఒకే ఒక్క పాట.. ‘హా మైనే షుకర్ దేఖా హై’. ఇందులోని... ‘క్షణాల వేలిని జ్ఞాపకాలు పట్టుకుని ఉన్నాయి. వరండాలోకి వచ్చాను. ఆ జ్ఞాపకాలను నేను తాకాను. చూశాను’ అనే చరణం ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేస్తుంది. అల్జైమర్స్లోని ప్రధాన లక్షణం మెమరీ లాస్. జ్ఞాపకశక్తి సన్నగిల్లడం లేదా నశించడం. మెమరీ లాస్ కథాంశంతో మంచి మంచి హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. బిఫోర్ ఐ గాట్ స్లీప్ (థ్రిల్లర్), ది వోవ్(రొమాంటిక్ డ్రామా), ది బార్న్ ట్రయాలజీ (యాక్షన్), ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్ (ఎమోషనల్), టోటల్ రీకాల్ (సైన్స్ ఫిక్షన్), 50 ఫస్ట్ డేట్స్ (రొమాంటిక్ కామెడీ), ఫైండింగ్ నెమో (ఉద్వేగం), మెమెంటో (సైకాలజీ)... అన్నవి మరపురాని సినిమాలు. నేరుగా అల్జైమర్స్ మీదే వచ్చిన సినిమాలూ ఉన్నాయి. ‘ది శావేజస్, ఎవే ఫ్రమ్ హర్, అరోరా బరియాలిస్, ది నోట్‌బుక్, ది సాంగ్ ఆఫ్ మార్టిన్, ఐరిస్: ఎ మెమొయిర్ ఆఫ్ ది ఐరిస్ ముర్డోక్, ఫైర్‌ఫ్లై డ్రీమ్స్, యాన్ ఓల్డ్ ఫ్రెండ్స్’... ఇలాంటివే. ‘మతిమరుపు’ వరం అంటారు. కావచ్చేమో కానీ చుట్టుపక్కల వారికి మాత్రం శాపం. చుట్టుపక్కల వాళ్లు అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు. వీళ్లందరికీ రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందుల గురించి మతిమరుపు ఉన్న వారికి తెలియకపోవడం మరో విషాదం. మరి ఇంత విషాదం ఉన్న అల్జైమర్స్... సినిమాలకు మంచి కథాంశం ఎలా అవుతోంది? అది దర్శకుల ప్రతిభ! ఈ డెరైక్టర్లు మతిమరుపును వినోదంగా, విడ్డూరంగా, ఉద్వేగంగా, ఊహించని విధంగా మలిచి ప్రేక్షకులను థియేటర్ లకు రప్పిస్తున్నారు. బాలీవుడ్లో, ఇతర భారతీయ భాషల్లో కూడా అల్జైమర్స్పై కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగినవి ‘బ్లాక్, మాయ్, యు మి ఔర్ హమ్’ (హిందీ), ‘గోధి బన్నా సాధారణ మైకట్టు’ (కన్నడ), ‘తన్మంత్ర’ (మలయాళం). తెలుగులో, తెలుగు డబ్బింగులో ఇలాంటివి ఒకటీ అరా సినిమాలు వచ్చాయి. (గజనీ, నేను మీకు తెలుసు, భలే భలే మగాడివోయ్... వగైరా). 2005లో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘బ్లాక్’ సినిమా పూర్తిగా అల్జైమర్స్ మీదే నడుస్తుంది. రాణీ ముఖర్జీ, అమితాబ్ బచ్చన్ నటించారు. ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె అంధురాలు. వినపడదు కూడా. టీచర్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడుతుంది. ఆ టీచర్‌కి క్రమంగా అల్జీమర్స్ వచ్చి, ఆమెను మరిచిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే ‘బ్లాక్’. హెలెన్ కెల్లర్ జీవిత కథను ఆధారంగా చేసుకుని భన్సాలీ ఈ సినిమాను నిర్మించారు. ఎమోషనల్లీ హిట్. విషయం ఏమిటంటే... ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషా చిత్రాలకు ఎవర్గ్రీన్ క్లిక్ ఫార్ములా అల్జైమర్స్. మనుషుల్లో ఎన్ని ఉద్వేగాలు ఉంటాయో... అన్ని ఉద్వేగాలనూ పలికించగల సెంటర్ పాయింట్ సబ్జెక్ - అల్జైమర్స్. -
జన్‌ధన్‌పై నల్లకుబేరుల కన్ను!
అమలాపురం : ఎప్పుడూ నయాపైసా లావాదేవీలు జరగని జన్‌ధన్ యోజన ఖాతాల్లో నగదు జమ అవుతోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏడు లక్షలకు పైగా జన్‌ధన్ యోజన ఖాతాలున్నట్టు అంచనా. మామూలుగా బ్యాంకు ఖాతాలో రూ.2.50 లక్షల వరకూ పాత నోట్లను జమ చేసుకునే వీలు ఉండడంతో.. జన్‌ధన్‌ఖాతాలున్న పేదల ద్వారా నల్లకుబేరులు నల్లధనాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ ఖాతాదార్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ముట్టజెప్పేందుకు సిద్ధపడుతున్నారు. అటువంటి ఖాతాదారుల కోసం తమ బంధుమిత్రుల ద్వారా ఆరాలు తీస్తున్నారు. కొంతమందికి ముందుగానే చెప్పుకుని ఉంచుకున్నారు. ప్రస్తుతం కేవలం రూ.4 వేల వరకూ మాత్రమే పాత నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నగదు మార్చుకునేందుకు అనుమతి వచ్చినప్పుడు ఈ ఖాతాల ద్వారా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే జన్‌ధన్‌ఖాతాలతో పాత నోట్ల మార్పిడి చేస్తే ఖాతాదారులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకౌంట్లు తెరచినప్పటినుంచీ ఎటువంటి లావాదేవీలూ నిర్వహించకుండా.. ఇప్పుడు ఒకేసారి రూ.2 లక్షలకు పైగా నగదు మారిస్తే ఆదాయపన్ను విభాగం అధికారులు ఆరా తీసే అవకాశముంటుందని అంటున్నారు. ఇదే జరిగితే అకౌంట్లలో నగదు మార్చుకున్నవారికన్నా అందుకు సహకరించినవారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. -
నల్లధనం పేరిట నరకం చూపుతున్న మోదీ
• విదేశాల్లో ఉన్న నల్లధనం వెలికితీయలేదెందుకు? • మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్న జనం • పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేరేడుచర్ల/గరిడేపల్లి: కేంద్ర ప్రభుత్వం రూ.500, 1,000 నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని వెలికితీయడమేమోకానీ.. సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. నల్లధనం పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు నరకం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లిలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువస్తామని ఎన్నికల్లో చెప్పిన నరేంద్ర మోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శిం చారు. నల్లకుబేరుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. మోదీ తొందరపాటు చర్యల వల్ల మూడు రోజులుగా సామాన్య జనం ముప్పు తిప్పలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామ ని చెప్పి తన కుటుంబంలో మాత్రమే నలుగురుకి కొలువు లు ఇచ్చుకుని.. నిరుద్యోగ యువతకు మొండిచేరుు చూపించిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకానికి ఇబ్బం దులు లేకుండా నిధులు విడుదల చేస్తే.. ప్రస్తుత ప్రభు త్వం విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోందని మండిపడ్డారు. డిసెంబర్లో హైదరాబాద్ లో రైతు, విద్యా ర్థి గర్జన పేరుతో బహిరంగసభ నిర్వహిస్తామని, దీనికి రాహుల్‌గాంధీ వస్తారని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. -
‘బ్లాక్’లో బంగారం విక్రయాలు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.33 వేలకు చేరింది. బుధవారం బ్లాక్ మార్కెట్లో బంగారం విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. బుధవారం ఉదయం బంగారం వ్యాపారులు 10 గ్రాముల బంగారాన్ని రూ.100 నోట్లు ఇచ్చినవారికి రూ.33 వేలకు విక్రయించారు. అదే రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే 10 గ్రాముల బంగారం రూ.43 వేలకు విక్రయించారు. హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్, సిద్దంబర్బజార్తో పాటు అబిడ్స, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో బ్లాక్‌లో బంగారం విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. పలువురు వ్యాపారులతో పాటు చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా బ్లాక్‌లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. దుకాణాలు వెలవెలబోయినా, కొనుగోలుదారులతో వ్యాపారులు ధరలు నిర్ణయించుకుని పక్కదారిలో బంగారం అమ్మకాలు సాగించారు. దీంతో సుమారు రూ.వంద కోట్ల వరకూ బ్లాక్ మార్కెట్లో చేతులుమారినట్లు అంచనా. ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం బ్లాక్ లో రూ. 50 వేల వరకు విక్రయించినట్టు వార్తలు వచ్చాయి. -
మేం నల్లధనాన్ని సర్దుకోలేదు
మంత్రి యనమల అంగర (కపిలేశ్వరపురం) : టీడీపీ, బీజేపీ తమ నల్లధనాన్ని సర్దుకున్నాకా నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రకటించారంటూ కమ్యూనిస్టు పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మండలంలోని పడమర ఖండ్రిక, అంగర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం పాల్గొన్నారు. రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లధనం వెలికితీయోచ్చని యనమల అన్నారు. పడమర ఖండ్రికలో పంచాయతీ భవనం, అంగరలోని పోలీస్ స్టేషన్ భవనం, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్‌లను మంత్రులు ప్రారంభించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీపీ కాదా వెంకట రాంబాబు, జెడ్పీటీసీ జుత్తుక సూర్యావతి, జేసీ సత్యనారాయణ, ఆర్డీఒ సుబ్బారావు, పువ్వల చిట్టిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్సై వాసా పెద్దిరాజు పాల్గొన్నారు. -
బ్లాక్‌మనీపై మాసివ్ గూగ్లీ...సిక్సర్
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ బ్లాక్‌మనీ’ లో భాగంగా దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రాత్రికి రాత్రి బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో తమ స్పందనను తెలియచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని ఆమోదించిన ప్రతీ ఒక్కరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని నిజాయితీపరులైన పౌరులకోసం ఈ నిర్ణయం తీసుకున్నామని..బెటర్ ఇండియా సాధించడమే లక్ష్యమన్నారు. దేశాన్ని అవినీతినుంచి విముక్తురాలిని చేయడంకోసం అందరం భుజం భుజం కలుపుదామని ప్రధాని పిలుపునిచ్చారు. అవినీతి, నల్లధనం , తీవ్రవాదంపై పోరాడటానికి ఇదొక చారిత్రక అడుగు అని నమో పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్జికల్ స్ట్రైక్స్ పై బాలీవుడ్, టాలీవుడ్, క్రికెట్ ఇలా అన్ని రంగాల ప్రముఖులు ట్విట్టర్ ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇది మాసివ్ గూగ్లీ ,వెల్డన్ సర్, ప్రౌడ్ ఆఫ్ యూ సర్ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు కుంబ్లేకు తోడు దూస్రా స్పెషలిస్ట్ హర్భజన్ సింగ్ కూడా తనదైన క్రికెట్ భాషలో చెలరేగిపోయాడు. ప్రధాని బ్రహ్మాండమైన సిక్సర్ కొట్టారంటూ ట్వీట్ చేశాడు. ఇదంతా ఒక ఎత్తయితే వీరందరికి ప్రధాని మెదీ సమాధానం ఇవ్వడం మరోఎత్తు. తమ బౌలింగ్ ద్వారా ఎంతో మంది బ్యాట్స్ మెన్లకు షాకిచ్చిన ప్రముఖ భారత క్రికెటర్లు స్పందన అంటూ రీట్వీట్ చేశారు. దీంతోపాటు టాలీవుడ్ హీరో నాగార్జున, మూవీ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, అజయ్ దేవగన్, రితేశ్ దేశ్ ముఖ్, సుభాష్ ఘాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరుల ట్వీట్లను రీట్వీట్ చేయడం విశేషం. Thank you. All of us have to work shoulder to shoulder and create a prosperous, inclusive and corruption free India. https://t.co/3rurQwFYja — Narendra Modi (@narendramodi) November 9, 2016 Massive googly bowled by our Hon. PM @narendramodi today. Well done Sir! Proud of you!! — Anil Kumble (@anilkumble1074) November 8, 2016 -
ప్రొద్దుటూరు-ఆళ్లగడ్డ మధ్య రాకపోకలు బంద్
వైఎస్సార్ కడప జిల్లాలో రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని వీర్లపాలెం సమీపంలోని వాగు ఉధృతంగా పొంగి పొర్లుతుండటంతో.. ప్రొద్దుటూరు-ఆళ్లగడ్డ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వానోచ్చింది.. మత్తడి దుంకింది..
మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీటి ఉధృతికి శనివారం మధ్యాహ్నం నల్లవాగు మత్తడి పొంగిపొర్లింది. మత్తడికి ఎగువ ప్రాంతాల్లో ఉన్న కల్హేర్, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో కురిసిన వర్షానికి వాగుల ద్వారా వరద నీరు వస్తోంది. తద్వారా మండలంలోని నల్లవాగు మత్తడికి జలకళ నెలకొంది. నల్లవాగు మత్తడి అలుగుపై నుంచి వరదనీరు పొంగిప్రవíß స్తుండడంతో ఆయకట్టు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – నిజాంసాగర్ -
బండ నేలల్లో పచ్చని పంటలు
చెరువు మట్టిని తరలించుకున్న రైతులు ఎర్రరేగడి నేలల్ని మాగాణిగా మార్చుకున్న వైనం జహీరాబాద్ టౌన్:జహీరాబాద్ నియోకవర్గంలో ఎర్ర, నల్లరేగడి భూములున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎర్రబండతో కూడిన పొలాలు ఉన్నాయి. ఎర్రబండ భూములు సాగుకు ఏమాత్రం అనుకూలం కావు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం బండ భూములు కలిగిన రైతులకు వరంగా మారింది. ఈ పథకం కింద పూడిక తీయగా వచ్చిన మట్టిని పంటలు పండని రాతి నేలల్లోకి తరలించుకుని నల్లరేగడి భూములుగా మార్చుకున్నారు ఈ ప్రాంత రైతులు. బండనేలలను సాగుకు యోగ్యంగా చేసుకుని పంటలు పండిస్తున్నారు. వర్షాలు కూడా పడడంతో సాగుచేసిన పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల మట్టిని పొలాలకు తరలించుకునేందుకు అనుమతులివ్వడంతో ఆసక్తి కలిగిన రైతులు ముందుకు వచ్చి సారవంతమైన చెరువు మట్టిని తమ బండ రాతి భూముల్లోకి తరలించి నల్ల రేగడి భూములుగా మార్చుకుంటున్నారు. మట్టితో నింపిన పొలాల్లో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. రైతులు తమ ఆర్థిక స్తోమతను బట్టి మట్టిని తరలించారు. మిషన్ కాకతీయ పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కో టిప్పరుకు రూ.300- రూ.500 వరకు ఖర్చుచేసి నల్లరేగడి మట్టిని తరలించారు. ఎకరానికి వంద నుంచి 150 ట్రిప్పుల మట్టిని నింపారు. ఎత్తుపల్లాలు ఉన్న చోట చదును చేశారు. ఎకరాకు రూ. 50 వేల వరకు ఖర్చుచేసి బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు. ఊహించని విధంగా బండ భూములు సారవంతమైన నల్ల రేగడి పొలాలుగా మారండంతో రైతులు ఉత్సాహంతో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. కొందరు చెరకు పంట వేయగా మరి కొందరు అల్లం పంటను సాగు చేస్తున్నారు. మరి కొందరు రైతులు ఖరీఫ్ పంటలైన సోయాబీన్, పెసర, కంది తదితర పంటలు వేశారు. మట్టి తరలించిన పొలాల్లో పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని రైతులు అంటున్నారు. -
నల్ల బెల్లం పట్టివేత
మిర్యాలగూడ అర్బన్: సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రాంతంలోని దాచేపల్లి నుంచి అక్రమంగా సార బెల్లాన్ని తరలిస్తుండగా సమాచాం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న 2క్వింటాళ్ల నల్లబెల్లం, 50కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. బెల్లాన్ని తరలిస్తున్న వ్యక్తి ధరవత్ రమేష్‌తో ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ బి.సుధాకర్, ఎస్ఐ అక్రం అలీతో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
నలుపు గెలుపు
నలుపు రంగుకు మెరుపొచ్చింది. అందాల వేదికల నుంచి పిలుపొచ్చింది. తెలుపు, గులాబీ తదితర అగ్రగామి మేనిఛాయల సరసన చేరింది. సింపుల్‌గా చెప్పాలంటే నలుపు గెలుపు బాట పట్టింది. తాజాగా చెన్నైకి చెందిన తెలుగమ్మాయి గాయత్రీ రెడ్డి ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో ఫైనల్స్‌కి చేరింది. ఈమె ‘డార్క్ ఈజ్ బ్యూటీఫుల్’ పేరుతో ఆన్లైన్ ప్రచారం కూడా ప్రారంభించడం విశేషం. లాక్మే సైతం తన తాజా మోడలింగ్ ఆడిషన్స్‌లో ఒక బ్లాక్ బ్యూటీని ఎంపిక చేసుకుంది. - ఎస్.సత్యబాబు తెల్ల వాళ్లను వెళ్లగొట్టినా భాష నుంచి రంగు వరకు దేన్నీ మన మనసుల్లోంచి వెళ్లగొట్టలేకపోయామనేది నిజం. అందుకు అందాన్నిచ్చే మేనిఛాయగా తెలుపు రంగుకు మన దగ్గర ఉన్న క్రేజ్ ఒక రుజువు. ఈ నేపథ్యంలో నల్లగా పుట్టడమేదో నేరమన్నంత దురావస్థ. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ విషయంలో సమస్యలు మరీ ఎక్కువే. ఈ రోజుకీ తెల్లని మేనిఛాయ అందిస్తామంటూ రూ.కోట్లు కొల్లగొడుతున్న కాస్మోటిక్ కంపెనీలే... అమ్మాయిలకు తమ ఒంటి రంగుపై ఉన్న ఆందోళనకు రుజువు. ఈ పరిస్థితుల్లో ర్యాంప్‌పై నల్లకలువలు పెద్ద సంఖ్యలో వికసిస్తుండడం బ్లాక్ కలర్ భవిష్యత్తుపై ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది. అయితే దీనికి సంబంధించి టాలీవుడ్లో ఇంకా మార్పు రాలేదనే చెప్పాలి. నల్లని మేనిఛాయ ఉన్న అమ్మాయిలను సాదరంగా ఆహ్వానించేందుకు సినిమా రంగం విముఖత చూపుతూనే ఉంది. ‘నా కలరే నాకు అవకాశాలు తెచ్చిపెట్టింది. చెన్నైలో 100కి పైగా యాడ్స్ చేశాను. అయితే డస్కీ కలర్‌కి టాలీవుడ్లో ఆదరణ లభించడం లేదనేది వాస్తవం’ అని నిన్నటి తరం నటి డిస్కో శాంతి సోదరి సుచిత్ర ‘సాక్షి’తో చెప్పారు. బ్లాక్ లుక్.. హిట్ మోడలింగ్‌లో బ్లాక్ బ్యూటీస్ గతంలోనూ ఉన్నారు. అయితే మన వాళ్లు కొద్ది మందే. మిగిలిన వారంతా విదేశీయులే ఉండేవారు. తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. నాటి మధుసాప్రే నుంచి నేటి నీనా మాన్యూల్ వరకు చెప్పుకోదగిన సంఖ్యలో భారతీయ బ్లాక్ బ్యూటీలు ర్యాంప్‌పై సందడి చేస్తున్నారు. ఇటీవలే ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో చెన్నై మోడల్ గాయత్రీ రెడ్డి ఫైనల్స్‌కు చేరి మరోసారి బ్లాక్ బ్యూటీస్ క్రేజ్ పెంచారు. ‘అమ్మాయిలు తమ రంగు గురించి ఆందోళన చెందడం అనవసరం. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి ఆలోచనలు మాని, తమ టాలెంట్‌కు, శక్తి యుక్తులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాల’ని అంటున్నారు గాయత్రీ రెడ్డి. అనడమే కాదు ‘డార్క్ ఈజ్ బ్యూటీఫుల్’ అంటూ ఆన్లైన్ ప్రచారం కూడా చేపట్టారు. ఈ ఫేస్బుక్ పేజీకి దాదాపు 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. డైమండ్‌కి డార్క్.. ముఖ్యంగా సిటీలో నిర్వహించే వజ్రాభరణాల ప్రదర్శనల్లో బ్లాక్ మోడల్స్‌కి తగినంత ప్రాధాన్యం లభిస్తోంది. తెలుపు కంటే నలుపు రంగుపై వజ్రం మరింతగా మెరుస్తూ ఆకట్టుకుంటుందని తేలడంతో బ్లాక్ బ్యూటీలకు డిమాండ్ పెరిగింది. కొన్ని రకాల బంగారు ఆభరణాలకు కూడా ప్రత్యేకంగా వీరిని ఎంచుకునే వారున్నారు. యాడ్స్ రంగంలోనూ బ్లాక్ కలర్‌కి ఇటీవలి కాలంలో మంచి గుర్తింపు లభిస్తోందని యాడ్ ఫొటోగ్రాఫర్ రాజేష్ చెప్పారు. లుక్స్, శరీరసౌష్టవం బాగుండి, చురుకుదనం, తెలివితేటలున్న అతివలు శరీర రంగుతో సంబంధం లేకుండా గ్లామర్ ప్రపంచంలో రాణించడం సాధ్యమేనన్నారు. ప్రస్తుత బ్లాక్ బ్యూటీల హవా శరీర రంగు కారణంగా తలదించుకోవాల్సిన పరిస్థితిని రూపుమాపుతుందని ఆశిద్దాం. కలర్... పవర్ నేనెప్పుడూ నా శరీర రంగు విషయంలో చిన్నతనంగా భావించలేదు. అలా అనుకుంటే అసలు మోడలింగ్‌లోకి రాను కదా. నిజానికి ర్యాంప్‌కి డస్కీ మోడల్స్ కొత్త అందాన్ని తెస్తారు. కొందరు నల్లని అమ్మాయిల్ని తిరస్కరించవచ్చు కానీ... మా ప్రత్యేకత మాదే. ముఖ్యంగా జువెలరీ షూట్స్, ఆభరణాల ప్రదర్శనలకు డస్కీ మోడల్స్ చేసినంత న్యాయం మరెవరూ చేయలేరు. నా కెరీర్ ప్రారంభంతో పోలిస్తే... ఇప్పుడు డస్కీ కలర్‌కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఫ్యాషన్ డిజైనర్స్ మమ్మల్ని తప్పనిసరిగా వారి దుస్తుల ప్రదర్శనకు ఎంచుకుంటున్నారు. నల్లని రంగున్న అమ్మాయిలకు చెప్పేది ఒకటే... కలర్ కన్నా కాన్ఫిడెన్స్ ముఖ్యం. - డెబొరా డొరిస్, సిటీ మోడల్ -
చెల్లింపుల్లో జాతి వివక్ష!
విద్యార్హతలు ఒక్కటే. ప్రతిభా పాటవాలూ ఒక్కటే.. అయితేనేం జాతి విభేదాలు మాత్రం వారి సంపాదన విషయంలో ప్రభావం చూపిస్తున్నాయి. రంగుల్లో తేడా వారి ఆదాయంలో సమతుల్యత లేకుండా చేస్తోంది. ది గ్రేట్ బ్రిటన్ లోని కార్మికుల పరిస్థితి పై తాజాగా నిర్వహించిన సర్వేలు అదే విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఒకే విద్యార్హతలు ఉన్నా... నల్ల జాతీయులు, తెల్లవారికన్నాఅన్నింటా దాదాపుగా నాలుగోవంతు తక్కువ ఆర్జించగల్గుతున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. బ్రిటన్ లో జాతి వివక్ష మరోమారు బహిర్గతమైంది. బ్రిటన్ కార్మికుల పరిస్థితులపై అధ్యయనాలు జరిపే లేబర్ థింక్ ట్యాంక్.. ఈ సరికొత్త విషయాలను వెల్లడించింది. ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (TUC) కి చెందిన... 'లేబర్ థింక్ ట్యాంక్' సంస్థ జరిపిన సర్వేల్లో 2014-15 సంవత్సరాల లెక్కల ప్రకారం...తెల్ల, నల్ల జాతీయులకు చెల్లింపుల విషయంలో సుమారు 23 శాతం తేడా కనిపిస్తోందని తెలిపింది. ఒకే డిగ్రీ చదివిన తెల్లజాతి వారికి గంటకు 27 డాలర్లు చెల్లిస్తుండగా... నల్లజాతీయులకు చెందిన విద్యాలయాలకు చెందిన వారికి మాత్రం గంటకు 21 డాలర్లనే చెల్లిస్తున్నట్లు టియుసి అధ్యయనాల్లో తేలింది. జాతి వివక్ష చెల్లింపుల పై ప్రభావం చూపిస్తోందని టియుసి జనరల్ సెక్రెటరీ ప్రాన్సెస్ ఓ గ్రేడీ అంటున్నారు. వివక్ష కారణంగా జీతాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని.. అన్ని విషయాల్లో కూడ తెల్ల వారికంటే నల్లజాతి సహా.. ఆసియా కార్మికులకు అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అయితే ఇటువంటి వివక్షపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఓ గ్రేడీ అంటున్నారు. కాగా ఇంగ్లాండ్ లోని విశ్వవిద్యాలయాల్లో సంస్థాగత వివక్ష నిర్మూలించడంలో భాగంగా ప్రధాని డేవిడ్ కామెరూన్ ఇటీవల వర్శిటీలకు నూతన ఆదేశాలు జారీ చేశారు. జాతి, ప్రదేశాలకు సంబంధించిన మైనారిటీ అభ్యర్థుల నిష్పత్తిని వెంటనే వెల్లడించాలని ఆయన తెలిపారు. -
బ్యూటిప్స్
ముఖం తరచు జిడ్డుగా మారుతోందా? అయితే, చెంచాడు ముల్తానీ మట్టిలో కాస్తంత రోజ్‌వాటర్, తాజా నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేయండి. ఆ పేస్టును ముఖానికి ప్యాక్‌లా పట్టించి, అరగంటసేపు గాలికి ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లయినా ఈ ప్యాక్ అప్లై చేస్తే, ముఖం నుంచి జిడ్డు మటుమాయం అవుతుంది. మోచేతుల దిగువ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా ఉంటోందా? రసం తీసేసిన నిమ్మచెక్కలతో రుద్ది, పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. నలుపు తగ్గి, మోచేతులు కూడా నిగనిగలాడతాయి. -
జీమెయిల్లో ఇక బ్లాకింగ్ ఫీచరు
న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈమెయిల్ సర్వీస్ జీమెయిల్లో ఇకపై ‘బ్లాక్’, ‘అన్‌సబ్‌స్క్రయిబ్’ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్ ఫీచర్‌ను ఉపయోగించి ...అవాంఛిత ఈమెయిల్ అడ్రస్‌ల నుంచి వచ్చే మెయిల్స్‌ను బ్లాక్ చేయొచ్చని గూగుల్ పేర్కొంది. ఆయా మెయిల్ ఐడీల నుంచి ఇకపై వచ్చే మెయిల్స్ నేరుగా స్పామ్ ఫోల్డర్లోకి వెడతాయి. భవిష్యత్‌లో కావాలంటే సెటింగ్స్‌లోకి వెళ్లి సదరు ఐడీలను అన్‌బ్లాక్ చేయొచ్చు. అలాగే ఏదైనా మెయిల్ ఐడీ నుంచి అన్‌సబ్‌స్క్రయిబ్ కూడా చేసే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యాప్‌లోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ తెలిపింది. గతంలో ఎప్పుడో సబ్స్క్రయిబ్ చేసినా ప్రస్తుతం అంతగా ఉపయోగించని న్యూస్‌లెటర్స్ మొదలైన వాటి బారి నుంచి తప్పుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది. -
కిరాణా కొట్లో బీమా చెల్లింపులు!
⇒ కరెంట్, నల్లా, డీటీహెచ్ బిల్లులు కూడా ⇒ జూన్ నుంచి ఎంకియోస్క్ సేవలు అందుబాటులోకి ⇒ వినూత్న సేవలతో ముందుకొస్తున్న పే నియర్ సొల్యూషన్స్ ⇒ రూ.62 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఫండ్ రెడీ ⇒ ‘సాక్షి’తో పే-నియర్ సొల్యూషన్స్ సీఈఓ ప్రీతి షా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిరాణా దుకాణమంటే ఉప్పు.. పప్పుల వంటి నిత్యావసర వస్తువులు విక్రయించేదిగానే తెలుసు. కానీ, త్వరలో ఇవి కూడా స్మార్ట్ రూపాన్ని సంతరించుకోబోతున్నాయి. ఎంత స్మార్ట్ అంటే... ఇక్కడే బీమా పాలసీ చెల్లింపులతో పాటు కరెంట్, నల్లా బిల్లులు, డీటీహెచ్, ఇంటర్నెట్ కార్డు చెల్లింపులు కూడా చేసేయొచ్చు. ఇప్పటికే మొబైల్ అనుసంధానంతో పనిచేసే పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్స్... ‘ఎంపే’ను అందుబాటులోకి తెచ్చిన పే-నియర్ సొల్యూషన్స్ సంస్థ.. జూన్ మొదటి వారం నుంచి ఎం-కియోస్క్ అప్లికేషన్‌నూ మార్కెట్లోకి తెస్తోంది. దీంతో బీమా ప్రీమియం, పాలసీ క్లెయిమ్ చేయటం నుంచి వినియోగ సంబంధిత బిల్లుల వరకు అన్నింటినీ దగ్గర్లోని రిటైల్ దుకాణాల్లోనే చేసేసే వీలుందంటున్నారు పే నియర్ సీఈఓ ప్రీతి షా. ఇంకా ఆమె ఏమంటారంటే... పాలసీ తీసుకోవటం వరకూ ఓకే. కానీ నెలనెలా చెల్లింపులే కష్టం. పాలసీ తేదీని గుర్తు పెట్టుకోవటం, కంపెనీలకు వెళ్లటం.. ఇదంతా కాస్త ఇబ్బందితో కూడిన పనే. ఈ చెల్లింపుల్ని ఎలాంటి చిక్కులూ లేకుండా ఇంటి పక్కనున్న రిటైల్ దుకాణాల్లోనో, మెడికల్ షాపుల్లోనో చెల్లించే వీలు కల్పిస్తుంది ఈ ఎంకియోస్క్ యాప్. ముందు దీన్ని అర్హ త గల ఏజెంట్లు, డీలర్లు కొంత మొత్తాన్ని చెల్లించి కొనుక్కోవాలి. తరవాత బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి. చెల్లించాల్సిన మొత్తాన్ని యాప్‌లో ఎంట ర్ చేశాక డివైజ్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కా ర్డును స్వైప్ చేస్తే చాలు.. సంబంధిత చెల్లింపులు జరిగిపోయినట్టే. ఆ లావాదేవీ వివరాలు కస్టమర్ సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి కూడా. అన్నింటికీ సెల్‌ఫోనే.. రానురాను దేశంలో క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం కూడా తగినవిధంగా ప్రోత్సహిస్తోంది. ఈ మధ్య బ్యాంకులూ భారీగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచాయి. అందరికీ రుపే కార్డులు జారీ చేస్తున్నారు. మున్ముందు అన్ని చెల్లింపులూ వీటితోనే జరుగుతాయి. వీటన్నిటినీ సెల్ఫోన్లోకి తెస్తే మరింత ఈజీ అవుతాయన్న ఆలోచనతో 2014 జనవరిలో పే నియర్ సొల్యూషన్స్‌ను ఆరంభించాం. అరచేతిలో స్వైప్ మిషన్.. ప్రస్తుతం మా కంపెనీ నుంచి పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్స్(ఎంపే) డివైజ్ అందుబాటులో ఉంది. ఈ డివైజ్‌ను సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, కాఫీ షాపులు, బేకరీలు, మెడికల్ షాపులు, జిమ్స్, రిటైల్ స్టోర్లలో క్రెడిట్/డెబిట్ కార్డు బిల్లులకు విని యోగించవచ్చు. స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్/పీసీల్లో ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని ఎంపే డివైజ్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి. కొనుగోలుదారు చెల్లించాల్సిన మొత్తాన్ని యాప్‌లో ఎంటర్ చేసి.. క్రెడిట్/ డెబిట్ కార్డును స్వైప్ చే స్తే చాలు చెల్లింపులు జరిగిపోతాయి. మూడేళ్లలో 2 లక్షల డివైజ్‌లు.. ప్రస్తుతం ఎంపే డివైజ్‌లను దేశంలో 3 వేల వ్యాపార సంస్థలకు విక్రయించాం. వచ్చే మూడేళ్లలో 2 లక్షల డివైజ్‌లను విక్రయించాలని లక్ష్యించాం. దీన్లో ఏపీ, తెలంగాణ వాటా 20-25 శాతం ఉండొచ్చు. ఎంపే డివైజ్ సెటప్ చార్జీల కింద తొలిసారి రూ.3 వేలు... తర్వాత నెలకు రూ.400 చెల్లించాలి. ఈ డివైజ్‌ను పోలండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఎంపే సేవలు దేశంలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చిన్, పుణే, మధురై, విజయవాడ నగరాల్లో, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా దేశాలకు విస్తరిస్తాం. రూ.62 కోట్ల పెట్టుబడులు.. రూ.20 లక్షల పెట్టుబడితో ప్రారంభించాం. విస్తరణలో భాగంగా తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ రూ.62 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. పూర్తి వివరాలను ఈ నెలాఖరులోగా వెల్లడిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 1): బ్లాక్
-
పాలపుంతలో ఏం జరుగుతోంది?
మన పాలపుంత గెలాక్సీ కేంద్రంలోని ధనూరాశి ప్రాంతంలో ఉన్న అతిపెద్ద కృష్ణబిలం(బ్లాక్‌హోల్) నుంచి ఇంతకుముందెన్నడూ చూడనంతటి స్థాయిలో భారీ ఎక్స్-రే విస్ఫోటం వెలువడిందట. చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ ద్వారా నాసా శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. కొన్నేళ్లుగా మామూలుగా ఉన్న ఎక్స్-రే ప్రకాశం ఒక్కసారిగా భారీ జ్వాలలా మారడం అనేది ఈ కృష్ణబిలం ప్రవర్తన, పరిసరాలపై కొత్త ప్రశ్నల్ని రేకెత్తిస్తోందని చెబుతున్నారు. మన సూర్యుడి కన్నా 45 లక్షల రెట్లు పెద్దగా ఉన్న ఈ బ్లాక్‌హోల్ తన సమీపంలోని ఓ ధూళిమేఘాన్ని మింగేసేటప్పుడు ఎంత వెలుతురు వెలువడుతుందన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టగా.. ఆ ప్రక్రియతో వెలుతురు వెలువడకపోగా ఇలా అనూహ్యంగా అప్పటికే ఉన్న ఎక్స్-రే ప్రకాశం 400 రెట్లు అధికంగా వెలిగిపోయిందట. ధూళి మేఘాలు కాకుండా ఏదైనా పెద్ద గ్రహశకలం బ్లాక్‌హోల్‌ను సమీపించడంతో ఇలాంటి విస్ఫోటం జరిగి ఉంటుందని కొందరు.. బ్లాక్‌హోల్‌లోకి వెళుతున్న వాయువులు కలగాపులగమై దిశలను మార్చుకోవడం వల్ల జరిగి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
అలా చేయాల్సింది కాదన్నారు..!
లైఫ్‌బుక్ సినిమాలకు ముందు ప్రకటనల్లో నటించాను. ఆర్థిక స్వాతంత్య్రమంటే ఏమిటో అప్పుడే తొలిసారిగా తెలిసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు కొందరు. ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకునేవారు కొందరు. మొదటి దాని వల్ల డబ్బు వస్తుంది. రెండో దాని వల్ల తృప్తి మిగులుతుంది. నేను రెండో కోవలో ఉండాలను కుంటున్నాను. డబ్బు కంటే తృప్తికే ప్రాధాన్యత ఇవ్వాలను కుంటున్నాను. ‘బ్లాక్’ సినిమాలో చేసినప్పుడు ‘‘సహాయక పాత్ర చేయడం ఏమిటి? అలా చేసి ఉండాల్సింది కాదు!’’ అన్నవాళ్లు ఉన్నారు. నేను మాత్రం అదేమీ పట్టించుకో కుండా నటించాను. అదొక గొప్ప భావోద్వేగ ప్రయాణం. కొన్ని రంగాలలోకి అడుగుపెట్టినప్పుడు...కొన్ని అలవా ట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నాకు కొత్త వారితో మాట్లాడాలంటే సిగ్గు. సినిమా రంగంలో ఇది కుదరదు కదా... అందుకే ఈ అలవాటు నుంచి బయటపడడానికి కష్టపడాల్సి వస్తుంది. ‘బ్లాక్’లాంటి హృదయం కదిలించే సినిమాలు చేసినా, ‘టాంగో చార్లీ’లాంటి మాసాల సినిమా చేసినా, ‘ఓవర్ ది మౌంటెన్’లాంటి అంతర్జాతీయ చిత్రాలు చేసినా నేను చేసే పాత్ర గురించి హోంవర్క్ చేయడం మరవను. శాంతినికేతన్లో చిన్నప్పుడు రవీంద్రుడి గీతాలు పాడేదాన్ని. మణిపురి నృత్యం అక్కడే నేర్చుకున్నాను. సినిమా అనేది కేవలం వినోదం కోసం అనే మాటను నమ్మను. సినిమాతో సామాజిక సందేశాన్ని ప్రజలకు చేరువ చేయవచ్చు. ‘యాక్టర్’లో ‘యాక్టివిస్ట్ట్’ కూడా ఉన్నా రు. కాబట్టి నటులు సామాజిక స్పృహకు సంబంధించిన పనుల్లో పాల్గొంటే ఆ ప్రభావం ఇతరులపై గాఢంగా ఉంటుంది. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సామా జిక కార్యక్రమాలకు మాత్రం ఎప్పుడూ దూరంగా ఉండలేదు. - నందనా సేన్, హీరోయిన్ -
చిన్నచూపు చూస్తే కనువిప్పు తప్పదు!
శారీరక, మానసిక వైక ల్యాన్ని ఎవరూ కూడా కోరుకోరు. పుట్టుక ద్వారా అవిటితనం కొందర్ని వెంటాడితే, విధి వక్రించడం కారణంగా మరికొందరు ఆ బారిన పడుతారు. ఇందులో ఎవర్ని తప్పు పట్టక్కర్లేదు. భగవంతుడు రాసిన విధి రాత అని తమకు తాము సంతృప్తి పడటమే తప్ప.. విచారించి ప్రయోజనం లేదు అనే ఓ ధైర్యాన్ని కూడగట్టుకుని తనకు ఇష్టాలకు అనుగుణంగా..,సహ జంగా సక్రమించే వ్యక్తిగత నైపుణ్యంతో ఆకట్టుకున్నవారేందరూ మానవ ప్రపంచంలో ఎదురుపడుతుంటారు. వారిని స్పూర్తిగా తీసుకుని కొందరు భారతీయ సినీ ప్రపంచంలో అనుభూతికి లోనయ్యే చిత్రాలను అందిస్తే.. మరికొందరు వైకల్యాన్ని పాయింట్‌గా చేసుకుని అవహేళన చేసిన వారున్నారు. దృశ్య మాధ్యమంలో సినిమా చాలా శక్తివంతమైంది. ప్రభావవంతమైంది అనడంలో సందేహం అక్కర్లేదు. భారతీయ సినీ ప్రపంచాన్ని కళాత్మకం, వాణిజ్యం హద్దులతో సినిమా ప్రస్తానం సాగుతుండగా.. వాటన్నింటిని చెరిపేసి.. మానసిక, శారీరక వైకల్యంతో బాధపడేవారిలోనూ అద్బుతమైన నైపుణ్యం, ప్రపంచానికి స్పూర్తినిచ్చే అంశాలుంటాయని పసిగట్టిన కొందరు దర్శకులు..తమ చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. కొన్ని కళాత్మకంగా రూపొందింతే, మరికొన్ని వాణిజ్య అంశాలను అధారంగా చేసుకుని హృదయాన్ని తడిమి.. ప్రేక్షకుడ్ని ఓ అద్బుతమైన అనుభూతికి లోను చేశాయి. వాటిలో సిరిసిరిమువ్వ, సిరివెన్నెల, పదహారేళ్ల వయస్సు లాంటి తెలుగు చిత్రాలు ఆక ట్టుకోగా, బాలీవుడ్లో తారే జమీన్ పర్, బ్లాక్, బర్ఫీ చిత్రాలు వికలాంగుల్లో కూడా అద్బుతమైన టాలెంట్ ఉంటుందనే భావనను కలిగించాయి. వికలాంగులు సామాన్య మానవుల కంటే తక్కువేమి కాదు అని వారంటే చిన్నచూపు చూసే కొందరికి కనువిప్పును కలిగించాయి. సినిమా మాధ్యమం ద్వారా ఓ అద్బుతమైన భావనను కలిగించిన చిత్రాలను ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఓ సారి నెమరువేసుకుందాం. సిరిసిరిమువ్వ(1978) సవతి తల్లి వేధింపులకు గురయ్యే మూగ అమ్మాయి హైమాను శారీరకంగా అవిటివాడైన సాంబయ్య అనే వ్యక్తి చేర దీస్తాడు. హైమా అంటే సాంబయ్యకు అభిమానం, తన చేరదీసి ప్రయోజకురాలిగా చేసిన సాంబయ్యపై హైమకు ప్రేమ. ఇలాంటి కథతో తెరకెక్కిన సిరిసిరిమువ్వ చిత్రానికి అప్పట్లో ప్రేక్షకులు నీరాజనం పట్టారు. సిరివెన్నెల (1986) అంధుడైన ఓ ఫ్లూటిస్ట్ హరిప్రసాద్ (సర్వదమన్ బెనర్జీ)కి, మూగ పెయింటర్ సుభాషిణి (సుహాసిని)కు, జ్యోతిర్మయి (మున్ మూన్ సేన్) మధ్య జరిగిన ప్రేమకథను సిరిసిరిమువ్వగా ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ తెరెక్కించారు. హరిప్రసాద్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించి జ్యోతిర్మయి ప్రోత్సాహానందిస్తుంది. ప్రోత్సాహం ఉంటే రాణిస్తారు అని హరిప్రసాద్ పాత్ర ద్వారా దర్శకుడు తెలియచెప్పాడు. ప్రకృతిని అంధుడైన ఓ సంగీత కారుడు ఎలా ఆస్వాదిస్తాడు. మూగ యువతి ఓ అంధుడికి తన భావాల్ని ఎలా వ్యక్త పరిచిందనే అంశాలతో సృజనాత్మక శైలిలో రూపొందించిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా గొప్ప విజయం సాధించింది. బ్లాక్(2005) మిచెల్లీ మ్యాక్నాలీ(రాణిముఖర్జీ) రెండేళ్ల వయస్సులోనే అనారోగ్యానికి గురవ్వడంతో అంధత్వం, చెవుడు వస్తుంది. తల్లితండ్రుల ప్రేమకు దూరమైన సమయంలో ఉపాధ్యాయుడు దేబరాజ్ సహాయ్ (అమితాబ్) చేర దీస్తాడు. ఉపాధ్యాయుడు అల్జీమర్స్ వ్యాధికి గురవుతాడు. వీరిమధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రేక్షుకుడిని ఉద్వేగాని గురి చేయడమే కాకుండా.. కంటతడి పెట్టించి.. ఓ అద్భుతమై ఫీలింగ్ గురయ్యేలా చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. వైకల్యం అనేది శారీరానికే.. మనసుకు కాదు అనే గొప్ప పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తారే జమీన్ పర్ (2007) డిస్లేక్సియా అనే వ్యాధితో బాధపడుతున్న నంద కిశోర్ అవస్థి (ద ర్శిల్ సఫారీ)ని కన్నవారే ఆదరించ కపోగా, ఇంట్లో సమస్యలు సృష్టిస్తున్నారనే కారణంతో బోర్డింగ్ స్కూల్లో చేర్చుతాడు. మానసికంగా ఎదుగుదల లేకున్నా.. నందకిశోర్ లో మామూలుగా ఉండే పిల్లలకంటే ఎక్కువ నైపుణ్యం, టాలెంట్ ఉందని గ్రహించిన ఉపాధ్యాయుడు రామ్ శంకర్ నిఖంబ్(అమీర్ ఖాన్) పోత్స్రాహాన్ని అందిస్తాడు. టీచర్ ప్రోత్సాహంతో నంద కిశోర్ పాఠశాలలో ఉత్తమ పెయింటర్‌గా ఎంపికవుతాడు. బర్ఫీ (2012) బుద్దిమాంద్యంతో బాధపడే జిల్మిల్ చటర్జీ(ప్రియాంక చోప్రా), జాన్సన్(రణబీర్ కపూర్) మూగ, చెవిటితో బాధపడే యువకుడు, శృతి ఘోష్(ఇలియానా)కు మధ్య జరిగిన ప్రేమకథగా బర్ఫీ రూపొందింది. వీరిద్దరీ మధ్య జరిగిన కథను ఆకట్టుకునే విధంగా రొమాంటిక్, కామెడీ, డ్రామాలను మేలివించి.. ఓ అందమైన ప్రేమకథగా తెరకెకించారు అనురాగ్ బసు. ప్రేమానురాగాలు పంచితే మానసికంగా సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారనేది ఈ చిత్రంలో ప్రధాన అంశం. పైన తెలిపిన చిత్రాల్లో హైమా, సాంబయ్య, హరిప్రసాద్, సుభాషిణి, నంద కిశోర్, మిచెల్లీ, జిల్మిల్, జాన్సన్, దేబ్రాజ్ సహాయ్ లాంటి పాత్రలు సమాజంలో మనకు కనిపించడం సహజం. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే వారిలో స్కిల్స్, టాలెంట్లు పుష్కలంగా ఉంటాయని దర్శకులు తమ కోణంలో చూపించారు. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే వ్యక్తులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యాన్ని అంతర్లీనంగా ప్రేక్షకులకు తెలియ చెబుతూనే సమాజం పట్ల వారి భాద్యతను చెప్పారు దర్శకులు. . సమాజంలో ఎదో ఒక వైకల్యంతో బాధపడేవారిని చేర దీసి పోత్రాహాన్ని అందిస్తే.. వాళ్లు రాణిస్తారు అని మనవంతు ఓ బాధ్యత గా ఫీలవుదాం.